మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 33
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 33 🌹
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : వేణుమాధవ్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. ప్రకృతి-జీవనము 🌻
ప్రకృతిని గమనించుకొనుచు జీవితమును నడిపించినచో మార్పులను ఏ విధముగా అర్థము చేసికొనవలెనో తెలియును.
ఆకలి పుట్టినపుడు అన్నము తినవలెనని తెలియును. వెంటనే అన్నము తిన్నచో కర్తవ్య నిర్వహణము అనబడును. లేక వేదాంతమో వాణిజ్యమో అంతకన్నా ముఖ్యమని ఆలస్యము చేసినచో, మనము ఏర్పరచుకొనిన కార్యక్రమము కర్తవ్యము కాకపోవును.
మన ఇష్టము, అభిమానము వేరు. మనతో పనిచేయుచున్న ప్రకృతి వేరు. ప్రకృతిలో పొరపాటుండదు. ఇష్టాఇష్టములలో పొరపాట్లుండును.
వేదాంతము ఎంత గొప్పదియైనను, ఆహారమునకుగల వేళలు అంతకన్నా గొప్పవి కాకపోవచ్చును గాని అంతకన్నా సత్యములు..
🌹 🌹 🌹 🌹 🌹
30 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment