🌹 19, MARCH 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 19, MARCH 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 19, MARCH 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 342 / Bhagavad-Gita - 342 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 04 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 189 / Agni Maha Purana - 189 🌹 🌻. కుంభాధివాసము - 4 / Consecration of pitchers - 4 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 054 / DAILY WISDOM - 054 🌹 🌻 23. సార్వత్రిక స్వీయ-అవగాహన / 23. Universal Self-Awareness🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 319 🌹
6) 🌹. శివ సూత్రములు - 56 / Siva Sutras - 56 🌹 
🌻 1.18 లోకానన్దః సమాధిసుఖమ్ - 2 / 1.18. lokānandaḥ samādhisukham - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 19, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat🌻*

*🍀. సూర్య మండల స్త్రోత్రం - 13 🍀*

*సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |*
*సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే*
*ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున* *సంవాదే సూర్యమండల స్తోత్రం సంపూర్ణం*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : శిరస్సు నందలి ధ్యానం - శిరస్సు నందు చేసే ధ్యానంలో ఏదైనా ఒక సంకల్పమందు నీ చిత్త మేకాగ్రం కావడం అవసరం. అది ఊర్ధ్వము నుండి పరమశాంతి నీలోనికి అవతరించాలనెడి పిలుపు కావచ్చు, లేక కానరాకుండా ఆవరించి యున్న ముసుగు తొలగి నీ చైతన్యం ఊర్ధ్వగతి నందుకోవాలనెడి పూనిక కావచ్చు. 🍀* 

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 08:08:33
వరకు తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: ధనిష్ట 22:04:55 వరకు
తదుపరి శతభిషం
యోగం: సిధ్ధ 20:07:20 వరకు
తదుపరి సద్య
కరణం: తైతిల 08:07:34 వరకు
వర్జ్యం: 04:05:40 - 05:31:56
మరియు 28:32:48 - 29:59:12
దుర్ముహూర్తం: 16:49:59 - 17:38:20
రాహు కాలం: 16:56:02 - 18:26:42
గుళిక కాలం: 15:25:22 - 16:56:02
యమ గండం: 12:24:02 - 13:54:42
అభిజిత్ ముహూర్తం: 12:00 - 12:48
అమృత కాలం: 12:43:16 - 14:09:32
సూర్యోదయం: 06:21:22
సూర్యాస్తమయం: 18:26:42
చంద్రోదయం: 04:33:39
చంద్రాస్తమయం: 16:11:05
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: మతంగ యోగం - అశ్వ
లాభం 22:04:55 వరకు తదుపరి రాక్షస
యోగం - మిత్ర కలహం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 342 / Bhagavad-Gita - 342 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 04 🌴*

*04. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా |*
*మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థిత: |*

🌷. తాత్పర్యం :
*సమస్తజగత్తు అవ్యక్తరూపమున నాచే ఆవరించబడియున్నది. జీవులన్నియు నా యందున్నవి, కాని నేను వాని యందు లేను.*

🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుడు జడమైన ఇంద్రియయములకు అనుభూతుడు కాదు. ఇదే విషయము ఈ క్రింది విధముగా తెలుపబడినది.

అత: శ్రీకృష్ణనామాది న భవేద్గ్రాహ్య మిన్ద్రియై: |
సేవోన్ముఖేహి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యద: ||

(భక్తిరాసామృతసింధువు 1.2.234)

శ్రీకృష్ణుని నామము, మహిమలు, లిలాదులు ఇంద్రియములచే అవగాహనకు రావు. తగిన నేతృత్వములో భక్తియుతసేవ యందు నిలిచిన మనుజునికే అతడు స్వయముగా విదితుడు కాగలడు. 

కనుకనే “ప్రేమాంజన చ్చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయన్తి” యని బ్రహ్మసంహిత యందు తెలుపబడినది. అనగా దేవదేవుడైన గోవిందుని యెడ దివ్యమైన ప్రేమను వృద్ధికావించుకొననివాడు ఆ భగవానుని సదా తన అంతర్బాహ్యములలో గాంచగలడు. సాధారణజనులకు అతడు గోచరుడు. ఆ భగవానుడు సర్వవ్యాపియై సర్వత్రా నిలిచియున్నను ఇంద్రియములచే అనుభూతుడు కాడని ఇచ్చట తెలుపబడినది. ఇదే విషయము “అవ్యక్తమూర్తినా” అను పదము ద్వారా ఇచ్చట సూచించబడినది. 

మనమాతనిని గాంచలేకున్నను వాస్తవమునకు సర్వము అతని యందు స్థితిని కలిగియున్నది. సప్తమాధ్యాయమున ఇదివరకే చర్చించినట్లు జగత్తంతయు అతని ఆధ్యాత్మికశక్తి, భౌతికశక్తుల కలయిక చేతనే ఏర్పడినది. సూర్యకాంతి విశ్వమంతటను వ్యాపించియున్నట్లు, శ్రీకృష్ణభగవానుని శక్తియు సృష్టియందంతటను వ్యాపించియండి, సమస్తము ఆ శక్తి యందు స్థితిని కలిగియున్నది. శ్రీకృష్ణభగవానుడు సర్వత్రా వ్యాపించి యుండుటచే తన వ్యక్తిగత రూపమును కోల్పోవునని ఎవ్వరును భావింపరాదు. 

అటువంటి వాదనను ఖండించుటకే ఆ భగవానుడు “సర్వత్రా నిలిచియున్న నా యందే సర్వము నిలిచియున్నను నేను సర్వమునకు పరుడనై యున్నను” అని పలికెను. ఆ భగవానుని వివిధశక్తుల విస్తారము వలననే జగత్తు సృజింప బడుచున్నది. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణభగవానుడు స్వీయప్రాతినిధ్యమైన తన వివిధశక్తుల విస్తారముచే సర్వత్రా నిలిచియుండును (విష్ట భ్యాహమిదం కృత్స్నమ్ ).
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 342 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 04 🌴*

*04 . mayā tatam idaṁ sarvaṁ jagad avyakta-mūrtinā*
*mat-sthāni sarva-bhūtāni na cāhaṁ teṣv avasthitaḥ*

🌷 Translation : 
*By Me, in My unmanifested form, this entire universe is pervaded. All beings are in Me, but I am not in them.*

🌹 Purport :
The Supreme Personality of Godhead is not perceivable through the gross material senses. It is said,

ataḥ śrī-kṛṣṇa-nāmādi
na bhaved grāhyam indriyaiḥ
sevonmukhe hi jihvādau
svayam eva sphuraty adaḥ

(Bhakti-rasāmṛta-sindhu 1.2.234)

Lord Śrī Kṛṣṇa’s name, fame, pastimes, etc., cannot be understood by material senses. Only to one who is engaged in pure devotional service under proper guidance is He revealed. In the Brahma-saṁhitā (5.38) it is stated, premāñjana-cchurita-bhakti-vilocanena santaḥ sadaiva hṛdayeṣu vilokayanti: one can see the Supreme Personality of Godhead, Govinda, always within himself and outside himself if one has developed the transcendental loving attitude towards Him. Thus for people in general He is not visible. Here it is said that although He is all-pervading, everywhere present, He is not conceivable by the material senses. 

This is indicated here by the word avyakta-mūrtinā. But actually, although we cannot see Him, everything is resting in Him. As we have discussed in the Seventh Chapter, the entire material cosmic manifestation is only a combination of His two different energies – the superior, spiritual energy and the inferior, material energy. Just as the sunshine is spread all over the universe, the energy of the Lord is spread all over the creation, and everything is resting in that energy.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 189 / Agni Maha Purana - 189 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 58*

*🌻. స్నపనాది విధానము - 1 🌻*

*హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఆచార్యుడు ఈశాన్యము నందు ఒక హోమకుండము నిర్మించి దానిలో వైష్ణవాగ్నిని స్థాపింపవలెను. గాయత్రీ మంత్రముతో నూట ఎనిమిది హోమములు చేసి సంపాతవిధిచే కలశలను ప్రోక్షించవలెను. మూర్తి పాలకులగు విద్వాంసులతోడను, శిల్పులతోడను కలిసి యజమానుడు, వాద్యములతో, శిల్పశాలకు వెళ్ళవెలను. అచట "విష్ణవేశిపివిష్టాయనమః" అను మంత్రముచ్చరించుచు, ఇష్టదేవతా ప్రతిమ కుడిచేతికి కౌతుక సూత్రము కట్టవలెను. ఆ సమయమున ఆచార్యుని హస్తమునకు గూడ ఉన్నిదారము, ఆవాలు, పట్టు వస్త్రము వీటితో కౌతుకము కట్టవలెను మండలముపై ఆప్రతిమను వస్త్రముచుట్టి స్థాపించి ఈ విధముగ స్తుతించవలెను.*

*"విశ్వకర్మ నిర్మించిన, దేవేశ్వరి యైన ఓ ప్రతిమా! నీకు నమస్కారము సమస్త జగత్తును ప్రభావితము చేయు ఓ జగదంబా! నీకు మాటిమాటికి నమస్కిరించుచున్నాను. ఈశ్వరీ! నేను నీపై నిరామయుడగు నారాయణుని పూజించుచున్నాను. నీ యందు శిల్పసంబధి దోషములేవియు లేకుండగాక. నా విషయమున సర్వదా సమృద్ధి శాలినివిగా ఉండుము". ప్రతిమను ఈ విధముగ ప్రార్థించి దానిని స్నానాగారమునకు తీసికొని వెళ్ళవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 189 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 58*
*🌻Consecration of the idol (snāna) - 1 🌻*

The lord said:

1-3. The priest should get ready a pit (for sacrificial fire) in the north-east. The fire relating to Viṣṇu should be kindled with (the recitation) of gāyatrī[1] one hundred and eight times. Having cleansed the pitchers thoroughly and established (the priest) he should go to the shed where the image has been made ready accompanied by the sculptors and custodians of the idol and along with music of (the instrument) tūrya. The woollen thread containing mustard seeds should be tied on the right arm (of the idol) with the syllables Viṣṇave śipiviṣṭāya[2] etc. The priest should also have a piece of silk cloth tied (to his arm).

4-5. Having placed the idol in the pavilion and having adored and worshipped the dressed idol (one has to say) “I bow to you the sovereign lady of celestials who has been made (ready) by Viśvakarman (the divine architect).” I make obeisance to you who is resplendant and is the sustainer of the entire universe. I worship in you the healthy Lord Nārāyaṇa.

6. Be thou always prosperous (goddess) devoid of defects due to the sculptors. Having submitted thus that idol should be carried to the bathing pavilion [i.e., snāna-maṇḍapa].

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 54 / DAILY WISDOM - 54 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 23. సార్వత్రిక స్వీయ-అవగాహన 🌻*

*చైతన్య జాగృతి జరిగినప్పుడు విశ్వం పట్ల ఒక అవగాహన దానంతట అదే వస్తుంది. ఈ అనందానుభవం సనంద సంపత్తి. సార్వజనీనమైన ఈ ఆనందంపై శ్రద్ధ వహిస్తున్న ఆత్మ చైతన్యం సస్మిత సమాపత్తి. ఇక్కడ వ్యక్తి యొక్క ప్రయత్నాలు ఉండవు. ధ్యానం చేయడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి వైపు నుండి ఎటువంటి ప్రయత్నం ఉండదు, ఎందుకంటే ఆ వ్యక్తే అసలు లేడు.*

*వ్యక్తిత్వాన్ని, విశ్వం యొక్క ప్రవాహం ద్వారా, భగవంతుడు స్వయంగా తీసుకువెళతాడు. ఒక వ్యక్తి అతీతమైన శక్తిని కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి తనకు తానుగా ఉండడు. అందుచేత తనపై తనకు ఎటువంటి బాధ్యతా ఉండదు. అందువల్ల, ఒకరు చేయగలిగేది లేదా చేయవలసినది ఏమీ ఉండదు. వ్యక్తి వ్యక్తిగా లేనందున 'చేయడం' అనే ప్రశ్నే ఉండదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 54 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 23. Universal Self-Awareness 🌻*

*There is a Universal Self-Awareness at this stage of the satisfaction that arises from consciousness in its essentiality. This joy-experience is sananda samapatti. The Self-Consciousness which is attending upon this joy universal is sasmita samapatti. Here the efforts of the individual do not continue. One need not have to struggle to meditate. There is no effort on the part of a person, because there is no person at all.*

*Individuality is carried by the current of the universe, of God Himself, if we would call it so. One is possessed by a Power that is super-individual. One is no more oneself, and therefore one has no responsibility over oneself. Hence, there is nothing that one can or need do. The very question of ‘doing’ ceases, as the individual is not there as a person.* 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 319 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆనందం ఆంతర్యంలోనిది. వ్యక్తిగతం. దాన్ని నీలోనే చూడవచ్చు. దానికి ఎవరి సాయం అక్కర్లేదు. ఒకసారి దాన్ని దర్శిస్తే నువ్వు విజేతవు. జీవితం ధగధగ లాడుతుంది. 🍀*

*ఆనందాన్ని దర్శించని వ్యక్తి ఓటమిలో జీవిస్తాడు. అతని జీవితమంతా చిరాకు, వైఫల్యం. జనాల ముఖాల్ని చూడండి. పెద్దగా అనిపిస్తూ, ముఖాల్ని వేలాడేసుకుని వుంటారు. ముసలితనం ముంచుకొచ్చినట్లుంటారు. దిగులుగా వుంటారు. కోపంగా వుంటారు. కారణం వాళ్ళ కలలు చెడిపోయివుంటాయి. ఆ వైఫల్యం జీవితంలో వుండదు. బాధ్యత వాళ్ళదే. అర్థరహితమయిన వాటిని అందుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అవి ధనం, గౌరవం, అధికారం. అవి అందుకోలేకపోతే ఆందోళనకు లోనవుతారు. అందుకుంటే మరింత ఆందోళనకు గురవుతారు. నిజానికి అందుకోవడం కన్నా అందుకోలేకపోవడం మేలు కనీసం అక్కడ ఆశ ఐనా వుంది. అందుకున్న వాడికి ఆశ వుండదు.*

*అందుకున్న వాటి మీదే అతడు సకల శక్తుల్నీ కేంద్రీకరిస్తాడు. వాటి నించీ బయటపడడు. ఆనందం ఆంతర్యంలోనిది. వ్యక్తిగతం. దాన్ని నీలోనే చూడవచ్చు. దానికి ఎవరి సాయం అక్కర్లేదు. ఒకసారి దాన్ని దర్శిస్తే నువ్వు విజేతవు. జీవితం ధగధగ లాడుతుంది. నీ అస్తిత్వ ఆకాశం నక్షత్రాల్లో నిండుతుంది. నీరసం లేని జీవితం జీవించినవాడు మరణంలోనూ నిండుగా వుంటుంది. మరణం ఒక విశ్రాంతి మాత్రమే. అది విశ్రాంతి సమయం. అనంతంలో ఐక్యమయ్యే సందర్భం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శివ సూత్రములు - 056 / Siva Sutras - 056 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 1.18 లోకానన్దః సమాధిసుఖమ్ - 2 🌻*
*🌴. అతని అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి (సమాధి) యొక్క ఆనందం మొత్తం విశ్వానికి ఆనందం.🌴*

*యోగికి బ్రహ్మానందమే విశ్వం అని ఈ సూత్రం చెబుతోంది. ఈ రకమైన యోగి నిరంతరంగా శివునిపై స్థిరమైన అవగాహనతో ఉండడం చాలా ముఖ్యం. అతడు శివుని దృష్టితో విశ్వాన్ని చూడాలి. ఈ సందర్భంలో సమాధిని మైమరపుగా వివరించినట్లయితే, ఒక యోగి అప్పుడప్పుడు సమాధి నుండి బయటకు వచ్చి ప్రాపంచిక పరిచయాన్ని పొందుతాడు. ఈ మైమరచిన స్థితిలో యోగి పూర్తి జాగ్రుదావస్థలో కాక చైతన్య స్థితి కాస్త సున్నితంగా ఉంటుంది. ఇది గాఢ నిద్రను పోలిన స్థితి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 056 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 1.18. lokānandaḥ samādhisukham - 2 🌻*
*🌴. The joy of his mystical trance (samādhi) is bliss for the whole universe.🌴*

*This sūtra says that the rejoicing in bliss is the universe for a yogi. It is important that a yogi of this type has to continuously remain in a state of constant awareness, fixed on Śiva. He has to look at the universe through the eyes of Śiva. If samādhi is explained as trance in this context, a yogi now and then comes out of trance and gets worldly acquaintance. Trance is explained as that state of mind in which consciousness is fragile and voluntary action is poor or missing; a state resembling deep sleep.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

No comments:

Post a Comment