05 - JUNE - 2022 ఆదివారం, భాను వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 05, జూన్ 2022 ఆదివారం, భాను వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 212 / Bhagavad-Gita - 212 - 5- 08 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 611 / Vishnu Sahasranama Contemplation - 611🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 290 / DAILY WISDOM - 290🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 190 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 129 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 05, జూన్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : స్కందషష్టి Skanda Sashti 🌻*

*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 9 🍀*

*9. ఓం సర్వతేజోజ్జ్వల జ్వాలామాలినే మణికుమ్భాయ హుం ఫట్ స్వాహా ।*
*ఓం నమస్కారప్రియాయ శ్రీసూర్యనారాయణాయ అధోదిగ్భాగే సర్వాభీష్ట సిద్ధ్యర్థం మాం రక్షతు ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : హనుమంతునిలా శరీరములోని కణకణాన్ని రామ శబ్ధమయం చేయండి. రాం అనే శబ్ధము సూపర్‌ ఇంపోజ్‌ అయిపోతే ఆ క్షణంలోనే మీ బాధలన్నీ పోతాయి. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀* 

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల షష్టి 30:41:51 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: ఆశ్లేష 24:25:51 వరకు
తదుపరి మఘ
యోగం: వ్యాఘత 28:48:16 వరకు
తదుపరి హర్షణ
కరణం: కౌలవ 17:47:06 వరకు
వర్జ్యం: 12:03:28 - 13:49:24
దుర్ముహూర్తం: 17:03:20 - 17:55:50
రాహు కాలం: 17:09:54 - 18:48:20
గుళిక కాలం: 15:31:28 - 17:09:54
యమ గండం: 12:14:35 - 13:53:01
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:40
అమృత కాలం: 22:39:04 - 24:25:00
సూర్యోదయం: 05:40:50
సూర్యాస్తమయం: 18:48:20
చంద్రోదయం: 10:19:37
చంద్రాస్తమయం: 23:34:43
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: కర్కాటకం  
వజ్ర యోగం - ఫల ప్రాప్తి 24:25:51
వరకు తదుపరి ముద్గర యోగం 
- కలహం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 212 / Bhagavad-Gita - 212 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 08 🌴*

*08. నైవ కించిత్ కరోమీతి యక్తో మన్యేత తత్త్వవిత్ |*
*పశ్యన్ శృణ్వన్ స్పృశన్జిఘ్రన్నశ్నన్ గచ్ఛన్స్వపన్ శ్వపన్ ||*

🌷. తాత్పర్యం :
*దివ్యచైతన్య యుక్తుడైన వాడు చూచుట, వినుట, తాకుట, వాసనజూచుట, భుజించుట, కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటివి చేయుచున్నను తాను వాస్తవముగా ఏదియును చేయనట్లుగా ఎరిగియుండును.*

🌷. భాష్యము :
కృష్ణభక్తిభావనలో నున్నటువంటివాడు శుద్ధస్థితిలో యున్నందున కర్త, కర్మము, స్థితి, ప్రయత్నము, అదృష్టములను ఐదు విధములైన కారణములపై ఆధారపడియుండు ఎటువంటి కర్మలతో సంబంధమును కలిగియుండడు. శ్రీకృష్ణభగవానుని దివ్యమైన భక్తియుక్తసేవలో అతడు నిలిచియుండుటచే అందులకు కారణము. 

దేహేంద్రియములతో వర్తించుచున్నను అతడు ఆధ్యాత్మిక కలాపమైన తన వాస్తవస్థితిని గూర్చి సర్వదా ఎరిగియుండును. భౌతికభావనలో ఇంద్రియములు ఇంద్రియభోగమునకై నియోగించబడగా, కృష్ణభక్తిభావన యందు అవి కృష్ణుని ప్రీత్యర్థమై నియోగించబడును. కావుననే కృష్ణభక్తిపరాయణుడు ఇంద్రియకర్మలలో వర్తించుచున్నట్లు తోచినను ఎల్లవేళలా విముక్తుడై యుండును. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 212 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 5 - Karma Yoga - 08 🌴*

*08. naiva kiñcit karomīti yukto manyeta tattva-vit*
*paśyañ śṛṇvan spṛśañ jighrann aśnan gacchan svapañ śvasan*

🌷 Translation : 
*A person in the divine consciousness, although engaged in seeing, hearing, touching, smelling, eating, moving about, sleeping and breathing, always knows within himself that he actually does nothing at all.*

🌹 Purport :
A person in Kṛṣṇa consciousness is pure in his existence, and consequently he has nothing to do with any work which depends upon five immediate and remote causes: the doer, the work, the situation, the endeavor and fortune. This is because he is engaged in the loving transcendental service of Kṛṣṇa. Although he appears to be acting with his body and senses, he is always conscious of his actual position, which is spiritual engagement. 

In material consciousness, the senses are engaged in sense gratification, but in Kṛṣṇa consciousness the senses are engaged in the satisfaction of Kṛṣṇa’s senses. Therefore, the Kṛṣṇa conscious person is always free, even though he appears to be engaged in affairs of the senses. 
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://www.tumblr.com/blog/bhagavadgitawisdom
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 611 / Vishnu Sahasranama Contemplation - 611🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻611. శ్రీకరః, श्रीकरः, Śrīkaraḥ🌻*

*ఓం శ్రీకరాయ నమః | ॐ श्रीकराय नमः | OM Śrīkarāya namaḥ*

అర్చయతాం చ స్తువతాం భక్తాణాం స్మరతామపి 

స్మరించు, స్తుతించు, అర్చించు భక్తులకు శ్రీని కలుగజేయు వాడు శ్రీకరః.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 611🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻611. Śrīkaraḥ🌻*

*OM Śrīkarāya namaḥ*

अर्चयतां च स्तुवतां भक्ताणां स्मरतामपि / Arcayatāṃ ca stuvatāṃ bhaktāṇāṃ smaratāmapi 

Since He dowers those remember Him, praise Him and worship Him, He is called Śrīkaraḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 290 / DAILY WISDOM - 290 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 16. సూక్ష్మమైన కోరికలు కోరికల వలె కనిపించక పోవచ్చు 🌻*

*మన మనస్సులో తలెత్తే వివిధ రకాల అనుమానాలు మరియు మన రోజువారీ ఆచరణలో మనకు తరచుగా కలిగే అయోమయం, సూక్ష్మమైన కోరికలు ఉండటం వల్లనే. సూక్ష్మమైన కోరికలు కోరికల వలె కనిపించకపోవచ్చు. అవి కోరికల లక్షణాన్ని కలిగి ఉండవు, ఎందుకంటే అవి ధోరణులు మాత్రమే. అవి వాహనం కదలడానికి తెరిచి ఉంచబడిన ట్రాక్‌లు లేదా రోడ్లు. వాహనం కదలడం లేదు, అయితే అది కావాలంటే కదలవచ్చు; మనం ప్రతిదీ ఖాళీగా ఉంచాము.*

*అలాగే, ఇంద్రియాలకు సంబంధించిన వాహనం రోడ్డుపై బయట ఉన్న వస్తువుల వైపు కదలనప్పటికీ, అది నియంత్రించబడినప్పటికీ, ఆ దిశలో కదిలే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. కాఠిన్యం, తపస్సు అంటే కేవలం ఇంద్రియాలను నియంత్రించడం అంటే వాటి కార్యకలాపాలను అంతం చేయడం అనే అర్థంలో కాదు. వస్తువుల పట్ల వారి ధోరణికి కూడా ముగింపు ఉండాలి; లేకపోతే, అవి రెండు రెట్లు కష్టాలను సృష్టిస్తాయి. ముందుగా, తమ శక్తిని చూపించడానికి అతి చిన్న అవకాశాన్ని సైతం చేజిక్కించుకుంటాయి. రెండవది, అవి భగవంతునిపై మనకున్న విశ్వాసం మరియు ఆధ్యాత్మిక సాధన యొక్క శక్తి నుండి మనల్ని కదిలిస్తాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 290 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 16. The Subtle Desires May Not Look Like Desires at All 🌻*

*The various types of suspicion that arise in our mind, and the diffidence we often feel in our daily practice, are due to the presence of subtle desires. The subtle desires may not look like desires at all. They will not have the character of desires, as they are only tendencies. They are tracks or roads kept open for the vehicle to move. The vehicle is not moving, but it can move if it wants; we have kept everything clear.*

*Likewise, though the vehicle of the senses is not moving on the road towards the objects outside, there is always a chance of it moving in that direction, in spite of the fact that it has been controlled. Austerity, tapas, does not merely mean control of the senses in the sense of putting an end to their activity. There should be an end to even their tendency towards objects; otherwise, they will create a twofold difficulty. Firstly, they will find the least opportunity provided as an occasion for manifesting their force once again; secondly, they will shake us from the core of all the faith that we have in God and the power of spiritual practice.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 190 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ప్రేమ గుండా, నమ్మకం గుండా హృదయం విచ్చుకుంటే హృదయం అనంతానికి లొంగిపోతుంది. అప్పుడు నీలో కొత్త అంతర్దృష్టి కలుగుతుంది. నువ్వెవరో తెలుస్తుంది. ఈ అనంత అస్తిత్వం ఎందుకు వునికిలో వుందో తెలిసి వస్తుంది. 🍀*

*మనిషి వివేకాన్ని కాదు జ్ఞానాన్ని కోరుతాడు. జ్ఞానం సులభం. మనసు గుండా చేసే చిన్ని ప్రయత్నం చాలు. దాంతో జ్ఞాపకయంత్రానికి సమాచారాన్ని అందించవచ్చు. అది కంప్యూటర్. దాంట్లో అన్ని లైబ్రరీలనూ పెట్టవచ్చు. వివేకమన్నది సంపాదించేది కాదు. అది మనసు గుండా సమకూరదు. అది హృదయం గుండా సంభవించేది. ప్రేమ గుండా అది వీలవుతుంది. హేతువు గుండా రాదు.*

*ప్రేమ గుండా, నమ్మకం గుండా హృదయం విచ్చుకుంటే హృదయం అనంతానికి లొంగిపోతుంది. సమస్తానికి శరణాగతి చెందుతుంది. అప్పుడు నీలో కొత్త అంతర్దృష్టి కలుగుతుంది. జీవితం గురించిన స్పష్టత, గొప్ప అవగాహన కలుగుతుంది. నువ్వెవరో తెలుస్తుంది. ఈ అనంత అస్తిత్వం ఎందుకు వునికిలో వుందో తెలిసి వస్తుంది. అన్ని రహస్యాలూ బహిర్గతమవుతాయి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 129 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 99. సమయస్ఫూర్తి - 2🌻*

*కార్యములకు కాలము నిర్ణయించు వారు, కాలము ననుసరించుటలో సూక్ష్మ లోకము నందు వారికి తెలియకయే మార్గమును పటిష్టము గావించు కొనుచున్నారు. విఘ్నములను లోయలపై తెలియకయే సూక్ష్మమగు వంతెనలను నిర్మించు కొనుచున్నారు. కాలానుగుణ్యముగ జీవితమును నడుపుకొను వారిని కాలమే అన్ని సమస్యల నుండి ఉద్ధరించును.*

*సమస్యలు కలిగినపుడు తగు స్ఫూర్తి నిచ్చును. ధర్మజుడట్లే నడచెను. యక్ష ప్రశ్నల సమయమున, నహుష ప్రశ్నల సమయమున, స్వర్గారోహణ సమయమున, అతని కందిన పరిష్కారము, అతని స్ఫూర్తి నుండి కలిగిన పరిష్కారమే. ఆ స్ఫూర్తి సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి, కాలము యొక్క అనుగ్రహమే. సమయపాలనమే వలసిన దీక్ష.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment