🍀 03 - SEPTEMBER - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀

 🌹🍀 03 - SEPTEMBER - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 03, సెప్టెంబర్ 2022  శనివారం, స్థిర వాసరే Saturday 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 257 / Bhagavad-Gita -257 - 6-24 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 656 / Vishnu Sahasranama Contemplation - 656 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 335 / DAILY WISDOM - 335 🌹   
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 235 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹03, September 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ధృవ అష్టమి,  Durva Ashtami 🌻*

*🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 6 🍀*

*11. విష్ణుభక్తాయ వశినే వివిధాగమవేదినే*
*విధిస్తుత్యాయ వంద్యాయ విరూపాక్షాయ తే నమః*
*12. వరిష్ఠాయ గరిష్ఠాయ వజ్రాంకుశధరాయ చ*
*వరదాభయహస్తాయ వామనాయ నమో నమః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి :  అమృత పుత్రుడా : ప్రకృతి ననుసరించి జీవించవద్దు. ఈశ్వరుని అనుసరించి జీవించు. ప్రకృతిని కూడా నీలోని ఈశ్వరుని అనుసరించి వర్తించేటట్లు అధిశాసించు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: శుక్ల-సప్తమి 12:29:47
వరకు తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: అనూరాధ 22:58:32
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: వైధృతి 16:57:20 వరకు
తదుపరి వషకుంభ
 కరణం: వణిజ 12:25:47 వరకు
వర్జ్యం: 03:39:40 - 05:12:20
మరియు 28:16:30 - 29:47:30
దుర్ముహూర్తం: 07:41:53 - 08:31:36
రాహు కాలం: 09:08:54 - 10:42:08
గుళిక కాలం: 06:02:26 - 07:35:40
యమ గండం: 13:48:37 - 15:21:51
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:39
అమృత కాలం: 12:55:40 - 14:28:20
సూర్యోదయం: 06:02:26
సూర్యాస్తమయం: 18:28:19
చంద్రోదయం: 12:06:16
చంద్రాస్తమయం: 23:28:29
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
అమృత యోగం - కార్య సిధ్ది 22:58:32
వరకు తదుపరి ముసల యోగం -
దుఃఖం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 257 / Bhagavad-Gita -  257 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం  - 24 🌴*

*24. స నిశ్చయేన యోక్తవ్యో యోగోనిర్విణ్ణ చేతసా |*
*సంకల్పప్రభవాన్ కామాంస్త్యక్త్వా సర్వాన శేషత: |*
*మనసైవేన్ద్రియగ్రామం వినియమ్యసమన్తత:*

🌷. తాత్పర్యం :
*స్థిరనిశ్చయముతో శ్రద్ధను కలిగి యోగము నభ్యసించుచు మనుజుడు ఆ మార్గము నుండు వైదొలగక యుండవలెను. మానసికకల్పనల నుండి ఉత్పన్నమైన విషయకోరికల నన్నింటిని ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి, అతడు మనస్సు ద్వారా ఇంద్రియములను అన్నివైపుల నుండి నియమింపవలెను.*

🌷. భాష్యము :
యోగము నభ్యసించువాడు స్థిరనిశ్చయము కలిగి ఏమాత్రము మార్గము నుండి వైదొలగకే ఓపికగా తన అభ్యాసమును కొనసాగింపవలెను. అంతిమవిజయము నెడ విశ్వాసమును కలిగియుండి, గొప్ప పట్టుదలతో తన పనిని నిర్వహింపవలెను. విజయము లభించుట యందు ఆలస్యమైనచో అతడెన్నడును నిరాశ చెందరాదు. నిష్ఠతో అభ్యాసము కావించువానికి విజయము తథ్యమై యుండును. శ్రీరూపగోస్వామి భక్తియోగమును గూర్చి ఈ విధముగా పలికియుండిరి.

ఉత్సాహా న్నిశ్చయాద్ధైర్యాత్ తత్తత్కర్మప్రవర్తనాత్ |
సంగత్యగాత్ సతో వృత్తే: షడ్భిర్భక్తి: ప్రసిధ్యతి

“ఉత్సాహము, పట్టుదల, నిశ్చయము, భక్తుల సమక్షములో విధ్యుక్తధర్మములను నిర్వర్తించుట మరియు సత్వగుణకార్యములందే సంపూర్ణముగా నిమగ్నమగుట ద్వారా భక్తియోగమును మనుజుడు విజయవంతముగా నిర్వహింపగలడు.” (ఉపదేశామృతము 3)

యోగాభ్యాశము, ముఖ్యముగా కృష్ణభక్తిరసభావన యందు నిర్వహింపబడెడి భక్తియోగము అతికటినమైనదిగా తోచవచ్చును. కాని దాని నియమములను నిశ్చయముగా పాటించువారికి శ్రీకృష్ణభగవానుడు తప్పక సహాయమును గూర్చును. తనకు తాను సహాయము చేసికొనెడివానికి భగవానుని సహాయము లభించుచున్నది తెలిసిన విషయమే కదా!
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 257 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 6 - Dhyana Yoga - 24 🌴*

*24. sa niścayena yoktavyo yogo ’nirviṇṇa-cetasā*
*saṅkalpa-prabhavān kāmāṁs tyaktvā sarvān aśeṣataḥ*
*manasaivendriya-grāmaṁ viniyamya samantataḥ*

🌷 Translation :
*One should engage oneself in the practice of yoga with determination and faith and not be deviated from the path. One should abandon, without exception, all material desires born of mental speculation and thus control all the senses on all sides by the mind.*

🌹 Purport :
The yoga practitioner should be determined and should patiently prosecute the practice without deviation. One should be sure of success at the end and pursue this course with great perseverance, not becoming discouraged if there is any delay in the attainment of success. Success is sure for the rigid practitioner. Regarding bhakti-yoga, Rūpa Gosvāmī says:

utsāhān niścayād dhairyāt tat-tat-karma-pravartanāt
saṅga-tyāgāt sato vṛtteḥ ṣaḍbhir bhaktiḥ prasidhyati

“One can execute the process of bhakti-yoga successfully with full-hearted enthusiasm, perseverance and determination, by following the prescribed duties in the association of devotees and by engaging completely in activities of goodness.” (Upadeśāmṛta 3)

Practice of yoga, especially bhakti-yoga in Kṛṣṇa consciousness, may appear to be a very difficult job. But if anyone follows the principles with great determination, the Lord will surely help, for God helps those who help themselves.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 656 / Vishnu  Sahasranama Contemplation - 656🌹*

*🌻656. అనిర్దేశ్యవపుః, अनिर्देश्यवपुः, Anirdeśyavapuḥ🌻*

*ఓం అనిర్దేశ్యవపుషే నమః | ॐ अनिर्देश्यवपुषे नमः | OM Anirdeśyavapuṣe namaḥ*

*ఇదం తదీదృశం వేతి నిర్దేష్టుం యన్న శక్యతే ।*
*గుణాద్యతీతయా శ్రీవిష్ణోరమితి తేజసః ।*
*తదేవ రూపమ్స్యేతి సోఽనిర్దేశ్యవపుర్హరిః ॥*

*గుణములు, రూపము మొదలగు వానికి అతీతము కావున - ఇదీ, అదీ, ఇట్టిదీ అని నిర్దేశ్యించుటకు శక్యముకాని వపువు అనగా శరీరము ఈతనిది గనుక అనిర్దేశ్యవపుః.*

:: పోతన భాగవతము - సప్తమ స్కంధము ::
వ. ఇట్లు సర్వాత్మకంబై యిట్టి దట్టి దని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు దానయై య మ్మహావిష్ణునియందుఁ జిత్తంబుఁ జేర్చి తన్మయుండయి పరమానందంబునం బొంది యున్న ప్రహ్లాదునియందు రాక్షసేంద్రుడు దన కింకరుల చేతం జేయించుచున్న మారణకర్మంబులు పాపకర్ముని యందుఁ బ్రయుక్తంబులైన సత్కారంబులుం బోలె విఫలంబు లగుటం జూచి. (196)

*ఇలా ప్రహ్లాదుడు ఎవరూ వర్ణింపలేని ఆ పరబ్రహ్మ స్వరూపం తానే అయ్యాడు. మనస్సు మహావిష్ణునియందు నిల్పి తనను తానే మరిచిపోయాడు. దివ్యమైన ఆనందంతో పరవశించి పోయాడు. పాపాత్ముని పట్ల జరిపే సన్మానాలు ఎలా అయితే విఫలం అవుతాయో అదే విధంగా ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు పెట్టే భయంకర బాధలన్నీ విఫలమై పోయాయి.*

177. అనిర్దేశ్యవపుః, अनिर्देश्यवपुः, Anirdeśyavapuḥ

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 656🌹*

*🌻656. Anirdeśyavapuḥ🌻*

*OM Anirdeśyavapuṣe namaḥ*

इदं तदीदृशं वेति निर्देष्टुं यन्न शक्यते ।
गुणाद्यतीतया श्रीविष्णोरमिति तेजसः ।
तदेव रूपम्स्येति सोऽनिर्देश्यवपुर्हरिः ॥

*Idaṃ tadīdr‌śaṃ veti nirdeṣṭuṃ yanna śakyate,*
*Guṇādyatītayā śrīviṣṇoramiti tejasaḥ,*
*Tadeva rūpamsyeti so’nirdeśyavapurhariḥ.*

*Due to transcending the guṇās, it is impossible to indicate His form as 'this', 'that' or 'like this' and hence Lord Viṣṇu is called Anirdeśyavapuḥ.*

:: श्रीमद्भागवते - सप्तमस्कन्धे, षष्टोऽध्यायः ::
प्रत्यगात्मस्वरूपेण दृश्यरूपेण च स्वयम् ।
व्याप्यव्यापकनिर्देश्यो ह्यनिर्देश्योऽविकल्पितः ॥ २२ ॥

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 6
Pratyagātmasvarūpeṇa dr‌śyarūpeṇa ca svayam,
Vyāpyavyāpakanirdeśyo hyanirdeśyo’vikalpitaḥ. (22)

He is indicated as that which is pervaded and as the all-pervading Supersoul, but actually He cannot be indicated. He is changeless and undivided. He is simply perceived as the supreme sac-cid-ānanda. Being covered by the curtain of the external energy, to the atheist He appears nonexistent.

177. అనిర్దేశ్యవపుః, अनिर्देश्यवपुः, Anirdeśyavapuḥ

🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥
కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥
Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr‌tāgamaḥ,Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 335 / DAILY WISDOM - 335 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*✍️ .స్వామి కృష్ణానంద   📝. ప్రసాద్ భరద్వాజ*

*🌻 30. దేవుడు సర్వ పరిపూర్ణుడు 🌻*

*దేవుడు పరధ్యానాన్ని, వికారాలను సృష్టించలేదు. అతను తనంతట తానుగా సంపూర్ణమైన విశ్వాన్ని సృష్టించాడు. కాబట్టి, మీరు మొత్తం ప్రపంచాన్ని భగవంతుడు ఎలా చూస్తాడో అలా చూడాలి,మొత్తంగా. అప్పుడు అన్ని అపసవ్య అంశాలు సరైన స్థానాన్ని పొందుతాయి. ప్రతి అంశము వాటి స్వంత స్థలంలో, అవి సరిగ్గానే ఉన్నాయి. మీరు వాటిని సందర్భం నుండి తీసివేస్తే, అవి అసమంజసంగా మరియు అవాంఛనీయంగా కనిపిస్తాయి. ప్రతిదీ దాని స్వంత సందర్భంలో ఉంచండి మరియు అప్పుడు  ప్రతిదీ సరిగ్గా ఉంటుంది. ప్రపంచం మొత్తం పరిపూర్ణమైనది, అందుచేత మీరు కూడా పరిపూర్ణులు. ఎందుకంటే మీరు అందులో భాగమే. ఈ రకమైన ధ్యానం గురించి ఆలోచించండి.*

*భగవంతుని సృష్టి వైరుధ్యాలతో నిండి ఉంది. ఏదీ వేరే దానిలా ఉండదు. చెట్టులోని ఒక ఆకు అదే చెట్టులోని మరో ఆకులా ఉండదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిలా కాదు. ప్రతిదీ భిన్నంగా ఉంటుంది. చాలా వైరుధ్యం ఉంది; ఇంకా, ఇది సృష్టి యొక్క సామరస్యం మరియు అందం యొక్క సంపూర్ణ సమ్మేళనం. ఇది శివుని కుటుంబం యొక్క వైరుధ్యాలలో మరియు అతను నిర్వహించే పరిపూర్ణ సామరస్యాన్ని సూచిస్తుంది. పాము యొక్క చెత్త విషం అతని శరీరంపై ఉన్న అమృతం. అతనికి ఏదీ హాని కలిగించదు.  భగవంతుడు పరిపూర్ణుడు కాబట్టి  మీరు జీవితంలో చూసే ప్రతి వైరుధ్యం అతనిలో అందంగా శ్రావ్యంగా ఉంటుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 335 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda  📚. Prasad Bharadwaj*

*🌻 30. God is All Perfection 🌻*

*God has not created distractions. He has created a universe which is complete in itself. And so, you have to see the whole world as God Himself would see it, as a total whole, in which all distractive elements find a proper place. And in their own place, they are perfectly all right. If you take them out of context, they look irregular and undesirable. Put everything in its own context and everything is all right. The whole world is perfect, and you are also perfect, because you are a part of that. Think about this kind of meditation.*

*God's creation is full of contradictions. Nothing is like something else. One leaf in the tree is not like another leaf in the same tree. One person is not like another person. Everything is different. There is so much contradiction; yet, it is a perfect blend of harmony and beauty of creation. This is symbolised in the contradictions of the family of Lord Siva, and the perfect harmony also that He maintains. The worst poison of the snake is the nectar on His body. Nothing will harm Him. So, God is all perfection, and in Him every contradiction that you see in life is harmonised beautifully.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 235 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀.  మనిషి దేవుడి గురించి, శాంతి గురించి ప్రేమ గురించి కలగంటాడు. వాస్తవంలో యుద్ధానికి, వినాశనానికి, దౌర్జన్యానికి సిద్ధపడతాడు.నిజమైన శాంతి కాముకుడు. ఆంతరిక పరివర్తన గుండా సాగుతాడు. ధ్యానమొకటే పరివర్తనకు కారణమవుతుంది.  🍀*

*ప్రతి మనిషి ప్రశాంతంగా జీవించాలనుకుంటాడు. అనుకున్నంత మాత్రాన ప్రశాంతంగా వుండలేడు. కొంత మంది శాంతి కోసం అరుస్తూ యుద్ధానికి సిద్ధపడతారు. శాంతి గురించి మాట్లాడుతూ ఆటంబాంబులు సిద్ధం చేస్తారు. ఇది చాలా చిత్రమయిన విషయం. మనుషులు అట్లాంటి వైరుధ్యాల్లో జీవిస్తారు. కారణం మంచి విషయాల గురించి కోరుకోవడం సులభం. వాటిని ఆచరణలోకి తేవడం పూర్తిగా భిన్నమైన విషయం. కలగనడం ఒక విషయం. కలని ఆచరణలోకి తేవడం మరొక విషయం. ఐనా కలలు కలలే. మేలుకొంటేనే అవి మాయమవుతాయి.*

*వాస్తవం వేరుగా వుంటుంది. మనిషిలో చీలిక ఏర్పడుతుంది. దేవుడి గురించి, శాంతి గురించి ప్రేమ గురించి కలగంటాడు. వాస్తవంలో యుద్ధానికి, వినాశనానికి, దౌర్జన్యానికి సిద్ధపడతాడు.నిజమైన శాంతి కాముకుడు. ఆంతరిక పరివర్తన గుండా సాగుతాడు. అప్పుడే స్వప్నం సాకారమవుతుంది. ధ్యానమొకటే పరివర్తనకు కారణమవుతుంది. దౌర్జన్యాన్ని ప్రేమగా పరివర్తిస్తుంది. అవి వేరు వేరు కావు. ఒక శక్తి. మన దగ్గర శక్తులున్నాయి. మనం ఎదగలేదు. ధ్యానం గుండానే అవి ఎదుగుతాయి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment