శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 252 / Sri Lalitha Chaitanya Vijnanam - 252
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 252 / Sri Lalitha Chaitanya Vijnanam - 252 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 61. పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।
చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥ 🍀
🌻 252. 'పరమానందా' 🌻
ఆనందమునకు పరాకాష్ఠ శ్రీమాత అని అర్థము. ఆనందము పలు విధములు. భౌతికమగు ఆనందము కొంత తృప్తి నిచ్చును. ఇంద్రియానందము అంతకు మించిన తృప్తి నిచ్చును. మానసికానందము మరికొంత తృప్తి నిచ్చును. అంతకు మించి మిక్కుటమైన తృప్తి విజ్ఞాన మిచ్చును. విజ్ఞానమున మునిగిన జీవుడే మానసిక ఆంద్రీయ భౌతిక ఆనందమును విస్మరించ గలడు. ఇచ్చట జీవునకు ఆనంద మిచ్చుటకు కారణము విజ్ఞానము. అనగా విజ్ఞానముతో ఉన్నప్పు డానంద ముండును.
విజ్ఞానమను ఉపాధి ఆనందమున కాధార భూతము. ఉపాధి కారణముగ పొందు ఆనందము శాశ్వతము కాదు. ఉపాధితో సంబంధములేక ఎప్పుడునూ ఆనందముగ నుండుట నిజమగు ఆనందము. ఇట్టి స్థితియందు ఉండుట లేకుండుట ఆనందముపై ఎట్టి ప్రభావము చూపదు.
భౌతిక సౌకర్యము లున్నను, లేకున్ననూ, ఇంద్రియ సుఖము లున్నను, లేకున్ననూ, విజ్ఞాన వీచికలున్నను, లేకున్ననూ ఆనందముగ నుండుట సాధ్యమా?
సాధ్యమే. తనయందు తానున్న వానికి ఆనందము శాశ్వతముగ నుండును. పరతత్త్వముతో ముడిపడి యున్నవానికి ఆనందము శాశ్వతముగ నుండును. అట్టివారిపై త్రిగుణములు ప్రభావము చూపవు. త్రిగుణముల ప్రభావము వలననే జీవుడహంకార స్థితిని పొందును. అహంకారము మూడు రకములు. తామసికము, రాజసికము, సాత్త్వికము. ఈ మూడును వరుసగ ఒక దానికంటే ఒకటి మెరుగైనదే అయినప్పటికి శాశ్వతానందము నీయవు.
సాత్త్విక అహంకారము కూడ అహంకార స్థితియే గనుక సంసరణమునకు లోబడుట జరుగుచుండును. సత్త్వాతీతము గుణాతీతము అగు స్థితియే శాశ్వతానంద స్థితి. ఆ స్థితియందు జీవుడు "పరముతో పరము" సంయోగము చెందినపుడు పరమానందమును పొందును. పరమున లయమైనపుడు ఉండుటయే ఉండును కాని ఆనందించువాడుండడు. పరముతో కూడియుండుట వలన పరమానంద ముండును.
శ్రీమాత పరము నందుద్భవించి పరము నందు కలిసి యుండును. కనుక ఆమె పరమానంద.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 252 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma Guruji
📚. Prasad Bharadwaj
🌻 Paramānandā परमानन्दा (252) 🌻
She is the embodiment of happiness. This nāma is an extension of the previous nāma. When consciousness is pure, it leads to bliss, which is known as the supreme happiness.
The stage of pure consciousness can be attained only if māyā is discarded. To discard māyā or illusion, one needs to cogitate Her all the time. This does not mean that one should stop his quotidian activities, sit in a secluded place and think about Her.
The prescribed actions should continue with the clear understanding that such acts are being done on Her behalf. This is the concept of Self-realization. When all the acts are done on Her behalf, the question of happiness or sorrow does not arise, as the results arising out of such actions are surrendered unto Her.
Because one is not the doer, the karmas arising out of such actions do not accrue to him. One’s body may suffer, but not his mind. His mind treats both happiness and sorrow on the same footing. To attain this stage, one should get away from the clutches of māyā. This stage is where one feels ‘I am That’.
Chāndogya Upaniṣad (VII.23) says “That which is Infinite is the source of happiness, which is to be sought after”.
Kṛṣṇa says in Bhagavad Gīta (VI.20), “The mind curbed through practice becomes still in which Ātman is realised and the soul rejoices.”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
15 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment