1) 🌹 శ్రీమద్భగవద్గీత - 593 / Bhagavad-Gita - 593 - 18-4 🌹
2) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 45🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 374 375 / Vishnu Sahasranama Contemplation - 374, 375🌹
4) 🌹 Daily Wisdom - 101🌹
5) 🌹. వివేక చూడామణి - 64🌹
6) 🌹Viveka Chudamani - 64🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 75🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 7🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 255 / Sri Lalita Chaitanya Vijnanam - 255 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 593 / Bhagavad-Gita - 593 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 04 🌴*
04. నిశ్చయం శ్రుణు మే తత్ర త్యాగే భరతసత్తమ |
త్యాగో హి పరుషవ్యాఘ్ర త్రివిధ: సమ్ప్రకీర్తిత:
🌷. తాత్పర్యం :
ఓ భరతశ్రేష్టా! పురుషవ్యాఘ్రా! త్యాగమును గూర్చిన నా నిర్ణయమును ఇప్పుడు ఆలకింపుము.శాస్త్రములందు అట్టి త్యాగము మూడువిధములని తెలుపబడినది.
🌷. భాష్యము :
త్యాగమును గూర్చి పలు అభిప్రాయములున్నను శ్రీకృష్ణభగవానుడిచ్చట దాని యెడ తన నిర్ణయమును తెలియజేయనున్నాడు. దానినే తుది నిర్ణయముగా భావింపవలెను. సత్యమెరిగినచో వేదములనునవి భగవానుడు ఒసగిన వివిధ నియమములే. అట్టి భగవానుడే ప్రత్యక్షముగా నిలిచియుండి పలుకుచున్నందున అతని వాక్యమును తుది నిర్ణయముగా స్వీకరింపవలెను.
ఏ గుణమునందు నిర్వహింపబడినదనెడి విషయము ననుసరించి త్యాగమును గుర్తింపవలెనని శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 593 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 04 🌴*
04. niścayaṁ śṛṇu me tatra tyāge bharata-sattama
tyāgo hi puruṣa-vyāghra tri-vidhaḥ samprakīrtitaḥ
🌷 Translation :
O best of the Bhāratas, now hear My judgment about renunciation. O tiger among men, renunciation is declared in the scriptures to be of three kinds.
🌹 Purport :
Although there are differences of opinion about renunciation, here the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, gives His judgment, which should be taken as final. After all, the Vedas are different laws given by the Lord. Here the Lord is personally present, and His word should be taken as final.
The Lord says that the process of renunciation should be considered in terms of the modes of material nature in which it is performed.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్గీత యథాతథం - 1 - 045 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 1, శ్లోకం 45
45
యది మామప్రతీకారమ్
అశస్త్రం శస్త్రపాణయ: |
ధార్తరాష్ట్రారణ హన్యు:
తన్మే క్షేమతరం భవేత్ ||
తాత్పర్యము : నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయనివాడను అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమునందు వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు.
భాష్యము : క్షత్రియ యుద్ధ నియమాల ప్రకారము శత్రువు చేతిలో ఆయుధాలు లేకపోయినా లేదా యుద్ధము చేయుటకు సిద్ధముగా లేకపోయినా అట్టి యోధుడ్ని సంహరింపరాదు. అయితే అర్జునుడు ఎంతకు సిద్ధమైనాడంటే ”వారు నిరాయుధుడనైన నన్ను సంహరించినా సరే గాని నేను మాత్రము యుద్ధము చేయను” అనే నిర్ణయానికి వచ్చెను. ఇవన్నీ అర్జునుని యొక్క భక్తిని తద్వారా అతని కోమల హృదయాన్ని ప్రతిబింపచేయుచున్నవి.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 374, 375 / Vishnu Sahasranama Contemplation - 374, 375 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 374. క్షోభణః, क्षोभणः, Kṣobhaṇaḥ 🌻*
*ఓం అమితాశనాయ నమః | ॐ अमिताशनाय नमः | OM Amitāśanāya namaḥ*
సర్గకాలే ప్రకృతించ పురుషంచ ప్రవిశ్యయః ।
క్షోభయామాస స హరిరితి క్షోభణ ఉచ్యతే ॥
ప్రకృతిం పురుషం చైవ ప్రవిశ్యాత్మేచ్ఛయా హరిః ।
ప్రవిశ్య క్షోభయామాస సర్గకాలే వ్యయావ్యయౌ ॥
ఇతి విష్ణుపురాణే శ్రీ పరాశర సమీరణాత్ ॥
జగదుద్పత్తి జరిగిన సమయమున మాయని/ప్రకృతినీ, జీవుని/పురుషునీ కూడ ప్రవేశించి క్షోభింప లేదా స్పందింపజేసెను.
:: విష్ణు పురాణము - 1:2 ::
ప్రకృతిం పురుషం చైవ ప్రవిశ్యాత్మేచ్ఛయా హరిః ।
ప్రవిశ్య క్షోభయామాస సర్గకాలే వ్యయావ్యయౌ ॥ 29 ॥
సృష్టికాలమునందు శ్రీహరి తన ఇచ్ఛతోనే ప్రకృతిని పురుషుని కూడ ప్రవేశించి వికారముకల తత్త్వమగు ప్రకృతిని నిర్వికార తత్త్వము అగు పురుషుని కూడ క్షోభింపజేసెను...అను విష్ణు పురాణ వచనము ఇచ్చట ప్రమాణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 374🌹*
📚. Prasad Bharadwaj
*🌻 374. Kṣobhaṇaḥ 🌻*
*OM Amitāśanāya namaḥ*
सर्गकाले प्रकृतिंच पुरुषंच प्रविश्ययः ।
क्षोभयामास स हरिरिति क्षोभण उच्यते ॥
प्रकृतिं पुरुषं चैव प्रविश्यात्मेच्छया हरिः ।
प्रविश्य क्षोभयामास सर्गकाले व्ययाव्ययौ ॥
इति विष्णुपुराणे श्री पराशर समीरणात् ॥
Sargakāle prakr̥tiṃca puruṣaṃca praviśyayaḥ,
Kṣobhayāmāsa sa haririti kṣobhaṇa ucyate.
Prakr̥tiṃ puruṣaṃ caiva praviśyātmecchayā hariḥ,
Praviśya kṣobhayāmāsa sargakāle vyayāvyayau.
Iti viṣṇupurāṇe śrī parāśara samīraṇāt.
At the time of creation, entering into Prakr̥ti and Puruṣa, He agitated them. So, He is Kṣobhaṇaḥ.
Viṣṇu purāṇamu - 1:2
Prakr̥tiṃ puruṣaṃ caiva praviśyātmecchayā hariḥ,
Praviśya kṣobhayāmāsa sargakāle vyayāvyayau. 29.
:: विष्णु पुराण - १:२ ::
प्रकृतिं पुरुषं चैव प्रविश्यात्मेच्छया हरिः ।
प्रविश्य क्षोभयामास सर्गकाले व्ययाव्ययौ ॥ २९ ॥
Bahavān Hari, entering into Prakr̥ti and Puruṣa at the time of creation, agitated the perishable (Prakr̥ti) and the imperishable (Puruṣa).
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥
ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥
Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 375 / Vishnu Sahasranama Contemplation - 375🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 375. దేవః, देवः, Devaḥ 🌻*
*ఓం దేవాయ నమః | ॐ देवाय नमः | OM Devāya namaḥ*
యతో దీవ్యతి సర్గాద్యా క్రీడయా క్రీడతే హతః ।
విజిగీషతే సురాదీన్ భూతేషు వ్యవహారతః ॥
ఆత్మనా ద్యోతతే యస్మాత్ స్తుత్యైశ్చ స్తూయతే యతః ।
సర్వత్ర గచ్ఛత్యథవేత్యతో దేవ ఇతీర్యతే ॥
ఏకో దేవ ఇతి శ్రుత్యా చాచ్యుతః స్తూయతే హరిః ॥
దివ్ అనే ధాతువు నుండి 'దేవః' అను శబ్దము ఏర్పడుచున్నది. ఆ ధాతువునకు కల వివిదార్థములను అనుసరించి 'సృష్టిమొదలగు వ్యాపారములతో క్రీడించును', 'అసురులు మొదలగువారిని జయించగోరుచుండును', 'సర్వభూతములయందును అంతర్యామిగా వ్యవహరించుచుండును', 'సర్వ భూతములయందును ఆత్మతత్త్వమై ప్రకాశించుచుండును', ' స్తుత్యులగువారిచే కూడ స్తుతించబడుచుండును', 'అంతటను వ్యాపించు ఉండును' కావున ఆ విష్ణుని దేవః అనదగియుండును. 'ఏకో దేవః' (శ్వేతా 6-11) 'దేవ శబ్దముచే చెప్పబడదగిన పరమాత్ముడు ఒక్కడే' అను శ్వేతాశ్వతరమంత్రవచనము ఇచ్చట ప్రమాణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 375🌹*
📚. Prasad Bharadwaj
*🌻375. Devaḥ🌻*
*OM Devāya namaḥ*
यतो दीव्यति सर्गाद्या क्रीडया क्रीडते हतः ।
विजिगीषते सुरादीन् भूतेषु व्यवहारतः ॥
आत्मना द्योतते यस्मात् स्तुत्यैश्च स्तूयते यतः ।
सर्वत्र गच्छत्यथवेत्यतो देव इतीर्यते ॥
एको देव इति श्रुत्या चाच्युतः स्तूयते हरिः ॥
Yato dīvyati sargādyā krīḍayā krīḍate hataḥ,
Vijigīṣate surādīn bhūteṣu vyavahārataḥ.
Ātmanā dyotate yasmāt stutyaiśca stūyate yataḥ,
Sarvatra gacchatyathavetyato deva itīryate.
Eko deva iti śrutyā cācyutaḥ stūyate hariḥ.
Devaḥ is from the root 'div/दिव्'. The root has multiple interpretations such as 'He is desires to be victorious over all asurās or evil doers', 'sports by creation', 'wishes to conquer the celestials and others', 'functions in all beings', 'shines as their ātman or soul', 'is praised by those given to praise', 'goes everywhere' etc. and hence Lord Viṣṇu is Devaḥ vide the mantra 'eko devaḥ' (Śvetā 6-11).
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥
ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥
Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 101 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 10. Yoga has been Defined as Union with Reality 🌻*
Yoga has been defined as union with Reality in its different degrees of manifestation, both within and without. Thus, by the fulfilment of one’s functions in life through the laws and disciplines of varna and ashrama, one moves gradually from the outer to the inner—from the external forms to the deeper meaning of things—and rises upward, from the gross to the subtle, and from the subtle to the ultimate essence of existence.
The concepts of the four purusharthas, dharma, artha, kama and moksha; of the four varnas, the classes of society wielding spiritual, political, economic and manual power; of the four ashramas, the stages of study and discipline, performance of duty individually as well as socially, withdrawal from attachment to perishable things, and communion with the Supreme Reality; these sum up the total structure of life in its integrality, excluding nothing, and including everything in its most comprehensive gamut. The stages are the orders of life necessitated by the progressive emphasis which it receives in outward evolution.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 64 / Viveka Chudamani - 64🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 19. బ్రహ్మము - 4 🍀*
229. ఆ జాడి యొక్క అసలు పదార్థమును మట్టి కంటే వేరుగా ఎవరు వర్ణించలేరు. అది మాయ వలన ఊహించబడినది మాత్రమే. ఆ పాత్ర యొక్క నిజమేమిటంటే, అది మట్టితోనే చేయబడినది.
230. అదే విధముగా విశ్వమంతా బ్రహ్మము యొక్క కారణము.నిజానికి అది బ్రహ్మమే కాని వేరు కాదు. ఇదంతా బ్రహ్మము యొక్క సారమే. ఎవరైన అది ప్రపంచమేనని పలికినపుడు అది మాయ వలన పలికిన పిచ్చి మాట.
231. అధర్వణ వేధములో విశ్వమంతా కేవలము బ్రహ్మమేనని చెప్పబడినది. అందువలన ఈ విశ్వమంతా బ్రహ్మము కాక వేరు కాదు. దాని నుంచి వేరు పదార్థము ఈ విశ్వములో లేదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 64 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 19. Brahman - 4 🌻*
229. None can demonstrate that the essence of a jar is something other than the clay (of which it is made). Hence the jar is merely imagined (as separate) through delusion, and the component clay alone is the abiding reality in respect of it.
230. Similarly, the whole universe, being the effect of the real Brahman, is in reality nothing but Brahman. Its essence is That, and it does not exist apart from It. He who says it does is still under delusion – he babbles like one asleep.
231. This universe is verily Brahman – such is the august pronouncement of the Atharva Veda. Therefore this universe is nothing but Brahman, for that which is superimposed (on something) has no separate existence from its substratum.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 75 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 56. కొన్ని ప్రశ్నలు 🌻*
మిమ్ములను సూటిగ కొన్ని ప్రశ్నలడుగుదును. సమాధానము మీకు మీరే చెప్పుకొనుడు. నాకు చెప్పనవసరము లేదు. నా ప్రశ్నలు సాధకులకు మాత్రమే.
1. నీ యందు ధర్మానుష్ఠాన బుద్ధి యున్నదా?
2. అవసర సమయమునందు కూడ అధర్మము ప్రోత్సహించ బడదా?
3. గురువునందు, దైవమునందు ఎప్పుడైన సందేహము వచ్చునా, రాదా?
4. నీవు పరనింద చేయుదువా? చేయవా?
5. అసత్య భాషణమునకు జంకుదువా? జంకవా?
6. సంవత్సరమున అసహనము ఎన్నిసార్లు కలుగును ?
7. మనస్సునకు స్థిరము ఏర్పడినదా? లేక చంచలత్వ మున్నదా?
8. పనులయందు శ్రద్ధ, భక్తి యున్నదా? లేక అశ్రద్ధ, నిర్లక్ష్యము
9. నీవు శరీర శ్రమకు సిద్ధమేనా?
10. నీకు దైవమన్న భయమా?
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 7 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. నువ్వు ప్రేమిస్తున్నావా? లేదా? అన్నది ముఖ్యం. 🍀*
ప్రేమ ప్రచారం చెయ్యకు. ప్రేమ గురించి వివరించకు. సమస్త అస్తిత్వాన్ని ప్రేమించు. అదొక యధార్థం. నిజానికి చెట్లు, పర్వతాలు, మనుషులు వేరు వేరు కాదు. మనం కలిసి భాగస్వామ్యం వహిస్తాం. మనం గాఢమయిన సమశృతిలో వుంటాం.
మనం ఆక్సిజన్ ని పీలుస్తాం. కార్బన్ డయాక్సైడ్ ని వదుల్తాం. చెట్లు కార్బన్‌డయాక్సైడ్ ని పీల్చి ఆక్సిజన్ ని వదుల్తాయి. అందు వల్ల చెట్లు లేకుంటే మనం లేము. మనం కలిసి వున్నాం. కలగలిసి వున్నాం. అట్లాగే ఈ అనంత విశ్వం అంతస్సంబంధం కలిగి వుంది.
కాబట్టి ప్రదర్శించకుండా ప్రేమించు. చెట్లని, నక్షత్రాల్ని, పర్వతాల్ని, జనాల్ని, జంతువుల్ని ప్రేమించు. నువ్వు ఎవర్ని ప్రేమిస్తున్నావన్నది విషయం కాదు. నువ్వు ప్రేమిస్తున్నావా? లేదా? అన్నది ముఖ్యం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 255 / Sri Lalitha Chaitanya Vijnanam - 255 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 62. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా ।
విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా ॥ 62 ॥ 🍀*
*🌻 255. 'ధర్మాధర్మ వివర్జితా'🌻*
ధర్మమును, అధర్మమును వర్ణించినది శ్రీదేవి అని అర్థము. శ్రీదేవి ధర్మమునకు, అధర్మమునకు అతీతమైన స్థితి యందున్నది. ధర్మాధర్మములు ఆమెను తాకవు. ధర్మము పుట్టినపుడు అధర్మము కూడ పుట్టును. వెలుగు పుట్టినపుడు చీకటి కూడ పుట్టును.
అట్లే జ్ఞానము పుట్టినప్పుడు అజ్ఞానము కూడ పుట్టును. కుడి ఎడమలు రెండునూ గల స్థితి సృష్టి. సృష్టియందు ధర్మాధర్మములు తప్పవు. సృష్టి కతీతమైనవారిని అవి అంటవు. సృష్టికి మూలము ఇచ్ఛ. ఇచ్ఛ లేనిదే తత్సంబంధిత జ్ఞానము లేదు. క్రియ కూడ లేదు. ఇది త్రిగుణముల కతీతమగు సహజ సమాధి స్థితి.
ఇచ్ఛలోనికి ప్రవేశించుట రెండు విధములుగ నుండును. తన కొరకు, ఇతరుల శ్రేయస్సుకొఱకు, తమకొఱకు ఇచ్ఛ లోనికి ప్రవేశించువారు అధర్మమున పడుదురు. ఇతరుల శ్రేయస్సు కొలకు
ఇచ్ఛా ప్రవేశము గావించువారు ధర్మమున నిలతురు. శ్రీమాత నుండి వెలువడు ఇచ్ఛాశక్తి జీవుల శ్రేయస్సు కొఱకే వ్యక్తమైనది. అట్లే జీవుల శ్రేయస్సు కొఱకే జీవించువారు శ్రీమాతవలె సహజ సమాధి యందుందురు.
ఇష్టములను పొందుటకు ధర్మము నాచరించు వారున్నారు. ఐశ్వర్యమును, గొప్పదనమును కోరి యజ్ఞయాగాది క్రతువుల నాచరించుచు నుండు వారున్నారు. వీరాచరించు ధర్మము ఇష్టమును పొందుటకు, అయిష్టమును తొలగించుకొనుటకు. ఇట్టివారు నిత్యము అయిష్టములను వర్ణించు ప్రయత్నమున నుందురు. అయిష్టమును నిర్జించుటకు నిత్య ప్రయత్నమున వీరి జీవితము పోరాటమువలె సాగును. పురాణములందు ఇంద్రుని కథలు దీనినే సూచించును.
సనకసనందనాదులు, నారదుడు, సప్త ఋషులు, ప్రజాపతులు ఇత్యాదులకు ఈ ఘర్షణ లేదు. కారణము వారు ధర్మాధర్మముల కతతీమైన చైతన్యమున నిలబడి యుందురు. వారందరికిని మిత్రులే. లోకశ్రేయస్సే వారికి ప్రధానము. జీవులందరునూ ఉద్ధరింపబడవలె నని వారి ప్రేమ భావన. తెలియనివారు తెలిసినవారిగ తీర్చిదిద్ద బడవలెను. తెలిసినవారు సంయమము చెంది సర్వమునూ సమన్వ యించుకొని సమవర్తనమున నిలువవలెను. తెలిసినవారు తెలియని వారిని దూషించిననూ, ద్వేషించిననూ తెలియని వారే అగుచున్నారు.
దూషించుట, ద్వేషించుట, హింసించుట కారణముగ తెలిసినవారు కూడ తెలియనివారితో సమానముగనే ఘర్షణ యందు పడి యుందురు. తెలియక దుస్థితి యందుండుట ఒక వంతు; తెలిసి దుస్థితి యందుండుట లోతైన దుస్థితి. ధర్మా ధర్మములచే విడివడుటకు యోగవిద్య ఒక్కటియే మార్గము. ఈ విద్యయే సమభావమున నిలుపును. సమదర్శనము నందించును. సమవర్తనము కలిగించును. యోగేశ్వరి అయిన శ్రీదేవి అట్టి సమదర్శనము కలది. ఆమెకు అందరూ తన సంతానమే. ధృతరాష్ట్రుని దూషించిన సనత్సుజాతునకు- ధృతరాష్ట్రునకు జ్ఞానము బోధింపుమని ఆదేశించి ఆతనిని సరిదిద్దినది. ఇట్టి విశేష ధర్మమే ఈశావాస్య ఉపనిషత్తు బోధించు చున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 255 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Dharmādharma-vivarjitā धर्माधर्म-विवर्जिता (255) 🌻*
She is above dharma and a-dharma. Dharma is the result of good acts and a-dharma arises out of evil acts. Accrual of sins is the result of adharma. It is argued whether an action is dharma or adharma depends upon the type of job one undertakes. Generally, dharma is what is preached by scriptures. It may also be argued that dharma and adharma are the cause arising out of the three guṇa-s. She is beyond guṇa-s; hence, these do not apply to Her.
There is another interpretation for dharma, religious abstraction, causing bondage. Opposite to bondage is liberation. Bondage and liberation are only for souls and not for the Brahman, as Brahman is the embodiment of absolute purity. Here, Her Brahman form is referred. The ultimate Reality is the situation, where there is no bondage and desire. Desire to attain liberation is also bondage. If one has absolute faith in Her, he should not even aspire for anything, including liberation. She knows what to give and when.
There is a difference between mukti (final liberation) and mokṣā. Liberation means that a soul will have no more re-births. But, mokṣā refers to a soul going to Heaven for sojourn to be reborn again. It is the transmigration of the soul.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment