శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 440 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 440 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 440 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 440 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀
🌻 440. 'కుమార గణనాథాంబా' - 1 🌻
కుమారునికి, గణపతికి తల్లి అని అర్థము. కుమారుడు శ్రీమాత ప్రేరణ వలన శివుని వీర్యము నుండి అగ్నిస్వరూపుడై ఉద్భవించెను. అతడు మహాశక్తి సంపన్నుడు. శక్తి అతని ఆయుధము. అతనిని మించిన శక్తివంతుడు సృష్టిలో లేడు. అతనిని మించిన అందగాడును లేడు. గణపతి శ్రీమాత సంకల్పము నుండి ఉద్భవించినవాడు. అతను మహాశక్తి సంపన్నుడే గాక బ్రహ్మవిద్యా స్వరూపుడు. అతనియందు శివశక్తులు పూర్ణానుగ్రహము కలిగి యుందురు. సిద్ధి బుద్ధుల కతడే దైవము. బ్రహ్మవిద్యకు కుమారునికి గురువై నిలచినవాడు. కుమారుడు గణపతి వద్దనే బ్రహ్మవిద్యను ఉపదేశముగా పొంది ఉపాసించి సుబ్రహ్మణ్యుడైనాడు. వీరిరువురును శ్రీమాత బిడ్డలే. ఇట్టి బిడ్డలుగల తల్లి సృష్టిని పరిపాలించుట అతి సులభము. సృష్టి కార్యములను వీరిరువురే చక్కబెట్టగలరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 440 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih
Shanti spastimati mantirnandini vignanashini ॥ 94 ॥ 🌻
🌻 440. Kumara gananadhanba - 1 🌻
It means the mother of Kumara and Ganapati. On Srimata's inspiration, Lord Kumara emerged from Lord Shiva's essence personified as fire. He is very powerful. Power is his weapon. There is no one more powerful than him in creation. There is no one more handsome than him either. Ganapati is born from the will of Srimata. He is the personification of Brahmavidya as he is endowed with great power. In him the powers of Shiva and Shakthi are fully blessed. He is the lord of Siddhi ( success) and Buddhi( intelligence). He was the Lord Kumara's teacher of Brahmavidya( occult knowledge). Lord Kumara received and practised Brahmavidya from Ganapati himself and was worshipped as Lord Subrahmanya. Both of them are the children of Srimata. It is very easy for the mother of these children to rule over creation. Both of them can oversee that the creation runs smoothly.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment