1) 🌹 23, JANUARY 2023 SATURDAY, సోమవారం, ఇందు వాసరే నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 315 / Bhagavad-Gita -315 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 05 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 162 / Agni Maha Purana - 162 🌹 🌻. దేవీ ప్రతిమా లక్షణములు - 2 / Characteristics of an image of the Goddess - 2 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 027 / DAILY WISDOM - 027 🌹 🌻 27. ఏ మానవుడు కూడా సర్వజ్ఞుడు అని చెప్పుకోలేడు / 27. No Human Being can Claim to be Omniscient 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 292 🌹
6) 🌹. శివ సూత్రములు - 29 / Siva Sutras - 29 🌹
🌻 8. జ్ఞానం జాగృత, 9. స్వప్నో వికల్పం, 10. అవివేకో మాయా సుషుప్తం - 3 / 8.Jñānaṁ jāgrat, 9. Svapno vikalpāḥ, 10. Aviveko māyāsauṣuptam - 4🌻
7) 🌹. శివ సూత్రములు - 000 / Siva Sutras - 000 🌹
🌻 పరిచయం / INTRODUCTION 🌻
8) ఆధ్యాత్మిక సాధన
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹23, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
🍀. సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు, Good Wishes on Subhas Chandra Bose Jayanti 🍀
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనం, సుభాష్ చంద్రబోస్ జయంతి, Chandra Darshan, Subhas Chandra Bose Jayanti 🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 17 🍀*
31. సర్వతూర్యనినాదీ చ సర్వాతోద్యపరిగ్రహః |
వ్యాలరూపో గుహావాసీ గుహో మాలీ తరంగవిత్
32.త్రిదశస్త్రికాలధృక్కర్మసర్వబంధవిమోచనః |
బంధనస్త్వసురేంద్రాణాం యుధిశత్రువినాశనః
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : కర్మాచరణలో మూడు దశలు - రెండవ దశలో కర్మ నిన్ను బహిర్ముఖుని చేయగా, సంసిద్ధి తెర మరుగున ఉండి పోతుంది. కర్మాచరణ కాలంలో అది నీకు స్ఫురించక పోయినా కర్మానంతరం అది మరల స్వీయంగానే ప్రకాశిస్తుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: శుక్ల విదియ 18:44:41 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: ధనిష్ట 24:28:23 వరకు
తదుపరి శతభిషం
యోగం: వ్యతీపాత 25:27:53
వరకు తదుపరి వరియాన
కరణం: బాలవ 08:34:37 వరకు
వర్జ్యం: 06:52:00 - 08:16:24
మరియు 30:54:18 - 32:20:22
దుర్ముహూర్తం: 12:50:22 - 13:35:29
మరియు 15:05:43 - 15:50:50
రాహు కాలం: 08:14:00 - 09:38:36
గుళిక కాలం: 13:52:24 - 15:17:00
యమ గండం: 11:03:12 - 12:27:48
అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:49
అమృత కాలం: 15:18:24 - 16:42:48
సూర్యోదయం: 06:49:24
సూర్యాస్తమయం: 18:06:12
చంద్రోదయం: 08:11:44
చంద్రాస్తమయం: 19:50:33
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: శుభ యోగం - కార్య
జయం 24:28:23 వరకు తదుపరి
అమృత యోగం - కార్య సిధ్ది
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 315 / Bhagavad-Gita - 315 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 05 🌴*
*05. అంతకాలే చ మామేవ స్మరున్ముక్త్వా కలేవరమ్ |*
*య: ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయ:*
🌷. తాత్పర్యం :
*అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసెడివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు.*
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావనపు ప్రాముఖ్యము ఈ శ్లోకమునందు నొక్కి చెప్పబడినది. కృష్ణభక్తిభావనలో నిలిచి దేహత్యాగము చేసినవాడు శీఘ్రమే శ్రీకృష్ణభగవానుని పొందగలడు ఆ దేవదేవుడు పవిత్రులలో పవిత్రతముడు గనుక అతని సంపూర్ణ భక్తిభావనలో సదా నిలిచియుండెడి భక్తుడు సైతము పవిత్రతముడు కాగలడు. ఈ శ్లోకమునందు “స్మరణ్” (స్మరించుట) యను పదము మిక్కిలి ప్రధానమైనది. కృష్ణభక్తిభావనలో భక్తియోగమును అనుసరించని అపవిత్రునికి కృష్ణుని స్మరించుట సాధ్యము కాదు. కనుకనే జీవితారంభము నుండియే కృష్ణభక్తిభావనను అలవరచుకొనవలెను.
జీవితారంభమున విజయమును కోరినచో శ్రీకృష్ణునిస్మరణము అత్యంత అవసరము గనుక ప్రతియొక్కరు హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హర హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను మాహామంత్రమును నిత్యము నిర్విరామముగా జపించుట మరియు కీర్తించుట చేయవలెను. ప్రతియొక్కరును తరువువలె గొప్ప ఓర్పును (తరోరివ సహిష్ణునా) కలిగియుండవలెనని శ్రీచైతన్యమహాప్రభువు ఉపదేశించియుండిరి. కనుక మాహామంత్రమును జపించునపుడు మనుజినికి అవరోధములు కలిగినను వానిని అతడు సహిష్ణుడై ఓర్చుకొనవలెను. ఆ విధముగా అతడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను నామజపమును కొనసాగించినచో జీవితాంతమున కృష్ణభక్తిరసభావనపు సంపూర్ణ ప్రయోజనమును నిశ్చయముగా పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 315 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 05 🌴*
*05. anta-kāle ca mām eva smaran muktvā kalevaram*
*yaḥ prayāti sa mad-bhāvaṁ yāti nāsty atra saṁśayaḥ*
🌷 Translation :
*And whoever, at the end of his life, quits his body remembering Me alone at once attains My nature. Of this there is no doubt.*
🌹 Purport :
In this verse the importance of Kṛṣṇa consciousness is stressed. Anyone who quits his body in Kṛṣṇa consciousness is at once transferred to the transcendental nature of the Supreme Lord. The Supreme Lord is the purest of the pure. Therefore anyone who is constantly Kṛṣṇa conscious is also the purest of the pure.
The word smaran (“remembering”) is important. Remembrance of Kṛṣṇa is not possible for the impure soul who has not practiced Kṛṣṇa consciousness in devotional service. Therefore one should practice Kṛṣṇa consciousness from the very beginning of life.
If one wants to achieve success at the end of his life, the process of remembering Kṛṣṇa is essential. Therefore one should constantly, incessantly chant the mahā-mantra – Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare.
Lord Caitanya has advised that one be as tolerant as a tree (taror api sahiṣṇunā). There may be so many impediments for a person who is chanting Hare Kṛṣṇa.
Nonetheless, tolerating all these impediments, one should continue to chant Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare, so that at the end of one’s life one can have the full benefit of Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 162 / Agni Maha Purana - 162 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 50*
*🌻. దేవీ ప్రతిమా లక్షణములు - 2 🌻*
ఉగ్రచండ యను తొమ్మిదవ దుర్గను మధ్య భాగమున స్థాపించి పూజింపవలెను. రుద్రచండ మొదలగు ఎనమండుగురు దుర్గల దేహకాంతి వరుసగ గోరోచనాసదృశముగను, అరుణముగను, నల్లగను, నీలముగను, తెల్లగను, ధూమ్రముగను, పచ్చగను, తెల్లగను ఉండును. వీరందరును సింహవాహనులై మహిషాసురుని కంఠము నుండి ఆవిర్భవించిన పురుషుడు శస్త్ర ధారియై యుండును. ఈ దుర్గాదేవులు వాని జుట్టు, తమ చేతులతో పట్టుకొని యందురు.
ఈ నవదుర్గలును ఆలీఢమున (కుడికాలు వెనుకకు తన్నిపెట్టి ఎడమకాలు ముందుకు వంచి నిలబడుటకు ఆలీఢమని పేరు) ఈ నవ దుర్గలను స్థాపించి పూజించినచో పుత్రపౌత్రాభివృద్ధి కలుగును చండికాది రూపములో పూజింపబడునది గౌరియే. హస్తములో కుండి, అక్షమాల, గద, అగ్ని ధరించినచో ఆమెకే ''రంభ'' అని పేరు. వనము నందు ఆమెకే ''సిద్ధ'' యని పేరు. సిద్ధావస్థలో ఆమె వద్ద అగ్ని ఉండదు. ''లలిత'' కూడ గౌరియే. ఆమె స్వరూపమిట్లుండును- ఒక ఎడమచేతిలో కంఠసహితమైన ముండము (భిన్న శిరస్సు), రెండవచేతిలో దర్పణము, క్రింది కుడిచేతిలో ఫలాంజలి, పైచేతిలో సౌభాగ్యముద్ర ఉండును. లక్ష్మి కుడిచేతిలో కమలము. ఎడమచేతిలో మారేడు పండు ఉండును.
సరస్వతి రెండు చేతులలో పుస్తకము, అక్షమాల ఉండును. మిగిలిన రెండు చేతులలో వీణ ఉండును. గంగాదేవి తెల్లని దేహచ్ఛాయతే మకరారూఢయై ఒక హస్తము కలశమును, మరియొక హస్తమున కమలమును ధరించి యుండును. యుమునాదేవి శ్యామవర్ణ. రెండు హస్తములందును కలశములు ధరించి తాబేలుపై నిలచి యుండును. తుంబురని ప్రతిమ వీణా సహితముగా నుండవలెను. అతని శరీరకాంతి తెల్లగా నుండును. శంకరుడు శూలపాణియై, వృషభము నెక్కి మాతృకలముందు వెళ్ళచుండును. బ్రహ్మపత్నియైన సావిత్రి గౌరవర్ణముగలది. నాలుగు ముఖములుండును. కుడి చేతులలో అక్షమాల, స్రుక్కు ఉండును. ఎడమ చేతులలో కుండము, అక్షపాత్ర ఉండును, వాహనము హంస
శంకరుని పత్నియగు పార్వతి వృషభారూఢయై కుడిచేతులలో ధనుర్బాణములను, ఎడమ చేతులలో చక్ర-ధనస్సులను ధరించి యుండును. ఎఱ్ఱని కాంతి గల కౌమరీ శక్తి నెమలిపై ఎక్కి, రెండు చేతులందును శక్త్యా యుధములను ధరించి యుండును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 162 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 50
*🌻Characteristics of an image of the Goddess - 2 🌻*
The nine (goddesses) commencing with Rudracaṇḍā are Rudracaṇḍā, Pracaṇḍā, Caṇḍogrā, Caṇḍanāyikā, Caṇḍā, Caṇḍavatī, Caṇḍarūpā, Aticaṇḍikā and Ugracaṇḍā stationed at the centre. (They are made to be) coloured as the rocanā. (yellow pigment), red, black, blue, white, purple, yellow and white and as riding the lion. Then the buffalo as a human (form) should be held by the hair by the nine (forms) of Durgā holding weapons.
13. They are in the ālīḍha[1] posture. They have to be -established for the increase of progeny; as also (the forms) Gaurī, Caṇḍikā and others (as well as the forms) Kuṇḍi, Akṣararadā (and) Agnidhṛk.
14-15. She is the same as Rambhā. (She is) accomplished and devoid of fire. (She is) also Lalitā. (She) holds the severed head along with the neck in the left (hand) and a mirror in the second hand.
(The image of) Saubhāgyā (is made) as holding fruits in the folded palms on the right side. (The image of) Lakṣmī holds the lotus in the right hand and the śrīphala (bilva fruit) in the left.
16. (The image of) Sarasvatī (should be made as holding) a book, rosary and lute in the hands. (The image of) Jahnavī (the river Ganges) (is represented) as holding a pot and flower in the hand (and standing) on the crocodile and of white complexion.
17. (The image of the river) Yamunā is worshipped as mounted on the tortoise and as holding a pot in the hand and of dark complexion. (The image of) Tumburu is represented as white (in colour), holding a lute and trident and riding a bull.
18-19. The four-faced Brāhmī (the female-energy of Brahmā) (is represented) as of fair complexion, riding a swan and as -carrying a rosary, different vessels such as surā and kuṇḍa in the left hand. Śāṅkarī is represented as white, (seated) on a bull holding the bow and arrow in the right hand and the disc and the bow in the left hand. Kaumārī (is represented) as red in colour, riding the peacock and having two arms, holding the spears.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 27 / DAILY WISDOM - 27 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 27. ఏ మానవుడు కూడా సర్వజ్ఞుడు అని చెప్పుకోలేడు 🌻*
*అత్యున్నత మేధోపరమైన అవగాహన కూడా సాపేక్షత ఆధారంగా మాత్రమే ఉంటుంది. ఏ మానవుడూ తాను సర్వజ్ఞుడని చెప్పుకోలేడు కాబట్టి అతను ఇక్కడ తన లాభాన్ని చూసి సంతోషించడమో లేదా తన నష్టాలను చూసి బాధపడే సందర్భమూ లేదు.ఇవేవీ సత్యం కాదు. ; సత్యాన్ని సాధించడం ఒక్కటే ఆత్మను దుఃఖం నుండి విముక్తి చేస్తుంది. సత్య సాక్షాత్కార ప్రక్రియలో మరణం కూడా అడ్డంకి కాదు. మరణం అనేది భిన్నమైన జీవిత క్రమానికి సర్దుబాటు చేయడానికి మరియు స్వీకరించడానికి చైతన్యం యొక్క పునర్నిర్మాణం.*
*ఆత్మ జ్ఞానం పట్ల ఉన్న ప్రేమ, శరీరం యొక్క పుట్టుక మరియు నాశనము వంటి విషయాలను పట్టించుకోదు. ఉన్నత చైతన్యాలను అందుకోవడం పుట్టుక మరియు మరణం కంటే అధిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. సంపూర్ణత కోసం అన్వేషణలో భాగంగా అత్యంత ప్రియమైన వస్తువును సైతం త్యాగం చేయాల్సిరావచ్చు. భయపడకుండా నొప్పి మరియు బాధలను సహించాలి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 27 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 27. No Human Being can Claim to be Omniscient 🌻*
*Even the highest intellectual perception belongs only to the realm of relativity. No human being can claim to be omniscient and so he has no occasion to rejoice at his profits or grieve at his losses here. The real is not this; the attainment of That alone can liberate the soul from sorrow. Even death is not a bar in the process of the realisation of Truth. Death is a reshuffling of consciousness to adjust and adapt itself to a different order of life.*
*The love for the knowledge of the Self cares not for such insignificant phenomena as the birth and the destruction of the body. The need for the higher illumination is more serious a matter than the birth and the death of the overcoat, and the quest for the Absolute should be undertaken even sacrificing the dearest object, fearless of even the greatest pain and loss that may have to be encountered in the world.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 292 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. వాస్తవంతో వుంటే బాధ వుండదు. ఆనందం వుంటుంది. నీ సంకల్పాన్ని వదిలిపెడితే నువ్వు సంపన్నుడవుతావు. అప్పుడు అనంతమే నీతో వుంటుంది. సమస్తమూ మనతో సాహచర్యం చేస్తే మనం విజేతలం అవుతాము. 🍀*
*మనం ప్రత్యేకమైన వునికితో వున్నట్లు నమ్ముతాం. అది నమ్మకమే. వాస్తవం కాదు. నమ్మకం వాస్తవానికి వ్యతిరేకంగా వెళితే అది బాధలు సృష్టిస్తుంది. కారణం మనం కారణం కాని దాన్ని పట్టుకుంటాం. వాస్తవంతో వుంటే బాధ వుండదు. ఆనందముంటుంది. ఆకు తనకు ప్రత్యేకత వుందని భావిస్తే అది వేరవుతుంది. దానికి చెట్టుతో సంబంధం లేదు. అప్పుడు సమస్య వస్తుంది. ఘర్షణ మొదలవుతుంది. దాని శక్తి కేంద్రం నించీ వేరవుతుంది. చెట్టు అకుకు తల్లి. అంతే కాదు దాని వేళ్ళు భూమిలో వున్నాయి. అది సమస్త భూమికి ప్రాధాన్యం వహిస్తుంది. అది గాలిని పీలుస్తుంది. దానికి సూర్యుడితో, నక్షత్రాలతో సంబంధముంది.*
*చెట్టుతో ఘర్షించడమంటే విశ్వంతో ఘర్షించడం. చిన్ని ఆకు అనంత విశ్వంతో ఘర్షించడం. ఆ వుద్దేశమే తెలివితక్కువది. మనిషి చేస్తున్నదదే. నదిని పక్కకు తోయడానికి ప్రయత్నిస్తున్నాడు. సన్యాసమంటే నదిలో ఘర్షించడం మానెయ్యడం. నదితో సాగడం. నదిని నిన్ను స్వీకరించడానికి అనుమతించడం. ఘర్షించకుండా సాగడాన్ని గ్రహించడం. సన్యాసత్వానికి అర్ధమది. 'ఆమోదించి సాగడమే' దాని కర్థం. నీ సంకల్పాన్ని వదిలిపెడితే నువ్వు సంపన్నుడవుతావు. అప్పుడు అనంతమే నీతో వుంటుంది. సమస్తమూ మనతో సాహచర్యం చేస్తే మనం విజేతలం అవుతాము.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 029 / Siva Sutras - 029 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 8. జ్ఞానం జాగృత 🌻 🌻 9. స్వప్నో వికల్పం 🌻 🌻 10. అవివేకో మాయా సుషుప్తం - 4🌻*
*🌴. జాగృత - స్పృహ, జ్ఞానం : స్వప్నం - ఊహ, కలలు : సుషుప్తి - అజ్ఞానం, మాయ. 🌴*
*10వ సూత్రం ఈ దశను మాయతో పోల్చింది. ఇది మాయ యొక్క ముసుగు కారణంగా మాత్రమే, ఒక వ్యక్తి తన స్వభావాన్ని మరచిపోతాడు. ఒక వ్యక్తిని అర్థం లేని బంధం మరియు కోరికలోకి జారుకునేలా చేసేది మాయ మాత్రమే. త్రిక తత్వశాస్త్రం ప్రకారం, మాయ కూడా శివుని సంకల్పమే. దీనిని అద్వైతం కూడా ఇదే చెప్పింది. మూడు స్థితులు అన్ని సమయాలలో కలిసి ఉంటాయి, కానీ ఒక స్థితి మాత్రమే ప్రధానమైనది.*
*ఇది మూడు రకాల గుణాల వంటిది. మూడు గుణాలు ఒకే సమయంలో ప్రబలంగా ఉంటాయి, కానీ వాటిలో ఒకటి మాత్రమే ప్రధానమైనది. ఆకాశం, గాలి మొదలైన పంచభూతాలు కూడా ఇలాగే ఉంటాయి. కానీ పదవ సూత్రంలో ఒక ముఖ్యమైన అవగాహన ఉంది. ఉన్నత స్థాయి చైతన్యం లేకపోవడం గాఢ నిద్ర స్థితికి సమానం అని చెబుతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 029 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 8.Jñānaṁ jāgrat 🌻 🌻9. Svapno vikalpāḥ 🌻 🌻 10. Aviveko māyāsauṣuptam - 4 🌻*
*🌴. Knowledge is Jagrat: Fancy is Svapna. Ignorance, Maya, is Susupti 🌴*
*The 10th aphorism compares this stage to māyā, the deceptive state. It is only due to the veil of māyā, one forgets his inherent nature. It is only māyā that makes a person slide down into fathomless bondage and desire. According Trika philosophy, māyā also is the will of Shiva, which Advaita also endorses. All the three states co-exist at all the time, but only one state is predominant.*
*This is like three types of gunās. All the three gunās prevail at the same time, but only one among them is predominant. This is also the case with five basic elements, ether, air, etc. But there is a significant percept in the tenth aphorism. It says that absence of higher level of consciousness is equivalent to the state of deep sleep.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 000 / Siva Sutras - 000 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻పరిచయం🌻
*శివ సూత్రాలు వాసుగుప్త (ca875–925 CE) ద్వారా వెల్లడి చేయబడి వ్రాయబడింది. సూత్రం ఆధ్యాత్మిక మరియు దైవిక మూలంగా పరిగణించబడుతుంది. కాశ్మీర్ శైవమతానికి, ఇది చాలా ముఖ్యమైన మూలాధారాలలో ఒకటి. ఇది శైవ ద్వంద్వ రహిత బోధనలను వివరిస్తుంది, ఇక్కడ ప్రతిదీ సృష్టించబడిన మరియు కరిగిపోయే అంతిమ వాస్తవికతను సాధించడంపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ అంతిమ స్థితిని పరమ శివ అని పిలుస్తారు మరియు ఇది వర్ణించలేనిది.*
*శివ స్వభావాన్ని కలిగి ఉన్న వారి స్వంత స్వాభావిక- స్వభావంలో నివసించాలని గుర్తుంచుకునే వారికి ఈ శివ స్థితిని పొందడం కోసం ఎటువంటి ప్రయత్నం లేదా మార్గం (anpAy an-up¯aya) అవసరం లేదు. శివసూత్రంలో వివరించబడిన పరమ శివుని ప్రాప్తి కోసం మిగతా అందరికీ మూడు మార్గాలు (ఉపాయాలు) ఉన్నాయి. సూత్రంపై ధ్యానం చేయడానికి కఠినమైన ఆదేశం ఇవ్వబడలేదు. ఇది ఒకరి పరిణామ దశపై ఆధారపడి ఉంటుంది.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 000 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 INTRODUCTION 🌻*
*The Shiva Sutra was revealed to and written down by Vasugupta (ca875–925 CE). The Sutra is considered mystical and of divine origin. For Kashmir Saivism, it is one of the most important key sources. It outlines the teachings of Shaiva non-dualism, where the focus is on attaining the Ultimate Reality in which everything is created and dissolved. This ultimate state is called Param Shiva and is beyond description.*
*For attaining this state of Shiva for those who remember to reside in their own inherent-self-nature, which is of the nature of Shiva, no effort or no way (anpAy an-up¯aya) is needed. For everyone else there are three ways (up¯ayas) for the attainment of Param Shiva described in the Shiva Sutra. There is no strict order given for meditating on the Sutra. It depends on one’s stage of evolution.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఆధ్యాత్మిక సాధన 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*ఉన్నత దృష్టిని అలవరచుకుంటూ శాశ్వతమైన దానితో సంబంధాన్ని కలిగి ఉండేందుకు చేసే కృషి ఆధ్యాత్మిక సాధన.*
*మనం బలహీనంగా ఉంటే, బలవంతులమయ్యేందుకు ప్రయత్నించాలి. నిరాశా నిస్పృహలతో, క్రుంగుబాటుతో ఉంటే ఆనందాన్ని తెచ్చుకొనేందుకు ప్రయత్నించాలి.*
*మన మనస్సు వ్యాకులత అనే చీకటితో కప్పబడి పోయి ఉంటే వెలుతురుకై ఎదురుచూడాలి. శారీరక రుగ్మతలు కలిగి ఉంటే ఆరోగ్యంగా, పవిత్రంగా అయ్యేందుకు కృషి చేయాలి.*
*అధైర్యంతో ఉంటే ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నించాలి. లౌకికత్వం నుండి పారమార్థికత వైపుకి పయనించాలి.*
*ఈ విధంగా నిమ్నస్థాయి వాటి నుండి బయటపడి ఉన్నత స్థాయి వాటిని చేరుకునే ప్రయత్నం జీవితంలో నిరంతరం సాగుతూ ఉండాలి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
No comments:
Post a Comment