🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 334 / Sri Lalitha Chaitanya Vijnanam - 334🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 334 / Sri Lalitha Chaitanya Vijnanam - 334🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।*
*విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀*

*🌻 334. 'విశ్వాధికా' 🌻* 

*విశ్వము కంటే అధికురాలు శ్రీమాత అని అర్థము. విశ్వము శ్రీమాత సంకల్పము నుండే ఆవిర్భవించినది. శివ-శక్తి విశ్వమునకు అధ్యక్షులు. అధికులు కూడ. శివు డాధారముగ శక్తి సమస్త విశ్వమును సృష్టించి వృద్ధి గావించి మరల తిరోధానము గావించు చున్నది. అంతటికిని ఆమె అధికురాలు గనుక సృష్టియందామెను ఆరాధించుట ఉత్తమము. ఆమె నారాధించునపుడు శివుని కూడ ఆరాధించినట్లే.*

*ఎందువల ననగా శివు డవ్యక్తుడు, నిరాకారుడు. శివుని ఆకారమే శ్రీమాత. శివుని వ్యక్తరూపమే శ్రీమాత. అందువలన ఆమె ఆరాధన శివరూపము నారాధించినట్లే. ఆ రూపము మహాచైతన్య రూపము. అపరిమితమగు వెలుగు రూపము. చీకటికి ఆవల వెలుగు రూపము. అత్యధికమగు రూపము. అన్ని వెలుగులకు అన్ని రూపములకు ఆధారమగు రూపము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 334 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini*
*Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻*

*🌻 334. Viśvādhikā विश्वाधिका (334) 🌻*

*She is beyond all tattva-s. There are thirty six important tattvas commencing from Śiva tattva downwards till pṛthivi (earth) tattva. She transcends all these tattva-s. All the living beings exist because of these tattva-s only. Thirty six tattva-s comprise of basic five elements, four components of antaḥkaraṇa, seven components of māyā tattva and five components of Śiva tattva.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

No comments:

Post a Comment