శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 569 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 569 -1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 569 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 569 -1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀

🌻 569. ‘నిఖిలేశ్వరీ’ - 1 🌻


సర్వ లోకములకు ఈశ్వరి అని అర్థము. ఈశ్వరత్వము సర్వవ్యాపకమైన తత్త్వమునకే సాధ్యము. అనితర సాధ్యము. లోకములకు, లోకపాలకులకు, లోకులకు కూడ శ్రీమాతయే రాజ్ఞి. అందరిని సృష్టించి అందరి హృదయములలో ప్రవేశించి అందు వసించి వారిని పరిపాలించుట శ్రీమాత మహేశ్వరీ తత్త్వము. తమను తాము పరిపాలించుకొనువారు ఈశ్వరులు. ఇతరులను పరిపాలించు వారు ప్రభువులు. తమను తాము పరిపాలించుకొనుచూ యితరులను స్వయం పాలకులుగ తీర్చిదిద్దువారు గురువులు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 569 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari
maityradi vasanalabhya mahapralayasakshini ॥115 ॥ 🌻

🌻 569. 'Nikhileshwari' - 1 🌻


'Nikhileshwari' means the sovereign of all worlds. The quality of being an all-encompassing ruler is unique to the divine essence. It is beyond the reach of others. Shri Mata is the queen of all worlds, their guardians, and all beings. She creates all, enters their hearts, resides within, and governs them—this is the supreme principle of Shri Mata Maheshwari. Those who govern themselves are divine, those who rule others are lords, and those who nurture others to govern themselves are teachers.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment