🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 40 / Sri Lalita Sahasra Stotram - 40 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ‖ 28 ‖
72. 'భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా'
భండ సైన్యమును వధించుట కుద్యుక్తమైన శక్తుల విక్రమమును చూచి హర్షించుదానా అని అర్థము.
భండు డనగ జీవుడు. జీవునియందు ద్వైత వృత్తులుండును. అవియే ద్వంద్వములు. ఈ ద్వైత వృత్తులను ఆధారముగ జీవుడు సృష్టి యందు జీవనము సాగించుచుండును. రాత్రి పగలు, మంచి - చెడు, సుగుణము-దుర్గుణము, కుడి ఎడమ, ఉత్తమము-నీచము, సరి-బేసి, ఆడ-మగ, సుఖము-దుఃఖము, లాభము-నష్టము, జయము - అపజయము. ఇట్లు ద్వంద్వములు మహా సైన్యమువలె యుండి జీవుని బంధించి వేయును. జీవితము అటునిటు లాగబడుచు సాగుచుండును.
ద్వంద్వములు నశించిననేగాని, జీవునికి శాంతి లేదు. అతని యందు కూడ జీవాత్మ భావము-దేహాత్మ భావము, బుద్ధి-మనస్సు, అంతఃకరణములు - బహిఃకరణములు, పశుప్రవృత్తి-పతిప్రవృత్తిగా ద్వందములు భాసించు చుండును.
వీనిని నశింపచేయవలె నన్నచో భక్తి, జ్ఞానము, వైరాగ్యము, యోగము అను విద్యలను ఆశ్రయించవలెను. అట్లాశ్రయించినచో క్రమశః జీవుడు ద్వంద్వములను దాటగలడు. ఈ విద్యలు జీవుని ద్వంద్వములను దాటించుచుండగ అమ్మ చూచి ఆనందించునట.
అందుచేత ద్వంద్వములను నశింపచేయు శక్తులున్నచో అమ్మకానందము. ద్వైత శక్తులకు మనస్సు కారణము. అద్వైత శక్తులకు జ్ఞానము కారణము. జ్ఞాన శక్తులే అమ్మకు ఆనంద దాయకములు. జ్ఞానము పొందుతున్న జీవులను చూచి వృద్ధిచెందుచున్న పిల్లలవలె భావించుచు అమ్మ హర్షించును. ఈ అద్వైత శక్తులను 'నకులి' శక్తులందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 72 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 72. Bhaṇḍasainya- vadhodhyukta- śakthivikrama-harṣitā भण्डसैन्य-वधोध्युक्त-शक्थिविक्रम-हर्षिता (72) 🌻
When Her śaktī-s (army) destroyed the army of the demon Bhaṇḍasurā, She was delighted.
Bhaṇḍa also means ignorant soul afflicted with duality, sainya (army) also refers to duality (identifying the self as different from the Brahman), and vadha means destruction. Lalitai is delighted when one destroys duality.
When duality is removed, it is an indication of the removal of the veil of māyā. The duality can be removed only by internal exploration with the help of mind.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 73 / Sri Lalitha Chaitanya Vijnanam - 73 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ‖ 28 ‖
🌻 73. 'నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సకా' 🌻
నిత్యాదేవి యొక్క పరాక్రమ ఆటోపమును చూచుటకు అత్యంత ఉత్సాహముతో కూడినదానా ! నిత్యాదేవి చతుర్దశి తిథి దేవతగ తెలిపితిమి. అటుపైనది పౌర్ణమియే. పౌర్ణమి తిథియనగా పూర్ణత్వమే లేక శ్రీ దేవియే. అమావాస్య నుండి చతుర్దశి వరకు చంద్రకాంతి పెరుగుచు నుండగ, పూర్ణిమ యగు అమ్మవారు, ఆ పెరుగుదలను ఉత్సాహముతో గమనించుచు నిరీక్షించి యుండును.
పదునైదు తిథులకు గల కాంతులు, పదిహేను సేనలుగ తంత్రరాజము నందు పేర్కొనిరి. ఈ సేనలు విస్తారమగు పరాక్రమము కలవిగ అందు తెలుపబడినవి. ఈ సేనలకన్నిటికిని నిత్యాదేవి నాయిక. ఈ సేనల శక్తులన్నియు ఆత్మశక్తులు. ఆత్మశక్తులు వృద్ధి పొందుచుండగ జీవుడు దైవమునకు చేరువగు చున్నాడు. అట్టి ఆత్మశక్తుల కోలాహలమును అమ్మ ప్రోత్సహించు చుండును. ఉత్సుకతతో వాని వృద్ధిని గమనించుచుండును.
నిత్య యను దేవత, సృష్టియందలి నిత్యత్వమునకు సంకేతము. అనిత్యమగు విషయముల యందు అనురక్తిని నిత్యవిషయైక జ్ఞానము ద్వారా నశింపచేసుకొన వచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 73 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 73. Nityā- pārākramāṭopa- nirīkṣaṇa- samutsukā नित्या-पाराक्रमाटोप-निरीक्षण-समुत्सुका (73) 🌻
Nitya means tithi nitya devi-s (refer nāma 71). Lalitai was happy on observing the valour of these fifteen tithi nityā devi-s during the war.
When duality is destroyed and the veil of māyā is removed, the knowledge of Brahman continues to increase over a period of time.
Spiritual progress achieved cannot be reversed that easily (though it can be reversed in exceptional circumstances). This is the secretive meaning of this nāma.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/
05 Nov 2020
No comments:
Post a Comment