వివేక చూడామణి - 139 / Viveka Chudamani - 139


🌹. వివేక చూడామణి - 139 / Viveka Chudamani - 139🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 28. ప్రారబ్దము - 2 🍀


456. అతడు తాను కలలో కన్న వస్తువులను గూర్చి పట్టించుకోడు. అవి అసత్యాలని అతనికి తెలుసు. అలానే ఆ కలల ప్రపంచములో మెలుకువ స్థితిలో ఉండడు. ఒకవేళ అతడు ఇంకా ఆ కలలలోని అసత్య వస్తువులను గూర్చి ఆలోచించుచున్న నిద్ర నుండి స్వేచ్ఛను పొందిన వాడు కాదు.

457. అలానే ఎవరైన బ్రహ్మములో జీవిస్తున్నట్లు తాను ఆ ఆత్మలో మాత్రమే ఉంటాడు. ఇతరములను పట్టించుకోడు. ఒక వ్యక్తికి తన కలలలోని వస్తువులు జ్ఞాపకములో ఉన్నట్లు, బ్రహ్మములో ఉన్న వ్యక్తి తాను చేస్తున్న పనుల జ్ఞాపకములలోనే ఉంటాడు. కాని వాటిని గూర్చి పట్టించుకోడు.

458. ఈ శరీరము కర్మలు చేయుటకు మాత్రమే లభించింది. ఎవరైన ప్రారబ్దమును గూర్చి ఊహించిన అవి శరీరమునకు మాత్రమే చెందినవని గ్రహించును. కాని ఆత్మకు చెందినవని మాత్రము భావించరాదు. ఆత్మ ఎప్పటికి కర్మల వలన వ్యక్తము కాదు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 139 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj


🌻 28. Fate - 2 🌻


456. He has no desire to substantiate the unreal objects, nor is he seen to maintain that dream-world. If he still clings to those unreal objects, he is emphatically declared to be not yet free from sleep.

457. Similarly, he who is absorbed in Brahman lives identified with that eternal Reality and beholds nothing else. As one has a memory of the objects seen in a dream, so the man of realisation has a memory of the everyday actions such as eating.

458. The body has been fashioned by Karma, so one may imagine Prarabdha work with reference to it. But it is not reasonable to attribute the same to the Atman, for the Atman is never the outcome of work.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


19 Oct 2021

No comments:

Post a Comment