🍀 17 - OCTOBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀

🌹🍀 17 - OCTOBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 17 - OCTOBER - 2022 MONDAY సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 79 / Kapila Gita - 79 🌹 సృష్టి తత్వము - 35
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 118 / Agni Maha Purana - 118 🌹 🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 1🌻
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 253 / Osho Daily Meditations - 253 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 408 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 408 -2 🌹 ”శివంకరీ”- 2 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹17, అక్టోబరు, October 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
 *మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కాలాష్టమి, తులా సంక్రాంతి, Kalashtami, Tula Sankranti🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 3 🍀*

*5. మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః |*
*మహాత్మా సర్వభూతాత్మా విశ్వరూపో మహాహనుః*
*6. లోకపాలోఽంతర్హితాత్మా ప్రసాదో హయగర్దభిః |*
*పవిత్రం చ మహాంశ్చైవ నియమో నియమాశ్రితః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : నిర్మాణాత్మక భావన - మనసులో మనం చేసే భావన సుస్పష్టంగాను, సువ్యవస్థితంగానూ ఉండాలి. అది సాధించినప్పుడు, దానిలోంచి నిర్మాణశక్తి ఉద్భూతం కావడం చూచి మనమే ఆశ్చర్యపోతాము. వెలుపలి ప్రపంచం లోపలి ప్రపంచాన్ని ప్రతిబింబించి. పురుషులూ, స్త్రీలూ రూపు గైకొన్న భావాలుగా మారిపోతారు.🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ సప్తమి 09:31:19 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: పునర్వసు 29:13:17 వరకు
తదుపరి పుష్యమి
యోగం: శివ 16:01:17 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: బవ 09:30:18 వరకు
వర్జ్యం: 15:44:00 - 17:31:52
దుర్ముహూర్తం: 12:24:46 - 13:11:41
మరియు 14:45:30 - 15:32:25
రాహు కాలం: 07:37:27 - 09:05:24
గుళిక కాలం: 13:29:16 - 14:57:14
యమ గండం: 10:33:22 - 12:01:19
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24
అమృత కాలం: 26:31:12 - 28:19:04
మరియు 24:52:56 - 26:40:12
సూర్యోదయం: 06:09:30
సూర్యాస్తమయం: 17:53:09
చంద్రోదయం: 23:47:16
చంద్రాస్తమయం: 12:35:32
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: జెమిని
ధూమ్ర యోగం - కార్య భంగం,
సొమ్ము నష్టం 29:13:17 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 79 / Kapila Gita - 79🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 35 🌴*

*35. నభసః శబ్దతన్మాత్రాత్కాలగత్యా వికుర్వతః|*
*స్పర్శోఽభవత్తతో వాయుస్త్వక్ స్పర్శస్య సంగ్రహః॥*

*శబ్దతన్మాత్ర యొక్క కార్యమైన ఆకాశము కాలగతిచే వికారమును పొంది, స్పర్శ తన్మాత్రగా రూపొందును. తత్పలితముగా వాయువు, స్పర్శజ్ఞానమును కలాగించు త్వగింద్రియము (చర్మము) ఉత్పన్నమయ్యెను.*

*తన్మాత్రము నుండి భూతము పుడుతుంది. శబ్ద తన్మాత్ర నుండి పుట్టిన ఆకాశము నుండి పరమాత్మ సంకల్పముతో, ఆ ఆకాశము వికారము చెంది స్పర్శ తన్మాత్ర పుట్టింది. స్పర్శ తన్మాత్ర నుండి వాయువు పుట్టింది. స్పర్శను గ్రహించే ఇంద్రియం పేరు త్వగ్ ఇంద్రియం.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 79 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 35 🌴*

*35. nabhasaḥ śabda-tanmātrāt kāla-gatyā vikurvataḥ*
*sparśo 'bhavat tato vāyus tvak sparśasya ca saṅgrahaḥ*

*From ethereal existence, which evolves from sound, the next transformation takes place under the impulse of time, and thus the subtle element touch and thence the air and sense of touch become prominent.*

*In the course of time, when the subtle forms are transformed into gross forms, they become the objects of touch. The objects of touch and the tactile sense also develop after this evolution in time. Sound is the first sense object to exhibit material existence, and from the perception of sound, touch perception evolves and from touch perception the perception of sight. That is the way of the gradual evolution of our perceptive objects.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 118 / Agni Maha Purana - 118 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 38*

*🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 1🌻*

అగ్నిదేవుడు చెప్పెను:- మునీశ్వరా! వాసుదేవాదుల కొరకు దేవాలయమును చేయించుటకే కలుగు ఫలమును చెప్పుచున్నాను. దేవాలయములు కట్టవలె ననియు. తటాకాదులు నిర్మింపవలె ననియుకలిగిన శుభసంకల్పము అట్టి సంకల్పము కలవాని వేల కొలది జన్మ పాపములను నశింపచేయును. భావన చేతనైన దేవాలయ నిర్మాణము చేసిన వాని అనేక జన్మల పాపములు తొలగిపోవును. ఎవరైన దేవమందిరాదులు గట్టుచున్నప్పుడు దానిని ఆమోదించినవారు కూడ సమస్తపాపములు తొలగి విష్ణులోకమును పొందుదురు. 

శ్రీమహావిష్ణువునకు ఆలయము నిర్మించిన వారు భూతకాలమునందలి వేయి తరములవారిని భవిష్యత్తులోని వేయి తరములవారిని విష్ణులోక నివాసార్హులనుగ చేయును. శ్రీకృష్ణుని ఆలయమును నిర్మించినవాని పితరులు వెంటనే నరకదుఃఖమునుండి విముక్తులై. దివ్యవస్త్రాభరణాదులు ధరించి ఆనందముతో విష్ణులోకమున నివసింతురు. 

దేవాలయ నిర్మాణము బ్రహ్మహత్యాది పాములను తొలగించును. యజ్ఞము చేయుట వలన కలుగని ఫలములు గూడ దేవాలయ నిర్మాణముచే కలుగును. దేవాలయ నిర్మాణము వలన సమస్త తీర్థములందును స్నానము చేసిన ఫలము కలుగును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 118 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 38*
*🌻 Benefits of constructing temples - 1 🌻*

Agni said:

1. I wil now describe the benefits of erecting the temples of Vāsudeva and others. One who is desirous of constructing the temples of gods gets freed from sins incurred in thousand births.

2-5. Those who conceive of building a temple get the sins accrued in hundreds of births destroyed. Those who approve the building of a temple for lord Kṛṣṇa, also become free from their sins and go to the world of Acyuta (Viṣṇu). Having built a temple for Hari, a man immediately conveys a lakh of his ancestors both past and future to the world of Viṣṇu. The manes of a person who builds a temple for Viṣṇu having seen it remain in the world of Viṣṇu well-honoured and relieved of their sufferings in hells. The erection of the abode for the deity destroys sins such as the killing of a brahmin.

6. Whichever benefit could not be obtained by doing sacrificial rites, could be got by the erection of an abode (for the god). He who erects an abode for the god reaps fruits of bathing in all holy waters.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 253 / Osho Daily Meditations - 253 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 253. ఊహ 🍀*

*🕉. ఊహను ఎప్పుడూ తిరస్కరించ వద్దు. ఇది మానవులలో ఏకైక సృజనాత్మక అధ్యాపకుడు, ఏకైక కవిత్వ అధ్యాపకుడు మరియు దానిని ఎవరూ తిరస్కరించ కూడదు. 🕉*

*తిరస్కరించబడిన ఊహ చాలా ప్రతీకారంగా మారుతుంది. తిరస్కరించ బడినప్పుడు, ఇది ఒక పీడకల అవుతుంది. తిరస్కరించబడిందా, అది విధ్వంసకరం అవుతుంది. కాకపోతే ఇది చాలా సృజనాత్మకంగా ఉంటుంది. ఇది సృజనాత్మకత తప్ప మరేమీ కాదు. కానీ మీరు దానిని తిరస్కరించినట్లయితే, మీరు మీ స్వంత సృజనాత్మకతకు మరియు మీకు మధ్య సంఘర్షణను ప్రారంభిస్తే, మీరు నష్టపోతారు. కళకు వ్యతిరేకంగా విజ్ఞానం ఎప్పుడూ గెలవదు మరియు ప్రేమకు వ్యతిరేకంగా తర్కం ఎన్నటికీ గెలవదు. పురాణానికి వ్యతిరేకంగా చరిత్ర ఎప్పటికీ గెలవదు మరియు కలలతో పోలిస్తే వాస్తవికత పేలవమైనది, చాలా పేలవమైనది.*

*కాబట్టి మీరు ఊహకు వ్యతిరేకంగా ఏదైనా ఆలోచన కలిగి ఉంటే, దానిని వదిలివేయండి. ఎందుకంటే మనమందరం దానిని మోస్తున్నాము - ఈ వయస్సు చాలా ఊహాజనితమైనది. వాస్తవికంగా, అనుభవపూర్వకంగా మరియు అన్ని రకాల అర్ధం లేని వాడివిగా ఉండాలని ప్రజలకు బోధించారు. కానీ ప్రజలు మరింత కలలు కనేవారిగా ఉండాలి, మరింత చిన్నపిల్లలుగా, మరింత పారవశ్యంతో. ప్రజలు ఆనందాన్ని సృష్టించగలగాలి. మరియు దాని ద్వారా మాత్రమే మీరు మీ అసలు మూలాన్ని చేరుకుంటారు. దేవుడు విపరీతమైన ఊహాశక్తి గల వ్యక్తి అయి ఉండాలి. ప్రపంచాన్ని చూడు! దీన్ని సృష్టించిన వారు లేదా కలలు కన్న వారు గొప్ప కలలు కనేవారు అయి ఉండాలి...ఇన్ని రంగులు మరియు అనేక పాటలు. అస్తిత్వమంతా హరివిల్లు. ఇది లోతైన ఊహ నుండి బయటకు రావాలి.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 253 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 253. IMAGINATION 🍀*

*🕉. Never deny imagination. It is the only creative faculty in human beings, the only poetic faculty, and one should not deny it. 🕉*

*Denied, imagination becomes very revengeful. Denied, it becomes a nightmare. Denied, it becomes destructive. Otherwise it is very creative. It is creativity and nothing else. But if you deny it, if you disown it, you start a conflict between your own creativity and yourself, then you are going lose. Science can never win against art, and logic can never win against love. History can never win against myth, and reality is poor compared to dreams, very poor.*

*So if you carry any idea against imagination, drop it. Because we all carry it--this age is very antiimagination. People have been taught, to be factual, realistic, empirical, and all sorts of nonsense. People should be more dreamy, more childlike, more ecstatic. People should be able to create euphoria. And only through that do you reach your original source. God must be a tremendously imaginative person. Just look at the world! Whoever created it or dreamed it must be a great dreamer…so many colors and so many songs. The whole of existence is a rainbow. It must come out of deep imagination.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 408 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 408 - 2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 88. భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।*
*శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శివంకరీ ॥ 88 ॥ 🍀*

*🌻 408. 'శివంకరీ”- 2 🌻* 

స్త్రీ గౌరవింపబడనిచోట శుభము లుండవు. స్త్రీని అవమానించినచో పతనము తప్పదు. మంగళమూర్తి అయిన శ్రీమాతను శుభంకరమగు రూపములందు దర్శించుచూ ఆరాధించుట జీవులు నేర్వవలెను. ఆమెయే మాయ అగుట వలన మాయ తొలగి శివదర్శనము కావలె నన్నచో శ్రీమాత అనుగ్రహము ముఖ్యము. శ్రీమాత అనుగ్రహము పొందుటకు స్త్రీలను పూజించుట, గౌరవించుట, ఆదరించుట ప్రధానము. ఇట్టివారు సృష్టియందు మాయావరణములను దాటుదురు. కారణము శ్రీమాత మాయ పొరలను తొలగించుటయే. 

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 408 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*

*🌻 88. Bhaktahardhatamobheda bhanumadbanu santatih*
*Shivaduti shivaradhya shivamurti shivankari ॥ 88 ॥ 🌻*

*🌻 408. 'Shivankari”- 2 🌻*

Where women are not respected, there are no auspices. One who insults woman will surely fall. Living beings should learn to worship Sri Mata, who is the goddess of good will in her auspicious forms. She, being Maya herself is the one who facilitates the devotee to reach Lord Shiva by removing Maya. Thus it is Her grace which brings devotees to Lord Shiva. It is important to worship, respect and cherish women to get grace of Sri Mata. They transcend the illusions of creation. The reason is that Srimata removes layers of this Maya.

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment