🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 390 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 390-2🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।
నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀
🌻 390. 'నిర్వాణ సుఖదాయిని' - 2 🌻
అవసరమగుచో శరీరమున ప్రవేశించి కర్తవ్యములను నిర్వర్తించి మరల అశరీర స్థితిలో నుండుట నిజమగు సుఖము. అవసరమైనచో వాహన మెక్కి కదలుట, అవసరము లేనపుడు వాహనము విసర్జించి స్వేచ్ఛగా నుండుట మానవులు చేయుచునే వున్నారు. కదా! ఇట్లు శరీరము కేవలము వాహన మని తెలిసి దాని నధిష్ఠించి జీవించుట సుఖప్రదము. అట్టి సుఖము నిచ్చునది శ్రీమాత.
సంస్కృతమున వ, బ శబ్దములకు భేదము లేదు. నిర్వాణమనగ, నిర్బాణము. నిర్బాణ మనగా శరీరము లేకుండుట. బాణమనగ శరీరము. శరీరమున బంధింపబడ్డ వారందరును బాణాసురునిచే బంధింపబడ్డ అనిరుద్ధునివంటి వారు. శ్రీకృష్ణుడు బాణాసురుని చెర నుండి అనిరుద్ధుని విడిపించెను. అనగా శరీర బంధము నుండి విడిపించి మోక్షస్థితి కలిగించెను. శ్రీకృష్ణుడు శరీరము నతిక్రమించి యుండి శరీరమును వాహికగ ధర్మ సంస్థాపనము చేసిన యోగేశ్వరుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 390 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 85. Nityaklinna nirupama nirvana sukhadaeini
Nitya shodashika rupa shree kantardha sharirini ॥ 85 ॥ 🌻
🌻 390. Nirvāṇa-sukha-dāyinī निर्वाण-सुख-दायिनी -2 🌻
This stage is described by Kṛṣṇa “He who is happy within, who rejoices within, he obtains Absolute Freedom or mokṣa. Only that yogi who possesses the inner bliss, who rests on the inner foundation, who is one with inner light, becomes one with Spirit. With sins obliterated, doubts removed, senses subjugated, the sages contributing to the welfare of the mankind, attain emancipation in the Brahman”. (Bhagavad Gīta V.24 and 25)
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
26 Jul 2022
No comments:
Post a Comment