🌹. కపిల గీత - 64 / Kapila Gita - 64🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 20 🌴
20. విశ్వమాత్మగతం వ్యంజన్ కూటస్థో జగదంకురః|
స్వతేజసో పిబత్తీవ్రమాత్మప్రస్వాపనం తమః॥
ఈ మహత్తత్త్వము లయవిక్షేపాది రహితము. ఇది జగత్తు యొక్క అంకురరూపము. అట్టి ఈ మహత్తత్త్వము తనలో స్థితమై యున్న విశ్వమును ప్రకటించుటకై తన స్వరూపమును కప్పివేయునట్టి ప్రళయకాలీన అంధకారమును తన తేజస్సుతో త్రాగివేయును. అనగా మహత్తత్త్వము వెలువడినంతనే అంధకారము అదృశ్యమగును.
ఎన్నడూ మారని వారైన పరమాత్మ (కూటస్థుడు) , తనలో దాగి ఉన్న (ఆత్మగతం) ప్రపంచాన్ని బయలు పరిచాడు(వ్యంజన్). పరమాత్మే జగత్తుకు అంకురం. తనలో దాగి ఉన్న జగత్తును ఆవిర్భవింపచేసి, తనను మరుగు పరచే చీకటిని త్రాగివేశాడు. తనను కూడా కనపడకుండా చేసే చీకటిని తాగి వేసాడు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 64 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 2. Fundamental Principles of Material Nature - 20 🌴
20. viśvam ātma-gataṁ vyañjan kūṭa-stho jagad-aṅkuraḥ
sva-tejasāpibat tīvram ātma-prasvāpanaṁ tamaḥ
Thus, after manifesting variegatedness, the effulgent mahat-tattva, which contains all the universes within itself, which is the root of all cosmic manifestations and which is not destroyed at the time of annihilation, swallows the darkness that covered the effulgence at the time of dissolution.
Since the Supreme Personality of Godhead, is ever existing, all-blissful and full of knowledge, His different energies are also ever existing in the dormant stage. Thus when the mahat-tattva was created, it manifested the material ego and swallowed up the darkness which covered the cosmic manifestation at the time of dissolution.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
02 Sep 2022
No comments:
Post a Comment