శ్రీ మదగ్ని మహాపురాణము - 187 / Agni Maha Purana - 187


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 187 / Agni Maha Purana - 187 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 57

🌻. కుంభాధివాసము - 2 🌻


ఆ కలశమును నాలుగు దిక్కులందును ఉంచవలెను. భగవదభిషేకము నమిత్తమైన ఏర్పరచిన ఆ కలశలను చాల గౌరవభావముతో ఉంచవలెను. తూర్పున నున్నకలశపైవట-ఉదుంబర-అశ్వత్థ-చంపక-అశోక-బిల్వ-పలాశ-అర్జున-ప్లక్ష-కదంబ- వకుల-చూతపల్లవములను ఉంచవలెను. దక్షిణ దిక్కుందున్న కలశలో కమల-రోచనా-దూర్వాదర్భ- జాతీపుష్ప-కుంద-చందన-రక్త చందన-సిద్దార్థ-తగర- తండులములను ఉంచవలెను. పశ్చిమ దిక్కునందున్న కలశలో బంగారము, వెండి, సముద్రములోనికి ప్రవహించునది యొక్క రెండు తటములందిలి మట్టి, విశేషముగ, గంగామృత్తు, గోమయము, యవలు, వరిబియ్యము, తిలలు ఉంచవలెను.

ఉత్తర దిక్కునందున్న కలశలో విష్ణువర్ణి, శాలపర్ణి, భృంగరాజము, శతావరి, సహదేవి, వచ, సైంహి, బల, వ్యాఘ్రి, లక్ష్మణ అను ఓషధులనుంచవలెను. ఈశాన్యము నందున్న మరొక కలశలో మాంగలిక వస్తువుల నుంచవలెను. అగ్నికోణము నందును రెండువ కలశలో ఏడు స్థాలనముల నుండి గ్రహింపబడిన మట్టి, ఉంచవలెను. నైరృతి దిక్కునందున్న కలశలో గంగ ఇసుకను, గంగా జలమును ఉంచవలెను.

వాయవ్య కోణము నందునన్న మరొక కలశము నందు సూకర-వృషభ-గజముల దంతముల చేతను. కొమ్ముల చేతను పెకలించన మట్టిని, పద్మము మొదట్లో నున్న మట్టిని, ఇతర కలశము నందు దర్భల మొదట్లో నున్న మట్టిని ఉంచవలెను. మరొక కలశములనందు నాగకేసర పుష్ప కేసరముల నుంచవలెను. మరొక కలశము నందు చందనము, అగురు, కర్పూరము కలిసిన ఉదకము నింపి, వైదూర్య-విద్రుము-ముక్తా-స్ఫటిక-వజ్రములనుంచవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 187 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 57

🌻Consecration of pitchers - 2 🌻


9-11. The young sprouts from the vaṭa udumbara, aśvattha, campaka, aśoka, śrīdruma, palāśa, arjuna, plakṣa, kadamba, bakula and mango trees should be brought and put in the eastern pitcher. The lotus, rocanā (a kind of yellow pigment), dūrvā grass, darbha grass, piñjala (yellow orpiment), the flowers jāti [jātī?] and kunda, (pieces of) sandal wood, red sandal, white mustard, tagara (a kind of herb), and rice should be put on the southern one.

12-14. Silver and gold and earth from the two banks of rivers flowing into the ocean especially the earth from the (river) Jāhnavi (Ganges), the urine of a cow, barley grains, paddy and sesamum should be placed in another pitcher. The viṣṇuparṇī, śyāmalatā, bhṛṅgarāja, śatāvarī, sahadevī, mahādevī, balā and vyāghnī (?), the auspicious things are put in the other pitcher in the north-east.

15. The earth from an ant-hill obtained from seven (different places should be put in another pitcher. The sand from the Ganges and its water should be put in another pitcher.

16. The earth loosened by the boars, bulls, and elephants. with their horns and tusks as well as earth from the root of the lotus and the kuśa grass should be placed in another pitcher.

17. One should put in another pitcher earth got from sacred places and hills. The flowers of nāgakeśara and kāśmira should be put in another pitcher.

18-19. Flowers together with the sandal wood, agallochum and camphor should be placed in another pitcher. (The gems) lapis lazuli, coral, pearl, crystal, and diamond should be put earlier in one pitcher and placed firmly by the holy priests. Another pitcher should be filled with the waters of the rivers and tanks.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment