శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 6


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 6 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।
స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀

🌻 539. 'శ్రుతిః' - 6 🌻

జీవుల యందు కూడ సంకల్పము లేర్పడును. అది ఋగ్వేద ఫలము. ప్రాణ స్పందనముగ సామగానము సాగుచుండును. అది జీవుల యందలి సామవేదము. జీవులు క్రియాధీనులై కార్యములు చేయుచుందురు. ఇది వారొనర్చు యజుర్వేదము. ఇట్లు మూడు వేదములు నిత్యము నిర్వర్తింపబడుతున్నవి. ఈ మూడింటి నిర్మలత్వమును బట్టి అధర్వ వేదముగ వారి జీవితము లేర్పడుచుండును. మూడునూ నిష్కల్మషము లైనపుడు, జీవితము దివ్య వైభవముతో కూడి యుండును. కల్మషములు హెచ్చుతగ్గులను బట్టి వైవిధ్యము లేర్పడు చుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 6 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini
svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻

🌻 539. 'Shrutih' - 6 🌻


Will also forms in living beings. It is the fruit of Rigveda. The samagana goes on as the response of prana. It is the Samaveda of living beings. Living beings are driven and perform actions. This is the Yajurveda that they perform. Thus the three Vedas are performed all the time. According to the purity of these three, their lives form Atharva Veda. When all three are pure, life is full of divine splendor. Fluctuations in impurities will cause variation.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment