22-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 435 / Bhagavad-Gita - 43t🌹 
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 223 / Sripada Srivallabha Charithamrutham - 223 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 103🌹 
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 126🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 39 / Sri Lalita Sahasranamavali - Meaning - 39 🌹
6) 🌹 VEDA UPANISHAD SUKTHAM - 66🌹
7) 🌹. నారద భక్తి సూత్రాలు - 43 🌹 
8) 🌹. శివగీత - 8 / The Shiva-Gita - 8🌹 
9)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 13 🌹 
10) 🌹. సౌందర్య లహరి - 50 / Soundarya Lahari - 50🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 349 / Bhagavad-Gita - 349 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 435 / Bhagavad-Gita - 435 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 45 🌴*

45. అదృష్టపూర్వం హృషితో(స్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితమ్ మనో మే |
తదేవమే దర్శయ దేవ రూపమ్
ప్రసీద దేవేశ జగన్నివాస 

🌷. తాత్పర్యం : 
ఇదివరకెన్నడును చూడనటువంటి ఈ విశ్వరూపమును గాంచి నేను మిగుల సంతోషించితిని. కాని అదే సమయమున మనస్సు భయముతో కలత చెందినది. కనుక ఓ దేవదేవా! జగాన్నివాసా! నా యెడ కరుణను జూపి నీ దేవదేవుని రూపమును తిరిగి నాకు చూపుము.


🌷. భాష్యము : 
శ్రీకృష్ణునకు ప్రియమిత్రుడైనందున అర్జునుడు అతని యెడ పూర్ణవిశ్వాసమును కలిగియుండెను. తన మిత్రుని సంపదను గాంచి ప్రియమిత్రుడైనవాడు సంతసించు రీతి, అర్జునుడు తన మిత్రుడైన శ్రీకృష్ణుడు దేవదేవుడనియు మరియు అద్భుతమైన విశ్వరూపమును చూపగలడనియు ఎరిగి మిగుల సంతసించెను. 

కాని అదే సమయమున ( ఆ విశ్వరూపమును గాంచిన పిమ్మట) తన విశుద్ధ ప్రేమధోరణిలో ఆ దేవదేవుని యెడ తాను పెక్కు అపరాధముల నొనర్చితినని అతడు భీతియును పొందెను. ఆ విధముగా భయమునొంద నవసరము లేకున్నను అతని మనస్సు భయముతో కలత నొందెను. తత్కారణముగా అర్జునుడు శ్రీకృష్ణుని అతని నారాయణరూపమును చూపుమని అర్థించుచున్నాడు. 

శ్రీకృష్ణుడు ఎట్టి రూపమునైనను దరించగలుగుటయే అందులకు కారణము. భౌతికజగము తాత్కాలికమైనట్లే ప్రస్తుత విశ్వరూపము సైతము భౌతికమును, తాత్కాలికమును అయి యున్నది. కాని వైకుంఠలోకములందు మాత్రము అతడు దివ్యమగు చతుర్భుజనారాయణ రూపమును కలిగియుండును. 

ఆధ్యాత్మికజగమునందలి అనంతసంఖ్యలో గల లోకములలో శ్రీకృష్ణుడు తన ముఖ్యాంశములచే వివిధనామములతో వసించియుండును. అట్టి వైకుంఠలోకము లందలి వివిధరూపములలోని ఒక్క రూపమును అర్జునుడు గాంచగోరెను. 

అన్ని వైకుంఠలోకములందు నారాయణరూపము చతుర్భుజసహితమే అయినను, వాని చతుర్భుజములలో శంఖ, చక్ర, గద, పద్మముల అమరికను బట్టి నారాయణరూపములకు వివిధనామములు కలుగును. ఆ నారాయణరూపములన్నియును. శ్రీకృష్ణునితో ఏకములే కనుక అర్జునుడు అతని చతుర్భుజ రూపమును గాంచ అర్థించుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 435 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 45 🌴*

45. adṛṣṭa-pūrvaṁ hṛṣito ’smi dṛṣṭvā
bhayena ca pravyathitaṁ mano me
tad eva me darśaya deva rūpaṁ
prasīda deveśa jagan-nivāsa

🌷 Translation : 
After seeing this universal form, which I have never seen before, I am gladdened, but at the same time my mind is disturbed with fear. Therefore please bestow Your grace upon me and reveal again Your form as the Personality of Godhead, O Lord of lords, O abode of the universe.

🌹 Purport :
Arjuna is always in confidence with Kṛṣṇa because he is a very dear friend, and as a dear friend is gladdened by his friend’s opulence, Arjuna is very joyful to see that his friend Kṛṣṇa is the Supreme Personality of Godhead and can show such a wonderful universal form. But at the same time, after seeing that universal form, he is afraid that he has committed so many offenses to Kṛṣṇa out of his unalloyed friendship. 

Thus his mind is disturbed out of fear, although he had no reason to fear. Arjuna therefore is asking Kṛṣṇa to show His Nārāyaṇa form, because He can assume any form. This universal form is material and temporary, as the material world is temporary. 

But in the Vaikuṇṭha planets He has His transcendental form with four hands as Nārāyaṇa. There are innumerable planets in the spiritual sky, and in each of them Kṛṣṇa is present by His plenary manifestations of different names. 

Thus Arjuna desired to see one of the forms manifest in the Vaikuṇṭha planets. Of course in each Vaikuṇṭha planet the form of Nārāyaṇa is four-handed, but the four hands hold different arrangements of symbols – the conchshell, mace, lotus and disc. According to the different hands these four things are held in, the Nārāyaṇas are variously named. 

All of these forms are one with Kṛṣṇa; therefore Arjuna requests to see His four-handed feature.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 223 / Sripada Srivallabha Charithamrutham - 223 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 42
*🌻. హతాశులైన పురవాసులు 🌻*

మధ్యాహ్నం భోజనాలు అయ్యాక భాస్కర పండితులు ఇలా చెప్పారు "శ్రీపాదవల్లభులు శూద్రుల ఇంటిలో దత్త దీక్ష ఇవ్వడం, పూజాదికాలు లేకుండా భక్తుల చేతికి తోరాలు కట్టడం, తానే దత్తుడనని ప్రకటించడం శాస్త్ర విరుధ్ధం అని బ్రాహ్మణులు తలచి బాపనార్యులను రాజశర్మను వెలి వేయాలని తీర్మానించారు. 

కాని అకస్మాత్తుగా శ్రీపాద వల్లభులు అంతర్ధానం అవడంతో ఈ విషయం ప్రధాన చర్చ నీయాంశం అయ్యింది. 

ఎన్నోమార్లు శ్రీపాదులే దత్తప్రభువు లని నిరూపణ జరిగినా మళ్ళీ మొదటికే వచ్చిన బ్రాహ్మణులు "16 సంవత్సరాలు నిండని బాలుడు తానే దత్తుడనని ప్రకటించడం దైవ ద్రోహం కాదా? "అంటూ మళ్ళీ అదే దోషాన్ని ఇంకొకసారి వేలెత్తి చూపించారు.
 
కొంతమంది బ్రాహ్మణులు కడుపులో కపటం ఉంచుకొని, పైకి సాను భూతి ప్రకటించడానికి బాపనార్యుల ఇంటికి వెళ్ళారు. 

ఆశ్చర్యంగా అక్కడ ఎవ్వరూ విచారంగా లేకపోగా 'దత్తుడు మా ఇంట్లో శ్రీపాదునిలా తిరుగాడుతూ మా జన్మ ధన్యం చేసాడు' అంటూ ఎంతో ఆనందం ప్రకటించడంతో బిత్తర పోయి అక్కడనుండి మిగిలిన మూడు ఇళ్ళకు వెళ్ళారు, కాని మూడు చోట్లా ఇదే పరిస్థితి ఎదురవడంతో బిక్క చచ్చిపోయి కుక్కుటేశ్వరాలయం లోని బైరాగి దగ్గరికి వెళ్ళి సంగతి అంతా పూస గుచ్చినట్లు చెప్పారు. 

బైరాగి పై ప్రాణం పైనే పోయింది. ఏదో ఒక దైవం పేరు కాకుండా తన ఉపాస్య దైవం దత్తుడు తానే అని శ్రీపాదులు చెప్పడంతో, అదే నిజమైనట్లయితే తనకు కష్టాలు ఖాయం అని, దత్తులు విచిత్రస్వభావులు, కష్టాలు కలిగించి, వినోదం చూసి, సంపూర్ణ శరణాగతి పొందితే కాని ఉద్ధరించరు అని, ఇక్కడ ఇంత ధనం సంపాదించడం దత్తుడి కరుణ అని అను కున్నాను కాని కరుణ వెనకాల తన కోసమే ఏదైనా ప్రత్యేక మైన శిక్ష కేటాయించారా? అని విచారించడం మొదలు పెట్టాడు. 

తాను ధనకాంక్షతోనే ఈ దీక్షాకార్యక్రమం మొదలు పెట్టాడే తప్ప, తన వద్దకాని, ఆ బ్రాహ్మణుల వద్ద కాని ఏ ఆధ్యాత్మిక శక్తి లేదు. 

దీక్ష తీసుకున్న వాళ్ళ కోరికలు ఫలిస్తే తమకు గొప్పతనం ఆపాదించుకొనవచ్చు, అలాకాని పక్షంలో ఉపాసకుల భక్తి శ్రద్ధలలో, విశ్వాసంలో లోపమని వారిపై తప్పు నెట్టవచ్చు. 

ఈ కపట ప్రణాళిక శ్రీపాదుల రూపంలో ఉన్న దత్తులకి తెలిసి చిత్రమైన చిక్కులు కల్పించరు కదా, అని ఒకవైపు భయంతో ఇంకొక వైపు పశ్చాత్తాపంతో లోలోపలే కుమిలి పోసాగాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 223 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

*🌻 Explanation of the secret of Siva worship The greatness of Sivayogi’s devotion – Sripada’s teaching to him - 1 🌻*

When I was readying to go to Kurungadda from this shore, I came across a good vysya. He was also coming to Kurungadda for darshan of Sripada. During conversation, I learnt that he was a relative of Sri Venkatappaiah Shreshti of Peethikapuram. I was very much surprised.  

All the devotees of Sripada Srivallabha whom I was meeting were telling His divine stories and leelas. There was a speciality in the wonderful incidents they were narrating. They were telling only a few incidents that happened in each year of Sripada’s life.  

They were not having connection with one another and I never heard them before. So far I was told about His ‘leelas’ that happened upto ten years of age in sequence. I thought in my mind that Dharma Gupta might tell some incidents that happened in the 11th year of Sripada. Sripada does ‘leelas’ every moment.  

Meanwhile Sri Dharma Gupta started telling me, ‘Sir! Shankar Bhatt! I am a devotee of Siva. While Sripada was 11 years old, one Siva Yogi came to Peethikapuram.  

He was a capable person. He would take only handful bhiksha daily. He would not keep any bag, plate or any vessel. He looked like a mad man to onlookers. Initially, he came to Kukutteswara temple. 

 Seeing his face and his dust ridden body, the priests were not allowing him to enter the temple. He was an avadhoota not having any body consciousness. He was repeating ‘Siva Panchakshari’ often.  

At that time, I was coming on a horse towards the house of Venkatappaiah Shresti, who was related to me. It was my habit to visit Kukkuteswara temple on the way. Because I was an important vysya, the priests did great worship to Shiva in my name.  

It was my habit to give good ‘Sambhavana’ to the priests. I decided to give five varahas to the priests. They would distribute that amount among themselves. They would express their financial problems and difficulties to me.  

They said that the support of people like me was required to uplift ‘sanathana dharma’. Meanwhile, Siva yogi came into the temple forcibly from outside. Along with him, two cobras also entered the temple. The priests started sweating.   

That Siva yogi said, ‘Oh! Priests! Don’t be afraid. These snakes are the ornaments for Kukutteswara whom we worship. They are eager to embrace Kukkuteswara like children who want to embrace their father.  

They are like our brothers. We should not be afraid of them and run away or kill them. It would be a great sin. These were attracted to this place because of the special worship done by the priests.  

Let us worship Kukkuteswara with snake ornaments with devotion. You chant ‘Namakam’ and ‘Chamakam’ with ‘swaram’.  

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 103 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. మహాశివరాత్రి పర్వదిన సందేశము - 3 🌻*

🌻 "సోహం భావేన పూజయెత్తి" (జీవయేత్) సోహం అనగా వాడే నేను దీనిని వీలైనన్ని ఎక్కువ మార్లు ధ్యానం చేయవలెను‌ ఇట్లు చేస్తుండగా చేయకూడని పనులు క్రమంగా మానేయటం జరుగుతుంది. తరువాత దేవుడు అనే అయస్కాంతం నీవు అనే ఇనుపముక్కను స్పృశిస్తుంది. చాలా తొందరలో నీవు కూడా అయస్కాంతంగా మారిపోతావు. 

ఇది కాక పుస్తకాలు మాత్రమే చదివితే ఈ మార్పు రాదు. Magnetism అనే లావాటి పుస్తకాన్ని పుచ్చుకొని బల్ల మీద పెట్టి తాళం చెవితో ఆ పుస్తకాన్ని రుద్దినంత మాత్రన తాళం చెవి Magnet అవ్వదు కాని, Transformation రావాలి. 

ఇలాంటి ఆపదల నుండి రక్షించటం కోసం సోహం అని ధ్యానం చేయటం కొసం శివ శబ్దాన్ని, రుద్రాభిషేకాన్ని కూడా మనకు పెద్దలు ఇచ్చారు. అనేక మార్గాలు ఇచ్చారు అందులో ఇదొకటి. 

దీని వలన జరిగే మార్పు దీనిని ఆచరించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. మనం రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు "నమకం" అనే మంత్రాన్ని ఇచ్చారు. ఈ నమకం అనే పేరు చాలా దిక్కుమాలిన పాడు పేరు. దాని పేరు అది కాదు. మనం సరియైన పేరు తెలుసుకోవాలి. ఇందులో నమః నమః అని ఉంటుంది కనుక ఎవడో పిచ్చివాడు దీనికి "నమకం" అని పేరు పెట్టేశాడు, అలాగే చమే చమే అని ఉన్నది కనుక "చమకం" అని పెట్టేశాడు. దీని అసలు పేరు రుద్రము లేక రుద్రసూక్తము. ఇది పరమ పవిత్రమైన పేరు. 

ఈ రుద్రసూక్తము యజుర్వేదము అనే పరమ పవిత్ర గ్రంథములో ఉన్న మహామంత్రం.
.....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 125 🌹*
*🌴 The Pulsation - 3 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 The Door to Subjectivity 🌻

The pulsating principle is the experience of an expanse of blue without form and the rising is like the flight of a bird. In the Puranas the bird of the cosmic respiration is called the eagle Garuda. 

The eagle, pulsating with its golden wings, rises and the sun enters into it. When we rise, the sun, the divine consciousness, can enter into us. 

Thus an initiate is considered to be an eagle, and it is said that many initiates existing beyond form prefer living in the form of an eagle.

We would like to deal with these advanced states without taking the preparatory steps. But as long as body, emotions and thoughts are in disorder, we cannot enter into the subtle existence. 

Only if we apply the information about pulsation on us and practice it over long years, our life gets regulated. Then we can turn from objectivity to subjectivity. 

A disciple organizes his life in a rhythmic way, in order to be able to easily work in the outer world and withdraw into the inner. 

Thus he expresses the pulsating life of the soul on the physical plane. How much we might read about it, it is of no use without practice. 

However, if we begin working with respiration and stay more and more with the pulsating principle, we come to like it and slowly the door to subjectivity opens, the entrance door of the ashram.

🌻 🌻 🌻 🌻 🌻 
Master K.P. Kumar: Listening to the Invisible Master / notes from seminars / Master E. Krishnamacharya: Spiritual Psychology.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 42 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 25

*🌻. 25. సాతు కర్మ జ్ఞాన యోగేభ్యో ఽప్యధికతరా - 5 🌻*

గీతాచార్యులు నుడివిందేమంటే ‘‘తత్త్వం తెలియని అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్ఠం. అట్టి పాండిత్యం కంటె కర్మ ఫలత్యాగం గొప్పది. దానివలన పరమశాంతి లభిస్తుంది. 

శరీరాభిమానాన్ని వదలి, త్రిగుణాలతో కూడిన స్వభావాన్ని విడచినవాడు స్థితప్రజ్ఞుడు. అట్టి భక్తుడు అంటే పరమాత్మకు అత్యంత ప్రీతి’’ అని భగవద్గీతలోని భక్తియోగ సారాంశం.

            కనుక సాధకుడు ఏ మార్గంలో తన సాధన మొదలుపెట్టినా ఫలితం ప్రాప్తించే సమయానికి ఇతర యోగాలు కూడా కలసిపోతాయి. చివరకు మోక్షం అనేది అందరికీ ఒక్కటే. అయితే పరాభక్తి గొప్పదిగా నారద మహర్షి ప్రశంసిస్తారు.

        వశిష్ఠులవారు అన్ని యోగాలు వివరించి, స్వీయ మార్గం జ్ఞానమని చెప్తారు. శ్రీరామునికి కూడా ఆ జ్ఞాన మార్గమే సరిపోతుందని బోధించారు. ఏది గొప్పది అని మాత్రం వశిష్ఠులవారు తేల్చి చెప్పలేదు.

     శ్రీ సీతారామాంజనేయ సంవాదం అనే గ్రంథంలో శ్రీ సీతారాములు శ్రీ ఆంజనేయుల వారికి సాంఖ్య తారక అమనస్క యోగాలను నేర్పి, భక్త ఆంజనేయుని పరబ్రహ్మ స్వరూపంగా ఆరూఢం చేశారు.

      శ్లో|| దేహ బుద్ధ్యా-స్మి దాసోహం
            జీవబుద్ధ్ద్యాత్మ త్వదంశకః
            ఆత్మ బుద్ధ్యా త్వమేవాహమితి
            మేనిశ్చితా మతిః ||

తా|| దేహబుద్ధితో కూడిన ఆంజనేయుడు భగవంతునికి దాసుడు. జీవ బుద్ధితో కూడిన ఆంజనేయుడు భగవంతుని అంశగా భావించి ఆ భగవంతునితో సమాన మంటున్నాడు. 

ఆత్మ బుద్ధితో కూడినప్పుడు ఆంజనేయుడు ఆ శ్రీరామునికంటే వేరుకాదు. ఇద్దరని లేకుండా ఒక్కటైన పరబ్రహ్మ స్వరూపమనేది శ్రీ ఆంజనేయుని స్వస్వరూపం.

            అత్రచ ప్రథమమ్‌ మహత్సేవ తతస్తద్ధర్మ శ్రద్ధా
            తతో భగవత్కథా శ్రవణమ్‌ తతో భగవతి రతిః తయాచ
            దేహద్వయ వివిక్తాత్మ జ్ఞానమ్‌ తతో దృఢభక్తిః
            తతో భగవతత్త్వ విజ్ఞానమ్‌ తత స్సర్వజ్ఞత్వాది గుణావిర్భావః ||

తా|| శ్రద్ధ అంటే కర్మ యోగం. తరువాతే భగవద్రతి అనగా భక్తి యోగం. తరువాత దేహ ద్వయ వివిక్త ఆత్మజ్ఞానం. ఇది జ్ఞాన యోగం. తరువాత దృఢ భక్తి. ఇది జ్ఞాననిష్ఠ లేక అనన్య భక్తి. సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వాలు ముక్తుడికి పై క్రమంలో అయత్నంగా సిద్ధిస్తాయి.

            ఇక్కడ అన్ని యోగాలు అవసరంగా కనిపిస్తూ చివరకు అన్నీ సాధకుడిలో అప్రయత్నంగా జరిగి, ముక్తికి దారి తీస్తున్నట్లు శ్రీధరాచార్యులు వివరించారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 39 / Sri Lalita Sahasranamavali - Meaning - 39 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 72

313. రమా - 
లక్ష్మీదేవి.

314. రాకేందువదనా - 
పూర్ణిమ చంద్రుని పోలిన ముఖము గలది.

315. రతిరూపా - 
ఆసక్తి రూపమైనది.

316. రతిప్రియా - 
ఆసక్తి యందు ప్రీతి కలది.

317. రక్షాకరీ - 
రక్షించునది.

318. రాక్షసఘ్నీ -
 రాక్షసులను సంహరించునది.

319. రామా - 
ఎప్పుడూ సంతోషంగా, క్రీడాత్మకంగా వుండేది.

320. రమణ లంపటా - 
రమణునితో అత్యంత సాన్నిహిత్య, సామ్య సంబంధము గలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 39 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 39 🌻*

313 ) Ramaa -   
She who is like Lakshmi

314 ) Raakendu vadana -  
 She who has a face like the full moon

315 ) Rathi roopa -   
She who attracts others with her features like Rathi (wife of God of love-Manmatha)

316 ) Rathi priya -   
She who likes Rathi

317 ) Rakshaa kari -   
She who protects

318 ) Rakshasagni -   
She who kills Rakshasas-ogres opposed to the heaven

319 ) Raamaa -   
She who is feminine

320 ) Ramana lampata -   
She who is interested in making love to her lord

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. VEDA UPANISHAD SUKTHAM - 66 🌹*
*🌻 1. Annapurna Upanishad - 27 🌻*
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

V-71. First augment wisdom by means of familiarity with the Shastras and by seeking the company of the holy. 

V-72. The true, real and ultimate Brahman, superlatively pure, eternal, without beginning and end, is the cure for all forms of transmigratory life. 

V-73. So also is It neither coarse nor spaced; neither tangible nor visible; It is tasteless and scentless; unknowable and peerless. 

V-74. Well disciplined (sage)! For achieving liberation, one should meditate on the bodiless Self that is Brahman - Being consciousness and Bliss without end - as 'I am (That)'. 

V-75. Concentration is the origination of knowledge in regard to the unity of the Supreme and the Jiva. The Self, verily, is eternal, omnipresent, immutable and flawless. 

V-76. Being (but) one, through Maya it splits up; not in its essence. Therefore the non-dual alone is; no manifold, no empirical life (is there). 

V-77. Just as space is called 'Pot-space' (and) 'great space', so, due to delusion, is the self-called Jiva and Ishvara in two ways. 

V-78. When the all-pervading spirit shines always without a break in the mind of the Yogin then one becomes one's Self. 

V-79. Verily, when one beholds all beings in one's own Self, and one's Self in all beings, one becomes Brahman. 

V-80. In the state of concentration, atoned with the Supreme, one beholds no beings; one then is the Alone.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 8 / The Siva-Gita - 8 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
*🌻. భక్తి నిరూపణ యోగము - 8 🌻*

చందనం బిల్వ కాష్ట స్య - పుష్పాణి వన జాన్యపి. 27
ఫలాని తాదృశాన్యేవ - యస్య ప్రీతి కారాణి వై ,
దుష్కరం తస్య సేవాయాం - కిమస్తి భువన త్రయే 28

బిల్వ వృక్షము బెరడుతో (చెక్కతో ) నరగ దీసిన శ్రీ గంధము, అడవిలోని పువ్వులు, ఫలములు మున్నగునవి యైనను భక్తితో సమర్పించినను మహాదేవుడు సంతసించును. 

వీటి యందె అతనికి ఎక్కువ మక్కువ గూడా. ఇటులుండగా నా పరమాత్ముని యుపాసించుటలో 
నెవరికి దానే కష్టమగును.

వన్యేషు యాదృశీ ప్రీతి - ర్వర్తతే పరమే శితు : ,
ఉత్తమేష్వపి నాస్త్యేవ - గ్రామ జేష్వ పితాదృశీ 29
తం త్యక్త్యా తాదృశం - దేవం యస్సే వే తాన్య దేవతామ్,
సమి భాగీ రధీం త్యక్త్యా - కాంక్షతే మృగ తృష్టికామ్ 30

శివునకు అడవియందే వికసించే పుష్పములందును, పండిన ఫలము లందును, దళాదు లందును ఎంత మక్కువో అంతటి ప్రీతి గ్రామ మందుండి శ్రేష్టము లె అయినప్పటికి ని వాని యందు ఆసక్తి యుండదు.

 ఆ విధముగా సులభముగా ప్రసన్నుడయ్యె భోలా శంకరుని వీడి ఇతరత్ర నుండి దేవుళ్ళను బూజించినచో ప్రక్కనే యున్న గంగానది ని వీడి ఎండ మావులను చూచి యాచించి మోసపోయిన వాడే యగును. అలంకార ప్రియో విష్ణు: అభిషేక ప్రియాః శివః సులభ సాధ్యుడు శివుడు.

కింతు యస్యాస్తి దురితం -కోటి జన్మ సు సంచితమ్,
తస్య ప్రకాశతే నాయం - త్వర్దో మోహాంధ చేతసః 31
న కాల నియమో యత్ర- న దేశస్య స్థల స్యచ,
యత్రాస్య రమతే చిత్తం - తత్ర ధ్యానేన కేవలమ్ 32
స్వాత్మ త్వేన శివస్యాసౌ - శివ సాయుజ్య మాప్నుయాత్ .

అసలు విషయమేమనగా - ఎవడైతే అనేక జన్మముల నుండి పాప కర్మముల చేసి మూట గట్టుకుని యున్నాడో అట్టి పపిష్టునకు జ్ఞాన శూన్యునికి, ఈ శైవ తత్వము నచ్చదు. 
ఇట్టి సులభైక ఉపాస్యుడైన శివుని సేవించుటకు ఇట్టి సమయమని కాని, ఇట్టి స్థలమని కాని, ఇట్టి ప్రదేశమని గాని నిర్ణయము లేదు. 

ఎట్టి సమయ మందైనను ఏ కాలము, ఏ దైవ మందై నను మనస్సు సుప్రసన్నముగా నుండునో అదే సమయంబున ఆయా స్థలము లందే తన హృదయమున పరమ శివుని ధ్యానించి నట్లైతే అట్టి నిర్మల మనస్సు గల మానవునకు సాక్షాత్తుగా కైలాస ప్రాప్తి కలుగుటలో సందేహము లేదు. అనగా సంశయింప నవసరము లేదు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 8 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
*🌻 Bhakti Niroopana Yoga - 8 🌻*

27. 28. Chandanam which is prepared from the wood of Bilwa tree (called as Sri Gandham), flowers of the forest, and fruits if offered to mahadeva, he would become exceedingly pleased, since these items are his favorite items. Such kind of service to the Lord is without a second in the three worlds.

29. 30. The way lord Shiva likes the flowers and fruits born in the forest compared to the so called better flowers of the villages, similarly, if someone neglects the easily pleasing Lord Shiva and worships other deities, it's as like as desiring for a mirage water by leaving the holy ganges beside.

31. 32. Fact is, a person who has done sins in numerous births and has accumulated a lot of vices such sinners, knowledge less people would not take interest and wouldn't like this 'Shaiva Tatwam'. 

To do service to Lord Shiva, there is nothing like right time or right place. Whatever time, whichever season, whichever place it might be, a person who meditates on Shiva within his own heart with happiness such a pure hearted person would achieve Salvation in Lord Shiva's abode Kailasha. And there is no doubt in that!!.

Continues.. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 13 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం - 1 🌻*

వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వావీ వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు.

ఇది అక్షర సత్యం అయింది. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చినవారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి.

రాజులు తమ ధర్మాన్ని మరిచిపోతారు. వారు విలాసాలు, విందుల్లో మునిగితేలుతూ ఉంటారు. ధర్మభ్రష్టులవుతారు.

ఇక్కడ రాజులు అంటే, పాలకులు అని అర్ధం. వారు రాజులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులు కావచ్చు. అనేక రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, దేశాల ప్రధాన మంత్రులు కూడా అవినీతి కుంభకోణాలలో చిక్కుకోవడం పత్రికల ద్వారా ప్రజలకు వెల్లడి అవుతోంది. పార్టీ ఏదైనా ప్రజా ప్రతినిధులు అత్యధిక శాతం అవినీతికి పాల్పడుతున్నారు.

శాంతమూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుంది. వివిధ వర్ణాలవారు తమ ఆచారాలను వదిలి ఇతరుల ఆచారాలను అనుసరించి నాశనమవుతారు.

నిజమే కదా.. మానసిక వత్తిడి విపరీతంగా పెరిగిన దరిమిలా శాంతమూర్తులు కూడా ఆవేశానికి, ఆగ్రహానికి లోనవడం మనం చూస్తూనే ఉన్నాం.

పైర్లు సరిగా పండవు. పాడి పశువులు పాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల కరువు భయంకరంగా పెరుగుతుంది..

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 సౌందర్య లహరి - 50 / Soundarya Lahari - 50 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

50 వ శ్లోకము

*🌴. మశూచికం నివారణకు, సృజనాత్మకత, కళల నైపుణ్యం 🌴*

శ్లో: 50. కవీనాం సందర్భస్త బక మకరం దైక రసికం 
కటాక్షవ్యా క్షేప భ్రమర కలభౌ కర్ణయుగలమ్l 
అముంచన్తౌ దృష్ట్యా తవ నవరసాస్వాదతరళౌ 
అసూయాసంసర్గా దళికనయనం కించి దరుణమ్ll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా ! కవీంద్రుల రచనల యందున్న రచనల యొక్క పూదేనెను ఆస్వాదించుటకు ఇష్టము కలిగి, కర్ణములను విడువక నవ రసాస్వాదమునందు ఆసక్తి కలిగి ఉన్న గండు తుమ్మెదల జంటను చూచి నీ ఫాల నేత్రము అసూయతో ఎర్రబడినది కదా! 
  
🌻. జప విధానం - నైవేద్యం :--

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 10 రోజులు జపం చేస్తూ, చక్కెర, చెరకును నివేదించినచో మశూచికము, ఇతర రోగముల నివారణ జరుగును మరియు సృజనాత్మకత, కళల నైపుణ్యం పెరుగును అని చెప్పబడింది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 SOUNDARYA LAHARI - 50 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 50 

*🌴 Seeing afar and Curing of Small-Pox - Creative skills 🌴*

50. Kavinam sandharbha-sthabaka-makarandh'aika-rasikam Kataksha-vyakshepa-bhramara-kalabhau-karna-yugalam; Amunchantau drshtva tava nava-ras'asvada tharalau- Asuya-samsargadhalika-nayanam kinchid arunam. 
 
🌻 Translation :
Thine two long eyes, oh goddess, are like the two little bees which want to drink the honey, and extend to the ends, with a pretense of side glances, to thine two ears, which are bent upon drinking the honey, from the flower bunch of poems presented by your devotees, and make thine third eye light purple, with jealousy and envy.

Chanting procedure and Nivedyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 5 days, offering sugar and sugarcane as prasadam, it is believed that they will be cured from pox, other diseases and increase of Creative skills. 
 
🌻 BENEFICIAL RESULTS: 
Prevetion and quick cure of small pox and dissentry (consuming of water or butter, on which yantra is drawn is prescribed). 
 
🌻 Literal Results: 
Poetic instincts enhanced. Creative skills.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 349 / Bhagavad-Gita - 349 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 30 🌴*

30. ఆపి అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మన్తవ్య: సమ్యగ్వ్యవసితో హి స: ||

🌷. తాత్పర్యం :
మిక్కిలి హేయమైన కార్యము నినరించినప్పటికిని మనుజుడు భక్తియుతసేవలో నియుక్తుడైయున్నచో, తన సంకల్పమున స్థిరనిశ్చయుడై యున్నందున అతనిని సాధువుగనే పరిగణింపవలెను.

🌷. భాష్యము : 
ఈ శ్లోకమునందలి భావగర్భితమైన “సుదురాచార” అను పదమును మనము సరిగా అర్థము చేసికొనవలెను. జీవుడు బద్ధస్థితిలో నున్నప్పుడు బద్ధకర్మలు మరియు సహజస్థితికి అనుగుణమైన కర్మలనెడి రెండు విధములైన కర్మలను కలిగియుండును. 

దేహమును రక్షించుకొనుటకు లేదా సంఘము మరియు దేశమునకు సంబంధించిన నియమనిబంధనలను పాటించుటకు బద్ధజీవనస్థితి యందు నిక్కముగా వివిధ కర్మములు కలవు. అవియే బద్ధజీవన కర్మలనబడును. అవి భక్తులకు సైతము తప్పవు. 

కాని తన ఆధ్యాత్మికస్వభావమును సంపూర్ణముగా నెరిగి కృష్ణభక్తిభావన (భక్తియోగము) యందు నియుక్తుడైన జీవుడు ఆ బద్ధకర్మలతో పాటు ఆధ్యాత్మికములనబడు కర్మలను సైతము కలిగియుండును. అట్టి కర్మలు అతని సహజస్థితి యందు ఒనరింపబడుచు భక్తియోగకర్మలుగా పిలువబడును. 

కనుక బద్ధస్థితిలో నున్నప్పుడు భక్తికర్మలు మరియు దేహపరమైన బద్ధకర్మలు రెండును సమానాంతరములుగా సాగుచున్నను, కొన్నిమార్లు అవి ఒకదానికొకటి విరుద్ధములుగా తయారగును. 

ఈ విషయమున భక్తుడు సాధ్యమైనంతవరకు అత్యంత జాగరూకుడై తన భక్తికి మరియు సహజస్థితికి ఆటంకము కలిగించు దేనిని చేయకుండును. కృష్ణభక్తిభావనా అనుభవపు పురోగతి పైననే తన కర్మల పూర్ణత్వము ఆధారపడియుండునని అతడు ఎరిగియుండును. 

అయినను కొన్నిమార్లు అట్టివాడు సంఘదృష్ట్యా లేదా చట్టము దృష్ట్యా అత్యంత హేయముగా భావింపబడు కార్యమును ఒనరించినట్లుగా కనిపించవచ్చును. కాని అట్టి తాత్కాలికమగుపతనము అతనిని ఏ విధముగను అనర్హుని చేయజాలదు. 

అత్యంత శ్రద్ధతో భక్తియుక్తసేవ యందు నిలిచియున్నవాడు ఒకవేళ పతనము నొందినను హృదయస్థుడైన పరమాత్ముడు అతనిని పవిత్రుని చేసి ఆ పాపమును క్షమించునని శ్రీమద్భాగవతము తెలియజేయుచున్నది. అనగా భౌతికసంపర్కము అత్యంత బలమైనదగుటచే భగవత్సేవ యందు పూర్ణముగా నియుక్తుడైన యోగి సైతము కొన్నిమార్లు మాయకు గురియగును. 

కాని కృష్ణభక్తి యనునది మరింత బలమైనదగుటచే భక్తుని అట్టి తాత్కాలిక పతనమును వెంటనే సరిదిద్దగలదు. కనుక భక్తియోగము సదా జయమునే కలిగించును. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 349 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 30 🌴*

30. api cet su-durācāro
bhajate mām ananya-bhāk
sādhur eva sa mantavyaḥ
samyag vyavasito hi saḥ

🌷 Translation : 
Even if one commits the most abominable action, if he is engaged in devotional service he is to be considered saintly because he is properly situated in his determination.

🌹 Purport :
The word su-durācāraḥ used in this verse is very significant, and we should understand it properly. When a living entity is conditioned, he has two kinds of activities: one is conditional, and the other is constitutional. 

As for protecting the body or abiding by the rules of society and state, certainly there are different activities, even for the devotees, in connection with the conditional life, and such activities are called conditional. 

Besides these, the living entity who is fully conscious of his spiritual nature and is engaged in Kṛṣṇa consciousness, or the devotional service of the Lord, has activities which are called transcendental. Such activities are performed in his constitutional position, and they are technically called devotional service. 

Now, in the conditioned state, sometimes devotional service and the conditional service in relation to the body will parallel one another. But then again, sometimes these activities become opposed to one another. 

As far as possible, a devotee is very cautious so that he does not do anything that could disrupt his wholesome condition. He knows that perfection in his activities depends on his progressive realization of Kṛṣṇa consciousness. 

Sometimes, however, it may be seen that a person in Kṛṣṇa consciousness commits some act which may be taken as most abominable socially or politically. But such a temporary falldown does not disqualify him.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment