శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 215 / Sri Lalitha Chaitanya Vijnanam - 215
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 215 / Sri Lalitha Chaitanya Vijnanam - 215 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ‖ 54 ‖
🌻 215. 'మహామాయా'🌻
కానరాని మాయా స్వరూపము కలది శ్రీమాత అని అర్థము.
బ్రహ్మలు సైతము శ్రీమాత మాయ వలన మోహము చెందుదురు. దేవి యొక్క మాయ జ్ఞానులను సైతము బలాత్కారముగ ఆకర్షించి మోహమున ముంచగలదు. ఎట్టివారినైనను తన మాయచేత మోహము కలిగించి కలత పెట్టగలదు. పురాణములందు ఇట్టి కథ లెన్నియో కలవు. నారదాది దేవర్షులుసైతము దేవి మాయకు లోనైరి.
మాయ లేనిదే సృష్టియే లేదు. నిరాకార నిరంజన తత్త్వము వెలుగుగ మారుటయే మొదటి మాయ. అటుపై నేర్పడు లోకము లన్నియూ మాయవలననే. ప్రతి మానవుడు తానున్నానని భావించుట మాయ వలననే. నిజమునకు తానొకడు వ్యక్తిగ లేడు. వున్నానను కొనియే సమస్త కార్యములు చేయుచుండును. లోకపాలకులు కూడ అట్లే చేయుచున్నారు.
ఇది యొక అద్భుతమగు విషయము. ఒకే తత్త్వము రూపాంతరములు చెందుచూ, గుణములను సంతరించు కొనుచూ అనేకానేకములుగ ఏర్పడుచున్నది. లేనిది వున్నట్లుగ, వున్నది లేనట్లుగ గోచరించుటకు మూల కారణము మాయయే.
మాయను దాటు ప్రయత్నము మానుకొని శ్రీమాతను ఆశ్రయించుట మేలు. ఈ మాయనే లీల అని కూడ పిలుతురు. సమస్తము దైవలీలగ గుర్తించువారు ధన్యులు. ఋషులు సహితము అకస్మాత్తుగ జరుగు అనూహ్యమగు సంఘటనలను దైవీ లీలగ భావింతురు. ఈ భావన కలవారికి పరాభవము, అవమానము అను భావన లుండవు.
దైవీ లీలలను జ్ఞప్తి యందుంచుకొని అణగి మణగి జీవించుచు ఆనందింతురు. ఎట్టి వారికైనను ఈ స్థితి తప్పదు. అదియే మహామాయా మాహాత్మ్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 215 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mahā-māyā महा-माया (215) 🌻
Māyā means illusion. She is known as mahā-māyā svarūpinī. The entire universe functions on the basis of māyā or illusion. If She does not cast Her effect of māyā on this world, there will no activity at all. Her spell of māyā makes us to seek the Brahman, Her another form, prākaśa vimarśa mahā-māyā svarūpinī. Even the sages and saints are no exception to Her spell of māyā. The intensity of māyā is felt depending upon one’s karma. The ‘hrīṁ (ह्रीं)’ bīja is called māyā bīja (please refer to the discussion on Pañcadaśī mantra).
{Further reading on māyā: In advaita philosophy (non-dualism) to some thinkers the terms māyā and avidyā mean the same thing. But some advaitins differentiate them and say that māyā is an auxiliary to Īśvarā and avidyā is an auxiliary to soul. The main function of māyā is projection, projecting the Brahman in various shapes and forms. But avidyā can both obscure and project, but covering is the main function of avidyā. According to some, the substrate of avidyā is soul and according to some others, avidyā resides in the Brahman.
The root of māyā is mā which means ‘to measure’. The infinite Brahman appears as if measured due to the effect of māyā. The root mā also means, leading to the ideal of illusionary appearance. The word māyā can be split into mā + yā. Then it means that which is not, but appears to be.
Māyā is regarded as Śaktī, the attribute of the Brahman. Brahman is essentially without attributes and is known as nirguṇa Brahman. But viewed in relation to māyā, it is saguṇa Brahman or with attributes. Just as a magician conjures up many things by his magical power which he really does not possess, so Brahman with māyā śaktī projects the appearance of the world. As things conjured up by the magician are false, so the projected world is ultimately false.
The phenomenal world is mere illusion or māyā. It is in reality non-existent. It appears to exist only because of the external objects that are related in the self, behind the mind. It is nothing but a mere illusory projection of ātman.}
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
20 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment