శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 565 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 565 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 565 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 565 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀

🌻 565. 'మిత్రరూపిణీ' - 2 🌻


దర్శించ వలెనే గాని వృక్షములు, జంతువులు, పంచభూతములు, సూర్య చంద్రాదులు- యిట్టి ప్రజ్ఞ లన్నియూ నిజమగు మిత్రులే. నిత్యమూ సహాయపడుచూ తమ ఉనికిని గూడ గుర్తు చేయరు. వీరందరి రూపమున శ్రీమాతయే యున్నది. సద్గురువు రూపమున శ్రీమాత దరిచేరి వికాసము కలిగించి వృద్ధి సిద్ధుల నిచ్చును. అట్లే తల్లిదండ్రులునూ, ఇట్లెందరో స్నేహితులు రూపమున తన వృద్ధికి తోడ్పడు చుండగా తనకు మిత్రులెవ్వరూ లేరని, అందరూ శత్రువులే అని భావించువారి దౌర్భాగ్య మేమని చెప్పగలము. ఇట్లు బహురూపముల శ్రీమాత తోడునీడయై మిత్రరూపము దాల్చి సహకరించు చుండును. దీనిని గమనింపని వారికి మిత్ర లాభ ముండదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 565 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻

🌻 565. 'Mitraroopini' - 2 🌻


Trees, animals, the five elements, the Sun, the Moon, and other celestial entities—if seen through the right perspective—are all true friends. They constantly assist and serve, though they do not remind us of their presence. Sri Mata is present in the form of all these entities. She manifests as the Sadguru (True Teacher) and, through this form, provides growth and fulfillment. Similarly, parents and many friends support one’s progress. It would be unfortunate to think that one has no friends and that everyone is an enemy. Thus, Sri Mata, in her many forms, takes the shape of a friend, offering help and protection. Those who fail to recognize this will not benefit from the companionship of friends.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment