శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 565 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 565 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 565 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 565 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀

🌻 565. 'మిత్రరూపిణీ' - 1 🌻


స్నేహ రూపము గలది శ్రీమాత అని అర్థము. స్నేహము ప్రేమ వలె అత్యంత బలమును కూర్చును. నిజమునకు ప్రేమ అన్నను, స్నేహమన్ననూ ఒక్కటియే. ఆత్మీయతకు సంబంధించిన అనుబంధమే స్నేహము లేక ప్రేమ. ఆత్మీయుల రూపములలో శ్రీమాతయే హితము చేకూర్చుచుండును. ఆత్మీయుల వలననే జీవుడు సుఖము పొందును. తుష్టిని, పుష్టిని పొందును. తన కెవ్వరునూ ఆత్మీయులు లేరని భావించుట అవగాహన లోపమే. పంచభూతములు తనకాత్మీయులే. అట్లే భూమి, గ్రహ గోళాదులు. అటుపైన సూర్యుని కన్న మించిన ఆత్మబంధువు లెవరు?


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 565 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻

🌻 565. 'Mitraroopini' - 1 🌻


The name means that Sri Mata embodies the form of friendship. Friendship, like love, is a force of great strength. In truth, love and friendship are essentially the same. The bond that relates to inner closeness is either friendship or love. In the forms of those close to us, Sri Mata is the one who bestows well-being. It is through these close ones that a person experiences joy, satisfaction, and nourishment. The belief that one has no close ones is a misunderstanding. The five elements are indeed one’s close companions, as are the earth, planets, and celestial bodies. Beyond all, who is a greater companion of the soul than the Sun?


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment