శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 459 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 459 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀
🌻 459. ‘నళినీ’ - 1 🌻
శ్రీమాత పద్మ రూపము కలదని అర్థము. శ్రీమాత పాదములను పాదపద్మము లందురు. హస్తములను హస్త పద్మము లందురు (పద్మహస్త). శ్రీమాత ముఖమును పద్మముతో పోల్చుచూ పద్మముఖి అందురు. కన్నులను పద్మములతో పోల్చుచూ పద్మాక్షీ అందురు. చేతుల యందు పద్మమును ధరించి యుండుట చేతను, అరచేతులు పద్మము వలె కోమలముగ నుండుట వలననూ పద్మ హస్త అందురు. ఆమె పద్మము నుండియే ఉద్భవించినది గనుక పద్మజ అందురు. పద్మమునందే కూర్చుని యుండును గనుక పద్మాసనా అందురు. ఆమెకు పద్మములయందు ప్రియత్వ మెక్కువ కనుక పద్మప్రియ అందురు. ఆమె యుండు ప్రదేశము కూడ పద్మముల నిలయము. అందువలన పద్మాలయా అందురు. ఇన్ని రకములుగ పద్మముతో శ్రీమాతను పోల్చి చెప్పుదురు. అందువలన ఏకముగ పద్మినీ అందురు. నళినీ అనిననూ అదే అర్థము. నాళముతో కూడిన పుష్పమైనది గనుక 'నళినీ' అందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻
🌻 459. 'Nalini' - 1 🌻
It means that Srimata Padma is in form of a Lotus. The feet of Srimata are called The lotus feet. The palms are called the Lotus palms. Padmamukhi means comparing Srimata's face to Lotus. Padmakshi means comparison of eyes to lotuses. She is called Padma hasta is due to the fact that the hands are holding lotus and the palms are tender like lotus. She is called Padmaja as she sprang from Lotus itself. She is called Padmasana because she is sitting in a Lotus. She is called Padma Priya because she is fond of Lotuses. Her place is also the abode of lotuses. And so she is called Padmalaya. Thus Sri Mata is compared to lotuses in many ways. Thus, she is called Padmini. Nalini also means the same. It is called 'Nalini' because it is a tubular flower.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment