కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 94


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 94 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము -24
🌻

ఈ రకంగా ఒకదానికంటే మరొకటి సూక్ష్మమైనటువంటిది. ఈ విధానాన్ని మనకి ఇప్పుడు చక్కగా బోధిస్తున్నారు. ఈ నేత్ర గోళకమునకు అంతరంగముగా నేత్రేంద్రియమున్నది.

అది సూక్ష్మ్ం అన్నమాట! అటులనే ఆ నరాల వ్యవస్థ కంటే, ఇంద్రియముల కంటే, వానికి కారణమైనటువంటి, శబ్దాది తన్మాత్రలు సూక్ష్మంగా ఉంటాయి. అంటే, అర్థం ఏమిటట? ఈ నెర్వ్‌ సెంటర్‌ని పని చేయించడానికి, కావాల్సినటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైనటువంటి జ్ఞానం ఇది చాలా ముఖ్యం.

మాట్లాడలేనివాళ్ళకి నాలుక లేదనా? నాలుక ఉంది, మాట్లాడగలిగే శక్తి లేదు. మాట్లాడగలిగే శక్తి ఎందుకు లేదు అంటే, మాట్లాడించేటటువంటి నెర్వ్ సెంటర్‌, ఉత్ప్రేరకముగా పనిచేయడం లేదు. ప్రేరణకు గురవ్వడం లేదు. దాంట్లోనుంచి వ్యక్తం కావల్సినటువంటివి, వ్యక్తం కావడం లేదు. అది వెనక్కి తీసుకోబడిందన్నమాట. అది ఎక్కడికి తీసుకోబడింది అంటే, అవ్యక్తంలోకి తీసుకోబడింది.

కాబట్టి, మనకున్నటువంటి జ్ఞానేంద్రియం అని చెప్పడానికి కారణము ఏమిటంటే, ఆ వెనుకనున్నటువంటి ఇంద్రియాన్ని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైన జ్ఞానం పనిచేస్తుంది. అవి స్వయంగా పనిచేయడంలేదు. మెదడులో న్యూరాన్ సెంటర్లని పనిచేయించడానికి కావాల్సిన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం పనిచేయకపోతే అవి ఉన్నా ప్రయోజనం శూన్యమే. కాబట్టి, జ్ఞానము ఉండాలి. ఆయా వ్యవస్థా ఉండాలి. వ్యవస్థ పనితీరును వ్యక్తం చేయడానికి, కావల్సిన గోళకాలు ఉండాలి. ఇంకేం ఉండాలి?

శబ్దాది తన్మాత్మలకన్న మనస్సు సూక్ష్మమైనటువంటిది. అయ్యా! ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు సంబంధించిన నాలెడ్జ్‌ అయితే ఉంది. కానీ, దానిని పనిచేయించేటటువంటి మనస్సు అనే ఇంద్రియం సూక్ష్మమైన ఇంద్రియం పనిచేయడం లేదు అన్నాం అనుకోండి? అప్పుడేమయ్యింది? మానసిక వికలాంగులను చూశాం అనుకోండి, వాళ్ళకు అన్నీ ఉన్నాయి.

ఏం లేవు? అన్ని గోళకాలు ఉన్నాయి. అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. అన్ని వ్యవస్థలు ఉన్నాయి. అన్నీ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైన జ్ఞానము ఉన్నది. కానీ, సమన్వయ కర్త అయినటువంటి మనస్సు పనిచేయడం లేదు.

ఈ నాలుగు వ్యవస్థలని పనిచేయించేటటువంటి సమన్వయ కర్త, అనుసంధాన కర్త అయినటువంటి మనస్సు అంటే వ్యానవాయువు యొక్క ప్రభావం సరిగ్గా లేదన్నమాట. ఆ ఒక్కటి లోపించింది. ఎప్పుడైతే మనోవ్యాపారం స్తంభించి పోయిందో అప్పుడు ఏమైంది? అది అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది. కిందికి దిగి రాదన్నమాట. అప్పుడు ఇంద్రియ వికాసం కలగడం లేదు. అప్పుడు ఇంద్రియ గోళకాల వికాసం కలగడం లేదు. బుద్ధి వికాసం కలగడం లేదు.

ఏ రకమైనటువంటి వ్యాపారము, వారు చేయగలిగేటటువంటి సమర్థత లేకుండా పోయింది. కాబట్టి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు సంబంధించిన నాలెడ్జ్‌ ‘జ్ఞానం’ ఉండడం అవసరమే! కానీ, ఈ నాల్గింటిని, ఈ జ్ఞానాన్ని, ఆ లోపలున్న వ్యవస్థని, ఆ లోపలున్నటువంటి ఇంద్రియాలని, ఆ లోపలున్నటువంటి గోళకాలని, ఒక దానిని ఒక దానితో అనుసంధాన పరిచేటటువంటి మనస్సు అత్యంత సూక్ష్మమైనటువంటిది వీటన్నింటి కంటే!

కానీ, ఈ మనస్సు అనేటటువంటి సూక్ష్మము కన్నా, బుద్ధి సూక్ష్మమైనటువంటిది. ఇది ఏమిటండీ? అంటే, “నిశ్చయాత్మకో బుద్ధిః, వివేచనాత్మనో మనః” ఇది సూత్రం. అంటే అర్థం ఏమిటి? అటు వెళ్దామా? ఇటు వెళ్దామా? నువ్వు అటూ వెళ్ళచ్చు, ఇటూ వెళ్ళచ్చు.

రకరకాల ఆప్షన్లు ఇస్తుంది. మనకు ఏదైనా ఒక ఆలోచన పుట్టగానే, ఆ ఆలోచనని నెరవేర్చుకోవడానికి కావల్సినటువంటి అవకాశములు ఎన్ని వున్నాయి అనేటటువంటిది నీ మనస్సు ఒకదాని తర్వాత ఒక్కటి, ఒకదాని తర్వాత ఒకటి తరంగముల వలె నీ ముందు ఉంచుతూ ఉంటుంది.

మనం ఏ పనినైనా చేయాలి అనంటే, ఎన్ని రకాలుగా ఆ పనిని నెరవేర్చుకోవచ్చో, రకరకాల [abcdef] ఆప్షన్‌లన్నీ లెక్క వేస్తూ ఉంటుంది. కానీ, ‘వివేచనాత్మకో మనః’ - అయితే వివేచన చేశాం. చేస్తే ఏమైంది? ఏదో ఒక నిశ్చయం చేయాలిగా పని చేయాలి అంటే, ‘ఒకటి తినాలి’ - ఏం తినాలి?-

బీరకాయి తినచ్చు, వంకాయి తినచ్చు, కాకరకాయి తినచ్చు, ఉల్లిపాయి తినచ్చు, కానీ టమాటో తినచ్చు. ఎదురుగుండా ఆప్షన్స్‌ చాలా ఉన్నాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/



05 Nov 2020

No comments:

Post a Comment