🌹. వివేక చూడామణి - 112 / Viveka Chudamani - 112🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 25. వైరాగ్య స్థితి - 2 🍀
375. పూర్తిగా వైరాగ్యమును పొందిన వ్యక్తి మాత్రమే సమాధి స్థితిని చేరగలడు మరియు స్థిరమైన జ్ఞానాన్ని పొందగలడు. అట్టి జ్ఞాని మాత్రమే సత్యాన్ని గ్రహించి బంధనాల నుండి విముక్తి పొందగలడు. అతడే స్వేచ్ఛను పొందిన ఆత్మానుభవముతో ఆనంద స్థితిని చేరగలడు.
376. స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి ఏమంటాడంటే ‘’నాకు ఏవిధమైన ఇతర పరికరము, ఆనందమును పొందుటకు లభించలేదు, ఒక్క వైరాగ్యము తప్ప’’. ఆ వైరాగ్యముతో ఆత్మ జ్ఞానము పొందిన, అది తిరుగులేని స్వేచ్ఛను కలుగజేస్తుంది. దాని ప్రభావముతో అంతములేని విముక్తిని పొందగలడు. అందువలన వ్యక్తి క్షేమము కొరకు బాహ్యాభ్యంతర్గత వ్యవహారములలో తన మనస్సును శాశ్వతమైన ఆత్మ పై ఉంచుము.
377. నీ యొక్క ప్రాపంచిక వస్తు సముదాయమును ఎంతగా కోరినప్పటికి, అవి విషమువంటివని వాని వలన చావు అంటిపెట్టుకొని ఉంటుందని గ్రహించి, నీ యొక్క కులముపై ఆపేక్ష, కుటుంబ జీవితములకు దూరముగా ఉంటూ, నీ గుర్తింపు అలాంటి అసత్య విషయములు, శరీరముపై గాక ఆత్మ వైపు మనస్సును మళ్ళించుము. అపుడు మాత్రమే నీవు నిజముగా బ్రహ్మమును దర్శించగలవు. మనస్సును ఒక క్షణము కూడా చలింపనీయకుండా కేవలం ఆత్మ పైన ఉంచి ధ్యానింపుము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 112 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 25. Vairagya (Dispassion) - 2 🌻
375. The extremely dispassionate man alone has Samadhi, and the man of Samadhi alone gets steady realisation; the man who has realised the Truth is alone free from bondage, and the free soul only experiences eternal Bliss.
376. For the man of self-control I do not find any better instrument of happiness than dispassion, and if that is coupled with a highly pure realisation of the Self, it conduces to the suzerainty of absolute Independence; and since this is the gateway to the damsel of everlasting liberation, therefore for thy welfare, be dispassionate both internally and externally, and always fix thy mind on the eternal Self.
377. Sever thy craving for the sense-objects, which are like poison, for it is the very image of death, and giving up thy pride of caste, family and order of life, fling actions to a distance. Give up thy identification with such unreal things as the body, and fix thy mind on the Atman. For thou art really the Witness, Brahman, unshackled by the mind, the One without a second, and Supreme.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
07 Aug 2021
No comments:
Post a Comment