గీతోపనిషత్తు -263


🌹. గీతోపనిషత్తు -263 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚


శ్లోకము 6-2

🍀 6. రాజవిద్య -2 - వాయువు నుండి ఇతర భూతము లేర్పడి నట్లు, నీ నుండి నీ బుద్ధి, చిత్తము, ఇంద్రియములు, శరీరము ఏర్పడినవి. వాటన్నిటికిని నీవు మూలము. నేను నీకు మూలము. నీ యందలి నన్ను ఎరుగుటకు ప్రయత్నింపుము. నన్ను చేరిన నీకు నీ గుణదోషము లంటవు. సర్వము స్థిరమై పరమగు శాంతి లభించును. నీ యందున్న నేను, నీ యందు మాత్రమే లేను. అందరి యందును యున్నాను. అంతట నిండి యున్నాను. నా యందు నీ వుండుట వలన, నీయందు నేను లభ్యమగు చున్నాను. నన్ను నీవు చేరి, కూడి యున్నప్పుడు నీవు నరుడగు చున్నావు. అనగా నశింపని వాని వగుచున్నావు. అట్లు కూడి యుండనపుడు మానవుడ వగుచున్నావు. నీ యందున్న నన్ను నీవు గ్రహించుటయే రాజగుహ్యము నెరుగుట. నీయందున్న 'నా'తో యోగము చెందుటయే రాజవిద్య. 🍀

యథా కాశస్థితో నిత్యం వాయు స్సర్వత్రలో మహాన్ |
తథా సర్వాణి భూతాని మఠానీ త్యుపధారయ II 6

తాత్పర్యము : ఏ ప్రకారముగ అంతటను చరించు వాయువు ఆకాశము నందు స్థితిగొని యున్నదో, అట్లే సమస్త ప్రాణులును నా యందు స్థితిగొని యున్నవి అని తెలుసుకొనుము.

వివరణము : వాయువు నుండి ఇతర భూతము లేర్పడి నట్లు, నీ నుండి నీ బుద్ధి, చిత్తము, ఇంద్రియములు, శరీరము ఏర్పడినవి. వాటన్నిటికిని నీవు మూలము. నేను నీకు మూలము. నీ యందలి నన్ను ఎరుగుటకు ప్రయత్నింపుము. నన్ను చేరిన నీకు నీ గుణదోషము లంటవు. ఆకాశము చేరిన వాయువునకు “కదలిక" అను గుణదోషము ఉండదు. నన్ను చేరి, నాతో కూడిన నిన్ను గుణదోషము లంటవు. సర్వము స్థిరమై పరమగు శాంతి లభించును.

నీ యందున్న నేను, నీ యందు మాత్రమే లేను. అందరి యందును యున్నాను. అంతట నిండి యున్నాను. నిజమునకు నా యందు నీ వుండుట వలన, నీయందు నేను లభ్యమగు

చున్నాను. నన్ను నీవు చేరి, కూడి యున్నప్పుడు నీవు నరుడగు చున్నావు. అనగా నశింపని వాని వగుచున్నావు. అట్లు కూడి యుండనపుడు మానవుడ వగుచున్నావు.

అనగా మనస్సు ప్రధానముగ జీవించువాడవు అగుచున్నావు. అనగా చంచలత్వము పొందుచున్నావు. వాయువు, అగ్ని, జలము, పదార్థము ఎల్లప్పుడును మార్పునకు గురియగు చుండును. అట్లే నీవు, నీ బుద్ధి, చిత్తము, ఇంద్రియములు, శరీరము ఎప్పుడును మార్పునకు వశమై యుండును. మార్పు మరణము.

మరణమునకు జననము, జననమునకు మరణము బొమ్మ - బొరుసుల వలె, వెలుగు - నీడలవలె తారుమారగు చుండును. అట్టి స్థితి నుండి బయల్పడుటకు నీ యందు అందుబాటులో నున్న నన్ను తెలుసుకొని నాతో సంయోగము చెందుము. నీ యందున్న నన్ను నీవు గ్రహించుటయే రాజగుహ్యము నెరుగుట. నీయందున్న 'నా'తో యోగము చెందుటయే రాజవిద్య.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


19 Oct 2021

No comments:

Post a Comment