మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 91
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 91 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. చేయవలసినది- చేయదలచినది - 7 🌻
కన్నులు మూసికొన్న, ముక్కు మూసికొన్న,ఇంద్రియాల్ని మనస్సులోనికి నిగ్రహించుకొనుటకు, మనస్సును ఆత్మలోకి నిగ్రహించుకొనుటకు సాధన కొరకు మాత్రమే గాని మూసికొనటం కోసం కాదు. ఎలా అయితే శరీరం వదిలి నిద్రలో మనం కాలు, చేయి కూడదీసికొనుట కోసం మనలోనికి మనం వెళ్ళిపోతామో, అలాంటిదే కన్నులు మూసికొన్నా, ముక్కులు మూసికొన్నా.
ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ లీనమైపోవటం ఎక్కడా చెప్పలేదు. ఋషులు చతుర్విధపురుషార్థములు, వాటి సమన్వయము, ధర్మాచరణం, ధర్మాచరణం వలన వచ్చే కామము, దాని వలన వచ్చే అర్థము, త్యాగం చేత పరమేశ్వరుని యందు అర్పణ బుద్ధితో చేయటం వలన వచ్చే మోక్షము గురించి చెప్పారు గానీ ఏదో ఒక స్థితిలో కన్నులు మూసికొని ఉండిపోవటం చెప్పలేదు.
ప్రార్థన గానీ, అనుష్ఠానం గానీ, నిరంతరం చేస్తూండటం వలన వికాసం చెందుతూ ఉంటూ ఉంటాం. చేస్తూ ఉన్నన్నాళ్ళు వికాసం చెందుతాం, చేయటం మానేసిన తరువాత రోజున వికాసం ఆగిపోతుంది. ఎన్ని పదుల సంవత్సరాలు వందల సంవత్సరాలు (జన్మలు) సాధన చేసినా మానేస్తే భ్రష్టుపట్టిపోతాం. చేస్తే ఏం వస్తుందనేదేం లేదు. చేస్తూ ఉండటం పరమాత్మ యందు ఉండటం కోసమే. పరమాత్మ యందు ఉండటం మొదలు పెట్టిన తరువాత సాధన చేయకపోవటం ఉండదు. నిరంతరం నిత్యం ఉండేదే సాధన.
.....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
19 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment