శ్రీ శివ మహా పురాణము - 807 / Sri Siva Maha Purana - 807


🌹 . శ్రీ శివ మహా పురాణము - 807 / Sri Siva Maha Purana - 807 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 23 🌴

🌻. పాతివ్రత్య భంగము - 5 🌻

సనత్కుమారుడిట్ల పలికెను- ఓ మునీ! మాయాపులందరిలో అగ్రగణ్యుడగు విష్ణువు ఆ ముని రూపములో నున్న వాడై ఆమె భర్తను బ్రతికించి వెంటనే అంతర్హితుడాయెను (36). వానిచే జీవింపచేయబడి లేచి నిలబడిన ఆ సముద్రనందనుడు వెంటనే బృందను కౌగిలించుకొని ప్రీతితో నిండిన మనస్సు గలవాడై ఆమె ముఖమును ముద్దాడెను (37). అపుడ బృందకూడా భర్తను గాంచి ఆనందముతో నిండిన మనస్సు గలదై శోకమునంతనూ విడనాడెను. ఆమె తన మనస్సులో ఆ వృత్తాంతము ఒక స్వప్నము వంటిదని భావించెను (38). ప్రసన్నమగు హృదయముగల ఆమె మనస్సులో కోర్కెలు చెలరేగెను. ఆమె ఆతనితో గూడి ఆ వనమధ్యములోనున్నదై అనేక దినములు రమించెను (39). ఒకనాడు విహారము అయిన తరువాత ఆతడు విష్ణువు అని గుర్తించి బృంద క్రోధముతో కూడినదై ఆతనిని నిందిస్తూ ఇట్లు పలికెను (40).

బృంద ఇట్లు పలికెను - ఓయీ హరీ! పరభార్యను ఈ తీరున కాంక్షించే నీ శీలమునకు నిందయగు గాక! తాపసుని వేషములో కనబడిన మాయావివి నీవే నని నేను చక్కగా గుర్తు పట్టినాను (41).

సనత్కుమారుడిట్లు పలికెను - ఓ వ్యాసా! పాతివ్రత్య పరాయణురాలగు ఆమె ఇట్లు పలికి మిక్కిలి కోపమును పొందినదై తన తేజస్సును ప్రదర్శిస్తూ కేశవుని శపించెను (42). ఓరీ! అధమాధమా! దైత్యశత్రూ! పరుల ధర్మమును చెడగొట్టు వాడా! మాయావీ! నేను ఇచ్చే, విషములన్నింటి కంటే తీక్‌ష్ణతరమైన శాపమును స్వీకరించుము (43).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 807 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 23 🌴

🌻 Outraging the modesty of Vṛndā - 5 🌻



Sanatkumāra said:—

36. After saying this and restoring him to life, O sage, that sage who was Viṣṇu the foremost among those who wield illusion vanished from the scene.

37. Jalandhara thus revived to life by him stood up. Delighted in mind he embraced Vṛndā and kissed her face.

38. On seeing her husband, Vṛndā too was delighted. She forgot her sorrow. She considered everything a dream.

39. Delighted in the heart and with all the dormant passions kindled up, she sported with him for many days in the middle of that forest.

40. Once at the end of the sexual intercourse she realised that it was Viṣṇu. Vṛndā rebuked him angrily and spoke thus.


Vṛndā said:—

41. Fie on this misdeed of Viṣṇu in outraging the modesty of another man’s wife. I have now realised you as the wielder of illusion, appearing in the guise of an ascetic.


Sanatkumāra said:—

42. O Vyāsa, saying thus in great anger she showed her brilliant powers as a staunch chaste lady by cursing Viṣṇu.

43. “O base foe of the Daityas, defiler of other people’s virtue, O wicked one, take this curse from me, greater in force than all persons.


Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment