🌹 02 OCTOBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀🌹 02 OCTOBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀
1) 🌹 శివ సూత్రాలు - 1 - 12వ సూత్రం. విస్మయో యోగ భూమికః - అద్భుతం మరియు ఆనందకరమైనది తుర్యా స్థితి. ఈ అతీంద్రియ స్థాయి సాధకుడిని దివ్య భావనలతో నింపుతుంది. 🌹 https://youtu.be/HWEOT5n65LI
2) 🌹 Shiva Sutras - 1 - 12th Sutra. Vismayo Yoga Bhumikah - Astonishment and Delightful is the Turiya State. This Transcendental State fills the Yogi with Divine Sensations. 🌹
3) 🌹 शिव सूत्र - 1 - 12वां सूत्र: विस्मयो योग भूमि: - अद्भुत और आनंदमयी है तुरीय अवस्था। यह पारलौकिक अवस्था साधक को दिव्य अनुभूतियों से भर देती है। 🌹 
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 592 / Bhagavad-Gita - 592 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 21 / Chapter 16 - The Divine and Demoniac Natures - 21 🌴
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 988 / Vishnu Sahasranama Contemplation - 988 🌹*
🌻 988. సామగాయనః, सामगायनः, Sāmagāyanaḥ 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 564 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 564 - 2 🌹 
🌻 564. 'మృడానీ’ - 2 / 564. 'Mrudani' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శివ సూత్రాలు - 1 - 12వ సూత్రం. విస్మయో యోగ భూమికః - అద్భుతం మరియు ఆనందకరమైనది తుర్యా స్థితి. ఈ అతీంద్రియ స్థాయి సాధకుడిని దివ్య భావనలతో నింపుతుంది. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*ఈ వీడియోలో, ప్రసాద్ భరద్వాజ శివ సూత్రాలలో 12వ సూత్రం - "విస్మయో యోగ భూమికః" గురించి వివరిస్తారు. ఇది తుర్యా స్థితిని వివరిస్తుంది. ఈ స్థితిలో యోగి విస్మయం మరియు దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. యోగి యొక్క చైతన్యం విశ్వ శివ చైతన్యంలో ఏకమవుతున్న విధానాన్ని మరియు యోగ సాధనలోని వివిధ స్థాయిలను తెలుసుకోండి. కుండలిని ఆనందం మరియు తుర్యా స్థితి మధ్య ఉన్న తేడాలను తెలుసుకోండి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Shiva Sutras - 1 - 12th Sutra. Vismayo Yoga Bhumikah - Astonishment and Delightful is the Turiya State. This Transcendental State fills the Yogi with Divine Sensations. 🌹*
*Prasad Bharadwaj*

*In this video, Prasad Bharadwaj explains the 12th Sutra of Shiva Sutras - "Vismayo Yoga Bhumikah" from Shambhavopaya. It describes the transcendental Turiya state, where a yogi experiences both astonishment and divine joy. Discover how the yogi's consciousness merges with universal Shiva consciousness, and the different stages of yogic development. Learn the distinction between Kundalini bliss and the Turiya state.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 शिव सूत्र - 1 - 12वां सूत्र: विस्मयो योग भूमि: - अद्भुत और आनंदमयी है तुरीय अवस्था। यह पारलौकिक अवस्था साधक को दिव्य अनुभूतियों से भर देती है। 🌹*
*प्रसाद भारद्वाज*

*इस वीडियो में, प्रसाद भारद्वाज "विस्मयो योग भूमि:" के 12वें शिव सूत्र को समझाते हैं, जो शम्भवोपाय का हिस्सा है। इसमें तुरीय अवस्था का वर्णन किया गया है, जहां योगी विस्मय और दिव्य आनंद दोनों का अनुभव करता है। जानिए कैसे योगी की चेतना शिव की सार्वभौमिक चेतना में विलीन हो जाती है और योग के विभिन्न चरणों के बारे में जानकारी प्राप्त करें। साथ ही, कुंडलिनी आनंद और तुरीय अवस्था के बीच अंतर को समझें।*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 593 / Bhagavad-Gita - 593 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 22 🌴*

*22. ఏతైర్విముక్త: కొన్తేయ తమోద్వారైస్త్రిభిర్నర: |*
*ఆచరత్యాత్మన: శ్రేయస్తతో యాతి పరాం గతిమ్ ||*

*🌷. తాత్పర్యం : ఓ కుంతీపుత్రా! ఈ మూడు నరకద్వారముల నుండి తప్పించుకొనినవాడు ఆత్మానుభూతికి అనుకూలములైన కార్యముల నొనరించి క్రమముగా పరమగతిని పొందగలడు.*

*🌷. భాష్యము : కామము, క్రోధము, లోభము అనెడి ఈ మువ్వురు మానవశత్రువుల యెడ ప్రతివారును జాగరూకులై యుండవలెను. ఈ మూడింటి నుండి ఎంతగా బయటపడినచో మనుజుని అస్తిత్వము అంతగా పవిత్రము కాగలదు. పిదప అతడు వేదములందు నిర్దేశింపబడిన విధినియమములను పాటించుటచే అతడు క్రమముగా ఆత్మానుభవస్థాయిని చేరగలడు. అతడు మిగుల అదృష్టవంతుడైనచో అట్టి సాధనచే కృష్ణభక్తిరసభావనకు చేరగలడు. అంతట జయము అతనికి నిశ్చయము కాగలదు. మనుజుడు పవిత్రుడగుటకు చేయవలసిన క్రియ, ప్రతిక్రియ మార్గములు వేదవాజ్మయమున విశదముగా వివరింపబడినవి.*

*కామము, క్రోధము, లోభము అనువానిని త్యజించుట పైననే సమస్తవిధానము ఆధారపడియున్నది. కామాది త్రిగుణములను త్యజించుటనెడి ఈ పధ్ధతిని అనుసరించుట ద్వారా మనుజుడు ఆత్మానుభవపు అత్యున్నతస్థాయికి ఎదగగలడు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 593 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 22 🌴*

*22. etair vimuktaḥ kaunteya tamo-dvārais tribhir naraḥ*
*ācaraty ātmanaḥ śreyas tato yāti parāṁ gatim*

*🌷 Translation : The man who has escaped these three gates of hell, O son of Kuntī, performs acts conducive to self-realization and thus gradually attains the supreme destination.*

*🌹 Purport : One should be very careful of these three enemies to human life: lust, anger and greed. The more a person is freed from lust, anger and greed, the more his existence becomes pure. Then he can follow the rules and regulations enjoined in the Vedic literature. By following the regulative principles of human life, one gradually raises himself to the platform of spiritual realization. If one is so fortunate, by such practice, to rise to the platform of Kṛṣṇa consciousness, then success is guaranteed for him. In the Vedic literature, the ways of action and reaction are prescribed to enable one to come to the stage of purification. The whole method is based on giving up lust, greed and anger.*

*By cultivating knowledge of this process, one can be elevated to the highest position of self-realization; this self-realization is perfected in devotional service. In that devotional service, the liberation of the conditioned soul is guaranteed. Therefore, according to the Vedic system, there are instituted the four orders of life and the four statuses of life, called the caste system and the spiritual order system. There are different rules and regulations for different castes or divisions of society, and if a person is able to follow them, he will be automatically raised to the highest platform of spiritual realization. Then he can have liberation without a doubt.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 989 / Vishnu Sahasranama Contemplation - 989 🌹*

*🌻 989. దేవకీనన్దనః, देवकीनन्दनः, Devakīnandanaḥ 🌻*

*ఓం దేవకీనన్దనాయ నమః | ॐ देवकीनन्दनाय नमः | OM Devakīnandanāya namaḥ*

*కృష్ణావతారే దేవక్యాః సుతోభూత్ మధుసూదనః ।*
*దేవకీనన్దన ఇతి కీర్త్యతే విబుధోత్తమైః ॥*

*దేవకీదేవి తనయుడై అవతరించిన విష్ణువు దేవకీనందనః అని చెప్పబడును.*

*:: శ్రీ మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి* *అష్టపఞ్చదధికశతతమోఽధ్యాయః ::*
*జ్యోతీంషి శుక్లాని హి సర్వలోకే త్రయో లోకా లోకపాలాస్త్రయశ్చ ।*
*త్రయోఽగ్నయో వ్యాహృతయశ్చతిస్త్రః సర్వే దేవా దేవకీపుత్ర ఏవ ॥ 31 ॥*

*లోకమున ప్రకాశమానములగు జ్యోతిస్సులును, మూడు లోకములును, సకలలోకపాలురును, వేదత్రయమును, అగ్నిత్రయమును, ఐదు ఆహుతులును, సర్వదేవతలును - ఏవి ఎన్ని కలవో - అన్నియు దేవకీ పుత్రుడే!*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 989🌹*

*🌻989. Devakīnandanaḥ🌻*

*OM Devakīnandanāya namaḥ*

*कृष्णावतारे देवक्याः सुतोभूत् मधुसूदनः ।*
*देवकीनन्दन इति कीर्त्यते विबुधोत्तमैः ॥*

*Kr‌ṣṇāvatāre devakyāḥ sutobhūt madhusūdanaḥ,*
*Devakīnandana iti kīrtyate vibudhottamaiḥ.*

*As the incarnation of Kr‌ṣṇa, the Lord was born to Devakī Devi and hence He is called Devakīnandanaḥ.*

:: श्री महाभारते अनुशासनपर्वणि दानधर्मपर्वणि अष्टपञ्चदधिकशततमोऽध्यायः ::
ज्योतींषि शुक्लानि हि सर्वलोके त्रयो लोका लोकपालास्त्रयश्च ।
त्रयोऽग्नयो व्याहृतयश्चतिस्त्रः सर्वे देवा देवकीपुत्र एव ॥ ३१ ॥

*Śrī Mahābhārata - Book 13, Chapter 158*
*Jyotīṃṣi śuklāni hi sarvaloke trayo lokā lokapālāstrayaśca,*
*Trayo’gnayo vyāhr‌tayaścatistraḥ sarve devā devakīputra eva. 31.*

*All the luminaries in the world, the three worlds, the protectors of the worlds, the three Vedas, the three sacred fires, the five oblations and all the devas are the son of Devakī Himself.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥
ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 565 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 565 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।*
*మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀*

*🌻 565. 'మిత్రరూపిణీ' - 1 🌻*

*స్నేహ రూపము గలది శ్రీమాత అని అర్థము. స్నేహము ప్రేమ వలె అత్యంత బలమును కూర్చును. నిజమునకు ప్రేమ అన్నను, స్నేహమన్ననూ ఒక్కటియే. ఆత్మీయతకు సంబంధించిన అనుబంధమే స్నేహము లేక ప్రేమ. ఆత్మీయుల రూపములలో శ్రీమాతయే హితము చేకూర్చుచుండును. ఆత్మీయుల వలననే జీవుడు సుఖము పొందును. తుష్టిని, పుష్టిని పొందును. తన కెవ్వరునూ ఆత్మీయులు లేరని భావించుట అవగాహన లోపమే. పంచభూతములు తనకాత్మీయులే. అట్లే భూమి, గ్రహ గోళాదులు. అటుపైన సూర్యుని కన్న మించిన ఆత్మబంధువు లెవరు?*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 565 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha*
*mrugashi mohini mudhya mrudani mitrarupini  ॥114 ॥ 🌻*

*🌻 565. 'Mitraroopini' - 1 🌻*

*The name means that Sri Mata embodies the form of friendship. Friendship, like love, is a force of great strength. In truth, love and friendship are essentially the same. The bond that relates to inner closeness is either friendship or love. In the forms of those close to us, Sri Mata is the one who bestows well-being. It is through these close ones that a person experiences joy, satisfaction, and nourishment. The belief that one has no close ones is a misunderstanding. The five elements are indeed one’s close companions, as are the earth, planets, and celestial bodies. Beyond all, who is a greater companion of the soul than the Sun?*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment