1) 🌹 16, MARCH 2023 FRIDAY గురువారం, బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 148 / Kapila Gita - 148 🌹 🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 02 / 4. Features of Bhakti Yoga and Practices - 02 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 740 / Vishnu Sahasranama Contemplation - 740 🌹
🌻740. చన్దనాఙ్గది, चन्दनाङ्गदि, Candanāṅgadi🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 701 / Sri Siva Maha Purana - 701 🌹 🌻. త్రిపుర వాసుల దీక్షాస్వీకారము - 5 / The Tripuras are initiated - 5 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 322 / Osho Daily Meditations - 322 🌹
🍀 322. నైపుణ్యం / 322. MASTERY🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 439 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 439 -2 🌹 🌻 439. 'కాళమార్గ తత్పర సేవితా' - 2 / 439. kaolamarga tatpara sevita - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 16, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*
*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రం - 31 🍀*
31. అకంపనీయాన్యపనీతిభేదైః
అలంకృషీరన్ హృదయం మదీయం
శంకా కళంకా పగమోజ్జ్వలాని
తత్త్వాని సమ్యంచి తవ ప్రసాదాత్
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఏకాగ్రతకు లక్ష్యాలు - ఏకాగ్రత త్రాటకాభ్యాసంలో వలె ఏ వెలుగు చుక్కవంటి దృశ్యం మీదనో కావచ్చు. అట్టి అభ్యాసంలో సాధకుని దృష్టి, ఆ చుక్కల మీదే లగ్నమై వుండాలి. ఇంకే ఆలోచనా రాగూడదు. అటులే ఏకాగ్రత భావయుక్తమైన నామంపైన కావచ్చు. ఒక భావంపైన, అక్షరంపైన, నామంపైన, భావయుక్తమైన అక్షరం పైన. ఈశ్వర భావం, ప్రణవాక్షరం, కృష్ణనామం ఇందుకు ఉదాహరణలు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ నవమి 16:40:51 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: మూల 06:25:03 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: వ్యతీపాత 10:07:34
వరకు తదుపరి వరియాన
కరణం: గార 16:35:51 వరకు
వర్జ్యం: 15:21:48 - 16:51:16
దుర్ముహూర్తం: 10:24:30 - 11:12:40
మరియు 15:13:27 - 16:01:36
రాహు కాలం: 13:55:12 - 15:25:29
గుళిక కాలం: 09:24:19 - 10:54:36
యమ గండం: 06:23:44 - 07:54:01
అభిజిత్ ముహూర్తం: 12:00 - 12:48
అమృత కాలం: 00:19:40 - 01:51:00
మరియు 24:18:36 - 25:48:04
సూర్యోదయం: 06:23:44
సూర్యాస్తమయం: 18:26:05
చంద్రోదయం: 01:43:34
చంద్రాస్తమయం: 12:54:15
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: ధూమ్ర యోగం - కార్య
భంగం, సొమ్ము నష్టం 06:25:03 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 148 / Kapila Gita - 148 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 02 🌴*
*02. స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ్చ నివర్తనమ్|*
*దైవాల్లబ్దేన సంతోష ఆత్మవిచ్చరణార్చనమ్॥*
*తాత్పర్యము : దీని కొరకై శాస్త్ర విహిత ధర్మములను యథాశక్తిగా ఆచరింపవలెను. శాస్త్ర విరుద్ధమైన కర్మలను పరిత్యజింప వలయును. ప్రారబ్ధానుసారము (దైవానుగ్రహముస) లభించిన దానితో తృప్తి చెందవలయును. ఆత్మజ్ఞానుల పాదములను సేవింప వలెను. అనగా వారి సమీపముననే యుండి వారి సత్సాంగత్య లాభములను పొందవలెను.*
*వ్యాఖ్య : ఈ శ్లోకం నిరంతరం అనుసంధానం చేయాలి. మనసు ప్రశాంతతను పొందాలీ అంటే తన ధర్మాన్ని తాను శక్తి మేరకు ఆచరించాలి. ధర్మము కాని దాని నుండి వైదొలగాలి. స్వధర్మమే ఫలమును కోరిచేస్తే విధర్మమవుతుంది. భగవదాజ్ఞ్యయా భగవత్కైంకర్య రూపేణా కర్మలు చేయాలి. అవిహిత అప్రతిషిద్ధ నిషిద్ధ వ్యాపారాలు విధర్మం. నిషేధించిన దాన్ని విడిచిపెట్టాలి, ఏ ఏ పని చేయకూడదని చెప్పలేదో దాన్ని కూడా విడిచిపెట్టాలి. వీటినుండి తొలగడానికి పరమాత్మ ప్రసాదించిన దానితో తృప్తి పొందాలి. అలా తృప్తి చెందడం వలన విధర్మ నివృత్తి కలుగ్తుంది. మరి పరమాత్మ ఇచ్చిన దానితో తృప్తి చెందాలంటే? మనసు కడగబడాలి. అది భాగవత ఆరాధనతో కలుగుతుంది. భగవంతుని భక్తులని ఆరాధిస్తే, భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిపడడం అలవాటవుతుంది. అంటే భగవంతుని భక్తులూ అనడానికి చిహ్నం, వారు భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి పడే వారు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 148 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 4. Features of Bhakti Yoga and Practices - 02 🌴*
*02. sva-dharmācaraṇaṁ śaktyā vidharmāc ca nivartanam
daivāl labdhena santoṣa ātmavic-caraṇārcanam
*MEANING : One should execute his prescribed duties to the best of his ability and avoid performing duties not allotted to him. One should be satisfied with as much gain as he achieves by the grace of the Lord, and one should worship the lotus feet of a spiritual master.*
*PURPORT : In this verse there are many important words which could be very elaborately explained, but we shall briefly discuss the important aspects of each. The final statement is ātmavic-caraṇārcanam. Ātma-vit means a self-realized soul or bona fide spiritual master. Unless one is self-realized and knows what his relationship with the Supersoul is, he cannot be a bona fide spiritual master. Here it is recommended that one should seek out a bona fide spiritual master and surrender unto him (arcanam), for by inquiring from and worshiping him one can learn spiritual activities.*
*The first recommendation is sva-dharmācaraṇam. As long as we have this material body there are various duties prescribed for us. Such duties are divided by a system of four social orders: brāhmaṇa, kṣatriya, vaiśya and śūdra. These particular duties are mentioned in the śāstra, and particularly in Bhagavad-gītā. Sva-dharmācaraṇam means that one must discharge the prescribed duties of his particular division of society faithfully and to the best of his ability. One should not accept another's duty. If one is born in a particular society or community, he should perform the prescribed duties for that particular division. If, however, one is fortunate enough to transcend the designation of birth in a particular society or community by being elevated to the standard of spiritual identity, then his sva-dharma, or duty, is solely that of serving the Supreme Personality of Godhead. The actual duty of one who is advanced in divine consciousness is to serve the Lord. As long as one remains in the bodily concept of life, he may act according to the duties of social convention, but if one is elevated to the spiritual platform, he must simply serve the Supreme Lord; that is the real execution of sva-dharma.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 740 / Vishnu Sahasranama Contemplation - 740🌹*
*🌻740. చన్దనాఙ్గది, चन्दनाङ्गदि, Candanāṅgadi🌻*
*ఓం చన్దనాఙ్గదినే నమః | ॐ चन्दनाङ्गदिने नमः | OM Candanāṅgadine namaḥ*
*భూషితశ్చన్దనైః సమ్యగాహ్లాదిభిరనుత్తమైః ।*
*కేయూరైరఙ్గదైర్విష్ణురుచ్యతే చన్దనాఙ్గదీ ॥*
*ఈతనికి ఆహ్లాదకరములగు భుజకీర్తులు అను ఆభరణములు కలవు. వానిచే అలంకరించబడియుండువాడు కనుక ఆ పరమాత్మునకు చందనాంగది అను నామము కలదు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 740🌹*
*🌻740. Candanāṅgadi🌻*
*OM Candanāṅgadine namaḥ*
भूषितश्चन्दनैः सम्यगाह्लादिभिरनुत्तमैः ।
केयूरैरङ्गदैर्विष्णुरुच्यते चन्दनाङ्गदी ॥
*Bhūṣitaścandanaiḥ samyagāhlādibhiranuttamaiḥ,*
*Keyūrairaṅgadairviṣṇurucyate candanāṅgadī.*
*His arms are ornamented by Keyūras or armlets which are attractive and pleasing and hence He is called Candanāṅgadi*.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी ।वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥
సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ ।వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥
Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,Vīrahā viṣamaśśūnyo ghrtāśīracalaścalaḥ ॥ 79 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 701 / Sri Siva Maha Purana - 701 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 04 🌴*
*🌻. త్రిపుర వాసుల దీక్షాస్వీకారము - 5 🌻*
*అపుడు నశించిన ఉత్సాహము గలవాడు, కింకర్తవ్యతా విమూఢుడు అగు ఆ యతి దుఃఖముతో నిండిన హృదయముతో విష్ణువును స్మరించి మనసులో ఆయనను పరిపరి విధముల స్తుతించెను (41). వానిచే స్మరింపబడిన విష్ణువు వెంటనే తన హృదయములో శంకరుని స్మరించి మనస్సులో ఆయన ఆజ్ఞను పొంది వెంటనే నారదుని స్మరించెను (42). విష్ణువు స్మరించగానే నారదుడచటకు వచ్చి నమస్కరించి, ఆయన యెదుట చేతులు జోడించి నిలబడెను (43).*
*బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, లోకోపకారమునందు సర్వదా నిమగ్నమైనవాడు, సర్వకాలములలో దేవకార్యమును చేయువాడునగు విష్ణువు ఆ నారదునితో నిట్లనెను (44). వత్సా! నేను శివుని ఆజ్ఞచే చెప్పుచున్నాను. నీవు వెంటనే త్రిపురములకు వెళ్లుము. ఆ నగరములలో నివసించు వారిని మోహపెట్టుటకై ఋషి శిష్యులతో గూడి అచటకు వెళ్లినాడు(45). విష్ణువు యొక్క మాటను విని, నారద మహర్షి మాయావులలో అగ్రేసరుడగు ఆ ఋషి ఉన్న స్థానమునకు వెంటనే వెళ్లెను (46). మాయావి యగు నారదుడు ఆ విధముగా మాయావియగు ప్రభుని ఆదేశముచే ఆ పురమును ప్రవేశించి ఆ మాయావి వద్ద దీక్షను స్వీకరించెను (47). తరువాత నారదుడు త్రిపురాధిపతి వద్దకు వెళ్లి క్షేమ సమాచారమును ప్రశ్నించి, తరువాత విషయమునంతనూ ఆ మహారాజునకు విన్నవించెను (48).
నారదుడిట్లు పలికెను.*
*ఇచటకు ధర్మ నిష్ఠుడు, విద్యలన్నింటిలో ఆరితేరినవాడు, వేదమునందలి పరావిద్యను ఎరింగిన వాడు అగు యతి ఒకరు వచ్చి యున్నారు (49). నేను అనేక ధర్మములను చూచితిని గాని, అవి దీని సాటి గావు. ఈ ధర్మము సనాతనమని మాకు తోచినది. కావున మేమీ ధర్మములో దీక్షను గైకొంటిమి (50). ఓ రాక్షస శ్రేష్ఠా! మహారాజా! నీకు ఆధర్మము నందు అభిరుచి కలిగినచో, నీవు కూడా ఆ ధర్మమునకు సంబంధించిన దీక్షను గైకొనుము (51).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 701🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 04 🌴*
*🌻 The Tripuras are initiated - 5 🌻*
41. He mentally remembered and eulogised Viṣṇu many times, with an aching heart. He had been so dispirited and listless.
42. On being remembered by him Viṣṇu mentally thought of Śiva. Receiving his behest by the process of thought forms he remembered Nārada.
43. Immediately after, Nārada approached Viṣṇu. After bowing to him and eulogising him, he stood before Viṣṇu with palms joined in reverence.
44. Viṣṇu, the foremost among the intelligent and who always carried out the tasks of the gods and who was engaged in rendering help to the worlds spoke to Nārada then.
45. “O dear, this is being mentioned to you at the bidding of Śiva. Go to the three cities immediately. The sage has gone there already for deluding the residents of the cities.”
Sanatkumāra said:—
46. On hearing his words, Nārada, the excellent sage went there quickly where the ascetic expert in magic was stationed.
47. Nārada, an expert in magic, at the bidding of the lord, an expert in the art of illusion, entered the three cities along with the deceptive sage, and got himself initiated.
48. Then Nārada approached the lord of the three cities. After the preliminary enquiries about his health and welfare he spoke to the king.
Nārada said:—
49. A certain sage, very virtuous and excellent master of lores has arrived here. He possesses complete knowledge of the Vedic lore.
50. Many cults have been observed by me but none of them is like his. Seeing the eternal virtue in this cult we have got ourselves initiated into it.
51. O great king, O excellent Asuras, if you have any interest in that cult, you shall get yourself initiated into it.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 322 / Osho Daily Meditations - 322 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 322. నైపుణ్యం 🍀*
*🕉. ప్రపంచాన్ని జయించడం నిజమైన శౌర్యం కాదు; తనను తాను జయించుకోవడమే నిజమైన శౌర్యం. 🕉*
*ప్రపంచంలో ఒక పోరాట యోధుడిగా, యోధునిగా ఉండటం అసాధారణమైనది కాదు. ప్రపంచం మొత్తం పోరాడుతోంది కాబట్టి అందరూ ఎoతో అంత యోధులే. ఇది నిరంతర యుద్ధం, కొన్నిసార్లు వేడిగా, కొన్నిసార్లు చల్లగా ఉంటుంది. ప్రతి వ్యక్తి పోరాడుతున్నాడు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆశయంతో పెరిగారు, ప్రతి ఒక్కరూ దానితో విషం కక్కుతున్నారు. మరియు ఎక్కడైతే ఆశయం ఉంటుందో, అక్కడ పోరాటం ఉంటుంది, పోటీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ చాలా ఉన్నతాశయాలతో ఉంటారు, ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న అన్ని సమాజాలు ఆశయంతో జీవించాయి. అన్ని విద్యా వ్యవస్థలు పిల్లలను ఉన్నతాశయం మరియు విజయం సాధించాలన్న మూసలో వడవెయ్యడం తప్ప మరేమీ చేయవు.*
*నిజమైన ధైర్యం, నిజమైన పోరాటం బయట లేదు. నిజమైన పోరాటం లోపల ఉంది, ఇది అంతర్గత విజయం. అలెగ్జాండర్ గొప్ప యోధుడు అయినప్పటికీ, అతని స్వంత ప్రవృత్తులకు సంబంధించినంతవరకు, అతను ఒక బానిస. నెపోలియన్ గొప్ప సైనికుడే కావచ్చు, కానీ తనలోని కోపం, కామం మరియు స్వాధీనతకు సంబంధించినంతవరకు, అతను అందరిలాగే సామాన్యుడు. నిజంగా ధైర్యవంతులు జీసస్, బుద్ధుడు, పతంజలి--ఈ రకమైన వ్యక్తులు. వారు తమను తాము అధిగమించారు. ఇప్పుడు ఏ కోరికా వారిని ఇక్కడికి మరియు అక్కడికి లాగలేదు; ఇప్పుడు ఏ అపస్మారక ప్రవృత్తి వారిపై ఎటువంటి శక్తిని కలిగి ఉండదు. వారి జీవితాలకు వారే అధిపతులు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 322 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 322. MASTERY 🍀*
*🕉. To conquer the world is not real bravery; to conquer oneself is. 🕉*
*To be a fighter in the world, to be a warrior, is nothing extraordinary. Everybody is a warrior, more or less, because the whole world is fighting. It is a continuous war, sometimes hot, sometimes cold. Every individual is fighting, because everyone is brought up in ambition, everybody is poisoned with it. And wherever there is ambition, there is fight, there is competition. Everyone is too ambitious, because all societies that have .existed up to now have lived on ambition. All the educational systems do nothing but condition children to be ambitious and to be successful.*
*The real bravery, the real fight, is not outside. The real fight is inside, it is an inner conquest. Although Alexander may have been a great warrior, but as far as his own instincts were concerned, he was a slave. Napoleon may have been a great soldier, but as far as his own anger, lust, and possessiveness were concerned, he was just as ordinary as anybody else. The really brave ones are Jesus, Buddha, Patanjali--these types of people. They have overcome themselves. Now no desire can pull them here and there; now no unconscious instinct can have any power over them. They are masters of their own lives.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 439 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 439 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।*
*కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀*
*🌻 439. 'కాళమార్గ తత్పర సేవితా' - 2 🌻*
*అట్లుగాక వేద విధులతో కూడిన ఆరాధన మున్నది. దానిని సమయ మతమని, సమయ మార్గమని అందురు. ఈ రెండును కలుపు మిశ్రమ మార్గము కూడ కలదు. ఈ మూడును గాక తంత్ర మార్గము కలదు. ఆరాధకులు వారి వారి అర్హతలను, ఆసక్తిని బట్టి ఇందే మార్గము నైనను అనుసరింపవచ్చును. మార్గమేదైననూ భక్తి శ్రద్ధలు ప్రధానము. తమను తాము శ్రీమాతకు అర్పణ చేసుకొనుట ప్రధానము. భక్తితో అర్పణ చేసుకొనునపుడు తత్పరత కలుగును. అపు దారాధనము హెచ్చగు ఆనందము నిచ్చును. కావున విధానము కన్న భక్తి తత్పరతలు ప్రధానము. విధానము కూడ అనుసరించినచో హెచ్చగు వైభవము కలుగ గలదు. భక్తిలేని విధానము తత్పరతను కలిగింపకపోగా దంభమును, డంబాచారమును కలుగచేయును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 439 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 93. Kushala komalakara kurukulla kuleshvari*
*Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻*
*🌻 439. kaolamarga tatpara sevita - 2 🌻*
*There are other ways of worship also. The one which uses Vedic rituals. It's called the samaya marga. There is also a mixed route that combines these two. There is also a tantra path along with these three. Devotees can follow any path according to their qualifications and interest. Whatever the path, devotional practices are paramount. It is important to offer oneself to Srimata. When you offer with devotion, you get satisfaction. That worship will give you happiness. Therefore devotional motives are more important than ritual. If the ritual is also followed, great glory can be achieved. An ungodly approach does not lead to efficiency but leads to arrogance and hypocrisy.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
No comments:
Post a Comment