దేవాపి మహర్షి బోధనలు - 72
🌹. దేవాపి మహర్షి బోధనలు - 72 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 53. కర్మవిమోచనము 🌻
కర్మవిమోచన మార్గము విచిత్రమైనది. సంసిద్ధత గల వారికిది సులభముగ లభించగలదు. సంసిద్ధత లేకయే సాధకులు విమోచనము కలిగించు కొనుట లేదు. దూరప్రయాణమునకై ఒక బృందము ఓడనెక్కినది. ఓడలో ఒక వ్యక్తి ధనము దోచబడెను. అతడు మౌనముగ తనకు జరిగిన అన్యాయమును ధీరతతో భరించెను.
సముద్రము నడుమ ఓడ ఒక నిక్షిప్తమైయున్న రాతిని ఢీకొని పగిలినది. ఓడ ముక్కలు చెక్కలు అయినది. ధనము పొగొట్టుకున్న ప్రయాణీకుడు ఒక చెక్కను పట్టుకొని రేయింబవళ్ళు తేలుచు ఒక అద్భుత ద్వీపమును చేరెను. ఇతర ప్రయాణీకులు ఓడతో సహా సముద్రమున మునిగిరి. నూతన ద్వీపవాసులు తీరము చేరిన వ్యక్తిని ఆదరించి సపర్యలు చేసి తమతో నుండుటకు సకల సౌకర్యములు ఏర్పరచిరి.
ద్వీపవాసి ఒకరు ప్రయాణికుని ఇట్లు ప్రశ్నించెను. “నీవు బ్రతికి ఈ ద్వీపము చేరుట ఒక అద్భుతము. ఇతరులందరును సముద్రమున మునిగిరి. నీవు మాత్రము తేలుచు, ద్వీపము చేరితివి. దీనికి కారణ మేమైయుండును ?
ప్రయాణీకు డిట్లనెను. “నాకు తెలిసిన కారణ మొకటియే. మిగిలిన వారికన్న నాకు ప్రయాణమున ఖర్చు ఎక్కువైనది.”
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
15 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment