శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 102, 103 / Sri Lalitha Chaitanya Vijnanam - 102, 103

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 56 / Sri Lalitha Sahasra Nama Stotram - 56 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 102, 103 / Sri Lalitha Chaitanya Vijnanam - 102, 103 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ |
మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ‖ 38 ‖


🌻 102. 'విష్ణుగ్రంథి విభేదినీ'' 🌻

విష్ణుగ్రంథిని విశేషముగ భేదించునది శ్రీదేవి యని అర్థము.

బ్రహ్మగ్రంథిని భేదించుకొని స్వాధిష్ఠానము నుండి మణిపూరకము చేరి అంతర్ముఖుడై ఆరాధన గావించు సాధకునకు తదుపరి లక్ష్యము విష్ణుగ్రంథి భేదనము. జీవుడు విష్ణురూపుడే. సనాతనుడే. అందుచేత అంతర్ముఖముగా విష్ణు నారాధన చేయవలెను లేక వైష్ణవీ ఆరాధనము చేయవలెను. తనను తాను సూక్ష్మముగ విష్ణురూపునిగ భావింపవలెను.

తన స్థూల దేహము తన సూక్ష్మ విష్ణు రూపమునకు కవచమని భావింపవలెను. విష్ణువే నేను. ఈ దేహము నా కవచము. ఈ భావన పరిపూర్ణమైనపుడు జీవునికి పూర్ణ రక్షణ యుండును. నారాయణ కవచము, ఇతర దైవీ కవచములు ఈ మార్గముననే సిద్ధించును. విష్ణువే నేను అని భావించుట 'సో హం' అను మంత్ర సిద్ధి నిచ్చును.

'సోలి హం' అనగా అతడే నేను అని అర్థము. దాని రూపాంతమే విష్ణువే నేను అని భావన. ఈ భావము స్థిరపడునపుడు స్థూలమువలె సూక్ష్మము కూడ అనిత్యమని తెలియును. ప్రాపంచిక భావనలు ప్రాపంచికానుభూతి నిచ్చును. దైవీ భావములు దివ్యానుభూతి నిచ్చును. రెండునూ భావమయములే. తాను నిత్యుడు. తన భావములు నిత్యములు. అందువలన ఈ స్థితియందు దైవీ విభూతుల కారాటపడుట యిక యుండదు.

దైవమే తానుగ నున్నాడని తెలియుట మొదలిడును. అప్పుడు విష్ణుమాయారూపుడై విష్ణుగ్రంథి భేదింపబడి జీవుడు ముందుకు సాగును. విష్ణువు దేవతలను రక్షించి, అసురులను శిక్షించి ధర్మమును నిలబెట్టుచుండును. జీవునియందు కూడ దైవాసుర భావము లుత్పత్తి యగుచుండును. దేవతలు, అసురులు పరస్పర విరోధము కలవారు.

ఇద్దరును ఒకే తండ్రికి జన్మించినవారు. అట్లే ఒకే జీవుని నుండి పరస్పర విరుద్ధమగు భావములు ఉత్పన్నమగుచుండును. అవి ఘర్షణ కలిగించును. ఇట్టి ఘర్షణను పరిష్కరించు తత్త్వమునే విష్ణువని పలికిరి. ద్వంద్వముల తీరుతెన్నులెరిగి తటస్థుడై కర్తవ్యము నిర్వహించు వారికి విష్ణువు ఆరాధన ఫలించును. చెడును దూషింపక మంచిని పెంపొందించు కొనుచు ముందుకు సాగుట ఈ ఆరాధనమున ప్రధానమగు భావము.

అట్టివాడు కుడిఎడమల ప్రభావమునకు లోనుగాక మధ్యేమార్గమున భ్రూమధ్యమును చేరును. మణిపూరక పద్మము నుండి భ్రూమధ్యము వరకు గల సుషుమ్న మార్గమును విష్ణుపథము అని భావింప వచ్చును. మణిపూరకమున విష్ణుపాదములు అటు నుండి ఫాలభాగము వరకు గల తన దేహమును విష్ణు వాక్రమించి దైవాసురులు సమన్వయమును నిర్వర్తించుచున్నట్లుగ భావింపవలెను.

ఇట్టి భావనతో విష్ణు సహస్రనామ పారాయణ గావించినచో సాధకునకు అం ఘర్షణలు ఉపశమింపగలవు. మంచి చెడుల ఆటుపోట్లను అధిగమించి భ్రూమధ్యమునకు చేరవలెను. ఇట్లు చేరుట విష్ణుగ్రంథి భేదనము అని తెలుపబడినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 102 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Viṣṇugranthi-vibhedinī विष्णुग्रन्थि-विभेदिनी (102) 🌻

She pierces the second knot called Viṣṇu granthi, which is just above the navel cakra. Lord Viṣṇu resides in maṇipūraka cakra and that is why the knot above this cakra is called Viṣṇu granthi.

Lord Viṣṇu is the authority for the sustenance of this universe. When a sādhaka could cross the navel cakra, it means that he exists beyond sustenance. Sustenance is only for ordinary living beings.

Beyond sustenance means sages and yogi-s. They can sustain themselves on the ambrosia, the nectar that has been discussed earlier.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 103 / Sri Lalitha Chaitanya Vijnanam - 103 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ |
సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ‖ 39 ‖


🌻 103. 'ఆజ్ఞాచక్రాంతరాళస్థా' 🌻

ఆజ్ఞాచక్ర మధ్యమున నుండునది. శ్రీదేవి యని అర్థము.

మూలాధారము నుండి ఆజ్ఞా కేంద్రము వరకుగల వివరణము రాబోవు నామములో ఇవ్వబడినది. జీవుని పరిణామమును సాధనను, కాలమును, ధర్మమును బట్టి, జీవచైతన్యము మూలాధారము నుండి క్రమముగ ఊర్థ్వముఖ మగుచుండును.

బహి రంతఃకరణముల శుచి, నిష్కామకర్మ నిర్వహణము, ఫలితము లందా శక్తిలేని బుద్ధి, యజ్ఞార్థ జీవనము, సంకల్ప సన్యాసము, యమ నియమాది గుణములు- ఇవి అన్నియు జీవుని సహజ స్వభావమై, శ్రద్ధ, అనసూయత్వము కలిగి యున్నప్పుడు చైతన్యము ఆజ్ఞను చేరకలదు.

ఆజ్ఞను చేరిన చైతన్యము జీవుని కధికార మిచ్చును. తన స్వభావముపై తనకు స్వామిత్వము నందించును. అట్టి జీవుడు ఆజ్ఞా పద్మమునందు ఆసీనుడైయున్న శ్రీ గురు దర్శనము చేయగలడు. మనస్సు ఇంద్రియములు నిర్వహింప బడుటచే బుద్ధిలోకమున స్థిరపడి అంతరాయములు లేక జ్ఞానోపాసను చేయును. ధ్యానము కుదురును.

శ్రీకృష్ణుడు, ఆత్మదర్శనమునకై ధ్యానము చేయుటకు ఆళాకేంద్రమునే సూచించినాడు. మనసున కవ్వలనున్న తాను తేజోమయ రూపుడని తెలియ వలెనన్నచో ఆజ్ఞాచక్రము నందలి పద్మము వికసింపవలెను. అట్లు వికసింపచేయునది శ్రీదేవి యని నామము తెలుపుచున్నది. ఆజ్ఞాపద్మము వికసించునపుడు జీవుడు, తాను హంస స్వరూపుడనని తెలుసుకొనుట జరుగును.

ఆజ్ఞయందు హంస స్వరూపుల దర్శనము జరుగును. పరమగురువులను దర్శించుట యనగా నిదియే. దీనికి పూర్వము జరుగు దర్శనము లన్నియూ కేవలము చిత్తభ్రాంతియే. చిత్తభ్రాంతి సాధకునకు రుచి కలిగించునేమో కాని భ్రాంతి దర్శనము సత్యదర్శనము కాదు కదా!

ప్రాథమిక దశలో నున్న సాధకునకు కనిపించుట, వినిపించుట తరచుగ జరుగుచుండును. అందలి రుచిని గుర్తించిన సాధకుడు గురుముఖముగ సాధనను శ్రద్ధతో, అనసూయత్వముతో నిర్వర్తించు కొనవలెను. భావమయ లోకముల యందు ముక్తి చెందిన జీవుడే సత్యదర్శనమున కరుడు. మైత్రేయాది మహర్షుల దర్శనము ఆజ్ఞ చేరిన వారికే జరుగగలదు.

ఆత్మ దర్శనమునకు చేరువలోనే ఆత్మ స్వరూపుల దర్శనము జరుగును. అదియే సద్గురు దర్శనము ఈ దర్శనమునకు చేర్చు అనుగ్రహ దేవతయే శ్రీదేవి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 103 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Ājñā-cakrāntarālasthā आज्ञा-चक्रान्तरालस्था (103) 🌻

She resides in ājñā cakra which is also known as third eye. This is the last of the six cakra-s and this cakra belongs to one’s guru from where he gives his commands to the sādhaka.

In this cakra, a sādhaka gains a little knowledge about the Brahman. In the previous five cakra-s, all the basic elements were identified. But this cakra is related to mind. Mind is the instrument for acquiring knowledge.

Saundarya Laharī (verse 36) describes this cakra. “I worship the supreme Śiva (paraṃ śaṃbhuṃ) who abides in your ājñā cakra, covered by parā-cit on the sides and having the splendour of billions of sun and moon.” This verse underlines the mental worship of both Śiva and Śaktī. Ājñā cakra is associated with mind.

Kṛṣṇa tells Arjuna (Bhagavad Gīta XI.8), “You cannot see me with your physical eyes. I now give you divine eyes (the third eye or the ājñā cakra)”. Ājñā cakra is described in detail in nāma-s 521 to 528.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


22 Nov 2020


No comments:

Post a Comment