శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 497, 498 / Sri Lalitha Chaitanya Vijnanam - 497, 498
. 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 497, 498 / Sri Lalitha Chaitanya Vijnanam - 497, 498 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 102. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥ 🍀
🌻 497. 'వజ్రాదికాయుధోపేత’ 🌻
వజ్రము మొదలగు ఆయుధములతో కూడినది శ్రీమాత అని అర్థము. వజ్రము, దండము, శక్తి, అభయము దాల్చిన చతుర్భుజిగా భావన చేయవలెను.
🌻 498. 'డామర్యాదిబిరావృతా' 🌻
డమరుకము ఆదిగా గల భీకర శబ్దములతో పరివేష్టించి యుండునది శ్రీమాత అని అర్ధము. పశుజనులకు భయభీతులు కలిగించుటకు శ్రీమాత డమరుక మొకటి చాలును. ఆ శబ్దమున దుష్టుల గుండెలు పగుల గలవు. శిష్టులకు అభయము కలిగించుచు దుష్టులకు భయము కలిగించునది. యిచ్చటి శ్రీమాత. డామరి మొదలగునవి పది శక్తులుగ వివరింపబడినవి. ఇవి భీకర శబ్ద కారకములు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 497, 498 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻102. Manipurabja nilaya vadanatraya sanyuta
vajradikayudhopeta dayaryadibhiravruta ॥ 102 ॥ 🌻
🌻 497. vajradikayudhopeta 🌻
Srimata has Vajra and other weapons. Vajra, Danda, Shakti and Abhaya should be thought of as a quadrilateral.
🌻 498. dayaryadibhiravruta 🌻
Srimata is surrounded by fierce sounds like the Damaruka. The damaruka is sufficient to strike fear in the animalistic people. The hearts of the wicked can break at that sound. Here Srimata is a source of security to the virtuous and a source of fear to the wicked. There are ten powers described as Damari etc. These cause fierce sounds.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment