🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 84 / Agni Maha Purana - 84 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 29
🌻. సర్వతోభద్ర మండల విధి - 1 🌻
నారుదుడు పలికెను : సాధకుడు దేవాలయాదులలో మంత్రసాధన చేయవలెను. తూర్పు గృహమునందు శుద్ధమైన భూమిపై, మండలమునందు, ప్రభు వైన హరిని స్థాపింపవలెను. చతురశ్రముగ చేసిన క్షేత్రము మీద మండలాదులను వ్రాయవలెను. రెండు వందల ఏబదియారు(256) కోష్ఠములలో సర్వతోభద్ర మండలమును గీయవలెను. ముప్పదియారు కోణములతో పద్మము గీయవలెను. పీఠము పంక్తికి వెలుపల ఉండవలెను. దానినుండి రెండింటిచేత వీథియు, రెండింటిచే దిక్కులలో ద్వారములును నిర్మించవలెను.
వెనుక చెప్పన పద్మక్షేత్రమును వర్తులముగా త్రిప్పి, పద్మార్ధమునందు ద్వాదశభాగము బైట త్రిప్పి, మిగిలిన క్షేత్రమును నాలుగుగా విభజించి, వర్తులముగా చేయవలెను.
మొదటిది కర్ణకయొక్క క్షేత్రము. రెండవది కేసరముల క్షేత్రము. మూడవది దలసంధుల క్షేత్రము. నాల్గవది దలాగ్రముల క్షేత్రము.
కోణస్థానములనుండి, కోణములకు ఎదురుగా ఉన్న మధ్యభాగము వరకును దారము లాగి, కేసరముల అగ్రములందుంచి దలముల సంధులను గుర్తింపవలెను. పిమ్మట దారమును క్రిందికి జార్చి, ఎనిమిది దలముల పద్మమును గీయవలెను. దలముల సంధుల మధ్యమునందు ఎంత ఎడ ముండునో అంత ఎడమునందు అగ్రభాగమున, దలాగ్రములను గీయవలెను.
వాటి మధ్మమానమును వాటి పార్శ్వమునందుంచి బాహ్యక్రమమున ఒక్కొక్క దలముపై రెండేసి కేసరములు గీయవలెను. ఇది పద్మయొక్క సామన్యలక్షణము. ఇపుడు ద్వాదశ కమల లక్షణము చెప్పబడు చున్నది. కర్ణిక యొక్క అర్ధమానమున తూర్పదిక్కు వైపు దార ముంచి క్రమముగా అన్ని వైపుల త్రిప్పవలెను. దాని పార్శ్వమునందు చేసిన భ్రమణముచే ఆరు కుండలుల చిహ్నములు, పండ్రెండు మత్స్యముల చిహ్నములు ఏర్పడును. వీటిచే ద్వాదశ దళ కమలమేర్పడును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 84 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 29
🌻 Mode of worshipping Hari in the figure called Sarvatobhadra - 1 🌻
Nārada said:
1. The aspirant has to accomplish the mystic syllable in the temple of the deity after having worshipped the Lord Hari in a circular figure in a purified ground.
2. One has to draw circles etc. in a square piece of ground, the Sarvatobhadra[1] is drawn in the compartments of rasa, bāṇa and akṣi.
3. A lotus seat containing thirty-six apartments should be outside in a row. Among these two (squares are set apart) for the path-way and two for the doors in the quarters.
4. A lotus figure is drawn in front outside and a circle is drawn around it. Half of the lotus is divided into twelve compartments.
5. Having thus divided it one should draw four circles, one around the other. The first one is that of the pericarp and the second, that of the filaments.
6-7. The third (is) that of the joints of the petals and the fourth, that of the tips of the petals. The joints of the petals are marked by stretching the threads from the angular points upto the middle of the side facing the angle and placing them on the tips of the filaments. Then the threads are made to lie (fall) and then an eight-petalled lotus is drawn.
8. Having allowed a measure (equal to) the space between the joints of the petals, the tops of the petals are drawn in front of it and afterwards.
9. Having allowed in the middle a measure of space (equal to that) of the interstices between the petals, two filaments are drawn in between every two petals.
10. This is the ordinary lotus circle said to be of twelve petals. Circles are drawn in order in the east of the measure of half the pericarp.
11. By this drawing there will be six circles on its side. In this way there will be twelve fish and twelve petals.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
26 Jul 2022
No comments:
Post a Comment