శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 255 / Sri Lalitha Chaitanya Vijnanam - 255
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 255 / Sri Lalitha Chaitanya Vijnanam - 255 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 62. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా ।
విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా ॥ 62 ॥ 🍀
🌻 255. 'ధర్మాధర్మ వివర్జితా'🌻
ధర్మమును, అధర్మమును వర్ణించినది శ్రీదేవి అని అర్థము. శ్రీదేవి ధర్మమునకు, అధర్మమునకు అతీతమైన స్థితి యందున్నది. ధర్మాధర్మములు ఆమెను తాకవు. ధర్మము పుట్టినపుడు అధర్మము కూడ పుట్టును. వెలుగు పుట్టినపుడు చీకటి కూడ పుట్టును.
అట్లే జ్ఞానము పుట్టినప్పుడు అజ్ఞానము కూడ పుట్టును. కుడి ఎడమలు రెండునూ గల స్థితి సృష్టి. సృష్టియందు ధర్మాధర్మములు తప్పవు. సృష్టి కతీతమైనవారిని అవి అంటవు. సృష్టికి మూలము ఇచ్ఛ. ఇచ్ఛ లేనిదే తత్సంబంధిత జ్ఞానము లేదు. క్రియ కూడ లేదు. ఇది త్రిగుణముల కతీతమగు సహజ సమాధి స్థితి.
ఇచ్ఛలోనికి ప్రవేశించుట రెండు విధములుగ నుండును. తన కొరకు, ఇతరుల శ్రేయస్సుకొఱకు, తమకొఱకు ఇచ్ఛ లోనికి ప్రవేశించువారు అధర్మమున పడుదురు. ఇతరుల శ్రేయస్సు కొలకు
ఇచ్ఛా ప్రవేశము గావించువారు ధర్మమున నిలతురు. శ్రీమాత నుండి వెలువడు ఇచ్ఛాశక్తి జీవుల శ్రేయస్సు కొఱకే వ్యక్తమైనది. అట్లే జీవుల శ్రేయస్సు కొఱకే జీవించువారు శ్రీమాతవలె సహజ సమాధి యందుందురు.
ఇష్టములను పొందుటకు ధర్మము నాచరించు వారున్నారు. ఐశ్వర్యమును, గొప్పదనమును కోరి యజ్ఞయాగాది క్రతువుల నాచరించుచు నుండు వారున్నారు. వీరాచరించు ధర్మము ఇష్టమును పొందుటకు, అయిష్టమును తొలగించుకొనుటకు. ఇట్టివారు నిత్యము అయిష్టములను వర్ణించు ప్రయత్నమున నుందురు. అయిష్టమును నిర్జించుటకు నిత్య ప్రయత్నమున వీరి జీవితము పోరాటమువలె సాగును. పురాణములందు ఇంద్రుని కథలు దీనినే సూచించును.
సనకసనందనాదులు, నారదుడు, సప్త ఋషులు, ప్రజాపతులు ఇత్యాదులకు ఈ ఘర్షణ లేదు. కారణము వారు ధర్మాధర్మముల కతతీమైన చైతన్యమున నిలబడి యుందురు. వారందరికిని మిత్రులే. లోకశ్రేయస్సే వారికి ప్రధానము. జీవులందరునూ ఉద్ధరింపబడవలె నని వారి ప్రేమ భావన. తెలియనివారు తెలిసినవారిగ తీర్చిదిద్ద బడవలెను. తెలిసినవారు సంయమము చెంది సర్వమునూ సమన్వ యించుకొని సమవర్తనమున నిలువవలెను. తెలిసినవారు తెలియని వారిని దూషించిననూ, ద్వేషించిననూ తెలియని వారే అగుచున్నారు.
దూషించుట, ద్వేషించుట, హింసించుట కారణముగ తెలిసినవారు కూడ తెలియనివారితో సమానముగనే ఘర్షణ యందు పడి యుందురు. తెలియక దుస్థితి యందుండుట ఒక వంతు; తెలిసి దుస్థితి యందుండుట లోతైన దుస్థితి. ధర్మా ధర్మములచే విడివడుటకు యోగవిద్య ఒక్కటియే మార్గము. ఈ విద్యయే సమభావమున నిలుపును. సమదర్శనము నందించును. సమవర్తనము కలిగించును. యోగేశ్వరి అయిన శ్రీదేవి అట్టి సమదర్శనము కలది. ఆమెకు అందరూ తన సంతానమే. ధృతరాష్ట్రుని దూషించిన సనత్సుజాతునకు- ధృతరాష్ట్రునకు జ్ఞానము బోధింపుమని ఆదేశించి ఆతనిని సరిదిద్దినది. ఇట్టి విశేష ధర్మమే ఈశావాస్య ఉపనిషత్తు బోధించు చున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 255 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Dharmādharma-vivarjitā धर्माधर्म-विवर्जिता (255) 🌻
She is above dharma and a-dharma. Dharma is the result of good acts and a-dharma arises out of evil acts. Accrual of sins is the result of adharma. It is argued whether an action is dharma or adharma depends upon the type of job one undertakes. Generally, dharma is what is preached by scriptures. It may also be argued that dharma and adharma are the cause arising out of the three guṇa-s. She is beyond guṇa-s; hence, these do not apply to Her.
There is another interpretation for dharma, religious abstraction, causing bondage. Opposite to bondage is liberation. Bondage and liberation are only for souls and not for the Brahman, as Brahman is the embodiment of absolute purity. Here, Her Brahman form is referred. The ultimate Reality is the situation, where there is no bondage and desire. Desire to attain liberation is also bondage. If one has absolute faith in Her, he should not even aspire for anything, including liberation. She knows what to give and when.
There is a difference between mukti (final liberation) and mokṣā. Liberation means that a soul will have no more re-births. But, mokṣā refers to a soul going to Heaven for sojourn to be reborn again. It is the transmigration of the soul.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
21 Apr 21
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment