ప్రసాద్ భరద్వాజ
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 125, 126 / Sri Lalitha Chaitanya Vijnanam - 125, 126 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 125 / Sri Lalitha Chaitanya Vijnanam - 125 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా |
శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ ‖ 42 ‖
🌻 125. 'శర్మదాయినీ'🌻
సుఖము నొసగునది శ్రీలలిత అని అర్థము.
శర్మ అను బిరుదు నిర్దిష్టముగను, నిశితముగను క్రతువులను ఆచరించు వారి కొసగుదురు. క్రతువనగా నియత జీవనము. శ్రీలలితను ఆరాధించువారు క్రమబద్ధములగు జీవితములను నడుపుట జరుగును. ఆరాధన యందలి ఆర్ధత, క్రతుబద్ధత కారణములుగ మనసు అట్టి క్రమమును పొంది జీవితమున అన్ని విషయముల యందు అదే క్రమమును వ్యాపింపచేయును.
అట్టివారి ఆహారము, వ్యవహారము, భాషణము అంతయు సహజముగ క్రమబద్ధమగును. దానివలన అంతఃసుఖము కలుగును. వారిని బాహ్య సన్నివేశములు చలింప చేయవు. ఈ విధముగ శ్రీలలిత శాశ్వతమగు సుఖమును ఒసగునది అగుచున్నది.
'సురేశః శరణం శర్మ' అనుచు విష్ణు సహస్రనామము నందు కూడ శర్మ శబ్దము కలదు. ఏ దేవత నారాధించినను, విధివిధానముగ ఆరాధించినచో సుఖము కలుగును. రజోగుణ ఆరాధనము, తమోగుణ ఆరాధనము అట్టి సుఖము నీయజాలవు. ఆరాధనయందు సాత్విక గుణమే సుఖమునకు ముఖద్వారము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 125 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Śarmadāyinī शर्मदायिनी (125) 🌻
Śarma means happiness. She confers happiness on Her devotees. Conferring happiness is Her habit as She is the Divine Mother.
Please refer nāma-s 192, 953 and 968 which convey the same meaning.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 126 / Sri Lalitha Chaitanya Vijnanam - 126 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |
శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖
🌻 126. 'శాంకరీ 🌻
శంకరుని భార్య శ్రీలలిత అని అర్థము.
శంకరుడనగా సుఖకరుడు అని అర్థము. రజస్తమో గుణములను విసర్జించి సత్వము నాశ్రయించి ప్రసన్న వదనుడైన దైవమును ధ్యానించుట వలన సుఖము కలుగును.
శంకరుడు ప్రసన్న వదనుడైన నారాయణుని సతతము ఆరాధించుచు నుండుట వలన శంకరత్వమును, మయస్కరత్వమును పొందినాడు.
అందువలన శంకరుని ముఖమున నిరుపమానమగు ప్రశాంతత యుండునని పురాణములు తెలుపుచున్నవి. అట్టి శంకరుని ఆరాధించి ఆయనను పొందినది పార్వతీదేవి. అందువలన ఆమె శాంకరి అయినది.
శంకరుడు ఏకాదశ రుద్రులలో నొకడు. రుద్రమూర్తి సైతము తపస్సు వలన శాంతమును, సుఖమును పొందెను.
అందువలన శాంతమును, సుఖమును పొందగోరువారు అర్ధనిమీలిత నేత్రుడై చిరుదరహాసముతో ధ్యానము చేయుచున్న శివుని శ్రీగురువుగ ఆశ్రయింతురు. లేదా భగవద్గీతయందు భగవంతునిచే పేర్కొనబడిన సత్వగుణము నుపాసించి కూడ శాంతమును పొందవచ్చును.
శ్రీలలిత అట్టి సత్వగుణ సముదాయమునకు కూడ అధిదేవత. ఆమె సుందర సుమనోహర రూపమును ఆరాధించుచు సత్వగుణము నాశ్రయించి జీవించువారికి ఆమెయే స్వయముగ సుఖ శాంతులను ప్రసాదించ గలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 126 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Śāṃkarī शांकरी (126) 🌻
Wife of Śaṇkarā, a form of Śiva, is known as Śāṃkarī. Śam means happiness and karā means doer. Therefore Śaṇkarā is known to give happiness and his wife Śāṇakarī has the same quality.
Śiva and Śaktī do not have any difference in qualities between them. That is why Śiva and Pārvatī are said to be father and mother of the universe.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
03 Dec 2020
No comments:
Post a Comment