12-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 425 / Bhagavad-Gita - 425 🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 213 / Sripada  Srivallabha Charithamrutham - 213 🌹
3)  🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 93🌹 
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 116 🌹
5) 🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 77🌹
6) 🌹 VEDA UPANISHAD SUKTHAM - 56 🌹
7) 🌹. నారద భక్తి సూత్రాలు - 33 🌹 
8) 🌹. శ్రీ దత్తాత్రేయ విరచిత జీవన్ముక్తగీత - 2 / DATTATREYA JEEVANMUKTHA GEETA - 2 🌹 
9) 🌹. సౌందర్య లహరి - 40 / Soundarya Lahari - 40 🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 339 / Bhagavad-Gita - 339 🌹

11) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 167 🌹 
12) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 44 🌹
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 40🌹
14) 🌹 Seeds Of Consciousness - 120 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 56 🌹 
16)🌻 Guru Geeta - Datta Vaakya - 2 🌻
17) 🌹. మనోశక్తి - Mind Power - 58 🌹
18) 🌹. సాయి తత్వం - మానవత్వం - 49 / Sai Philosophy is Humanity - 49🌹
19) 🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 3 🌹
20) 🌹. ఓంకారము - ప్రణవోపాసన 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 425 / Bhagavad-Gita - 425 🌹* 
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

 *🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 34 🌴* 

34. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్ |
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్టా
యుధ్యస్య జేతాసి రణే సపత్నాన్ ||

🌷. తాత్పర్యం : 
ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహా యోధులందరును నాచే ఇదివరకే చంపబడిరి. కావున నీవు వారిని సంహరింపుము. ఏ మాత్రము వ్యథనొందక కేవలము యుద్ధము నొనరింపుము. నీవు తప్పక నీ శత్రువులను రణమున నశింపజేయగలవు.

🌷. భాష్యము : 
ప్రతిప్రణాళికయు దేవదేవుని చేతనే నిర్వహింపబడుచుండును. కాని భక్తుల యెడ అరమ కరుణామయుడైన అతడు తన కోరిక ననుసరించి స్వీయప్రణాళికలను అమలరుపరచు భక్తుల కార్యసాఫల్య ప్రతిష్టను ఒసగగోరును. 

కనక గురుముఖముగా కృష్ణభక్తిభావన యందు వర్తించుచు ఆ దేవదేవుని అవగతము చేసికొనునట్లుగా ప్రతియొక్కరు జీవితమును మలచుకొనవలెను. శ్రీకృష్ణభగవానుని సంకల్పము అతని కరుణ తోడనే తెలియుటకు సాధ్యమగును. 

భక్తుల సంకల్పములు సైతము ఆ దేవదేవుని సంకల్పముతో సమానముగా ఉత్తమములై యుండును. కనుక మనుజుడు వాటిని అనుసరించి జీవనసమరమున జయమును పొందవలెను. 
🌹 🌹 🌹 🌹 🌹

 *🌹 Bhagavad-Gita as It is - 425 🌹* 
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

 *🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 34 🌴* 

34. droṇaṁ ca bhīṣmaṁ ca jayadrathaṁ ca
karṇaṁ tathānyān api yodha-vīrān
mayā hatāṁs tvaṁ jahi mā vyathiṣṭhā
yudhyasva jetāsi raṇe sapatnān

🌷 Translation : 
Droṇa, Bhīṣma, Jayadratha, Karṇa and the other great warriors have already been destroyed by Me. Therefore, kill them and do not be disturbed. Simply fight, and you will vanquish your enemies in battle.

🌹 Purport :
Every plan is made by the Supreme Personality of Godhead, but He is so kind and merciful to His devotees that He wants to give the credit to His devotees who carry out His plan according to His desire. 

Life should therefore move in such a way that everyone acts in Kṛṣṇa consciousness and understands the Supreme Personality of Godhead through the medium of a spiritual master. 

The plans of the Supreme Personality of Godhead are understood by His mercy, and the plans of the devotees are as good as His plans. 

One should follow such plans and be victorious in the struggle for existence.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 213 / Sripada Srivallabha Charithamrutham - 213 🌹* 
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 39

 *🌻. నాగేంద్రశాస్త్రితో సమాగమం. 🌻* 

శంకరభట్టు, ధర్మగుప్తులు ప్రయాణాన్ని సాగిస్తూ నాగేంద్రశాస్త్రి అనే నాగోపాసకుడి ఇంటిలో ఆతిధ్యాన్ని స్వీకరించి అతని కథను తెలుసుకున్నారు. 

అతడు శ్రీపాదులవారు
పదిహేను సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు పీఠికాపురానికి పోయి, స్వయంభూదత్తుని మెడలో, మణి ఉన్న కాలనాగును చూశాడు. కాలాన్ని శాసించే కాలనాగులకు మణి
ఉంటుంది. 

అవి నిరంతరం యోగధ్యానంలో ఉండి మానవులకు కనపడవు. కాలనాగుమణి
అంగారకగ్రహ అశుభస్పందనలు నివారించి శుభాలను కలిగిస్తుంది. అతనికి మణిని
పొందాలన్న ఆశ కలిగింది.

అతడు నరసింహవర్మగారి ఇంటి ప్రాంతం నుంచి పోతూంటే, శ్రీపాదులవారు అతడిని పిలిచి, అప్పుడే అక్కడ భూమిలో వర్మగారికి దొరికిన తామ్రపాదుకలను అతనికి
ఇచ్చి, నాగేంద్రుని పీఠాన్ని స్థాపించి, ఈ పాదుకలను పూజ చేస్తూ, నాగదోష నివారణ కోసం, ఆదివ్యాధి పీడితులకు ఆ తీర్థాన్ని యిస్తే అవి నివారింప బడతాయని సెలవిచ్చారు.

పూర్వం శుంభ నిశుంభుల సంహార సమయంలో కాళీ రూపంలో సంహారకారిణిగా ఉన్న దేవికి క్రోధ,ఆవేశాలు కలగడానికి కారణం...కాలాన్ని శాసించే కాలనాగులే.ఆ సమయంలో ఆమె శరీరం నుండి జాషోడశీ,దానినుండి త్రిపుర భైరవి రూపాలు
ఉద్భవించాయి. 

తాము శ్రీ మహావిష్ణువుగా ఆమెకు అన్న కనుక శివుని త్రిశూలాన్ని
సంయోగపరచి, నాగమణులను సృష్టించి, అవి కాలనాగులచేత ధరింపబడే వరాన్ని ఇచ్ఛానని...పుట్టింటివారి సొమ్ము  
కలవందే నాగదోష నివారణ కాదనే నిబంధనను ఏర్పరిచానని తెలిపారు. 

ఇంకా అనేక బ్రహ్మాండాలు పుట్టి, స్థితిలో ఉండి, చివరకు లయించడం అంతా కాలాధీనంగా జరుగుతుందని... అటువంటి కాలమే తమ అధీనం అని... తమను ఆరాధించేవాళ్ళకు
కాలపురుషుడు ఎల్లప్పుడూ అనుకూలిస్తాడని చెప్పారు. 

శంకరభట్టు, ధర్మగుప్తులు వచ్చినప్పుడు వారికి పాదుకలనిచ్చి, వారి వద్ద నుండి మణిని గ్రహించమని శ్రీపాదులవారు అతనికి తెలిపారు
అని నాగేంద్రశాస్త్రి శంకరభట్టు, ధర్మగుప్తులకు తెలిపి, అలాగే చేశాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

 *🌹 Sripada Srivallabha Charithamrutham - 213 🌹* 
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 21

 *🌻 Sripada’s assurance to Datta devotees 🌻* 

Talking to each other on the speciality of Sripada’s greatness, we reached ‘Maanchaala’ village.  

The village Goddess of Maanchaala gave us Her divine darshan and blessed us. She fed us ‘prasad’ with Her divine hands and said, “Dattatreya who did ‘Guru bodha’ (teaching of Guru), is now present in the form of Sripada Srivallabha in Bhulokam. Sripada’s ‘will’ can not be predicted. 

 Sripada Himself told me that in the coming centuries, Prahlada would take avathar as ‘Gurusarvabhouma’ (the greatest Guru) and this place would become famous as ‘Mantralayam’. He would daily drink the waters of ‘Thungabhadra’.  

May you have all auspiciousness.” Saying so she got back Her previous form. While we were leaving that place, one Maaladaasari by name Krishna Dasu came.  

The village Goddess of Maanchaala gave ‘prasad’ to him also, gave him a garland of flowers as a symbol of Her grace and told us to travel to Kurungadda. We three started our journey to Kurungadda.  

All the devotees of Datta belong to only one caste. They can take the ‘prasad’ of Datta Prabhu given by a person of any caste. When Krishna Dasu joined us, we had new enthusiasm.  

In course of conversation, Krishna Dasu said, ‘If one knows why there are differences in the numbers 16, 116, 1116 to the ‘dakshinas’ given as donation in yajnas, one can understand the number 2498 of Sripada. Just as this ‘jagat’ (world) is reflected in ‘atma’, children are born from father.  

During marriage the bridegroom prays to Agnihotra, ‘Oh! Agnihothra! You allow me to have ten children in this bride.’ He himself becomes the 11th son. That means, it is within dharma to have 10 children. After that he should treat his wife as mother.  

The son is 1/10th part of the father. Ten such children together become father, who is the form of ‘purnanka’. Siva is atma, so He is ‘Paripoorna’ (wholesome).  

If 16 ‘dasa amsas’ (one tenths) are divided by ten, one (purna ankam) comes as the symbol of Siva, and six remains. Vishnu is the form of ‘Moola Prakruthi’ (the root nature) and has the form of ‘Maya’. Prakruthi is one half of ‘Purusha’.  

So one half of 10 is 5. If 6 is divided by 5, one (purnankam) comes as the symbol of Vishnu. But one (dasamsa) remains. Brahma who is the son of ‘purusha prakruthi’ (Siva-Vishnu) is 1/10th of them (dasamsa).  

So if 1 is divided by 1, 1 (purnanka) comes as the symbol of Brahma as the result. Nothing remained. Purnam means zero. It is ‘Nirguna’.  

So it is the form of Rudra. When everything is merged (annihilated) (laya), only ‘Maha Sunyam’ is seen. Everything merges in Maha Sunyam only.  

But the form of Vishnu has the dharma of ‘Anantha’ (endless). While the creation in the nature of ‘Sthithi’, the ananthatwam (all pervading nature) is inevitable.  

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 93 🌹* 
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. *చేయవలసినది- చేయదలచినది - 9* 🌻 

మానవజీవిత రంగంలో ప్రతి ఒక్కడు పరమాత్మను తనకు సహాయంగా ఆవాహన చేసి తన హృదయంలోనికి ఆహ్వానం చేసికొనుటకు సంకేతంగా మహాభారతంలో ఈ ఘట్టం ఉన్నది. 

శ్రీకృష్ణుని, యుద్ధంలో సహాయమును ఆపేక్షించుట కొరకు అర్జునుడు, దుర్యోధనుడు వస్తారు. దుర్యోధనుడు తలవైపున అర్జునుడు పాదముల వైపున కూర్చొనుట ఈ కథను మనమెరుగుదుము. పాదముల వైపున కూర్చున్నవాడు అనుగ్రహింప బడినాడు. 

పరమాత్మ తన దొంగనిద్రలో నుండి మేల్కొని కనులు తెరిచేటప్పటికి ఎదురుగా కాళ్ళవైపున చూస్తుండగా అర్జునుడు కనబడినాడు. తలవైపున కూర్చున్న దుర్యోధనుడు కనిపించలేదు. అతడు నేను వచ్చానని చెప్పుకోవలసి వచ్చింది. 

నేను వచ్చానని చెప్పుకున్నవాడి గతి యుద్ధంలో ఏమైందో మనం చూశాము గదా! ఈ ప్రపంచంలోకి నేను వచ్చానండోయ్ నేనిది పాస్ అయినాను అది చదువుకున్నాను. నాకు ఆస్తి ఇంత ఉంది. నగరంలో నేనింత‌ మందిని ఎరుగుదును. నాకు హోదా ఇంత ఉంది. నేనింతమందిని కంట్రోల్ చేయగలను అన్నవాడి గతి దుర్యోధనుడి గతే అవుతుంది. ఇది లాభం లేదు. 

కావలసినదల్లా పాదముల దగ్గర కూర్చోగలగటమే. సంఘంలో ఉన్న జీవులను చూచి, వారిలో పరమాత్మను చూచి, తదర్చన బుద్ధితో, తదర్పణబుద్ధితో తన వృత్తి వ్యాపారాదులను ఆరంభించుకొనవలెను. ఇది మహాభారతానికి (మన జీవితానికి మధ్యన) ఉన్న సంకేతం. 

దుర్యోధనునితో పాటు వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణుని ఏమీ కోరలేదు‌ శ్రీకృష్ణుడే "యాదవుల సహాయం కావాలా? నేను ఒక్కడినే కావాలా? అని అడుగుతూ నేను యుద్ధం చేయను అస్ర్తం పట్టను, అని అన్నాడు. "నీ యుద్ధం, సహాయం కాదయ్యా నేను కోరేది. నీవు నా రథమందు వసింపుమయ్య! నందకుమారా యదుభూషణ" అని (అర్జునుడు) కోరాడు‌. కోరగానే కృష్ణుడు యుద్ధంలో రథం మీద కూర్చున్నాడు.
.....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 115 🌹* 
 *🌴 Meditation for the Aquarian AGE - 6 🌴* 
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

 *🌻 “Dip deep” - 1 🌻* 

The meditation proposed by Master CVV for the Aquarian Age is to observe how the thoughts emerge from us. 

We meditate on the state of the absolute being we are ourselves, where there is neither sound, colour, form, idea nor thoughts. 

For the daily meditation we choose a fix time, best at an interval of 12 hours. 6 o’clock in the morning and evening are recommended as the appropriate time. 

In the morning we should have had a bath, purged the bowels and put on fresh clothes. We sit in a comfortable position with the eyes closed, the spine upright, facing East or North. 

In addition we can light a candle and incense – particularly recommended is sandalwood. We utter 3 or 7 times the OM in a soft and uniform manner and listen to the sound. 

We visualize the Master; the presence helps us for meditation. In order to become a channel to the energies of synthesis the Master has given the sound key “Namaskarams Master CVV” and added that you don’t have to repeat it like a mantra, but just invoke it once in the morning and in the evening. 

Thereafter we remain silent for 15 minutes and observe what is happening inside. The Master called this: “Dip deep”. 

He said it takes at least 15 minutes for the energy to spread to all nooks and corners of the body and to dynamise it. 

Thereby adjustments happen in the body and energy blockages are removed for a free circulation of prana energy. The Master called this “repair work”.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K. P. Kumar: The Aquarian Master / seminar notes.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 77 🌹* 
 *🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻* 
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

 *🌻 II ధ్యాన భేదన ఫలభేదన కథనమ్ II 🌻* 

అభినవ సిన్దూరాభా
మమ్బ! త్వాం చిన్తయన్తి యే హృదయే I
ఉపరి నిపతన్తి తేషా
ముత్పల నయనా కటాక్ష కల్లోలాః II 1 II

వర్గాష్టక మిళితాభి
ర్వశినీ ముఖ్యాభి రావృతాం భవతీమ్ I
చిన్తయతాం సితవర్ణాం
వాచో నిర్యాన్త్యయత్నతో వదనాత్ II 2 II

కనక శలాకా గౌరీం-
కర్ణవ్యాలోల కుణ్డల ద్వితయామ్ I
ప్రహసిత ముఖీఞ్చ భవతీం
ధ్యాయ న్తే త ఏవ భూధనదాః II 3 II

శీర్షామ్భోరుహ మధ్యే
శీతల పీయూష వర్షిణీం భవతీమ్ I
అనుదిన మనుచి న్తయతా
మాయుష్యం భవతి పుష్కల మవన్యామ్ II 4 II

మధురస్మితాం మదారుణ
నయనాం మాతఙ్గకుమ్భ వక్షోజామ్ I
చన్ద్రావతంసినీం త్వాం
సవిధే పశ్యన్తి సుకృతినః కేచిత్ II 5 II

లలితాయాః స్తవరత్నం
లలితపదాభిః ప్రణీత మార్యాభిః I
అనుదిన మవనౌ పఠతాం
ఫలాని వక్తుం ప్రగల్భతే సైవ II 6 II

చతుర్భుజే! చన్ద్రకలావతంసే!
కుచోన్నతే! కుఙ్కుమరాగశోణే I
పుణ్డ్రేక్షు చాపాఙ్కుశ పుష్పబాణ
హస్తే నమస్తే జగదేకమాతః II 7 II

అరుణాం కరుణా తరఙ్గితాక్షీం
ధృత పాశాఙ్కుశ పుష్ప బాణ చాపామ్ I
అణిమాధిభి రావృతాం మయూఖై
రహ మిత్యేవ విభావయే భవానీమ్ II 8 II
  
ఇతి శ్రీమదాదిశైవైః తత్రభవద్భిః క్రోధభట్టారాకైః
శ్రీదుర్వాసోమహర్షిభిః సందృశ్య ప్రత్యక్షతః శ్రీపురం సంవర్ణితమ్.
శ్రీఆర్యాద్విశతీ స్తోత్రరత్నాఖ్యం శ్రీలలితా స్తవరత్నం సమ్పూర్ణమ్.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. VEDA UPANISHAD SUKTHAM - 56 🌹* 
 *🌻 1. Annapurna Upanishad - 17 🌻* 
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

IV-61. Now the sage is no longer affected; for he resorts to the vast intelligent non-knowing (in the objective mode).

 IV-62. Through the concentration of modelessness, rejecting all latent impressions, he becomes one with it; in the Infinite even that is dissolved. 

IV-63. Though standing, walking, touching, smelling, the intelligent sage, devoid of all clinging, gets rid of (fluctuating) pleasures, and the cognitions (of the particulars); he is at peace. 

IV-64. A shoreless ocean of excellences, he crosses the sea of sufferings, because he resorts to this vision even in the midst of vexed activities. 

IV-65. Devoid of all particular the stainless, pure Being is one vast essence - That is held to be the abode of (immutable) existence. 

IV-66. Rejecting distinctions like the being of time, the being of instants, the being of entities, be solely devoted to pure Being. 

IV-67. Contemplating but one unqualified universal Being, be omnipresent, full, supremely blissful, filling up all space. 

IV-68. The pristine inconceivable Status, without beginning and end, that remains at the fringe of universal Being, is causeless. 

IV-69. Cognitions dissolve there. It remains beyond the possibility of doubts. A man who reaches That returns to pains no more. 

IV-70. It is the cause of all beings; itself has no cause. It is the quintessence of all essences; nothing is more quintessential that It.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 32 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
 *చలాచలభోధ* 
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 19

 *🌻 19. నారదస్తు తదర్పితాఖిలాచరతా తద్విస్మరణే పరమ వ్యాకులతేతిచ 🌻* 

            సమస్త ఆచార వ్యవహారాలను భగవదర్పితం చేసిన భక్తుడికి భగవంతుడు ఎప్పుడైనా మరుపుకు వస్తే బాధపడుతుండడం భక్తి లక్షణం అవుతుంది. ఇది నారద మతం.

            పూజలు, కీర్తనలు వాటికవే భక్తి లక్షణాలు కావు. నిజమైన భక్తుడికి భగవద్విస్మృతి ఎన్నడూ కలుగదు. 

విస్మృతి ఎప్పుడైనా కలిగితే అందుకు దుఃఖపడతాడు. ఆ దుఃఖపడడంలో అతడు మరలా భగవంతునినే తలచు కుంటూ ఉంటాడు. ఆ విధంగా భగవంతుడు ఎప్పుడూ నిలిచే ఉంటాడు.

            భగవంతుని మరువకుండా నిరంతరం స్మృతిలో ఉంచుకుంటే ఆయన కోసం స్తోత్రాలు చేయడం, మొదలైనవి అనవసరం.

 మొదట వాచిక భక్తి ఉన్నప్పటికీ భక్తుని చిత్తం భగవంతునికి అంకితమయ్యాక, పూర్వపు భక్తి విధానం అంత ముఖ్యం కాదు. మెహెర్‌బాబా తన భక్తులకు ఈ విధంగా చెప్పారు.

 ‘‘హారాలు వేయడం, మోకరిల్లడం, స్తోత్ర పాఠాలు వల్లించడం మొదలైనవి అనవసరం. భగవంతుని కనుగొనే మార్గంలో ప్రేమ, విధేయత, అర్పణ ఈ మూడూ ప్రధానం. మానవుడికి ప్రేమించడం తెలుసు. 

అది మానవుడికి భగవంతుడిచ్చిన కానుక. అయితే లోక సంబంధమైన వాటిని కాకుండా, అదే ప్రేమను భగవంతునిపై చూపడాన్ని సహజం చేసుకోవాలి. 

దానికోసం అర్పణ, లేక కైంకర్యం అనేది మానవుడు తిరిగి భగవంతునికి ఇవ్వవలసిన కానుక. భక్తుడు ప్రియతమ భగవంతుని ఇచ్ఛకు లోబడి ఆయనతో ఐక్యతను ఆశించాలి. 

ప్రేమ కన్నా విధేయత, విధేయతకన్నా అర్పణ గొప్పవి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ, విధేయత, అర్పణ - ఈ మూడూ కలిస్తే భగవత్ప్రేమ అవుతుంది’’.

            ఇట్టి ప్రేమలో ప్రేమికుడు ప్రియతముని ఒక్క క్షణం కూడా మరచి ఉండలేడు. ఒక వేళ మరచినా, పశ్చాత్తాపంతో మరలా ఆ భగవంతునినే నిలుపు కుంటాడు. నిరంతరం భగవద్ధ్యాసలోనే ఉంటాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ దత్తాత్రేయ విరచిత జీవన్ముక్తిగీత - 2 / DATTATREYA JIVANMUKTA GITA - 2 🌹* 
📚. ప్రసాద్ భరద్వాజ

05. ఏకథా బహుథా చైవ
దృశ్యతే జలచంద్రవత్‌
ఆత్మజ్ఞానీ తథై వేకో
జీవన్ముక్త స్స ఉచ్యతే ll 

భావము: 
జలముల యందు చంద్రుడు అనేకములుగా కన్పించినను ఒక్కడే అయినట్లు, ‘ఆత్మజ్ఞానము నొందిన వాడు అద్వయుడే యగుచున్నాడు’ అనెడి సత్యమును గ్రహించిన వాడు ‘జీవన్ముక్తుడు’ అనబడుచున్నాడు.

06. సర్వభూతే స్థితం బ్రహ్మ
భేదా భేదో న విద్యతే
ఏకమేవాభి పశ్యంశ్చ
జీవన్ముక్త స్స ఉచ్యతే ll 

భావము: 
సర్వ భూతముల యందు బ్రహ్మము స్థిరమై యున్నాడు. భేదాభేదములు తెలియక యున్నాడు. ఉన్నదొక్కటియేనని ఎరిగినవాడై సదా దానినే దర్శించు వాడెవ్వడో అతడే ‘జీవన్ముక్తుడు’.

07. తత్త్వం క్షేత్రం వ్యోమాతీతమ్‌
అహం క్షేత్రజ్ఞ ఉచ్యతే
అహం కర్తా చ భోక్తా చ
జీవన్ముక్త స్స ఉచ్యతే ll 

భావము: 
ఆకాశమునకు మిన్నగా తెలియునది కూడా క్షేత్రమే. నేను క్షేత్రజ్ఞుడని పిలువ- బడుచున్నాను. “సర్వకర్మలకు కర్తయును, భోక్తయును అహంకారమే”. ఈ తత్త్వమును గ్రహించిన వాడు ‘జీవన్ముక్తుడు’.

08. కర్మేంద్రియ పరిత్యాగీ
ధ్యాన వర్జిత చేతసః
ఆత్మజ్ఞానీ తథై వేకో
జీవన్ముక్త స్స ఉచ్యతే ll  

భావము: 
కర్మేంద్రియములను, ధ్యానపూరిత చిత్తమును పరిత్యజించిన వాడై ఏకమైన ఆత్మజ్ఞానము నందు సదా స్థిరుడై యుండు వాడెవడో అతడే ‘జీవన్ముక్తుడు’.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 *🌹. DATTATREYA JIVANMUKTA GITA - 2 🌹* 
📚. Prasad Bharadwaj

5. He is called a Jivanmukta who is possessionless, who has transcended time, space and causation and who abides peacefully in the Chidakasa of the heart.

6. He is called a Jivanmukta who has transcended the waking, dreaming and sleeping states and is established in the Eternal Consciousness of Self-Identity.

7. He is called a Jivanmukta who knows that the Self, the Guru, and the universe are all the taintless Ether of Consciousness and that nothing actually comes or goes. He is called a Jivanmukta who is simple, gentle, humble, bold, courageous, patient, self-restrained, ever-peaceful, calm, serene, forgiving, just, truthful and non-covetous.

8. He is called a Jivanmukta who has a broad heart like the sky, deep as the ocean, fragrant like the Jasmine, pure as the Himalayan snow and brilliant like the million suns shining at a time in the firmament.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 40 / Soundarya Lahari - 40 🌹* 
📚. ప్రసాద్ భరద్వాజ 
40 వ శ్లోకము

 *🌴. లక్ష్మి మాతా దీవెనలు, అజ్ఞానము నుండి విముక్తి, భవిష్యత్తు తట్టడము 🌴* 

శ్లో: 40. తటిత్వంతం శక్త్యా తిమిర పరిపన్ధిస్పురణయా 
స్ఫుర న్నానారత్నాభరణ పరిణద్దేన్ద్ర ధనుషమ్l 
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం 
నిషేవే వర్షన్తం హర మిహిర తప్తం త్రిభువనమ్ll 
 
🌻. తాత్పర్యము :
 అమ్మా ! నీ యొక్క మణిపూర చక్రమే ముఖ్యమయిన నెలవుగా కలిగి అందలి చీకటికి శత్రువు అయిన ప్రకాశములు కలిగిన వివిధ రత్నముల అలంకారములచే అలంకరింపబడిన ఇంద్ర ధనుస్సు కల నల్లని వర్ణము కలిగినట్టిదియు ఈశ్వరుడు అను సూర్యుని చే కాల్చబడిన మూడు లోకములను తన వర్ష ధారలచేత తడుపునట్టి నిర్వచించుటకు వీలు లేనట్టి మేఘమును ( ఈశ్వరుని ) పూజింతును .కదా ! 
  
🌻. జప విధానం - నైవేద్యం:--

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పాయసం, తమలపాకులు, వక్క నివేదించినచో లక్ష్మి మాతా దీవెనలు, అజ్ఞానము నుండి విముక్తి, భవిష్యత్తు గూర్చి సూచనలు తెలియ వచ్చును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

 *🌹 Soundarya Lahari - 40 🌹* 
📚 Prasad Bharadwaj 

SLOKA - 40 

 *🌴 Blessings from mother Lakshmi, Fore-sight into future events and freedom from ignorance 🌴* 

40. Thatithwantham shakthya thimira paree pandhi sphuranaya Sphuranna na rathnabharana pareenedwendra dhanusham Thava syamam megham kamapi manipooraika sharanam Nisheve varshantham haramihira thaptham thribhuvanam.
 
🌻 Translation :
I bow before that principle, which is in your wheel of manipooraka ,which as Parashakthi shines like the enemy of darkness, which is with the streak of lightning, which is with the shining jewels of precious stones of lightning, which is also black as night, which is burnt by rudhra like the sun of the deluge, and which cools down the three worlds like a strange cloud.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :   

If one chants this verse 1000 times a day for 45 days, offering Milk payasam, betel leaves and areca nut as prasadam, it is said that one would get Blessings of Lakshmi Form of Mata, desirable good dreams

🌻 BENEFICIAL RESULTS: 
Fore-sight into future events and freedom from ignorance. 
 
🌻 Literal Results: 
Accumulation of gems and jewellery, activation of manipura chakram, cooling of body and mind.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 339 / Bhagavad-Gita - 339 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 20 🌴

20. త్రైవిద్యా మాం సోమపా: పూతపాపా
యజ్ఞైరష్ట్వా స్వర్గతిం ప్రార్థయన్తే |
తే పుణ్యమాసాద్య సురేద్రలోకమ్
అశ్నన్తి దివ్యాన్దివి దేవా భోగాన్ ||

🌷. తాత్పర్యం :
స్వర్గలోకములను గోరుచు వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే అర్చింతురు. పాపఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్య ఇంద్రలోకమున జన్మించి దేవభోగముల ననుభవింతురు.

🌷. భాష్యము :
ఈ శ్లోకము నందలి “త్రైవిద్యా:” అను పదము సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదములను సూచించుచున్నది. ఇట్టి మూడు వేదములను అధ్యయనము చేసిన బ్రహ్మణుడే “త్రివేది” యని పిలువబడును. 

ఈ వేదములందు తెలుపబడిన జ్ఞానము యెడ ఆకర్షణను కలిగియుండువాడు నిక్కముగా సంఘములో అత్యంత గౌరవనీయుడు కాగలడు. కాని దురదృష్టవశాత్తు వేదాధ్యయనపు అంతిమ ప్రయోజనమును తెలియని వేదపండితులే అధికముగా నున్నారు. 

కనుకనే ఆ త్రివేదులకు అంతిమలక్ష్యము తానేయని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట ప్రకటించుచున్నాడు. నిజమైన త్రివేదులు శ్రీకృష్ణభగవానుని చరణకమలములకు శరణమునొంది అతని ప్రీత్యర్థమై భక్తియుక్తసేవలో నియుక్తులగుదురు. 

అట్టి భక్తియోగము హరేకృష్ణ మహామంత్రమును జపించుటతోను మరియు అదేసమయమున కృష్ణుని గూర్చి నిజముగా అవగతము చేసికొనుట యత్నించుటతోను ఆరంభమగును. కాని దురదృష్టవశాత్తు వేదాధ్యయనపరులు సాధారణముగా ఇంద్రుడు, చంద్రుడు వంటి దేవతల కొరకు యజ్ఞములు చేయుట యందే మగ్నులగుదురు. 

అట్టి యత్నముచే వివిధ దేవతార్చకులు నిక్కముగా రజస్తమోగుణ సంపర్కము నుండి శుద్ధిపడినవారై మహర్లోకము, జనలోకము, తపోలోకము పలు ఊర్థ్వలోకములను(స్వర్గలోకములను) చేరుదురు. 

అట్టి ఉన్నతలోకములను చేరిన పిమ్మట వారు భూలోకమున్నను అనేక లక్షలరెట్లు అధికముగా సుఖముల ననుభవింతురు.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 339 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 20 🌴

20. trai-vidyā māṁ soma-pāḥ pūta-pāpā
yajñair iṣṭvā svar-gatiṁ prārthayante
te puṇyam āsādya surendra-lokam
aśnanti divyān divi deva-bhogān

🌷 Translation : 
Those who study the Vedas and drink the soma juice, seeking the heavenly planets, worship Me indirectly. Purified of sinful reactions, they take birth on the pious, heavenly planet of Indra, where they enjoy godly delights.

🌹 Purport :
The word trai-vidyāḥ refers to the three Vedas – Sāma, Yajur and Ṛg. A brāhmaṇa who has studied these three Vedas is called a tri-vedī. Anyone who is very much attached to knowledge derived from these three Vedas is respected in society. 

Unfortunately, there are many great scholars of the Vedas who do not know the ultimate purport of studying them. Therefore Kṛṣṇa herein declares Himself to be the ultimate goal for the tri-vedīs. 

Actual tri-vedīs take shelter under the lotus feet of Kṛṣṇa and engage in pure devotional service to satisfy the Lord. Devotional service begins with the chanting of the Hare Kṛṣṇa mantra and side by side trying to understand Kṛṣṇa in truth. 

Unfortunately those who are simply official students of the Vedas become more interested in offering sacrifices to the different demigods like Indra and Candra. 

By such endeavor, the worshipers of different demigods are certainly purified of the contamination of the lower qualities of nature and are thereby elevated to the higher planetary systems or heavenly planets known as Maharloka, Janaloka, Tapoloka, etc. 

Once situated on those higher planetary systems, one can satisfy his senses hundreds of thousands of times better than on this planet.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 167 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

 *🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
38. అధ్యాయము - 13

 *🌻. శివపూజ - 7 🌻* 

కుర్యాదారార్తికం పంచవర్తికామనుసంఖ్యయా | పాదయోశ్చ చతుర్వారం ద్విః కృత్యో నాభిమండలే || 71

ఏకకృత్వో ముఖే సప్తకృత్వస్సర్వాగ ఏవ హి| తతో ధ్యానం యథోక్తం వై కృత్వా మంత్రముదీరయేత్‌ || 72

యథాసంఖ్యం యథాజ్ఞానం కుర్యాన్మంత్ర విధిం నరః | గురూపదిష్ట మర్గేణ కృత్వా మంత్రజపం సుధీః || 73

స్తోత్రైర్నానావిధైః ప్రీత్యా స్తువీత వృషభద్వజమ్‌ |తతః ప్రదక్షిణాం కుర్యాచ్ఛివస్య చ శనైశ్సనైః || 74

అయిదు వత్తుల గల హారతిని సంఖ్యానియమానుసారముగా ఈయవలెను. పాదములకు నాలుగు సార్లు, నాభీమండలము నందు రెండుసార్లు (71), 

ముఖమునందొకసారి, సర్వాగములయందు ఏడుసార్లు హారతినీయవలెను. తరువాత ధ్యానమును చేయవలెను. మంత్రమును జపించవలెను (72). 

భక్తుడు గురువు ఉపదేశించిన మార్గములో ధ్యానపూర్వకముగా మంత్రమును శాస్త్రోక్త సంఖ్యలో జపించవలెను (73). 

తరువాత వృషభము ధ్వజమునందు గల శివుని ప్రేమతో అనేక స్తోత్రములతో స్తుతించవలెను. అటు పిమ్మట శివునకు మెల్లగా ప్రదక్షిణమును చేయవలెను (74).

నమస్కారం తతః కుర్యాత్సాష్టాంగం విధివత్పుమాన్‌ | తతః పుష్పాంజలిర్దేయో మంత్రేణానేన భక్తితః || 75

శంకరాయ పరేశాయ శివ సంతోషహేతవే | అజ్ఞానాద్యది వా జ్ఞానాద్యద్యత్పూజాదికం మయా || 76

కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర | తావకస్త్వద్గత ప్రాణ స్త్వచ్చిత్తోహం సదా మృడ || 77

ఇతి విజ్ఞాయ గౌరీశ భూతనాథ ప్రసీద మే | భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనమ్‌ || 78

త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం ప్రభో | ఇత్యాది బహువిజ్ఞప్తిం కృత్వా సమ్యగ్విధానతః || 79

తరువాత భక్తుడు యథావిధిగా సాష్టాంగ నమస్కారమును చేయవలెను. తరువాత దేవదేవుడగు శంకరునికి ప్రీతిని కలిగించుటకై భక్తితో ఈ మంత్రమును నుచ్చరించి పుష్పాంజలినీయవలెను (75). 

హే శంకరా! నేను తెలిసి గాని, తెలియక గాని చేసిన పూజాదికము (76) 

నీదయవలన సఫలమగు గాక! హే మృడా! నేను నీవాడను. నా ప్రాణములు నీయందే ఉన్నవి. నేను సర్వదా నిన్నే స్మరించెదను (77). 

ఈ విధముగా పార్వతీపతికి విజ్ఞాపన చేయవలెను. హే భూతనాథా! నాయందు దయ చూపుము. భూమి యందు జారిపడిన వారికి భూమియే ఆలంబనమగును (78). 

హే ప్రభో! అదే తీరున, నీయందు అపరాధము చేసిన వారికి నీవే శరణు. ఇత్యాదిగా శివునకు చక్కని విధములో అనేక విజ్ఞప్తులను చేయవలెను (79).

పుష్పాంజలిం సమర్ప్యైవం పునః కుర్యాన్నంతి ముహుః | స్వస్థానం గచ్ఛ దేవేశ పరివారయుతః ప్రభో || 80

పూజాకాలే పునర్నాథ త్వయా గంతవ్యమాదరాత్‌ | ఇతి సంప్రార్ధ్య బహుశశ్శంకరం భక్తవత్సలమ్‌ || 81

విసర్జయేత్స్వ హృదయే తదపో మూర్ద్ని విన్యసేత్‌ | ఇతి ప్రోక్త మశేషేణ మునయ శ్శివపూజనమ్‌ || 82

భుక్తి ముక్తి ప్రదం చైవ కిమన్యచ్ఛ్రోతు మర్హథ || 83

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమఖండే సృష్ట్యుపాఖ్యానే శివపూజన వర్ణనం నామ త్రయో దశోsధ్యాయః (13).

ఈ విధముగా పుష్పాంజలిని సమర్పించి మరల అనేక పర్యాయములు నమస్కరించవలెను. హే దేవదేవా! ప్రభో! పరివారముతో గూడి స్వస్థానమునకు వెళ్లుము (80).

 హేనాథా! పూజాకాలమునందు మరల దయతో విచ్చేయుము. ఈ రీతిగా భక్తవత్సలుడగు శంకరుని అనేక తెరంగుల ప్రార్థించి (81)

 తన హృదయములోనికి విసర్జన చేసుకొనవలెను. ఆ జలములను శిరస్సుపై ఉంచుకొనవలెను. ఓ మునులారా! మీకీ విధముగా శివపూజను నిశ్శేషముగా చెప్పితిని (82). 

ఈ పూజ వలన భుక్తి,మరియు ముక్తి లభించును. మీరింకనూ ఏమి వినగోరుచున్నారు? (83).

శ్రీ శివ మహాపురాణములోని రెండవదియగు రుద్రసంహిత యందు మొదటిదియగు సృష్ట్యుపాఖ్యాన ఖండములో శివ పూజా వర్ణనము అనే పదమూడవ అధ్యాయము ముగిసినది (13).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 44 🌹* 
Chapter 13
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

 *🌻 Infinite Knowledge in the Avatars Work - 2 🌻* 

When the First One realized his Infinite Knowledge, his Knowledge formulated a divine plan.  

And according to this plan he himself must take human form and come down on earth to work out his pl an. It is by the working out of this plan that he fulfills the responsibility for the whole creation.  

The plan is that he himself must work sufficiently up to the time when he himself must come back in a new advent.  

It is during this period of 700 to 1400 years between advents that he allows the five Perfect Masters to know and to fulfill his plan. 

So the Avatar prepares his plan, outlines it, puts details into it and colors it in such a way that every being has a part in his plan.  

After preparing this pla n, the Avatar drops his body, and according to his plan already worked out, the details become clear and start taking shape (manifesting). 

The specific details of Meher Baba's plan are now manifesting, and they are starting to reveal their shape and scope.  

The hidden details of his work are taking a clearer shape because the work is already planned, and the time when all the details are most clearly seen will be when the plan is in full action and reaction. The time when the details are crystal clear is the time when the manifestation is felt the most.  

It is when we know the details of his plan for each of us that we will receive the knowledge that he has planned for us to understand.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 40 🌹* 
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 17
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. జగత్ సృష్టి వర్ణనము - 2 🌻* 

హిరణ్యవర్ణమభవత్తదణ్డముదకేశయమ్‌. 
తస్మిఞ్జజ్ఞే స్వయం బ్రహ్మా స్వయంభూరితి నః శ్రుతమ్‌ | 8

ఉదకములో నున్న ఆ వీర్యము బంగారు వర్ణము గల అండముగా అయెను. దానియందు స్వయంభు దైన బ్రహ్మ జనించెనని మేము వింటిమి.

హిరణ్యగర్భో భగవానుషిత్యా పరివత్సరమ్‌. 9

తదణ్డమకరోద్ధ్వెదం దివం భువమథాపి చ | తయోః శకలయోర్మధ్యే ఆకాశమసృజత్ర్పభుః. 10

అప్సు పారిప్లవాం పృథ్వీం దిశశ్చ దశధాదధే | తత్ర కాలం మనో వాచం కామం క్రోధమథో రతిమ్‌. 11

ససర్జ సృష్టిం తద్రూపాం స్రష్టుమిచ్ఛన్‌ ప్రజాపతిః |

బగవంతు డైన హిరణ్యగర్భుడు ఆ అండమునందు పరివత్సరము కాల ముండి, దానిని రెండు వ్రక్కలుగా చేసి ద్యులోకమును, భూలోకమును నిర్మించెను.

 ఆ రెండు వ్రక్కల మధ్మయందు ఆకాశమును సృజించెను. ఉదకము నుందు తేలుచున్న భూమిని, పది దిక్కులను సృజించెను. 

అచట కాలమును, మనస్సును, వాక్కును, కామమును, క్రోధమును, మరియు రతిని నిర్మించెను. ప్రజాపతి ఈ రాబోవు సృష్టిని పైన చెప్పిన ఆకాశాదులతో సంబంధించిన దానినిగా చేయదలచి, ముందుగా వాటిని సృజించెను.

విద్యుతోశనిమేఘాంశ్చ రోహితేన్ద్రధనూషి చ. 12

వయాంసి చ ససర్జాదౌ వర్జన్యం బాధ వక్త్రతః | బుచో యజూంషి సామాని నిర్మమే యజ్ఞసిద్దయే. 13

మేఱుపులను, వజ్రమును (పిడుగును). మేఘములను, రక్తమును, ఇంద్రధనస్సును లేదా ఎఱ్ఱని రంగుగల ఇంద్రధనుస్సులను, పక్షులను వర్జన్యుని సృజించెను 

పిదప యజ్ఞసిదికొరకై ముఖమునుండి బుగ్యజుఃసామవేదములను సృజించెను.

సాధ్యాం సైరయజద్దేవాన్‌ భూతముచ్ఛావచం భుజాత్‌ | సనత్కుమారం రుద్రం చ సర్జ క్రోధసమ్బవమ్‌.

మరీచిమత్ర్యజీరసం పులస్త్యం పులహం క్రతుమ్‌ | వసిష్ఠం మానసాః సప్త బ్రహ్మాణ ఇతి నిశ్చితాః. 15

సపైతే జనయన్తి స్మ ప్రజా రుద్రాశ్చ సత్తమ |

ఆ వేదములచే సాధ్యులను, దేవతలను ఉద్దేశించి యజ్ఞము చేసెను. అనేక విధముల లగు భూతములను సృజించెను. భుజమునుండి సనత్కుమారుని, క్రోధమునుండి రుద్రుని సృజించెను. 

మరీచి, ఆత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు. క్రతువు, వసిష్ఠుడు అనువారిని సృజించెను. ఈ ఏడుగురును బ్రహ్మమానసపుత్రు లగు బ్రహ్మ లని ప్రసిద్ది చెందిరి. 

ఈ సప్త బ్రహ్మలును. రుద్రులను ప్రజాసృష్టి చేసిరి.

ద్విదా కృత్వాత్మనో దేహమర్దేన పురుషోభవత్‌ | అర్దేన నారీ తస్యాం స బ్రహ్మా వై చాసృజత్ర్పజాః. 16

తన దేహమును రెండు భాగములుగా చేసి. ఒక భాగము పురుసుడు గాను, మరొక భాగము స్త్రీగాను అయి బ్రహ్మ ఆమె యందు ప్రజలను సృజించెను.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే జగత్సర్గవర్ణనం నామ సప్తదశోధ్యాయః.

అగ్ని మహాపురాణమునందు జగత్సృష్టివర్ణన మను సప్తదశాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 56 🌹* 
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

 *🌻. పులస్త్యమహర్షి - హవిర్భువు - 4 🌻* 

13. మరి నేటికి ఇలా ఎందుకు అయిపోయారు? ఎందుకిలా దుఃఖాలను అనుభవిస్తున్నారు? అంటే, “ఏ పాపమూ చెయ్యలేదు!” అని నోటితోచెప్పి తప్పించుకోవచ్చుకాని; ఈ హీనస్థితికి రావటానికి బలమైన హేతువేదో ఉందని మనం ఒప్పుకోకపోతే మనకు వివేకమేలేనట్టు!

14. మహర్షులందరూ స్మృతికర్తలే! అవి చాలావరకు నశించిపోయాయి. స్మృతివిహితమయిన కర్మను ఆచరించవలసిందే. కానీ జ్ఞానహీనమయినటు వంటి కర్మ బంధన హేతువవుతుంది. 

15. క్రమంగా స్వధర్మకర్మలోంచీ ఇంకా ఉత్తమకర్మ చెయ్యటమనేటటువంటిది జ్ఞానంలేక సాధ్యంకాదు. జ్ఞానముంటే కర్మలో ఉత్తమ లక్షణాలు పొందుతాడు. ఇంకా ఉత్తమ కర్మచేయవచ్చు. కానీ జ్ఞానంలేనివాడు కర్మలో, సరియైన పద్ధతిలో ఉండకుండా పతనంచెందుతూ ఉంటాడు. 

16. జ్ఞానహీనమైన కర్మ బంధనమని; జ్ఞానము, కర్మ ఈ రెండూ కూడా ఫలిస్తేనే అతడు ముక్తిని క్రమంగా పొందుతాడని పులస్త్యస్మృతి చెబుతోంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌻 Guru Geeta - Datta Vaakya - 2 🌻* 
✍ Sri GS Swami ji 
📚. Prasad Bharadwaj

 *🌻 Pointers to Spiritual Seekers 🌻* 

People have endless desires. Desires keep emerging as if from an inexhaustible container. But many things desired are also often forgotten. There are mainly three types of desires.

1. I am great. My word is great. My wealth is great. Such arrogance is there. I should be everywhere. My words should be heeded. Mine should be the final word.

2. I should be informed of everything. If it is done without my knowledge I will not accept it.

3. I should always be happy. But it is okay if I torment others. Everyone should respect me and do things to please me. But I will not show respect towards others.

When these 3 attitudes are properly analyzed, all desires fall into the flow of three rivers. If the history of desires is studied, it is found that the fire of desire is age old and has troubled man since the beginning of time. Is there anyone who has had all their desires fulfilled?

To explore that question, we should know our ancient heritage. This power was achieved by the sages of Indian tradition.That is because they have followed the Guru principle.

Even a child knows the meaning of guru, because it naturally follows the guidance and instruction of mother and father. But the strange thing is, even the greatest of scientists and the strictest of seekers sometimes do not grasp this principle of Guru.

Mother, father, their instruction and guidance are accepted, but the concept of guru is rejected by many even though they chant the verse.

 *☘️ “Gurur Brahma gurur Vishnuhu gurur devo Maheswaraha..”. ☘️* 

Let us learn why this puzzling situation exists, in the next episode.
🌻 🌻 🌻 🌻 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 3 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

ఇప్పుడు మనం చూస్తున్న విపరీత పరిమాణాలు, దుర్ఘటనలు, ఆశ్చర్యకర సంఘటనల గురించి వేల సంవత్సరాల కిందటే వివరించిన మహాజ్ఞాని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో జన్మిచారు. ఆయన ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు? కాలజ్ఞానాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలకు వెల్లడి చేశారు- అనే విషయాలపైన వాదోపవాదాలు వున్నాయి.

ఏదేమయినా క్రీస్తు శకం 1600 – 1610 మధ్యలో ఆయన జన్మించి ఉండవచ్చని కొందరి అంచనా. పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి జీవితంలో ఎన్నో మహిమలు ప్రదర్శించినట్లు చెబుతారు. అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అని తర్కించే వారి విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రం భవిష్య సూచికగా అత్యధికశాతం హిందువులు నమ్ముతారు.

కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు ‘నీవెవరివి?’ అని శ్రీ కృష్ణుడిని ప్రశ్నించినపుడు “సర్వ శక్తిమంతుడైన కాలుడను నేను” అని జవాబిచ్చాడు. కాలుడు సమస్త చరాచర జగత్తును కబళించగలిగిన, సృష్టించగలిగిన శక్తి వున్నవాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు కాలుని అధీనంలోనే ఉంటాయి! 

సృష్టి మొత్తం కాలం అధీనంలోనే వుంటుంది. కేవలం మహాజ్ఞానులకు, యోగులకు మాత్రమే కాల పురుషుని గురించిన జ్ఞానం వుంటుంది. అటువంటి మహాత్ముడు యోగి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి. 

అందువల్ల ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికే అత్యధికులకు అనుసరణీయంగా వుంటోంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. ఓంకారము - ప్రణవోపాసన 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ 
 *🌻. చలాచల బోధ* 
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రణవమనగా ఓంకారము. ఇది వర్ణ సమూహములోని ఒక్క అక్షరం. ఇది ధ్వన్యాత్మకము. అనగా కేవలము ధ్వనియే స్వరూపముగా కలదు. 

సృష్టికి పూర్వము, సృష్టి కారణ అధిష్టాన చేతన పరబ్రహ్మము అందలి పరావాగ్రూపముగా లేశమాత్రమయి వుండి, ధ్వన్యాత్మకమగు నాద రూపముగా వికసించినది. అట్టి నాద స్వరూపము నొందుటలో కలిగిన చలనమే ప్రాణమాయెను. 

ప్రాణముతో కూడిన ప్రణవనాదము నుండి పంచబీజములు ఆ బీజములనుండి ఒక్కొక్క అక్షరము నందు, 10 అక్షరముల చొప్పున మొత్తం 50 అక్షరములు వాని నుండి శబ్దజాలము, సకల నామములు, అఖిల వాఙ్మయము ఏర్పడినది. ఆ పిమ్మట శబ్దోచ్ఛారణలో రూపకల్పన జరిగినది.  

ఈ విధముగా తొలుత నామరూపములు లేని, అధిష్ఠాన బ్రహ్మమే నామముచే ప్రసిద్ధి చెంది, “తస్యవాచకః ప్రణవః” అని పతంజలి చే చెప్పుటకు కారణమైనది.

అలోక కళ లేక పరమాకళ ... ఈ పదహారు కూడిన స్థితిని అఖండ ఎరుక అందురు.

బింబ ప్రతిబింబ పద్ధతిగా తురీయంలో మిగిలినవి విలయం చెందాలి... తురీయంలో తురీయంగా బిందువు మిగిలి అఖండ ఎరుకగా.... మిగిలిన 15 కళలను సంకల్పమాత్రంచే సృష్టించి పిండ బ్రహ్మాండమంతా తానే అయింది.

‘నేను’అనే ఎరుక మిగిలి యున్నా మరల సృష్టి లోనికి వచ్చి, జీవాత్మగా మరల మొదటి కొచ్చే ప్రమాదముందని చెప్తున్నారు.

 *అలోక కళ: శూన్యం (దృశ్య రహితం)* 
 *ఆలోక కళ: దర్శనం* 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 120 🌹* 
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

 *🌻 Deep Conviction 🌻* 

When a stage is reached that one feels deeply that whatever is being done is happening and one has not got anything to do with it, then it becomes such a deep conviction that whatever is happening is not happening really. 

And that whatever seems to be happening is also an illusion. That may be final. 

In other words, totally apart from whatever seems to be happening, when one stops thinking that one is living, and gets the feeling that one is being lived, that whatever one is doing, one is not doing, but one is made to do, then that is a sort of criterion.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 58 🌹* 
 *Know Your Infinite Mind* 
 *🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴* 
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

 *🌻 Q 54 :--నేను, పూర్ణాత్మ, అంశాత్మ - 1 🌻* 

Ans :--
1) నేను అనగా 
పూర్ణాత్మ+ పూర్ణాత్మ చే సృష్టింపబడ్డ ఆత్మశకలం (మనం)+
మన ఆలోచనల ద్వారా జరిగిన సృష్టి అంతా కలిసి నేను అనబడుతుంది. అందుకే రమణ మహర్షి నీవెవరు (know thyself) నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు. అనగా నేను అంటే పూర్ణాత్మ, మనం మరియు మన ఆలోచనలు చేత సృష్టింపబడ్డ భౌతిక రూపాలు అంశాత్మలు అని. అందరూ సమిష్టిగా పరిణామం చెందుతున్నారు.

2) ఉదాహరణకు America లోని newyork లో ఒక citybank ఉందనుకోండి. newyork లో main branch ఉంది. sub branches ప్రపంచమంతటా ఉన్నాయి. ప్రతి branch స్వతంత్రంగా అభివృద్ధి చెందుతుంటుంది. sub branch లోని customers ఎంత bank balance నైనా పెంచుకోవచ్చు. అలా sub branch స్వతంత్రంగా ఎదుగుతుంటుంది. దానికి ఏ ఇతర branches అడ్డురావు.

 ప్రపంచంలోని అన్ని బ్రాంచెస్ యొక్క అభివృద్ధి main branch యొక్క అభివృద్ధి గా అవుతుంది. అదే విధంగా భూమండలం అంతా అన్ని నగరాలలో అన్ని branches ఇంటర్నెట్ ద్వారా connect అయి వున్నాయి. main branch లో server ఉంటుంది. 

ఒక బ్రాంచ్ లో save చేస్తే ప్రపంచంలో ఏ బ్రాంచ్ లో నైనా withdraw చేసుకోవచ్చు. అన్ని branches interconnect అయి ఉంటాయి గనుక, ఒక బ్రాంచ్ యొక్క అభివృద్ధి అన్ని branches యొక్క అభివృద్ధి అవుతుంది. ఒక బ్రాంచ్ కుంటుపడితే అన్ని బ్రాంచెస్ ఆదుకుంటాయి. ఏ బ్రాంచ్ యొక్క అభివృద్ధి ని main branch control చేయదు. అన్ని బ్రాంచెస్ ఒకదానికొకటి సహకరించుకుంటూ communicate అవుతూ విస్తరిస్తూ ఉంటాయి.

3) పూర్ణాత్మ, అంశాత్మలు చైతన్యశక్తి ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఒక అంశాత్మ యొక్క అభివృద్ధి అన్ని ఇతర ఆత్మలకు పూర్ణాత్మ కు వర్తిస్తుంది. నిరంతరం పరిణామం చెందుతూ వ్యాకోచిస్తూ చైతన్య వికాసం చెందుతుంటాయి. ఆ విధంగా పూర్ణాత్మ అంశాత్మలు ఏకకాలంలో అభివృద్ధి చెందుతాయి.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సాయి తత్వం - మానవత్వం - 49 / Sai Philosophy is Humanity - 49 🌹* 
🌴. అధ్యాయము - 7 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

 *🌻. బాబా యోగాభ్యాసములు 🌻* 

1. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసియుండెను. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధయోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో రెండు మాత్రమే యిక్కడ వర్ణింపబడినవి.

 *🌻. ధౌతి ప్రక్రియ 🌻* 

1. మసీదుకు చాల దూరమున ఒక మఱ్ఱిచెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి మూడురోజులకొకసారి బాబా యచ్చటకు పోయి ముఖప్రక్షాళనము, స్నానము చేయుచుండెను.

2. ఆ సమయములో బాబా తన ప్రేవులను బయటికి వెడల గ్రక్కి, వాటిని నీటితో శుభ్రపరచి, ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట శిరిడీలోని కొందరు కండ్లార చూచి చెప్పిరి.

3.మామూలుగా ధౌతియనగా 3 అంగుళముల వెడల్పు 22 1/2 అడుగుల పొడవుగల గుడ్డను మ్రింగి కడుపులో అరగంటవరకు నుండనిచ్చి పిమ్మట తీసెదరు, కాని బాబా చేసిన ధౌతి చాల విశిష్టము, అసాధారణమునైనది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

 *🌹. Sai Philosophy is Humanity - 49 🌹* 
Chapter 7
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj

 *🌻 Baba’s Yoga Practice 🌻* 

Baba knew all the processes and practices of Yoga. Two of them will be described here:

 *🌻 (1) DHAUTI or CLEANING PROCESS:* 🌻

Baba went to the well near a Banyan tree at a considerable distance from the Masjid every third day and washed his mouth and had a bath. 

On one occasion, He was seen to vomit out his intestines, clean them inside and outside and place them on a Jamb tree for drying. 

There are persons in Shirdi, who have actually seen this, and who have testified to this fact. Ordinary Dhauti is done by a moistened piece of linen, 3 inches broad 22 1/2ft. long. 

This piece is gulped down the throat and allowed to remain in the stomach for about half an hour for being reacted there and then taken out. But Baba’s Dhauti was quite unique and extraordinary.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment