🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 114 / Sri Gajanan Maharaj Life History - 114 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 21వ అధ్యాయము - 2 🌻
శ్రీగజానన్ మహారాజు తనమందిర నిర్మాణంలో ఎవరికీ హానిజరగనివ్వలేదు. ఈఘటనవల్ల శ్రీమహారాజు చేతిస్పర్శ పొందిన ఆపనివాడు చాలా అదృష్టవంతుడు. క్షుద్రశక్తుల ప్రభావితురాలయిన ఒక రాజ్పుత్ స్త్రీ జైపూరునుండి షేగాం వచ్చింది.
దత్తాత్రేయ భగవానుడు, శ్రీరామనవమి రోజున షేగాం వెళ్ళి శ్రీగజానన్ మహారాజు కృపతో ఆ క్షుద్రశక్తుల నుండి విముక్తి పొందవలసిందిగా ఆమెను ప్రేరేపించారు. ఆవిధంగా ఆమె రామనవమి రోజున షేగాంకి వచ్చింది.
చైత్రమాసం పాడ్యమి రోజునుండి రామనవమి ఉత్సవాలు అక్కడ ఆరంభంఅయి, నవమిరోజున రాముని జన్మదినం జరిపేందుకు చాలామంది జనం గుమిగూడారు. ఆ సమయంలో సభామండపం పనిజరుగుతూ ఉండడంవల్ల 1.5 5 అడుగుల కొలతగల రాయిస్తంభాలు, సరిఅయిన ఆధారంలేకుండా ఉంచబడి శ్రీరామనవమి ఉత్సవాల కారణంగా పని తాత్కాలికంగా ఆపివెయ్యడంతో వాటిని అక్కడ అలానే వదిలి వేసారు.
శ్రీరాముని జననం అయిన తరువాత, జనం అంతా ప్రసాదం కోసం దూసుకు పోవడం ప్రారంభించారు. ఆ స్త్రీ తన ఇద్దరు పిల్లలతో సురక్షితం కోసం ఒకస్తంభం ప్రక్కకి వెళ్ళింది కానీ ఆ స్తంభం ఆమె మీద, పిల్లలమీద పడింది. ఆ స్తంభం బరువుతో ఆమె మరణించి ఉంటుందని ప్రజలు భయపడ్డారు.
ఆమె ఎక్కడ ఉందో ఎవరికీ తెలియలేదు. వాళ్ళు ఆ స్తంభం నిలబెట్టి ఆమెను బయటకుతీసి త్రాగేందుకు కొంచెం నీళ్ళు ఇచ్చారు. తరువాత ఆమెను జీసస్ క్రైస్తు భక్తురాలు, మంచి శస్త్ర చికిత్స చేసే డా. లోబో దగ్గరకు తీసుకు వెళ్ళారు.
ఆమె ఆ స్త్రీని పరీక్షచేసి ఆస్తంభం మీద పడినప్పటికీ ఏవిధంగా గాయపడకపోవడం చూసి ఆశ్చర్య పోయింది. ఆస్తంభం అలామీద పడడానికి ప్రత్యేకత వేరే ఉంది. శ్రీ మహారాజు స్తంభం ఆమె మీద పడనిస్తూ ఆమె శరీరంలోనుండి క్షుద్రశక్తిని విముక్తిచేసారు. ఆవిధంగా క్షుద్రశక్తినుండి పూర్తిగా బయటపడ్డ ఆ స్త్రీ జైపూరు తిరిగి వెళ్ళిపోయింది.
ఇదే విధంగా శ్రీమహారాజు మందిరంలో ఒక పండుగ సందర్భంలో ఒక పెద్ద చెక్కదిమ్మ శ్రీనాయక్ నవారా తలమీద పడింది. కానీ అతను శ్రీగజానన్ మహారాజు కృపవల్ల చమత్కారంగా గాయపడకుండా తప్పించుకున్నాడు. కృష్ణాజిపాటిల్ కుమారుడయిన రామచంద్ర శ్రీమహారాజు యొక్క నిజమయిన భక్తుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Gajanan Maharaj Life History - 114 🌹
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
🌻 Chapter 21 - part 2 🌻
A Rajput lady, afflicted by an evil spirit had come to Shegaon from Jaipur. God Dattatraya had inspired her to go to Shegaon on Ramnavami day to get rid of that spirit by the grace of Shri Gajanan Maharaj. She accordingly came to Shegaon on Ramnavami day.
The celebrations of Ramnavami had started there from first day, i.e. Pratipada of Chaitra, and on the Navami a huge crowd had gathered to celebrate the birth of God Rama. At that time the construction work of the Sabhamandapam was in progress and huge stone pillars, measuring 5 feet by 11/2 feet were kept there without any proper support, as the work was suspended temporarily for Shri Ramnavami celebrations.
After the birth of Shri Ram was celebrated, the crowd rushed for Prasad. The lady, with her two children, went to one of the pillers for safety. However, that piller itself fell on her and her two children. People feared that she must have died by the weight of the piller. Nobody knew her where abouts; they lifted the piller, took her out and gave her some water to drink.
She was then taken to Dr. Lobo, a devotee of Jesus Christ, and a very good surgeon. She examined that lady and was surprised to see her unhurt after the stone piller had fallen on her. The falling of that piller on her had a different significance. Shri Gajanan Maharaj , by letting that piller fall on her, had liberated the evil spirit from her body. Then having gotten completely rid of that spirit, the lady went back to Jaipur.
Similarly on the occasion of another festival at the temple of Shri Gajanan Maharaj a huge wooden beam had fallen on the head of Shri Naik Nawara, who had, miraculously, escaped unhurt by the grace of Shri Gajanan Maharaj. Ramchandra, son of Krisnaji Patil, was a sincere devotee of Shri Gajanan Maharaj
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
22 Nov 2020
No comments:
Post a Comment