దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు అందరికి. Durga Navaratri Greetings to All.


🌹దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు అందరికి. Durga Navaratri Greetings to All. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


🍀 నవదుర్గలు -- ఆధ్యాత్మిక విశిష్టతలు 🍀


1. శైలపుత్రి:- ఆధ్యాత్మిక సాధన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియజేసేదే ''శైలపుత్రి''.

2. బ్రహ్మచారిణి:- నిరంతరం బ్రహ్మ తత్వంతో (శూన్యంతో), మూలాత్మతో అనుసంధానం అయి ఉండమని తెలియజేసేదే "బ్రహ్మచారిణి" తత్వం.

3. చంద్రఘంట:- ఎవరైతే మనస్సు నియంత్రణ కలిగి ఉంటారో వారికి 'త్రినేత్ర దృష్టి' ప్రాప్తిస్తుంది అని తెలియచేసే తత్వమే "చంద్రఘంట".

4. కూష్మాండ:- విశ్వంలోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే "కూష్మాండ".

5. స్కంద మాత:- సాధకులు తమలోని అరిషడ్వర్గాలను జయించాలి అని తెలియచేసే తత్వమే "స్కందమాత".

6. కాత్యాయని:- తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో త్రిగుణాలకు (సత్వ, రజో, తమో గుణాలకు) అతీతంగా సాధన చేయాలి అని తెలియజేసేదే "కాత్యాయని".

7. కాళరాత్రి:- ప్రతి అంతం... ఒక నవ ఆరంభానికి సంకేతం అని తెలియజేసేదే "కాళరాత్రి".

8. మహాగౌరీ:- మన ఆత్మ సాధన (ధ్యానం) మహా పాపాలను కూడా హరిస్తుంది అని తెలియజేసేదే "మహాగౌరీ".

9. సిద్దిధాత్రి:- ఆధ్యాత్మికత సర్వసిద్ధులను కలుగచేయును అని తెలియజేసే తత్వమే "సిద్ధిధాత్రి".



🌹🍲 నవరాత్రి అలంకారాలు, ప్రసాదాలు🍲 🌹

1.శ్రీ బాలత్రిపురసుందరిదేవి.

పొంగల్




2 .గాయత్రి దేవి

పులిహోర, బూరెలు



3 .అన్నపూర్ణా దేవి.

కొబ్బెరన్నం



4 .లలితా దేవి

బెల్లం అన్నం.



5 .మహాచండి

కదంబం ప్రసాదం



6 శ్రీ మహాలక్ష్మిదేవి

రవ్వ కేసరి, పంచామృతాలు.



7 .సరస్వతి ( మూల నక్షత్రం )

దద్ధోజనం, పాయసం


8. దుర్గాష్టామి

అల్లం గారెలు, పులిహోర



9. మహిషాసుర మర్ధిని

నిమ్మకాయ పులిహోర, పాయసం



10. రాజ రాజేశ్వరి దేవి ప్రసాదం

వివిధ ప్రసాదాలు



🌹🙏శ్రీ మాత్రే నమః 🙏🌹

🌹🌹🌹🌹🌹




No comments:

Post a Comment