శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 162 / Sri Lalitha Chaitanya Vijnanam - 162
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 162 / Sri Lalitha Chaitanya Vijnanam - 162 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము
47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖
🌻162. ' నిర్మోహా '🌻
మోహము లేనిది శ్రీదేవి అని అర్థము. చిత్తభ్రాంతియే మోహము. అహంకారము కారణముగా మోహమేర్పడును. అహంకారి తాను, తనవారు, ఇతరులు, పైవారు అను భావములతో బంధింపబడి యుండును. తనవారనుకొనుటకు ఆధారము తానే.
తనకాధారమైన దానికి అంతయూ తానే అగుటచే స్వేతర బుద్ధి యుండదు. అనగా స్వ, ఇతర బుద్ధి. స్వబుద్ధి అనగా తనకు సంబంధించిన బుద్ధి. తనవారనుకొనుట వలన పక్షపాత బుద్ధి ఏర్పడును. పై వారు అనుకొనుట వలన కూడా పక్షపాత బుద్ధి ఏర్పడును.
తనవారు అనుకొనినపుడు తప్పులు కనపడవు. అన్నియూ ఒప్పులే. తనవారు కాదనుకున్నప్పుడు, ఇతరులుగ భావింపబడి నప్పుడు తప్పు కనపడుచుండును. ఇదియే చిత్తభ్రాంతి. ఇష్టమైనచో మలినమైనను, ఇంగువవలె అనిపించును. ఇష్టము కానిచో దివ్యమైననూ విమర్శ భావముండును.
అహంకారి యిష్టాయిష్టములను బట్టి చూచునే కాని, ఉన్నది ఉన్నట్లుగా దర్శింపలేడు. అహంకారము కూడ మూడు విధములు. అవి రాజసికము, తామసికము, సాత్వికము యగు అహంకారములు. ఇందు మొదటి రెండునూ అధికమగు భ్రాంతికి లోను చేయును.
సాత్విక అహంకారము మాత్రమే సత్యమును దర్శించును. సాత్వికత నుండియే సత్యదర్శనమున్నది. సాత్విక అహంకారమున చిత్త భ్రాంతి స్వల్పము. ఇతరము లగు అహంకారములందు చిత్తభ్రాంతి హెచ్చు.
చిత్తభ్రాంతివలన లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు కనిపించు చుండును. ఇట్టి మోహమునుండి బయల్పడుటకు మోహాతీత, నిర్మోహ అయిన శ్రీమాతయే శరణ్యము. శ్రీమాత అహంకారమునకు అతీతమైనది. ఆమె సమాశ్రయము వలన చిత్తము భ్రాంతియందు పడక యుండును.
అట్లుకానిచో కర్తవ్య నిర్వహణము ఇష్టాయిష్టములకు లోనగును. ఇష్టపడుట వలననే జానకి బంగారు లేడి విషయమున భ్రమపడినది. ఇష్టము లేకుండుట వలననే అర్జునుడు విషాదమున పడినాడు. కర్తవ్యములతో యిష్టాయిష్టములకు ముడి పెట్టుట వలన మోహపడుట యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 162 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Nirmohā निर्मोहा (162) 🌻
Moha means bewilderment, perplexity, distraction, infatuation, delusion, etc all leading to follies. She is without any confusion, a product of mind. Mind is the most important factor in realising God. Only the attunement of mind to thoughtless state leads to Self-realization.
Īśa upaniṣad (verse 7) asks “when a person knows that he himself has become everything and knows oneness of things, how can he hate or love anything?” Love and hate leads to confusion. Kṛṣṇa says, (Bhagavad Gīta XIV.22-25) “One who is unwavering and undisturbed through all these reactions of the material qualities remaining neutral and transcendental, knowing that the modes alone are active;
who is situated in the self and regards alike happiness and distress; who looks upon a lump of earth, a stone and a piece of gold with an equal eye…such a person is said to have transcended the modes of nature’. Such a person does not have confusion (nāma 162), ego (nāma 161) and worries (nāma 160).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
28 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment