*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
ప్రధమాధ్యాయము
*🌻. భక్తి నిరూపణ యోగము - 8 🌻*
చందనం బిల్వ కాష్ట స్య - పుష్పాణి వన జాన్యపి. 27
ఫలాని తాదృశాన్యేవ - యస్య ప్రీతి కారాణి వై ,
దుష్కరం తస్య సేవాయాం - కిమస్తి భువన త్రయే 28
బిల్వ వృక్షము బెరడుతో (చెక్కతో ) నరగ దీసిన శ్రీ గంధము, అడవిలోని పువ్వులు, ఫలములు మున్నగునవి యైనను భక్తితో సమర్పించినను మహాదేవుడు సంతసించును.
వీటి యందె అతనికి ఎక్కువ మక్కువ గూడా. ఇటులుండగా నా పరమాత్ముని యుపాసించుటలో
నెవరికి దానే కష్టమగును.
వన్యేషు యాదృశీ ప్రీతి - ర్వర్తతే పరమే శితు : ,
ఉత్తమేష్వపి నాస్త్యేవ - గ్రామ జేష్వ పితాదృశీ 29
తం త్యక్త్యా తాదృశం - దేవం యస్సే వే తాన్య దేవతామ్,
సమి భాగీ రధీం త్యక్త్యా - కాంక్షతే మృగ తృష్టికామ్ 30
శివునకు అడవియందే వికసించే పుష్పములందును, పండిన ఫలము లందును, దళాదు లందును ఎంత మక్కువో అంతటి ప్రీతి గ్రామ మందుండి శ్రేష్టము లె అయినప్పటికి ని వాని యందు ఆసక్తి యుండదు.
ఆ విధముగా సులభముగా ప్రసన్నుడయ్యె భోలా శంకరుని వీడి ఇతరత్ర నుండి దేవుళ్ళను బూజించినచో ప్రక్కనే యున్న గంగానది ని వీడి ఎండ మావులను చూచి యాచించి మోసపోయిన వాడే యగును. అలంకార ప్రియో విష్ణు: అభిషేక ప్రియాః శివః సులభ సాధ్యుడు శివుడు.
కింతు యస్యాస్తి దురితం -కోటి జన్మ సు సంచితమ్,
తస్య ప్రకాశతే నాయం - త్వర్దో మోహాంధ చేతసః 31
న కాల నియమో యత్ర- న దేశస్య స్థల స్యచ,
యత్రాస్య రమతే చిత్తం - తత్ర ధ్యానేన కేవలమ్ 32
స్వాత్మ త్వేన శివస్యాసౌ - శివ సాయుజ్య మాప్నుయాత్ .
అసలు విషయమేమనగా - ఎవడైతే అనేక జన్మముల నుండి పాప కర్మముల చేసి మూట గట్టుకుని యున్నాడో అట్టి పపిష్టునకు జ్ఞాన శూన్యునికి, ఈ శైవ తత్వము నచ్చదు.
ఇట్టి సులభైక ఉపాస్యుడైన శివుని సేవించుటకు ఇట్టి సమయమని కాని, ఇట్టి స్థలమని కాని, ఇట్టి ప్రదేశమని గాని నిర్ణయము లేదు.
ఎట్టి సమయ మందైనను ఏ కాలము, ఏ దైవ మందై నను మనస్సు సుప్రసన్నముగా నుండునో అదే సమయంబున ఆయా స్థలము లందే తన హృదయమున పరమ శివుని ధ్యానించి నట్లైతే అట్టి నిర్మల మనస్సు గల మానవునకు సాక్షాత్తుగా కైలాస ప్రాప్తి కలుగుటలో సందేహము లేదు. అనగా సంశయింప నవసరము లేదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 8 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 01:
*🌻 Bhakti Niroopana Yoga - 8 🌻*
27. 28. Chandanam which is prepared from the wood of Bilwa tree (called as Sri Gandham), flowers of the forest, and fruits if offered to mahadeva, he would become exceedingly pleased, since these items are his favorite items. Such kind of service to the Lord is without a second in the three worlds.
29. 30. The way lord Shiva likes the flowers and fruits born in the forest compared to the so called better flowers of the villages, similarly, if someone neglects the easily pleasing Lord Shiva and worships other deities, it's as like as desiring for a mirage water by leaving the holy ganges beside.
31. 32. Fact is, a person who has done sins in numerous births and has accumulated a lot of vices such sinners, knowledge less people would not take interest and wouldn't like this 'Shaiva Tatwam'.
To do service to Lord Shiva, there is nothing like right time or right place. Whatever time, whichever season, whichever place it might be, a person who meditates on Shiva within his own heart with happiness such a pure hearted person would achieve Salvation in Lord Shiva's abode Kailasha. And there is no doubt in that!!.
Continues..
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment