శ్రీమద్భగవద్గీత - 480: 12వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 480: Chap. 12, Ver. 11

 

🌹. శ్రీమద్భగవద్గీత - 480 / Bhagavad-Gita - 480 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -11 🌴

11. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత: |
సర్వకర్మఫలత్యాగం తత: కురు యతాత్మవాన్ ||

🌷. తాత్పర్యం : అయినను ఒకవేళ నా భావనలో కర్మను చేయుట యందును నీవు అసమర్థుడవైనచో త్యాగము చేసి ఆత్మస్థితుడవగుట యత్నింపుము.


🌷. భాష్యము : సాంఘిక, కుటుంబ, ధర్మపరిస్థితుల రీత్యా లేదా ఇతర ఆటంకముల కారణముగా మనుజుడు కృష్ణచైతన్య ప్రచారోద్యమ కార్యక్రమములందు సహాయానుభూతిని చూప సమర్థుడు కాకపోవచ్చును. అట్టి కార్యక్రమములలో ప్రత్యక్షముగా పాల్గొనినచో కుటుంబసభ్యుల నుండి నిషేధములు లేదా ఇతర కష్టములు సంప్రాప్తింపవచ్చును. అటువంటి కష్టము కలిగినవాడు తన కర్మల ద్వారా ప్రోగైన ధనమును ఏదేని ఓక మంచి కార్యమునకై ఉపయోగించవచ్చునని ఉపదేశింపబడినది. అట్టి విధానములు వేదములందు వివరింపబడినవి. వివిధములైన యజ్ఞములు మరియు విశేష పుణ్యకార్యములు (పూర్వకర్మఫలములను వినియోగించుటకు వీలు కలిగించెడి కొన్ని ముఖ్యకర్మలు) వాని యందు పెక్కుగలవు.

ఆ విధముగా మనుజుడు క్రమముగా జ్ఞానస్థాయికి ఉద్ధరింపగలడు. కృష్ణపరకర్మల యందు అభిరుచి లేనివాడు సైతము కొన్నిమార్లు వైద్యశాలకో లేదా సాంఘికసంస్థకో తన కష్టార్జితమును దానము చేయుటను మనము గాంచుచుందుము. ఇట్టి దానము కూడ ఇచ్చట సమర్థింపబడినది. ఏలయన తన కర్మఫలములను త్యాగము చేయుటను అభ్యసించుట ద్వారా మనుజుడు క్రమముగా మనస్సును పవిత్రమొనర్చు కొనగలడు. అట్టి మనోపవిత్రత కలిగిన స్థితిలో అతడు కృషభక్తిరసభావనను అవగాహన చేసికొనుటకు సమర్థుడు కాగలడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 480 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 11 🌴

11. athaitad apy aśakto ’si kartuṁ mad-yogam āśritaḥ
sarva-karma-phala-tyāgaṁ tataḥ kuru yatātmavān

🌷 Translation : If, however, you are unable to work in this consciousness of Me, then try to act giving up all results of your work and try to be self-situated.


🌹 Purport : It may be that one is unable even to sympathize with the activities of Kṛṣṇa consciousness because of social, familial or religious considerations or because of some other impediments. If one attaches himself directly to the activities of Kṛṣṇa consciousness, there may be objections from family members, or so many other difficulties. For one who has such a problem, it is advised that he sacrifice the accumulated result of his activities to some good cause. Such procedures are described in the Vedic rules. There are many descriptions of sacrifices and special functions for the full-moon day, and there is special work in which the result of one’s previous action may be applied. Thus one may gradually become elevated to the state of knowledge.

It is also found that when one who is not even interested in the activities of Kṛṣṇa consciousness gives charity to some hospital or some other social institution, he gives up the hard-earned results of his activities. That is also recommended here because by the practice of giving up the fruits of one’s activities one is sure to purify his mind gradually, and in that purified stage of mind one becomes able to understand Kṛṣṇa consciousness. Of course, Kṛṣṇa consciousness is not dependent on any other experience, because Kṛṣṇa consciousness itself can purify one’s mind, but if there are impediments to accepting Kṛṣṇa consciousness, one may try to give up the results of his actions. In that respect, social service, community service, national service, sacrifice for one’s country, etc., may be accepted so that some day one may come to the stage of pure devotional service to the Supreme Lord. In Bhagavad-gītā (18.46) we find it is stated, yataḥ pravṛttir bhūtānām: if one decides to sacrifice for the supreme cause, even if he does not know that the supreme cause is Kṛṣṇa, he will come gradually to understand that Kṛṣṇa is the supreme cause by the sacrificial method.

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment