శ్రీ శివ మహా పురాణము - 600 / Sri Siva Maha Purana - 600


🌹 . శ్రీ శివ మహా పురాణము - 600 / Sri Siva Maha Purana - 600 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 05 🌴

🌻. కుమారాభిషేకము - 2 🌻

అపుడు దేవతా గణములు, ఋషులు, సిద్ధులు, చారణులు అందరు విష్ణువుతో బ్రహ్మతో గూడి కుమారుని రాకను శివునకు చెప్పిరి (12). అపుడు గొప్ప హర్షముతో గూడిన శివుడు విష్ణు బ్రహ్మలతో, దేవతలతో, ఋషులతో మరియు ఇతరులతో కలిసి కుమారుని చూచివెళ్లెను (13). అనేక శంఖములు, భేరీలు, తూర్యములు వివిధరీతులలో మ్రోగింపబడినవి. ఆనందముతో నిండిన మనస్సులు గల దేవతలు గొప్ప ఉత్పవమును చేసిరి (14).

అదే సమయములో వీరభద్రుడు మొదలగు గణములన్నియూ ఆడుతూ పాడుతూ అనేక తాళములను వాయించుచూ శివుని వెనుక నడచిరి (15). సంతసించిన మనస్సులు గలవారు, ఇతరులచే స్తుతింపబడుచున్నవారు అగు శివగణములు జయశబ్దములను, నమశ్శబ్దములను పలుకకుతూ శివుని గుణములను కీర్తిస్తూస్తుతించిరి(16).

సర్వశ్రేష్టుడు, రెల్లుగడ్డి యందు పుట్టినవాడు అగు ఆ శివపుత్రుని చూచుటకు వారు వెళ్లిరి (17). పార్వతి నగరమంతటా రాజమార్గమును పద్మరాగము మొదలగు మణులచే అలంకరింపజేసి, సుందరముగా మంగళకరముగా చేసెను (18). ఆమె భర్త, పుత్రులు గల పతివ్రతలగు స్త్రీలతో కూడియున్నదై, లక్ష్మి మొదలగు ముప్పది దేవీమూర్తులు ఎదుట నడువగా విచ్చేసెను (19).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 600🌹

✍️ J.L. SHASTRI    📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 05 🌴


🌻 Kārttikeya is crowned - 2 🌻

12. Then all the gods, sages, Siddhas, Cāraṇas, Viṣṇu and Brahmā announced his arrival.

13. Then in order to see him Śiva, along with Viṣṇu, Brahmā, the gods, sages and others went there.

14. Many conches, Bherīs and Tūryas were sounded. There was great jubilation among the delighted gods.

15. Vīrabhadra and other Gaṇas followed them with different chiming cymbols beating the time and sporting about.

16. Eulogising and being eulogised they sang songs of praise.

17. Shouting cries of “Victory” and “Obeisance” the delighted people went to see the excellent son of Śiva born in the grove of Śara plants.[1]

18. Pārvatī caused the entire outskirts of the city fully decorated with Padmarāga and other gems. The main highway was rendered beautiful and auspicious.

19. The thirty goddesses Lakṣmī and others stood in front, along with chaste ladies whose husbands and sons were alive and Pārvatī stood ahead of them.


Continues....

🌹🌹🌹🌹🌹


26 Jul 2022

No comments:

Post a Comment