🌹 03 OCTOBER 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹

🍀🌹 03 OCTOBER 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀
🌹దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు అందరికి. Durga Navaratri Greetings to All. - నవదుర్గలు -- ఆధ్యాత్మిక విశిష్టతలు  - ప్రసాదాలు 🌹
1) *🌹 శివ సూత్రాలు - 4వ సూత్రం: జ్ఞానాధిష్టానం మాతృక - 1. to 4 Shorts 🌹
2) *🌹 Shiva Sutras - 4th Sutra: Jnana Adhishtaanam Maatrika - 1 to 4 Shorts 🌹
3) *🌹 शिव सूत्र - चौथा सूत्र: ज्ञानाधिष्ठानम् मातृका - 1 to 4 Shorts. 🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 594 / Bhagavad-Gita - 594 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 23 / Chapter 16 - The Divine and Demoniac Natures - 23 🌴
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 990 / Vishnu Sahasranama Contemplation - 990 🌹*
🌻 990. స్రష్టా, स्रष्टा, Sraṣṭā 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 565 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 565 - 2 🌹 
🌻 565. 'మిత్రరూపిణీ' - 2 / 565. 'Mitraroopini' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు అందరికి. Durga Navaratri Greetings to All. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🍀 నవదుర్గలు -- ఆధ్యాత్మిక విశిష్టతలు 🍀*

*1. శైలపుత్రి:- ఆధ్యాత్మిక సాధన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియజేసేదే ''శైలపుత్రి''.*

*2. బ్రహ్మచారిణి:- నిరంతరం బ్రహ్మ తత్వంతో (శూన్యంతో), మూలాత్మతో అనుసంధానం అయి ఉండమని తెలియజేసేదే "బ్రహ్మచారిణి" తత్వం.*

*3. చంద్రఘంట:- ఎవరైతే మనస్సు నియంత్రణ కలిగి ఉంటారో వారికి 'త్రినేత్ర దృష్టి' ప్రాప్తిస్తుంది అని తెలియచేసే తత్వమే "చంద్రఘంట".*

*4. కూష్మాండ:- విశ్వంలోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే "కూష్మాండ".*

*5. స్కంద మాత:- సాధకులు తమలోని అరిషడ్వర్గాలను జయించాలి అని తెలియచేసే తత్వమే "స్కందమాత".*

*6. కాత్యాయని:- తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో త్రిగుణాలకు (సత్వ, రజో, తమో గుణాలకు) అతీతంగా సాధన చేయాలి అని తెలియజేసేదే "కాత్యాయని".*

*7. కాళరాత్రి:- ప్రతి అంతం... ఒక నవ ఆరంభానికి సంకేతం అని తెలియజేసేదే "కాళరాత్రి".*

*8. మహాగౌరీ:- మన ఆత్మ సాధన (ధ్యానం) మహా పాపాలను కూడా హరిస్తుంది అని తెలియజేసేదే "మహాగౌరీ".*

*9. సిద్దిధాత్రి:- ఆధ్యాత్మికత సర్వసిద్ధులను కలుగచేయును అని తెలియజేసే తత్వమే "సిద్ధిధాత్రి".*

*🌹🍲 నవరాత్రి అలంకారాలు, ప్రసాదాలు🍲 🌹*

1.శ్రీ బాలత్రిపురసుందరిదేవి.
పొంగల్ 

2 .గాయత్రి దేవి
పులిహోర, బూరెలు  

3 .అన్నపూర్ణా దేవి.
కొబ్బెరన్నం 

 4 .లలితా దేవి
బెల్లం అన్నం.

 5 .మహాచండి 
కదంబం ప్రసాదం

6 శ్రీ మహాలక్ష్మిదేవి 
రవ్వ కేసరి, పంచామృతాలు.

7 .సరస్వతి ( మూల నక్షత్రం )
 దద్ధోజనం, పాయసం 
 
8. దుర్గాష్టామి 
అల్లం గారెలు, పులిహోర 

9. మహిషాసుర మర్ధిని
నిమ్మకాయ పులిహోర, పాయసం 

10. రాజ రాజేశ్వరి దేవి ప్రసాదం 
వివిధ ప్రసాదాలు 

🌹🙏శ్రీ మాత్రే నమః 🙏🌹
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శివ సూత్రాలు - 4వ సూత్రం: జ్ఞానాధిష్టానం మాతృక - 1. శ్రీమాతయే ఆక్షరాలకి మూలం 🌹*

*🌹 శివ సూత్రాలు - 4వ సూత్రం: జ్ఞానాధిష్టానం మాతృక - 2. శక్తియే శబ్దబ్రహ్మ 🌹*

*🌹 శివ సూత్రాలు - 4వ సూత్రం: జ్ఞానాధిష్టానం మాతృక - 3. అంతిమ విముక్తి 🌹*

*🌹 శివ సూత్రాలు - 4వ సూత్రం: జ్ఞానాధిష్టానం మాతృక - 4. మాయా ముసుగు 🌹*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Shiva Sutras - 4th Sutra: Jnana Adhishtaanam Maatrika - 1. SriMata is the source of the alphabet 🌹*

*🌹 Shiva Sutras - 4th Sutra: Jnana Adhishtaanam Maatrika - 2. Shakti is Shabda Brahma 🌹*

*🌹 Shiva Sutras - 4th Sutra: Jnana Adhishtaanam Maatrika - 3. Ultimate Liberation 🌹*

*🌹 Shiva Sutras - 4th Sutra: Jnana Adhishtaanam Maatrika - 4. Veil of Maya 🌹*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 शिव सूत्र - चौथा सूत्र: ज्ञानाधिष्ठानम् मातृका - 1. श्रीमाता अक्षरों की मूल 🌹*

🌹 शिव सूत्र - चौथा सूत्र: ज्ञानाधिष्ठानम् मातृका - 2. शक्ति ही शब्दब्रह्म 🌹

*🌹 शिव सूत्र - चौथा सूत्र: ज्ञानाधिष्ठानम् मातृका - 3. अंतिम मुक्ति 🌹*

*🌹 शिव सूत्र - चौथा सूत्र: ज्ञानाधिष्ठानम् मातृका - 4. माया का आवरण 🌹*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 594 / Bhagavad-Gita - 594 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 23 🌴*

*23. య: శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారత: |*
*న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ||*

*🌷. తాత్పర్యం : శాస్త్రవిధులను త్యజించి తోచిన రీతిని వర్తించువాడు పూర్ణత్వమును గాని, సుఖమును గాని, పరమగతిని గాని పొందజాలడు.*

*🌷. భాష్యము : పూర్వము వివరించినట్లు మానవుల యందలి వివిధవర్ణములకు, ఆశ్రమములకు పలువిధములైన శాస్త్రవిధులు (శాస్త్రనిర్దేశములు) ఒసగబడియున్నవి. ప్రతియొక్కరు ఆ విధినియమములను తప్పక అనుసరింపవలెను. ఒకవేళ మనుజుడు వాటిని పాటింపక కామము, లోభము, కోరికల ననుసరించి తోచినరీతిలో వర్తించినచో జీవితమున ఎన్నడును పూర్ణత్వము నొందలేడు. అనగా మనుజుడు ఈ విషయముల నన్నింటిని సిద్దాంతరీతి తెలిసినను, తన జీవితమున వాటిని అమలుపరచక పోయినచో నరాధమునిగా తెలియబడగలడు. మానవజన్మ యందు జీవుడు బుద్ధిమంతుడై ఉన్నతపదమును పొందుటకు ఒసగబడిన విధినియమములను అనుసరింప వలసి యున్నది. అతడు వాటిని అనుసరింపనిచో తనను తాను పతనము కావించుకొనగలడు. ఒకవేళ అతడు విధినియమములను మరియు ధర్మనియమములను పాటించినను అంత్యమున శ్రీకృష్ణభగవానుని అవగాహన చేసికొనెడి స్థితికి అరుదెంచినచో అతని జ్ఞానము వ్యర్థమే కాగలదు.*

*భగవానుని అస్తిత్వమును అంగీకరించినను, ఆ పరమపురుషుని భక్తియుతసేవలో నిలువనిచో అతని యత్నములన్నియు వృథాయే కాగలవు. కనుక ప్రతియొక్కరు కృష్ణభక్తిభావానాస్థితికి మరియు భక్తియోగస్థాయికి క్రమముగా ఎదగవలెను. ఆ సమయముననే మరియు ఆ స్థితియందే మనుజుడు అత్యున్నత పూర్ణత్వమును పొందును గాని అన్యథా కాదు. ఇచ్చట “కామారత:” యని పదము మిగుల ప్రధానమైనది. తెలిసియే నియమములకు ఉల్లంఘించువాడు కామమునందు వర్తించునవాడగును. తాను చేయునది నిషిద్దమని తెలిసియు అతడు అట్లే వర్తించును. అట్టి వర్తనమే యథేష్టాచరణ మనబడును. తప్పక చేయవలసియున్న కార్యములను సైతము చేయకుండుట చేతనే అతడు చపలుడు లేదా చంచలుడని పిలువబడును. అట్టివారు దేవదేవునిచే తప్పక శిక్షింపబడుదురు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 594 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 23 🌴*

*23. yaḥ śāstra-vidhim utsṛjya vartate kāma-kārataḥ*
*na sa siddhim avāpnoti na sukhaṁ na parāṁ gatim*

*🌷 Translation : He who discards scriptural injunctions and acts according to his own whims attains neither perfection, nor happiness, nor the supreme destination.*

*🌹 Purport : As described before, the śāstra-vidhi, or the direction of the śāstra, is given to the different castes and orders of human society. Everyone is expected to follow these rules and regulations. If one does not follow them and acts whimsically according to his lust, greed and desire, then he never will be perfect in his life. In other words, a man may theoretically know all these things, but if he does not apply them in his own life, then he is to be known as the lowest of mankind. In the human form of life, a living entity is expected to be sane and to follow the regulations given for elevating his life to the highest platform, but if he does not follow them, then he degrades himself.*

*But even if he follows the rules and regulations and moral principles and ultimately does not come to the stage of understanding the Supreme Lord, then all his knowledge becomes spoiled. And even if he accepts the existence of God, if he does not engage himself in the service of the Lord his attempts are spoiled. Therefore one should gradually raise himself to the platform of Kṛṣṇa consciousness and devotional service; it is then and there that he can attain the highest perfectional stage, not otherwise.The word kāma-kārataḥ is very significant. A person who knowingly violates the rules acts in lust. He knows that this is forbidden, but still he acts. This is called acting whimsically. He knows that this should be done, but still he does not do it; therefore he is called whimsical. Such persons are destined to be condemned by the Supreme Lord. Such persons cannot have the perfection which is meant for the human life. The human life is especially meant for purifying one’s existence, and one who does not follow the rules and regulations cannot purify himself, nor can he attain the real stage of happiness.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 990 / Vishnu Sahasranama Contemplation - 990 🌹*

*🌻 990. స్రష్టా, स्रष्टा, Sraṣṭā 🌻*

*ఓం స్రష్ట్రే నమః | ॐ स्रष्ट्रे नमः | OM Sraṣṭre namaḥ*

*స్రష్టేతి సర్వలోకస్య సృష్టేర్విష్ణుస్సముచ్యతే*

*సర్వలోకములను సృజించు విష్ణుడు స్రష్టా అని చెప్పబడును.*

:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
ఉ. వేదవధూశిరో మహితవీథులఁ జాల నలంకరించు మీ
     పాదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు ని
     త్యోదితభక్తిమైఁ దగిలియుండు నుపాయ మెరుంగఁ బల్కు దా
     మోదర! భక్త దుర్భవపయోనిధితారణ! సృష్టికారణా! ( 753)

*దామోదరా! వేదాంత వీథులలో విహరించెడి నీ పాద పద్మములు మా హృదయములలో ఎల్లప్పుడును నిలి ఉండే ఉపాయమును మాకు అనుగ్రహింపుము. నీవు సంసార సాగరమును తరింప జేసెడివాడవు. ఈ సమస్త సృష్టికీ కారణమైయున్నవాడవు.*

*588. స్రష్టా, स्रष्टा, Sraṣṭā*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 990 🌹*

*🌻 990. Sraṣṭā 🌻*

*OM Sraṣṭre namaḥ*

*स्रष्टेति सर्वलोकस्य सृष्टेर्विष्णुस्समुच्यते / Sraṣṭeti sarvalokasya sr‌ṣṭerviṣṇussamucyate*

*As the Creator of all worlds, Lord Viṣṇu is called Sraṣṭā.*

:: श्रीमद्भागवते दशमस्कन्धे षट्पञ्चाशत्तमोऽध्यायः ::
त्वं हि विश्वसृजाम्‌स्रष्टा सृष्टानामपि यच्च सत् ।
कालः कलयतामीशः पर आत्मा तथात्मनाम् ॥ २७ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 56
Tvaṃ hi viśvasr‌jāmˈsraṣṭā sr‌ṣṭānāmapi yacca sat,
Kālaḥ kalayatāmīśaḥ para ātmā tathātmanām. 27.

*You are the ultimate creator of all creators of the universe, and of everything created You are the underlying substance. You are the subduer of all subduers, the Supreme Lord and Supreme Soul of all souls.*

588. స్రష్టా, स्रष्टा, Sraṣṭā

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥
ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 565 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 565 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।*
*మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀*

*🌻 565. 'మిత్రరూపిణీ' - 2 🌻*

*దర్శించ వలెనే గాని వృక్షములు, జంతువులు, పంచభూతములు, సూర్య చంద్రాదులు- యిట్టి ప్రజ్ఞ లన్నియూ నిజమగు మిత్రులే. నిత్యమూ సహాయపడుచూ తమ ఉనికిని గూడ గుర్తు చేయరు. వీరందరి రూపమున శ్రీమాతయే యున్నది. సద్గురువు రూపమున శ్రీమాత దరిచేరి వికాసము కలిగించి వృద్ధి సిద్ధుల నిచ్చును. అట్లే తల్లిదండ్రులునూ, ఇట్లెందరో స్నేహితులు రూపమున తన వృద్ధికి తోడ్పడు చుండగా తనకు మిత్రులెవ్వరూ లేరని, అందరూ శత్రువులే అని భావించువారి దౌర్భాగ్య మేమని చెప్పగలము. ఇట్లు బహురూపముల శ్రీమాత తోడునీడయై మిత్రరూపము దాల్చి సహకరించు చుండును. దీనిని గమనింపని వారికి మిత్ర లాభ ముండదు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 565 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha*
*mrugashi mohini mudhya mrudani mitrarupini  ॥114 ॥ 🌻*

*🌻 565. 'Mitraroopini' - 2 🌻*

*Trees, animals, the five elements, the Sun, the Moon, and other celestial entities—if seen through the right perspective—are all true friends. They constantly assist and serve, though they do not remind us of their presence. Sri Mata is present in the form of all these entities. She manifests as the Sadguru (True Teacher) and, through this form, provides growth and fulfillment. Similarly, parents and many friends support one’s progress. It would be unfortunate to think that one has no friends and that everyone is an enemy. Thus, Sri Mata, in her many forms, takes the shape of a friend, offering help and protection. Those who fail to recognize this will not benefit from the companionship of friends.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment