22-NOVEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 556 / Bhagavad-Gita - 556 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 122, 123 / Vishnu Sahasranama Contemplation - 122, 123🌹
3)🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 41 / Sri Devi Mahatyam - Durga Saptasati - 41🌹 
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 110🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 129 🌹
6) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 116 / Gajanan Maharaj Life History - 116🌹
7) *🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 56 🌹* 
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 102, 103 / Sri Lalita Chaitanya Vijnanam - 102, 103 🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 468 / Bhagavad-Gita - 468🌹

10) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 82 📚
11) 🌹. శివ మహా పురాణము - 280🌹
12) 🌹 Light On The Path - 35🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 167🌹
14) 🌹. శివగీత - 121 / The Siva-Gita - 121🌹* 
15) 🌹 Seeds Of Consciousness - 231 🌹   
16) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 106 🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 70 / Sri Vishnu Sahasranama - 70 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 556 / Bhagavad-Gita - 556 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 23 🌴*

23. య: శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారత: |
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ||

🌷. తాత్పర్యం : 
శాస్త్రవిధులను త్యజించి తోచిన రీతిని వర్తించువాడు పూర్ణత్వమును గాని, సుఖమును గాని, పరమగతిని గాని పొందజాలడు.

🌷. భాష్యము :
పూర్వము వివరించినట్లు మానవుల యందలి వివిధవర్ణములకు, ఆశ్రమములకు పలువిధములైన శాస్త్రవిధులు (శాస్త్రనిర్దేశములు) ఒసగబడియున్నవి. ప్రతియొక్కరు ఆ విధినియమములను తప్పక అనుసరింపవలెను. ఒకవేళ మనుజుడు వాటిని పాటింపక కామము, లోభము, కోరికల ననుసరించి తోచినరీతిలో వర్తించినచో జీవితమున ఎన్నడును పూర్ణత్వము నొందలేడు. 

అనగా మనుజుడు ఈ విషయముల నన్నింటిని సిద్దాంతరీతి తెలిసినను, తన జీవితమున వాటిని అమలుపరచక పోయినచో నరాధమునిగా తెలియబడగలడు. మానవజన్మ యందు జీవుడు బుద్ధిమంతుడై ఉన్నతపదమును పొందుటకు ఒసగబడిన విధినియమములను అనుసరింపవలసియున్నది. 

అతడు వాటిని అనుసరింపనిచో తనను తాను పతనము కావించుకొనగలడు. ఒకవేళ అతడు విధినియమములను మరియు ధర్మనియమములను పాటించినను అంత్యమున శ్రీకృష్ణభగవానుని అవగాహన చేసికొనెడి స్థితికి అరుదెంచినచో అతని జ్ఞానము వ్యర్థమే కాగలదు. 

భగవానుని అస్తిత్వమును అంగీకరించినను, ఆ పరమపురుషుని భక్తియుతసేవలో నిలువనిచో అతని యత్నములన్నియు వృథాయే కాగలవు. కనుక ప్రతియొక్కరు కృష్ణభక్తిభావానాస్థితికి మరియు భక్తియోగస్థాయికి క్రమముగా ఎదగవలెను. ఆ సమయముననే మరియు ఆ స్థితియందే మనుజుడు అత్యున్నత పూర్ణత్వమును పొందును గాని అన్యథా కాదు.

ఇచ్చట “కామారత:” యని పదము మిగుల ప్రధానమైనది. తెలిసియే నియమములకు ఉల్లంఘించువాడు కామమునందు వర్తించునవాడగును. 

తాను చేయునది నిషిద్దమని తెలిసియు అతడు అట్లే వర్తించును. అట్టి వర్తనమే యథేష్టాచరణ మనబడును. తప్పక చేయవలసియున్న కార్యములను సైతము చేయకుండుట చేతనే అతడు చపలుడు లేదా చంచలుడని పిలువబడును. అట్టివారు దేవదేవునిచే తప్పక శిక్షింపబడుదురు. 

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 556 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 23 🌴*

23. yaḥ śāstra-vidhim utsṛjya
vartate kāma-kārataḥ
na sa siddhim avāpnoti
na sukhaṁ na parāṁ gatim

🌷 Translation : 
He who discards scriptural injunctions and acts according to his own whims attains neither perfection, nor happiness, nor the supreme destination.

🌹 Purport :
As described before, the śāstra-vidhi, or the direction of the śāstra, is given to the different castes and orders of human society. Everyone is expected to follow these rules and regulations. If one does not follow them and acts whimsically according to his lust, greed and desire, then he never will be perfect in his life. 

In other words, a man may theoretically know all these things, but if he does not apply them in his own life, then he is to be known as the lowest of mankind. In the human form of life, a living entity is expected to be sane and to follow the regulations given for elevating his life to the highest platform, but if he does not follow them, then he degrades himself. But even if he follows the rules and regulations and moral principles and ultimately does not come to the stage of understanding the Supreme Lord, then all his knowledge becomes spoiled. 

And even if he accepts the existence of God, if he does not engage himself in the service of the Lord his attempts are spoiled. Therefore one should gradually raise himself to the platform of Kṛṣṇa consciousness and devotional service; it is then and there that he can attain the highest perfectional stage, not otherwise.

The word kāma-kārataḥ is very significant. A person who knowingly violates the rules acts in lust. He knows that this is forbidden, but still he acts. This is called acting whimsically. He knows that this should be done, but still he does not do it; therefore he is called whimsical. Such persons are destined to be condemned by the Supreme Lord. Such persons cannot have the perfection which is meant for the human life. 

The human life is especially meant for purifying one’s existence, and one who does not follow the rules and regulations cannot purify himself, nor can he attain the real stage of happiness.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 122, 123 / Vishnu Sahasranama Contemplation - 122, 123 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻122. మహాతపాః, महातपाः, Mahātapāḥ🌻*

*ఓం మహాతపసే నమః | ॐ महातपसे नमः | OM Mahātapase namaḥ*

Mahātapāḥమహత్తత్సృజ్యవిషయం తపో జ్ఞానం హి యస్య సః ।
ఉతైశ్వర్యం ప్రతోపో వా తపో యస్య మహచ్చ సః ॥

జ్ఞానమయమూ, సృజింపబడు విశ్వములు విషయములుగా గలదియూ అగు మహా తపస్సు ఎవనికి కలదో అట్టివాడు. లేదా తపము అనగా ఐశ్వర్యము అని అర్థము. గొప్పదియగు ఐశ్వర్యము ఎవనికి కలదో అట్టివాడు. లేదా తపః అనగా ప్రతాపము. గొప్పదియగు ప్రతాపము ఎవనికి కలదో అట్టివాడు మహాతపాః.

:: ముణ్డకోపనిషత్ - ప్రథమ ముణ్డకే, ప్రథమః ఖండః ::
య సర్వజ్ఞః సర్వవిద్యస్య జ్ఞానమయం తపః ।
తస్మాదే త ద్బ్రహ్మ నామ రూపమన్నం చ జాయతే ॥ 9 ॥

స్వీయ సంకల్పమే జ్ఞాన స్వరూపమైనది కావున, ఎవడు సమస్త జగత్తుయొక్క ప్రవర్తనను తెలిసికొనుచు, ప్రతిచోట ప్రతి క్షణము జరుగుచున్న ప్రతి విషయమును గ్రహించుచున్నాడో, అట్టి పరమాత్మ నుండి, ఈ సృష్టికర్తయగు బ్రహ్మయు, ఈ నామరూపాత్మకమగు విశ్వము, అన్నాది ఆహారములు మున్నగునవి అన్నియు ఉద్భవించినవి.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 122🌹*
📚. Prasad Bharadwaj

*🌻122. Mahātapāḥ🌻*

*OM Mahātapase namaḥ*

Mahattatsr̥jyaviṣayaṃ tapo jñānaṃ hi yasya saḥ,
Utaiśvaryaṃ pratopo vā tapo yasya mahacca saḥ.

महत्तत्सृज्यविषयं तपो ज्ञानं हि यस्य सः ।

महत्तत्सृज्यविषयं तपो ज्ञानं हि यस्य सः ।
उतैश्वर्यं प्रतोपो वा तपो यस्य महच्च सः ॥

The austerity connected with creation, which is of the nature of knowledge is of great potency. Or tapas may mean opulence. Hence the divine name can also be interpreted as glorifying the One whose opulence is the greatest. In a different sense, tapas also indicates valor. Thus the name also may be considered as describing Him to be the One with great valor.

Muṇḍakopaniṣat - Muṇḍaka 1, Canto 1
Ya sarvajñaḥ sarvavidyasya jñānamayaṃ tapaḥ,
Tasmāde ta dbrahma nāma rūpamannaṃ ca jāyate. (9)

:: मुण्डकोपनिषत् - प्रथम मुण्डके, प्रथमः खंडः ::
य सर्वज्ञः सर्वविद्यस्य ज्ञानमयं तपः ।
तस्मादे त द्ब्रह्म नाम रूपमन्नं च जायते ॥ ९ ॥ 

From Him, who is omniscient in general and all-knowing in detail whose austerity is constituted by knowledge, evolve this Brahman, name, color and food.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिश्शुचिश्रवाः ।अमृतश्शाश्वत स्स्थाणुर्वरारोहो महातपाः ॥ १३ ॥

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశ్శుచిశ్రవాః ।అమృతశ్శాశ్వత స్థ్సాణుర్వరారోహో మహాతపాః ॥ ౧౩ ॥

Rudro bahuśirā babhrurviśvayoniśśuciśravāḥ।Amr̥taśśāśvata ssthāṇurvarāroho mahātapāḥ ॥ 13 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 123 / Vishnu Sahasranama Contemplation - 123🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻123. సర్వగః, सर्वगः, Sarvagaḥ🌻*

*ఓం సర్వగాయ నమః | ॐ सर्वगाय नमः | OM Sarvagāya namaḥ*

కారణత్వేన సర్వత్ర వ్యాప్తత్వాత్ సర్వత్ర గచ్ఛతి ఇతి సర్వదృశ్యజగత్తునకును కారణరూపుడుగా సర్వత్ర వ్యాపించియుండు వాడు గావున విష్ణువు అంతటను పోవు వాడు లేదా చేరియుండువాడు. అన్ని చోట్ల అన్ని కాలములలో ఉపాదాన కారణ రూపుడగుటచే కార్యములందుండు వాడగుటచే సర్వగః అని విష్ణువే చెప్పబడును.

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::

యిట్టి దేహంబునందున్న యాత్మ యేకంబును, శుద్ధ స్వరూపంబును, స్వయంజ్యోతియు, నిర్గుణంబును, గుణాశ్రయంబును, వ్యాప్య వ్యాపకంబును, నసంవృతంబును, సాక్షిభూతంబును, నిరాత్మంబును నగు, దీని దేహంబుకంటె వేరుగా నెవ్వండు దెలియు వాఁడు మత్పరుం డగుటం జేసి దేహధారియై యుండియుఁ దద్గుణంబులం బొరయక వర్తించు.

దేహమునందలి ఆత్మ శుద్ధ స్వరూపము గలది. అది యేకంబును, శుద్ధ స్వరూపంబును, స్వయంజ్యోతియు, నిర్గుణంబును, గుణాశ్రయంబును, సర్వ వ్యాపకంబును, జడములచే కప్పబడినిదీ, సాక్షిభూతంబును, నిరాత్మంబైనది. కాబట్టి ఆత్మను దేహంకంటే వేరని భావించేవాడు నా యందు భక్తి పెంచుకుంటాడు. అందువల్ల దేహధారి అయినప్పటికీ దేహ గుణాలను పొందడు.

:: శ్రీమద్దేవీభాగవతే ప్రథమస్కన్ధే అష్టమోఽధ్యాయః ::
దేవేషు విష్ణుః కథితః సర్వగః సర్వపాలకః ।
యతో విరాడిదం సర్వముత్పన్నం సచరాచరమ్ ॥ 14 ॥

దేవతలలో విష్ణు భగవానుడే సర్వవ్యాపియై అన్ని భూతములను రక్షించువాడు. ఆయనద్వారానే సమస్త చరాచర విరాట్ సంసార సృష్టి జరిగినది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 123🌹*
📚. Prasad Bharadwaj

*🌻123. Sarvagaḥ🌻*

*OM Sarvagāya namaḥ*

Kāraṇatvena sarvatra vyāptatvāt sarvatra gacchati iti / कारणत्वेन सर्वत्र व्याप्तत्वात् सर्वत्र गच्छति इति He who goes or is everywhere and is all-pervading as the cause of everything.

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 20
Ekaḥ śuddhaḥ svayaṃjyotirnirguṇo’sau guṇāśrayaḥ,
Sarvago’nāvr̥taḥ sākṣī nirātmātmātmanaḥ paraḥ. (7)

:: श्रीमद्भागवते चतुर्तस्कन्धे विंशोऽध्यायः ::
एकः शुद्धः स्वयंज्योतिर्निर्गुणोऽसौ गुणाश्रयः ।
सर्वगोऽनावृतः साक्षी निरात्मात्मात्मनः परः ॥ ७ ॥

The individual soul is one, Pure, non-material and self-effulgent. He is the reservoir of all good qualities, and He is all-pervading. He is without material covering, and He is the witness of all activities. He is completely distinguished from other living entities, and He is transcendental to all embodied souls.

:: श्रीमद्देवीभागवते प्रथमस्कन्धे अष्टमोऽध्यायः ::
देवेषु विष्णुः कथितः सर्वगः सर्वपालकः ।
यतो विराडिदं सर्वमुत्पन्नं सचराचरम् ॥ १४ ॥

Śrīmad Devī Bhāgavata - Book 1, Chapter 8
Deveṣu Viṣṇuḥ kathitaḥ sarvagaḥ sarvapālakaḥ,
Yato virāḍidaṃ sarvamutpannaṃ sacarācaram. 14.

Amongst the divinities, Lord Viṣṇu alone is known to be the protector of all being all pervasive. The total massive animate and inanimate creation is His.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सर्वगस्सर्वविद्भानु र्विष्वक्सेनो जनार्धनः ।वेदो वेदविदव्यंगो वेदांगो वेदवित्कविः ॥ १४ ॥

సర్వగస్సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్ధనః ।వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ ౧౪ ॥

Sarvagassarvavidbhānu rviṣvakseno janārdhanaḥ ।Vedo vedavidavyaṃgo vedāṃgo vedavitkaviḥ ॥ 14 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 41 / Sri Devi Mahatyam - Durga Saptasati - 41 🌹*
✍️. మల్లికార్జున శర్మ 
📚. ప్రసాద్ భరద్వాజ 

*అధ్యాయము 11*
*🌻. నారాయణీ స్తుతి - 5 🌻*

38–39. దేవతలు పలికిరి : "ఓ సర్వేశ్వరీ! ఇప్పటి వలే నీవు ముల్లోకాల దుఃఖాలన్నింటినీ శమింపజేయాలి, మా శత్రువులనందరినీ నాశనం చేయాలి.”

40–41. దేవి పలికెను : వైవస్వత మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ యుగంలో మరో ఇరువురు మహాసురులు శుంభనిశుంభ నామాలతో ఉద్భవిస్తారు.

42. ఆ కాలంలో నందగోపుని ఇంట, యశోదా గర్భాన పుట్టి వింధ్యాద్రిపై నివసిస్తూ, వారిని ఇరువురిని నేను పరిమారుస్తాను.

43. మళ్ళీ భూతలంలో అతి రౌద్రాకారంతో జన్మించి, విప్రచిత్తి వంశీయులైన దానవులను నేను చంపుతాను.

44. విప్రచిత్తివంశీయులైన ఆ భయంకర మహాసురులను భక్షించినప్పుడు నా పళ్ళు దానిమ్మ పూవుల వలే రక్తవర్ణం అవుతాయి.

45. అందుచేత స్వర్గలోకంలో దేవతలు, భూలోకంలో మానవులు, నన్ను స్తుతించేడప్పుడు 'రక్తదంతిక' అనే పేరు వాడతారు.

46. మళ్ళీ నూరు సంవత్సరాలు వర్షం కురవడం చేత నీటి లేమి వల్ల పరితపించే భూమిపై నేను మునిజన స్తోత్రఫలంగా పుడతాను. కాని స్త్రీ గర్భం నుండి కాదు.

47. అంతట ఆ మునులను నేను వంద కన్నులతో చూస్తాను. మానవులు నన్ను ఆ పిదప 'శతాక్షి' అని కీర్తిస్తారు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 41 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

*CHAPTER 11* 
*🌻 Hymn to Narayani - 5 🌻*

 The devas said:

38-39. ' O Queen of all, this same manner, you must destroy all our enemies and all the afflictions of three worlds. The Devi said:

40-41. 'When the twenty-eighth age has arrived during the period of Avaisvsvata Manu, two other great asuras, Sumbha and Nisumbha will be born.

42. 'Then born from the womb of Yasoda, in the home of cowherd Nanda, and dwelling on the Vindhya mountains, I will destroy them both.

43. 'And again having incarnated in a very terrible form on the earth, I shall slay the danavas, who are the descendants of Vipracitti.

44. 'When I shall devour the fierce and great asuras descended from Vipracitti, my teeth shall become red like the flower of pomegranate.

45. 'Therefore when devas in heaven and men on the earth praise me, shall always talk of me as the 'Red-toothed.'

46. 'And again when rain shall fail for a period of hundred years, propitiated by the munis I shall be born on the drought-ridden earth, but not womb-begotten.

47. 'Then I shall behold the munis with a hundred eyes and so mankind shall glorify me as the 'hundred-eyed.'

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 109 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము -39 🌻*

అటువంటి ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని, ఉత్తమమైనటువంటి సాధనను, శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గంలోకి మరలించుకోవడం ద్వారా బాహ్య విషయ వస్తు వ్యవహార సంగత్వ దోషాన్ని పరిత్యజించడం ద్వారా, నిమిత్తమాత్రపు వ్యవహారం ద్వారా, సామాన్య వ్యవహారం ద్వారా, తనను తాను నియమించుకుంటూ, సాధన చతుష్టయ సంపత్తి ద్వారా, నిత్యానిత్యవస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి... 

అంటే శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము, ముముక్షత్వము, తీవ్ర మోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యము... వీటిని పొందవలసినటువంటి అవసరము మానవులకు ఎంతైనా ఉన్నది. ఈ సమస్తమూ కూడా నివృత్తి మార్గంలోనే సాధ్యమౌతుంది. సత్వగుణంతోనే సాధ్యమౌతుంది. చాలా మంది ఈ సత్వగుణం అనేదాని దగ్గర విశ్రాంతి తీసుకుంటారు. ఎంతకాలం తీసుకుంటారయ్యా? ఎన్ని జన్మలపాటైనా విశ్రాంతి తీసుకోవచ్చు. ఎందుకని అంటే? అది సహనంతో ఉంటుంది, శాంతంతో ఉంటుంది, ఓర్పుతో ఉంటుంది. 

అన్ని దైవీ లక్షణాలు ఆ సత్వగుణంతో ముడిపడి ఉంటాయి. దయ, క్షమ, త్యాగం ఇలాంటి లక్షణాలన్నీ దానితో ముడిపడి ఉంటాయి. కానీ స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందక పోయినట్లయితే, ఈ సత్వగుణం కూడా బంధహేతువే, బంధ కారణమే! ఎందుకని అంటే, జనన మరణ చక్రంలోకి పట్టుకెళ్తుంది కాబట్టి. 

పునః మరలా శరీరాన్ని ధరింప చేస్తుంది కాబట్టి. ఎప్పటికైనా సరే ఈ సత్వగుణాన్ని కూడా అధిగమించాలి. గుణాతీత స్థితిలో నిలబడి ఉండాలి. గుణాలకు సాక్షిగా ఉండాలి.

  ‘గుణత్రయాతీతః’ - ఎట్లా అయితే, ‘శరీర త్రయ విలక్షణః’ - ఆత్మ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అట్లాగే ‘గుణత్రయాతీతః’ - మూడు గుణాలను దాటినటువంటి స్థితిలో, మూడు గుణాలు స్వాధీనమైనటువంటి స్థితిలో, గుణమాలిన్యము లేనటువంటి స్థితిలో, స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞాన స్థితిలో, ప్రత్యగాత్మ స్థితిలో, అంతర్యామి స్థితిలో, బుద్ధి గుహయందు, స్వప్రకాశంతో, స్వరూపజ్ఞానంతో సహజంగా నిలకడ చెంది, తనను తాను తెలుసుకున్న వాడై, సరియైనటువంటి ఆత్మనిష్ఠ యందు నిలకడ చెందాలి. 

ఈ ఉత్తమ లక్ష్యాన్ని పొందాలి అంటే, రాచబాటను తెలియజేసింది. నివృత్తి మార్గం ద్వారా మనస్సునుండి బుద్ధికి, బుద్ధినుండి మహతత్వానికి, మహతత్వం నుంచి అవ్యక్తానికి, అవ్యక్తం నుంచి ప్రత్యగాత్మకు చేసేటటువంటి అంతర్ముఖ ప్రయాణాన్ని, మానవులు పూర్తి చేయాలి. అలా పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మాత్రమే ఈ ఆత్మదర్శనాన్ని పొందగలుగుతున్నారు.
 
       అలా లేకపోయినట్లయితే, ఈ నివృత్తి మార్గంలో కనుక నువ్వు ఉత్తమ లక్ష్యాన్ని స్వీకరించి, శ్రవణ, మనన, నిధి ధ్యాసల ద్వారా, ఈ స్థిరమైనటువంటి స్థితిని గనుక నువ్వు పొందకపోయినట్లయితే, ఇది సాధ్యం కాదు. కాబట్టి, తప్పక అందరూ ఈ ఆత్మదర్శనాన్ని పొందేదిశగా పరిణామం చెందవలసినటువంటి అవసరం ఈ జన్మలోనే ఉంది. ఎప్పుడో చేద్దాంలే, ఎప్పుడో చూద్దాంలే, అదే రాకపోతుందా? వచ్చినప్పుడు అదే వస్తుందిలే, కాలంలో అవే వస్తాయిలే, ‘కాలేన ఆత్మని విందతి’ - అనేటటువంటిది వాయిదా పద్ధతి తమోగుణం సంబంధమైన వాయిదా పద్ధతి.

        ఇప్పుడే ఈ జన్మలోనే, ఈ క్షణమందే, ఈ స్థితియందే, ఇప్పటికిప్పుడే ‘నేను పొందాలి’ అనేటటువంటి తీవ్రమోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యం ఎవరికైతే ఉంటుందో, వారు మాత్రమే ఈ నివృత్తి మార్గంలో త్వరత్వరగా ప్రయాణం చేయగలుగుతారు. అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయగలుగుతారు. 

చాలామంది ప్రయత్నం చేస్తారు కాని, సత్వగుణానికి చేరగానే ‘కాలేన విందతి’ అని ఊరుకుంటారు. అలా ఊరుకునేవారు చాలామంది ఉన్నారు. ఇది పెద్ద విమానాశ్రయం లాంటిది, విమానాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ వీడు ఎప్పటికీ విమానాశ్రయంలో వుంటాడు, ఏ విమానము ఎక్కడు, ఎక్కడికి ప్రయాణం పూర్తి చేయడు. అందువల్ల ఏమైపోయింది? శ్రవణం చేశాడు, మననం కూడా చేశాడు, కానీ నిధిధ్యాసలను పూర్తి చేయలేదు. అతని దగ్గర అన్నీ మంచి లక్షణాలున్నాయి. ఏ చెడు లక్షణాలు ఎత్తి చూపడానికి ఏం కనపడవు. 

అందరి కంటే ఓర్పు కలిగినవాడు, సహనం కలిగినవాడు, అందరితో పోలిస్తే జ్ఞానం ఉన్నవాడు, వివేకం ఉన్నవాడు, శాస్త్రములన్నీ బాగా చదివాడు, మంత్రములన్నీ బాగా తెలుసుకున్నాడు, ఉపదేశాలన్నీ బాగా పొందాడు, మహానుభావుల సేవనం కూడా చేశాడు, కానీ లక్ష్యశుద్ధి ఇప్పుడే, ఈ జన్మలోనే, ఇక్కడే, ఈ సందర్భంలోనే ‘నేను వెంటనే వెనువెంటనే ఆత్మసాక్షాత్కార జ్ఞానము’ పొందక నిలువజాలను అనేటటువంటి తీవ్రమోక్షేచ్ఛ లోపించడం చేత, ఆ స్థానంలో వాయిదా పద్ధతి వచ్చేసింది. సరే నేను చేయాల్సింది చేసేశాను, ఇక వచ్చేది ఎప్పటికైనా ఈశ్వరానుగ్రహం చేత అదే వస్తుందిలే అనుకుంటాడు. 

అలా అనడం వలన ఏమైపోయింది? ఆ వాయిదా వాయిదా అలాగే ఉండిపోయి, ఆ జన్మాంతరమూ, అలాగే అవశేషంగా మిగిలిపోయి, ఆ అసంతృప్తి చేత పునః జనన మరణ చక్రంలో, మరలా తల్లి గర్భాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం వచ్చింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 130 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
122

We discussed that the sages, unable to tolerate Nemi’s heinous acts, came together and decided to sever both his legs. But, not only did he escape death, a lot of demons were born out of his severed legs. This created more work for the sages. The sages had to kill all the demons. 

They thought about what happened and decided this time to sever Nemi’s arms. From the arms were born divine beings. The sages handed over the kingdom to these beings who took good care of the kingdom.

But Nemi would neither live nor die. The sages thought some more. They gave him poison and cut him into pieces. But, he still wouldn’t die. Each piece of this severed body would eventually join together. 

Due to his mother’s grace, he continued to live. Even after being given poison and being cut into pieces, he lived. Each severed piece was a living being. Each piece seemed to have life. Nemi experienced hell on earth. 

We think he survived, he lived, but every piece was experiencing hell. Eventually, one day, Lord Datta came to him, initiated him into worship of Guru and uplifted him. All the divine beings shouted slogans, “Datta! Jaya Guru Datta! Datta!”. Although Nemi was a great sinner, he achieved higher worlds by the grace of Guru.

You should not construe whatever happened in the meanwhile as the outcome of Guru’s anger. It was the compassion of the Guru. That is what is called Kshalana (cleansing). 

The Guru is always in bliss. That is why the previous sloka said “Prasannam” (bliss). The Guru is the epitome of bliss, the source of bliss, embodiment of knowledge. To such a Sadguru, you should always offer obeisance. Next is another mantra to meditate on the Guru.

Sloka:
Nityam suddham nirabhasam nirakaram niranjanam | Nityabodha cidanandam gurum brahma namamyaham ||

Obeisance to Guru who is eternal, pure, formless, tranquil, embodiment of truth and knowledge, who is always teaching, who is embodiment of universal consciousness and bliss and an embodiment of the Absolute.

Here, “Nityabodha” shows that he is always teaching. That means, if you meditate on him in silence when you face difficulties, you will hear his voice. There is no doubt whatsoever.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 114 / Sri Gajanan Maharaj Life History - 114 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 21వ అధ్యాయము - 2 🌻*

శ్రీగజానన్ మహారాజు తనమందిర నిర్మాణంలో ఎవరికీ హానిజరగనివ్వలేదు. ఈఘటనవల్ల శ్రీమహారాజు చేతిస్పర్శ పొందిన ఆపనివాడు చాలా అదృష్టవంతుడు. క్షుద్రశక్తుల ప్రభావితురాలయిన ఒక రాజ్పుత్ స్త్రీ జైపూరునుండి షేగాం వచ్చింది.

 దత్తాత్రేయ భగవానుడు, శ్రీరామనవమి రోజున షేగాం వెళ్ళి శ్రీగజానన్ మహారాజు కృపతో ఆ క్షుద్రశక్తుల నుండి విముక్తి పొందవలసిందిగా ఆమెను ప్రేరేపించారు. ఆవిధంగా ఆమె రామనవమి రోజున షేగాంకి వచ్చింది. 

చైత్రమాసం పాడ్యమి రోజునుండి రామనవమి ఉత్సవాలు అక్కడ ఆరంభంఅయి, నవమిరోజున రాముని జన్మదినం జరిపేందుకు చాలామంది జనం గుమిగూడారు. ఆ సమయంలో సభామండపం పనిజరుగుతూ ఉండడంవల్ల 1.5 5 అడుగుల కొలతగల రాయిస్తంభాలు, సరిఅయిన ఆధారంలేకుండా ఉంచబడి శ్రీరామనవమి ఉత్సవాల కారణంగా పని తాత్కాలికంగా ఆపివెయ్యడంతో వాటిని అక్కడ అలానే వదిలి వేసారు. 

శ్రీరాముని జననం అయిన తరువాత, జనం అంతా ప్రసాదం కోసం దూసుకు పోవడం ప్రారంభించారు. ఆ స్త్రీ తన ఇద్దరు పిల్లలతో సురక్షితం కోసం ఒకస్తంభం ప్రక్కకి వెళ్ళింది కానీ ఆ స్తంభం ఆమె మీద, పిల్లలమీద పడింది. ఆ స్తంభం బరువుతో ఆమె మరణించి ఉంటుందని ప్రజలు భయపడ్డారు. 

ఆమె ఎక్కడ ఉందో ఎవరికీ తెలియలేదు. వాళ్ళు ఆ స్తంభం నిలబెట్టి ఆమెను బయటకుతీసి త్రాగేందుకు కొంచెం నీళ్ళు ఇచ్చారు. తరువాత ఆమెను జీసస్ క్రైస్తు భక్తురాలు, మంచి శస్త్ర చికిత్స చేసే డా. లోబో దగ్గరకు తీసుకు వెళ్ళారు. 

ఆమె ఆ స్త్రీని పరీక్షచేసి ఆస్తంభం మీద పడినప్పటికీ ఏవిధంగా గాయపడకపోవడం చూసి ఆశ్చర్య పోయింది. ఆస్తంభం అలామీద పడడానికి ప్రత్యేకత వేరే ఉంది. శ్రీ మహారాజు స్తంభం ఆమె మీద పడనిస్తూ ఆమె శరీరంలోనుండి క్షుద్రశక్తిని విముక్తిచేసారు. ఆవిధంగా క్షుద్రశక్తినుండి పూర్తిగా బయటపడ్డ ఆ స్త్రీ జైపూరు తిరిగి వెళ్ళిపోయింది. 

ఇదే విధంగా శ్రీమహారాజు మందిరంలో ఒక పండుగ సందర్భంలో ఒక పెద్ద చెక్కదిమ్మ శ్రీనాయక్ నవారా తలమీద పడింది. కానీ అతను శ్రీగజానన్ మహారాజు కృపవల్ల చమత్కారంగా గాయపడకుండా తప్పించుకున్నాడు. కృష్ణాజిపాటిల్ కుమారుడయిన రామచంద్ర శ్రీమహారాజు యొక్క నిజమయిన భక్తుడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 114 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 21 - part 2 🌻*

A Rajput lady, afflicted by an evil spirit had come to Shegaon from Jaipur. God Dattatraya had inspired her to go to Shegaon on Ramnavami day to get rid of that spirit by the grace of Shri Gajanan Maharaj. She accordingly came to Shegaon on Ramnavami day. 

The celebrations of Ramnavami had started there from first day, i.e. Pratipada of Chaitra, and on the Navami a huge crowd had gathered to celebrate the birth of God Rama. At that time the construction work of the Sabhamandapam was in progress and huge stone pillars, measuring 5 feet by 11/2 feet were kept there without any proper support, as the work was suspended temporarily for Shri Ramnavami celebrations. 

After the birth of Shri Ram was celebrated, the crowd rushed for Prasad. The lady, with her two children, went to one of the pillers for safety. However, that piller itself fell on her and her two children. People feared that she must have died by the weight of the piller. Nobody knew her where abouts; they lifted the piller, took her out and gave her some water to drink. 

She was then taken to Dr. Lobo, a devotee of Jesus Christ, and a very good surgeon. She examined that lady and was surprised to see her unhurt after the stone piller had fallen on her. The falling of that piller on her had a different significance. Shri Gajanan Maharaj , by letting that piller fall on her, had liberated the evil spirit from her body. Then having gotten completely rid of that spirit, the lady went back to Jaipur. 

Similarly on the occasion of another festival at the temple of Shri Gajanan Maharaj a huge wooden beam had fallen on the head of Shri Naik Nawara, who had, miraculously, escaped unhurt by the grace of Shri Gajanan Maharaj. Ramchandra, son of Krisnaji Patil, was a sincere devotee of Shri Gajanan Maharaj 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 56 / Sri Lalitha Sahasra Nama Stotram - 56 🌹*
*ప్రసాద్ భరద్వాజ*


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 102, 103 / Sri Lalitha Chaitanya Vijnanam - 102, 103 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ |*
*మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ‖ 38 ‖*

*🌻 102. 'విష్ణుగ్రంథి విభేదినీ'' 🌻

విష్ణుగ్రంథిని విశేషముగ భేదించునది శ్రీదేవి యని అర్థము.

బ్రహ్మగ్రంథిని భేదించుకొని స్వాధిష్ఠానము నుండి మణిపూరకము చేరి అంతర్ముఖుడై ఆరాధన గావించు సాధకునకు తదుపరి లక్ష్యము విష్ణుగ్రంథి భేదనము. జీవుడు విష్ణురూపుడే. సనాతనుడే. అందుచేత అంతర్ముఖముగా విష్ణు నారాధన చేయవలెను లేక వైష్ణవీ ఆరాధనము చేయవలెను. తనను తాను సూక్ష్మముగ విష్ణురూపునిగ భావింపవలెను.

తన స్థూల దేహము తన సూక్ష్మ విష్ణు రూపమునకు కవచమని భావింపవలెను. విష్ణువే నేను. ఈ దేహము నా కవచము. ఈ భావన పరిపూర్ణమైనపుడు జీవునికి పూర్ణ రక్షణ యుండును. నారాయణ కవచము, ఇతర దైవీ కవచములు ఈ మార్గముననే సిద్ధించును. విష్ణువే నేను అని భావించుట 'సో హం' అను మంత్ర సిద్ధి నిచ్చును. 

'సోలి హం' అనగా అతడే నేను అని అర్థము. దాని రూపాంతమే విష్ణువే నేను అని భావన. ఈ భావము స్థిరపడునపుడు స్థూలమువలె సూక్ష్మము కూడ అనిత్యమని తెలియును. ప్రాపంచిక భావనలు ప్రాపంచికానుభూతి నిచ్చును. దైవీ భావములు దివ్యానుభూతి నిచ్చును. రెండునూ భావమయములే. తాను నిత్యుడు. తన భావములు నిత్యములు. అందువలన ఈ స్థితియందు దైవీ విభూతుల కారాటపడుట యిక యుండదు. 

దైవమే తానుగ నున్నాడని తెలియుట మొదలిడును. అప్పుడు విష్ణుమాయారూపుడై విష్ణుగ్రంథి భేదింపబడి జీవుడు ముందుకు సాగును. విష్ణువు దేవతలను రక్షించి, అసురులను శిక్షించి ధర్మమును నిలబెట్టుచుండును. జీవునియందు కూడ దైవాసుర భావము లుత్పత్తి యగుచుండును. దేవతలు, అసురులు పరస్పర విరోధము కలవారు.

ఇద్దరును ఒకే తండ్రికి జన్మించినవారు. అట్లే ఒకే జీవుని నుండి పరస్పర విరుద్ధమగు భావములు ఉత్పన్నమగుచుండును. అవి ఘర్షణ కలిగించును. ఇట్టి ఘర్షణను పరిష్కరించు తత్త్వమునే విష్ణువని పలికిరి. ద్వంద్వముల తీరుతెన్నులెరిగి తటస్థుడై కర్తవ్యము నిర్వహించు వారికి విష్ణువు ఆరాధన ఫలించును. చెడును దూషింపక మంచిని పెంపొందించు కొనుచు ముందుకు సాగుట ఈ ఆరాధనమున ప్రధానమగు భావము. 

అట్టివాడు కుడిఎడమల ప్రభావమునకు లోనుగాక మధ్యేమార్గమున భ్రూమధ్యమును చేరును. మణిపూరక పద్మము నుండి భ్రూమధ్యము వరకు గల సుషుమ్న మార్గమును విష్ణుపథము అని భావింప వచ్చును. మణిపూరకమున విష్ణుపాదములు అటు నుండి ఫాలభాగము వరకు గల తన దేహమును విష్ణు వాక్రమించి దైవాసురులు సమన్వయమును నిర్వర్తించుచున్నట్లుగ భావింపవలెను. 

ఇట్టి భావనతో విష్ణు సహస్రనామ పారాయణ గావించినచో సాధకునకు అం ఘర్షణలు ఉపశమింపగలవు. మంచి చెడుల ఆటుపోట్లను అధిగమించి భ్రూమధ్యమునకు చేరవలెను. ఇట్లు చేరుట విష్ణుగ్రంథి భేదనము అని తెలుపబడినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 102 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Viṣṇugranthi-vibhedinī विष्णुग्रन्थि-विभेदिनी (102) 🌻*

She pierces the second knot called Viṣṇu granthi, which is just above the navel cakra. Lord Viṣṇu resides in maṇipūraka cakra and that is why the knot above this cakra is called Viṣṇu granthi.  

Lord Viṣṇu is the authority for the sustenance of this universe. When a sādhaka could cross the navel cakra, it means that he exists beyond sustenance. Sustenance is only for ordinary living beings.  

Beyond sustenance means sages and yogi-s. They can sustain themselves on the ambrosia, the nectar that has been discussed earlier.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 103 / Sri Lalitha Chaitanya Vijnanam - 103 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ |*
*సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ‖ 39 ‖*

*🌻 103. 'ఆజ్ఞాచక్రాంతరాళస్థా' 🌻

ఆజ్ఞాచక్ర మధ్యమున నుండునది. శ్రీదేవి యని అర్థము.

మూలాధారము నుండి ఆజ్ఞా కేంద్రము వరకుగల వివరణము రాబోవు నామములో ఇవ్వబడినది. జీవుని పరిణామమును సాధనను, కాలమును, ధర్మమును బట్టి, జీవచైతన్యము మూలాధారము నుండి క్రమముగ ఊర్థ్వముఖ మగుచుండును. 

బహి రంతఃకరణముల శుచి, నిష్కామకర్మ నిర్వహణము, ఫలితము లందా శక్తిలేని బుద్ధి, యజ్ఞార్థ జీవనము, సంకల్ప సన్యాసము, యమ నియమాది గుణములు- ఇవి అన్నియు జీవుని సహజ స్వభావమై, శ్రద్ధ, అనసూయత్వము కలిగి యున్నప్పుడు చైతన్యము ఆజ్ఞను చేరకలదు. 

ఆజ్ఞను చేరిన చైతన్యము జీవుని కధికార మిచ్చును. తన స్వభావముపై తనకు స్వామిత్వము నందించును. అట్టి జీవుడు ఆజ్ఞా పద్మమునందు ఆసీనుడైయున్న శ్రీ గురు దర్శనము చేయగలడు. మనస్సు ఇంద్రియములు నిర్వహింప బడుటచే బుద్ధిలోకమున స్థిరపడి అంతరాయములు లేక జ్ఞానోపాసను చేయును. ధ్యానము కుదురును. 

శ్రీకృష్ణుడు, ఆత్మదర్శనమునకై ధ్యానము చేయుటకు ఆళాకేంద్రమునే సూచించినాడు. మనసున కవ్వలనున్న తాను తేజోమయ రూపుడని తెలియ వలెనన్నచో ఆజ్ఞాచక్రము నందలి పద్మము వికసింపవలెను. అట్లు వికసింపచేయునది శ్రీదేవి యని నామము తెలుపుచున్నది. ఆజ్ఞాపద్మము వికసించునపుడు జీవుడు, తాను హంస స్వరూపుడనని తెలుసుకొనుట జరుగును. 

ఆజ్ఞయందు హంస స్వరూపుల దర్శనము జరుగును. పరమగురువులను దర్శించుట యనగా నిదియే. దీనికి పూర్వము జరుగు దర్శనము లన్నియూ కేవలము చిత్తభ్రాంతియే. చిత్తభ్రాంతి సాధకునకు రుచి కలిగించునేమో కాని భ్రాంతి దర్శనము సత్యదర్శనము కాదు కదా!

ప్రాథమిక దశలో నున్న సాధకునకు కనిపించుట, వినిపించుట తరచుగ జరుగుచుండును. అందలి రుచిని గుర్తించిన సాధకుడు గురుముఖముగ సాధనను శ్రద్ధతో, అనసూయత్వముతో నిర్వర్తించు కొనవలెను. భావమయ లోకముల యందు ముక్తి చెందిన జీవుడే సత్యదర్శనమున కరుడు. మైత్రేయాది మహర్షుల దర్శనము ఆజ్ఞ చేరిన వారికే జరుగగలదు. 

ఆత్మ దర్శనమునకు చేరువలోనే ఆత్మ స్వరూపుల దర్శనము జరుగును. అదియే సద్గురు దర్శనము ఈ దర్శనమునకు చేర్చు అనుగ్రహ దేవతయే శ్రీదేవి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 103 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Ājñā-cakrāntarālasthā आज्ञा-चक्रान्तरालस्था (103) 🌻*

She resides in ājñā cakra which is also known as third eye. This is the last of the six cakra-s and this cakra belongs to one’s guru from where he gives his commands to the sādhaka. 

 In this cakra, a sādhaka gains a little knowledge about the Brahman. In the previous five cakra-s, all the basic elements were identified. But this cakra is related to mind. Mind is the instrument for acquiring knowledge.  

Saundarya Laharī (verse 36) describes this cakra. “I worship the supreme Śiva (paraṃ śaṃbhuṃ) who abides in your ājñā cakra, covered by parā-cit on the sides and having the splendour of billions of sun and moon.” This verse underlines the mental worship of both Śiva and Śaktī. Ājñā cakra is associated with mind.

Kṛṣṇa tells Arjuna (Bhagavad Gīta XI.8), “You cannot see me with your physical eyes. I now give you divine eyes (the third eye or the ājñā cakra)”. Ājñā cakra is described in detail in nāma-s 521 to 528.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment