శ్రీ శివ మహా పురాణము - 534 / Sri Siva Maha Purana - 534
🌹 . శ్రీ శివ మహా పురాణము - 534 / Sri Siva Maha Purana - 534 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 47
🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 4 🌻
తరువాత శంఖములు, భేరీలు, పటహములు, ఆనకములు, గోముఖములు ఆ మహోత్సవములో అనేక పర్యాయములు మ్రోగించబడినవి (33). మరియు గాయకులందరు పరమ మంగళకరమగు పాటలను పాడిరి. నాట్యకత్తెలందరు అనేక తాళములతో గూడి నాట్యమును చేసిరి (34).
జగదేక బంధువగు శివుడు వీరతో గూడి అప్పుడు పరమేశ్వర తేజస్సుతో ముందుకు సాగెను. లోకపాలకులందరు ఆయనను సేవిస్తూ ఆనందముతో పుష్పములను చల్లు చుండిరి (35). ఈ విదముగా పూజింప బడిన శంభు పరమేశ్వరుడు అనేక స్తుతులచే కొనియాడబడుచున్న వాడై యజ్ఞ మండపములోనికి ప్రవేశించెను (36). పర్వతశ్రేష్ఠులు మహోత్సవ పురస్సరముగా మహేశ్వరుని వృషభము నుండి దింపి ప్రీతితో గృహము లోపలికి దోడ్కొని వెళ్లిరి(37). హిమవంతుడు కూడ దేవతలతో గణములతో కూడి విచ్చేసిన ఈశ్వరునకు భక్తితో ప్రణమిల్లి యథావిధిగా నీరాజన మొసంగెను (38).
హిమవంతుడు తన భాగ్యమును కొనియాడుచూ దేవతలను, మునులను, ఇతరులను అందరినీ నమస్కరించి మహోత్సాహముతో సన్మానించెను (39). ఆ హిమవంతుడు అచ్యుతునితో, ముఖ్యులగు దేవతలతో గూడి యున్న ఈశ్వరునికి అర్ఘ్యపాద్యముల నిచ్చి తన గృహము లోపలికి తీసుకొని వెళ్లెను (40). నన్ను, విష్ణువును, ఈశ్వరుని ఇతర పెద్దలను వాకిటి యందు రత్న సింహాసనములపై ప్రత్యేకముగా కూర్చుండబెట్టెను(41). చెలికత్తెలు, మేన, మరియు బ్రాహ్మణ స్త్రీలు, ఇతర ముత్తయిదవలు ఆనందముతో నీరాజనమిచ్చిరి (42).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 534 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴
🌻 The ceremonious entry of Śiva - 4 🌻
33. In that great festivity conches were blown, drums were beaten and the musical instruments, paṭaha, Ānaka and Gomukha were played on, repeatedly.
34. Musicians sang auspicious songs. Dancing girls danced to the tune.
35. Accompanied by these, attended upon by all important gods and with flowers showered on Him delightedly, the sole kinsman of the universe walked ahead shedding lordly splendour.
36. Lord Śiva, eulogised with many hymns of praise, entered the sacrificial altar. He was duly worshipped.
37. The excellent mountains jubilantly made Śiva dismount the bull and lovingly took Him within.
38. After duly bowing to Śiva who arrived there with the gods and Gaṇas, Himavat performed the Nīrājana with great devotion.
39. Praising his own good luck and bowing to all the gods, sages and others jubilantly he honoured them suitably.
40. The mountain, after offering Pādya and Arghya to them, took Śiva along with Viṣṇu and the important gods, within.
41. In the quadrangle inside he made us, Viṣṇu, Śiva and other important persons sit on gemset thrones.
42. The Nīrājana rites was then performed by Mena, her maids and the brahmin women as well as other ladies of the city with joy.
Continues....
🌹🌹🌹🌹🌹
15 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment