కపిల గీత - 188 / Kapila Gita - 188


🌹. కపిల గీత - 188 / Kapila Gita - 188 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 42 🌴

42. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని|
ఈక్షేతానన్యభావేన భూతేష్వివ తదాత్మతామ్॥


తాత్పర్యము : జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అను నాలుగు విధములగు ప్రాణులను వేర్వేరుగా తోచుచున్నను వాటి దేహములన్నియు పంచభూత నిర్మితములే. ఐనను, వాటిలో చైతన్యరూపమున విలసిల్లుచున్న ఆత్మ ఒక్కటే అనియు, ఆత్మయందు సకలజీవులను అనన్యభావముతో అనుగతమై యున్నవని ఆత్మజ్ఞాని తెలిసికొనును.

వ్యాఖ్య : సర్వభూతేషు చాత్మానం - దేవ మనుష్య తిర్యక్కులూ స్థావరాలు ఈ నాలుగు రకముల ప్రాణులూ ఒకటా వేరా? వీటన్నింటిలో ఉన్న ఆత్మలు ఒకటే. అనేకమంది జీవులలో ఉన్న ఆత్మలన్నీ జ్ఞ్యానస్వరూపాలే. అన్ని ప్రాణులలో ఆత్మ ఒకటే. ఆన్ని ఆత్మలలో ఉన్న ప్రాణులు (శరీరాలు) కూడా ఒకటే. ఎలాగంటే దేవ తిర్యక్ మనుష్య స్థావరాలు కూడా వారి వారి పాప పుణ్యాలతో జన్మించినా, అన్ని శరీరాలు పాంచభౌతికములే. ప్రతీ ఆత్మ ధరించే శరీరాలన్నీ పాంచభౌతికములే. ఆ శరీరాలు ధరించే ఆత్మలు జ్ఞ్యానాధికరణములే. వీటన్నింటిలో ఉన్న పరమాత్మ ఒక్కడే (ఏకమేవ అద్వితీయం బ్రహ్మ) . ఆత్మలకు ధారకమైన అన్ని శరీరాలు పంచభౌతికములే, అన్ని ఆత్మలు జ్ఞ్యానాకారములే, అన్ని ఆత్మలకు ఆత్మ అయిన పరమాత్మ ఒకడే. మనకు వేరు వేరు అనిపించేవి ఏవీ వేరు కాదు. అన్నీ పాంచ భౌతికములే. ఇలా చూడగలిన వాడే యోగి. అన్ని ప్రాణులలో పరమాత్మ ఆత్మగా ఉన్నాడని చూడాలి


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 188 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 4. Features of Bhakti Yoga and Practices - 42 🌴

42. sarva-bhūteṣu cātmānaṁ sarva-bhūtāni cātmani
īkṣetānanya-bhāvena bhūteṣv iva tad-ātmatām

MEANING : A yogi should see the same soul in all manifestations, for all that exists is a manifestation of different energies of the Supreme. In this way the devotee should see all living entities without distinction. That is realization of the Supreme Soul.

PURPORT : As stated in the Brahma-saṁhitā, not only does the Supreme Soul enter each and every universe, but He enters even the atoms. The Supreme Soul is present everywhere in the dormant stage, and when one can see the presence of the Supreme Soul everywhere, one is liberated from material designations.

The word sarva-bhūteṣu is to be understood as follows. There are four different divisions of species-living entities which sprout from the earth, living entities born of fermentation or germination, living entities which come from eggs and living entities which come from the embryo. These four divisions of living entities are expanded in 8,400,000 species of life. A person who is freed from material designations can see the same quality of spirit present everywhere or in every manifested living entity. Less intelligent men think that plants and grass grow out of the earth automatically, but one who is actually intelligent and has realized the self can see that this growth is not automatic; the cause is the soul, and the forms come out in material bodies under different conditions. By fermentation in the laboratory many germs are born, but this is due to the presence of the soul. The material scientist thinks that eggs are lifeless, but that is not a fact. From Vedic scripture we can understand that living entities in different forms are generated under different conditions. Birds evolve from eggs, and beasts and human beings are born from the embryo. The perfect vision of the yogī or devotee is that he sees the presence of the living entity everywhere.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment