దేవాపి మహర్షి బోధనలు - 38


🌹. దేవాపి మహర్షి బోధనలు - 38 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 27. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 2 🌻


నన్ను నేనుద్దరించుకొను ప్రతి కసరత్తు నాకు విసుగు కలిగించెడిది కానీ, పరిష్కారము అందించలేదు. అది ఆదివారము, ఉదయం సమయము. నాకు చర్చికి పోబుద్దికాలేదు. ఇంట్లోని వారందరూ ప్రార్థనలకై చర్చికి వెళ్ళిరి. నేను ముందుగదిలో కూర్చుని నాకు తోచిన గ్రంథమును చదువుకొను చున్నాను.

సింహద్వారము దానికదిగా తెరువబడినది. నాకు ఒళ్ళు గగుర్పొడినచినది. ఎదుటి దృశ్యము చూచి శరీరము దాదాపు కొయ్యబారిపోయినది. సింహద్వారము నుండి ఒక ఆజానుబాహువైన పురుషుడు తలపాగాను, ఐరోపా దుస్తులను ధరించి లోపలికి ప్రవేశించుచున్నాడు.

అతని శరీర సౌష్ఠవము, ముఖము నందలి

వర్చస్సు, అందము నన్ను ముగ్ధను చేసినవి. అతడు నెమ్మదిగా నడచివచ్చి నాప్రక్కనే మృదువుగా కూర్చుండెను. నాకు నోట మాట రాలేదు. తెల్లబోయి చూచుచుంటిని. అతడు మెల్లగా యిట్లనెను.

"ప్రపంచమున నీవలన జరుగవలసిన పనియొకటి యున్నది. అది కారణముగ నీ స్వభావమునందు అత్యద్భుతమైన పరివర్తన మేర్పడగలదు. ప్రస్తుతము నీవు 'నన్నంటబోకు - నా మాలకాకి' అను సామెత చందమున అందరినీ అసహ్యించుకొంటూ, అందరిచే అసహ్యింప బడుచూ దుఃఖితవై యున్నావు.

నీవు చేయు కార్యక్రమమున నీకు ఆత్మనియతి కలుగగలదు. నిన్ను నీవు చక్కగా నియంత్రించుకొన గలిగినచో, ప్రపంచమున కుపయోగపడు దివ్యకారమును నీచే నేను నిర్వర్తింప చేయగలను.

నీ మనోనియంత్రణము పైననే ఈ కార్యము జరుగుట కవకాశముగలదు. అప్పుడే నిన్ను మేము విశ్వసింప గలము."

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


20 Feb 2021

No comments:

Post a Comment