విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 122, 123 / Vishnu Sahasranama Contemplation - 122, 123


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 122, 123 / Vishnu Sahasranama Contemplation - 122, 123 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻122. మహాతపాః, महातपाः, Mahātapāḥ🌻

ఓం మహాతపసే నమః | ॐ महातपसे नमः | OM Mahātapase namaḥ

Mahātapāḥమహత్తత్సృజ్యవిషయం తపో జ్ఞానం హి యస్య సః ।

ఉతైశ్వర్యం ప్రతోపో వా తపో యస్య మహచ్చ సః ॥

జ్ఞానమయమూ, సృజింపబడు విశ్వములు విషయములుగా గలదియూ అగు మహా తపస్సు ఎవనికి కలదో అట్టివాడు. లేదా తపము అనగా ఐశ్వర్యము అని అర్థము. గొప్పదియగు ఐశ్వర్యము ఎవనికి కలదో అట్టివాడు. లేదా తపః అనగా ప్రతాపము. గొప్పదియగు ప్రతాపము ఎవనికి కలదో అట్టివాడు మహాతపాః.

:: ముణ్డకోపనిషత్ - ప్రథమ ముణ్డకే, ప్రథమః ఖండః ::

య సర్వజ్ఞః సర్వవిద్యస్య జ్ఞానమయం తపః ।

తస్మాదే త ద్బ్రహ్మ నామ రూపమన్నం చ జాయతే ॥ 9 ॥

స్వీయ సంకల్పమే జ్ఞాన స్వరూపమైనది కావున, ఎవడు సమస్త జగత్తుయొక్క ప్రవర్తనను తెలిసికొనుచు, ప్రతిచోట ప్రతి క్షణము జరుగుచున్న ప్రతి విషయమును గ్రహించుచున్నాడో, అట్టి పరమాత్మ నుండి, ఈ సృష్టికర్తయగు బ్రహ్మయు, ఈ నామరూపాత్మకమగు విశ్వము, అన్నాది ఆహారములు మున్నగునవి అన్నియు ఉద్భవించినవి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 122 🌹

📚. Prasad Bharadwaj

🌻122. Mahātapāḥ🌻

OM Mahātapase namaḥ

Mahattatsr̥jyaviṣayaṃ tapo jñānaṃ hi yasya saḥ,
Utaiśvaryaṃ pratopo vā tapo yasya mahacca saḥ.

महत्तत्सृज्यविषयं तपो ज्ञानं हि यस्य सः ।
महत्तत्सृज्यविषयं तपो ज्ञानं हि यस्य सः ।
उतैश्वर्यं प्रतोपो वा तपो यस्य महच्च सः ॥

The austerity connected with creation, which is of the nature of knowledge is of great potency. Or tapas may mean opulence. Hence the divine name can also be interpreted as glorifying the One whose opulence is the greatest. In a different sense, tapas also indicates valor. Thus the name also may be considered as describing Him to be the One with great valor.

Muṇḍakopaniṣat - Muṇḍaka 1, Canto 1

Ya sarvajñaḥ sarvavidyasya jñānamayaṃ tapaḥ,
Tasmāde ta dbrahma nāma rūpamannaṃ ca jāyate. (9)

:: मुण्डकोपनिषत् - प्रथम मुण्डके, प्रथमः खंडः ::

य सर्वज्ञः सर्वविद्यस्य ज्ञानमयं तपः ।

तस्मादे त द्ब्रह्म नाम रूपमन्नं च जायते ॥ ९ ॥

From Him, who is omniscient in general and all-knowing in detail whose austerity is constituted by knowledge, evolve this Brahman, name, color and food.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिश्शुचिश्रवाः ।अमृतश्शाश्वत स्स्थाणुर्वरारोहो महातपाः ॥ १३ ॥

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశ్శుచిశ్రవాః ।అమృతశ్శాశ్వత స్థ్సాణుర్వరారోహో మహాతపాః ॥ ౧౩ ॥

Rudro bahuśirā babhrurviśvayoniśśuciśravāḥ।Amr̥taśśāśvata ssthāṇurvarāroho mahātapāḥ ॥ 13 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 123 / Vishnu Sahasranama Contemplation - 123 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻123. సర్వగః, सर्वगः, Sarvagaḥ🌻

ఓం సర్వగాయ నమః | ॐ सर्वगाय नमः | OM Sarvagāya namaḥ

కారణత్వేన సర్వత్ర వ్యాప్తత్వాత్ సర్వత్ర గచ్ఛతి ఇతి సర్వదృశ్యజగత్తునకును కారణరూపుడుగా సర్వత్ర వ్యాపించియుండు వాడు గావున విష్ణువు అంతటను పోవు వాడు లేదా చేరియుండువాడు. అన్ని చోట్ల అన్ని కాలములలో ఉపాదాన కారణ రూపుడగుటచే కార్యములందుండు వాడగుటచే సర్వగః అని విష్ణువే చెప్పబడును.

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::

యిట్టి దేహంబునందున్న యాత్మ యేకంబును, శుద్ధ స్వరూపంబును, స్వయంజ్యోతియు, నిర్గుణంబును, గుణాశ్రయంబును, వ్యాప్య వ్యాపకంబును, నసంవృతంబును, సాక్షిభూతంబును, నిరాత్మంబును నగు, దీని దేహంబుకంటె వేరుగా నెవ్వండు దెలియు వాఁడు మత్పరుం డగుటం జేసి దేహధారియై యుండియుఁ దద్గుణంబులం బొరయక వర్తించు.

దేహమునందలి ఆత్మ శుద్ధ స్వరూపము గలది. అది యేకంబును, శుద్ధ స్వరూపంబును, స్వయంజ్యోతియు, నిర్గుణంబును, గుణాశ్రయంబును, సర్వ వ్యాపకంబును, జడములచే కప్పబడినిదీ, సాక్షిభూతంబును, నిరాత్మంబైనది. కాబట్టి ఆత్మను దేహంకంటే వేరని భావించేవాడు నా యందు భక్తి పెంచుకుంటాడు. అందువల్ల దేహధారి అయినప్పటికీ దేహ గుణాలను పొందడు.

:: శ్రీమద్దేవీభాగవతే ప్రథమస్కన్ధే అష్టమోఽధ్యాయః ::

దేవేషు విష్ణుః కథితః సర్వగః సర్వపాలకః ।

యతో విరాడిదం సర్వముత్పన్నం సచరాచరమ్ ॥ 14 ॥

దేవతలలో విష్ణు భగవానుడే సర్వవ్యాపియై అన్ని భూతములను రక్షించువాడు. ఆయనద్వారానే సమస్త చరాచర విరాట్ సంసార సృష్టి జరిగినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 123 🌹

📚. Prasad Bharadwaj

🌻123. Sarvagaḥ🌻

OM Sarvagāya namaḥ

Kāraṇatvena sarvatra vyāptatvāt sarvatra gacchati iti / कारणत्वेन सर्वत्र व्याप्तत्वात् सर्वत्र गच्छति इति He who goes or is everywhere and is all-pervading as the cause of everything.

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 20

Ekaḥ śuddhaḥ svayaṃjyotirnirguṇo’sau guṇāśrayaḥ,

Sarvago’nāvr̥taḥ sākṣī nirātmātmātmanaḥ paraḥ. (7)

:: श्रीमद्भागवते चतुर्तस्कन्धे विंशोऽध्यायः ::

एकः शुद्धः स्वयंज्योतिर्निर्गुणोऽसौ गुणाश्रयः ।

सर्वगोऽनावृतः साक्षी निरात्मात्मात्मनः परः ॥ ७ ॥

The individual soul is one, Pure, non-material and self-effulgent. He is the reservoir of all good qualities, and He is all-pervading. He is without material covering, and He is the witness of all activities. He is completely distinguished from other living entities, and He is transcendental to all embodied souls.

:: श्रीमद्देवीभागवते प्रथमस्कन्धे अष्टमोऽध्यायः ::

देवेषु विष्णुः कथितः सर्वगः सर्वपालकः ।

यतो विराडिदं सर्वमुत्पन्नं सचराचरम् ॥ १४ ॥

Śrīmad Devī Bhāgavata - Book 1, Chapter 8

Deveṣu Viṣṇuḥ kathitaḥ sarvagaḥ sarvapālakaḥ,

Yato virāḍidaṃ sarvamutpannaṃ sacarācaram. 14.

Amongst the divinities, Lord Viṣṇu alone is known to be the protector of all being all pervasive. The total massive animate and inanimate creation is His.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

सर्वगस्सर्वविद्भानु र्विष्वक्सेनो जनार्धनः ।वेदो वेदविदव्यंगो वेदांगो वेदवित्कविः ॥ १४ ॥

సర్వగస్సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్ధనః ।వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ ౧౪ ॥

Sarvagassarvavidbhānu rviṣvakseno janārdhanaḥ ।Vedo vedavidavyaṃgo vedāṃgo vedavitkaviḥ ॥ 14 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


22 Nov 2020

No comments:

Post a Comment