శ్రీమద్భగవద్గీత - 267: 06వ అధ్., శ్లో 34 / Bhagavad-Gita - 267: Chap. 06, Ver. 34

 


🌹. శ్రీమద్భగవద్గీత - 267 / Bhagavad-Gita - 267 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 34 🌴

34. చంచలం హి మన: కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ |
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్


🌷. తాత్పర్యం :

ఓ కృష్ణా! మనస్సు చంచలమును, కల్లోలపూర్ణమును, దృఢమును, మిగుల బలవత్తరమును అయి యున్నది. దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కన్నాను కష్టతరమని నేను భావించుచున్నాను.

🌷. భాష్యము :

మనస్సు మిగుల బలవత్తరము, దృఢమును అయియున్నది. తత్కారణమున అది వాస్తవమునకు బుద్ధికి విధీయమై యుండవలసినను కొన్నిమార్లు దానిని అతిక్రమించుచుండును.

జగము నందు అనేకములైన అవరోధములతో సంఘర్షణ పడు మనుజుని అట్టి మనస్సును నిగ్రహించుట అత్యంత కష్టమైన కార్యము. కృత్రిమముగా ఎవరైనను శత్రుమిత్రుల యెడ సమానవైఖరిని కనబరచిన కనబరచవచ్చును.

కాని లౌకికుడును మాత్రము ఆ విధముగా చేయలేడు. మనస్సును నిగ్రహించుట తీవ్రగాలిని నియమించుట కన్నను అతికష్టమైన కార్యమగుటయే అందులకు కారణము. కతోపనిషత్తు (1.3.3-4) నందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది.

ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ చ |
బుద్ధిం తు సారథిం విద్ధి మన: ప్రగ్రహమేవ చ

ఇంద్రియాణి హయా నాహు: విషయాం స్తేషు గోచరాన్ |
ఆత్మేన్ద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణ: ||

“దేహమును రథములో జీవుడు ప్రయాణికుడు కాగా, బుద్ధి రథచోదకుడై యున్నాడు. మనస్సు రథమును నడుపు సాధనము కాగా ఇంద్రియముల అశ్వములై యున్నవి. ఈ విధముగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియముల సంగత్వమున భోక్త యగుచున్నాడని మునులచే అవగాహన చేసికొనబడినది.”

వాస్తవమునకు బుద్ధి యనునది మనస్సునకు నిర్దేశము నొసగవలెను. కాని బలవత్తరము, దృఢమును అగు మనస్సు అంటువ్యాధి ఔషధశక్తిని సైతము అతిక్రమించునట్లు, మనుజుని బుద్ధిని సైతము కొన్నిమార్లు అతిక్రమించుచుండును.

అట్టి బలమైన మనస్సును యోగపద్ధతిచే నియమింపవలసియున్నది. అయినను అర్జునుని వంటి వానికి కూడా ఈ యోగాభ్యాసము ఆచరణీమైనదిగా లేదు. అట్టి యెడ నేటి సాధారణమానవుని గూర్చి ఇక చెప్పవలసినది ఏమున్నది?

ఈ శ్లోకమునందు తెలుపబడిన వాయువు ఉదాహరణము అత్యంత సమంజసముగా నున్నది. ఏలయన ఎవ్వరును వాయువును బంధించలేరు. కాని దాని కన్నను కల్లోలపూర్ణమగు మనస్సును నిరోధించుట ఇంకను కష్టతరమై యున్నది.

అటువంటి మనస్సును నిరోధించుటకు శ్రీచైతన్యమాహాప్రభువు ఉపదేశించిన భవతారకమైన హరే కృష్ణ మాహామంత్రమును నమ్రతతో కీర్తించుట అతిసులభమైన మార్గము. అనగా “స వై మన: కృష్ణపదారవిందయో:” అను విధానమే ఇచ్చట నిర్దేశింపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 267 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 34 🌴

34. cañcalaṁ hi manaḥ kṛṣṇa pramāthi balavad dṛḍham
tasyāhaṁ nigrahaṁ manye vāyor iva su-duṣkaram


🌷 Translation :

The mind is restless, turbulent, obstinate and very strong, O Kṛṣṇa, and to subdue it, I think, is more difficult than controlling the wind.

🌹 Purport :

The mind is so strong and obstinate that it sometimes overcomes the intelligence, although the mind is supposed to be subservient to the intelligence.

For a man in the practical world who has to fight so many opposing elements, it is certainly very difficult to control the mind.

Artificially, one may establish a mental equilibrium toward both friend and enemy, but ultimately no worldly man can do so, for this is more difficult than controlling the raging wind. In the Vedic literature (Kaṭha Upaniṣad 1.3.3–4) it is said:

ātmānaṁ rathinaṁ viddhi śarīraṁ ratham eva ca
buddhiṁ tu sārathiṁ viddhi manaḥ pragraham eva ca

indriyāṇi hayān āhur viṣayāṁs teṣu gocarān
ātmendriya-mano-yuktaṁ bhoktety āhur manīṣiṇaḥ

“The individual is the passenger in the car of the material body, and intelligence is the driver.

Mind is the driving instrument, and the senses are the horses. The self is thus the enjoyer or sufferer in the association of the mind and senses. So it is understood by great thinkers.”

Intelligence is supposed to direct the mind, but the mind is so strong and obstinate that it often overcomes even one’s own intelligence, as an acute infection may surpass the efficacy of medicine.

Such a strong mind is supposed to be controlled by the practice of yoga, but such practice is never practical for a worldly person like Arjuna.

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment