🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 19 🍀
వేదశాస్త్రి ప్రమాణ్ శృతీచే వచన్!
ఏక్ నారాయణ్ సార్ జప్!!
జప్ తప్ కర్మ్ హరి విణ ధర్మ్!
వా ఉగాచి శ్రమ వ్యర్థ జాయ్!!
హరిపాఠీ గేలే తే నివాంతచి రేలే!
భ్రమర గుంతలే సుమన్ కళికె!!
జ్ఞానదేవీ మంత్ర హరినామాచే శస్ట్!
యమే కుళగోత్ర వర్జియలే!!
భావము:
ఒక్కనారాయణ నామమే సారమని వేద శాస్త్రాల ప్రమాణము కలదు. మరియు శృతులు కూడా అదే మాట చెప్పినవి. కావున నామ జపము చేయవలెను.
జపము, తపము మరియు కర్మలు హరినామము లేని ఏ ఇతర ధర్మాలైనా అనవసరమైన శ్రమ. సమయమంత వ్యర్థమై పోవును. కమలముపై వ్రాలి మకరందమును గ్రోలుచున్న తుమ్మెద తీరుగ. హరిపాఠమును అనుసరిస్తూ నడిచే వారంత ఆనందంగా జీవిస్తారు.
హరినామము ఒక దివ్యమైన శస్త్రము. నామ పఠనము చేసే వారి కుల గోత్రీకులను కూడ యముడు పట్టజాలడని జ్ఞానదేవులు తెలుపుచున్నారు.
🌻. నామ సుధ -19 🌻
వేద శాస్త్రాల ప్రమాణము
శృతులు చెప్పిన వచనము
నారాయణ నామమే సారము
నామ జపము తరుణ్ పాయము
జపతప కర్మలు సర్వము
హరినామము వీడిన ధర్మము
“పనికి మాలిన కష్టము
వ్యర్థమయ్యెను జీవితము”
హరిపాఠమున ప్రయాణము
అయినారు వారు సుస్థిరము
తుమ్మెద గ్రోలిన చందము
కమలములోని మకరందము;
జ్ఞానదేవుని మంత్రము
హరినామము దివ్య శస్త్రము
కుల గోత్రీకులను సహితము
వర్జించును యముడు సత్యము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
28 Dec 2020
No comments:
Post a Comment